ప్రపంచం లో అత్యంత శక్తిమంతమైన ‘ఏకతా శక్తుల’లో ఒకటి గా యోగ మారిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పేర్కొన్నారు. నాలుగో అంతర్జాతీయ యోగ దినాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్ లోని దెహ్ రాదూన్ లో గల ఫారెస్ట్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆవరణ లో ఒక భారీ సభ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాన మంత్రి ఫారెస్ట్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆవరణ లో యోగా ఔత్సాహికులు మరియు స్వచ్ఛంద సేవకులు దాదాపు 50,000 మందితో పాటు యోగాసనాలలో, ప్రాణాయామంలో, ఇంకా ధ్యానంలో పాలుపంచుకొన్నారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.07524300_1529557266_684-3.jpg)
“ప్రపంచం అంతటా ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒక గర్వకారణమైన ఘడియ; ప్రజలు యోగా చేస్తూ సూర్యుని యొక్క వెలుగులను మరియు వెచ్చదనాన్ని స్వాగతిస్తున్నారు. దెహ్ రాదూన్ మొదలుకొని డబ్లిన్ వరకు; శంఘయి నుండి శికాగో వరకు; అలాగే, జకార్తా నుండి జోహానిస్ బర్గ్ వరకు ప్రతి చోటుకు ప్రస్తుతం యోగా విస్తరించింది” అని ప్రధాన మంత్రి అన్నారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.82423400_1529557302_684-4.jpg)
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యోగా ఔత్సాహికులకు ప్రధాన మంత్రి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తూ, యావత్తు ప్రపంచం యోగా ను అక్కున చేర్చుకొందని, మరి దీని తాలూకు సన్నివేశాలను ప్రతి ఏటా అంతర్జాతీయ యోగా దినాన్ని జరుపుకొంటున్న తీరులో గమనించవచ్చునని ఆయన చెప్పారు. యోగ దినం మంచి ఆరోగ్యం కోసం, క్షేమం కోసం సాగుతున్న అన్వేషణ లో అతి పెద్ద సామూహికోద్యమాలలో ఒకటి గా రూపుదిద్దుకొందని కూడా ఆయన అన్నారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.08222600_1529557350_684-6.jpg)
మనల్ని మిగతా ప్రపంచం గౌరవించాలని కోరుకొనే పక్షంలో మన స్వీయ ఉత్తరదాయిత్వాన్ని, వారసత్వాన్ని ఆదరించడానికి మనం వెనుకాడకూడదని ప్రధాన మంత్రి చెప్పారు. యోగ ప్రాచీనమైనది అయినప్పటికీ, ఎంతో ఆధునికంగా ఉన్నందున ఎంతో సుందరమైందని; ఇది నిలకడగా ఉంటూనే ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతోందని; దీనిలో మన ఉత్తమమైనటువంటి గతం మరియు వర్తమానం ఇమిడివున్నాయని; ఇది మన భవిష్యత్తు కు ఒక ఆశాకిరణాన్ని ప్రసరింప జేస్తున్నదని ఆయన వివరించారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.90800400_1529557386_684-1.jpg)
యోగ యొక్క అంతర్గత శక్తులను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ప్రజలు వ్యక్తులు గాను, సంఘం గాను ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు యోగ వద్ద ఒక పరిష్కారం ఉందన్నారు. యోగ ఉద్రిక్తతలను, అనవసర భయాందోళనలను తొలగించి, ప్రశాంతమైన సృజనాత్మకమైన మరియు తృప్తికరమైన జీవనానికి బాటను పరచగలుగుతుందని ఆయన చెప్పారు. ‘‘విభజించడం కన్నా యోగ ఏకం చేస్తుంది. శత్రుత్వ భావనను పెంచడం కన్నా యోగా ఏకీకరిస్తుంది, బాధలను అధికం చేయడం కన్నా శాంతపరుస్తుంది’’ అని ఆయన అన్నారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.63400000_1529557413_684-2.jpg)
PM @narendramodi is speaking at the 4th International Yoga Day Celebrations in Dehradun.
— PMO India (@PMOIndia) June 21, 2018
Watch Live: https://t.co/J14KzEHOe5#InternationalYogaDay2018
हम सभी के लिए गौरव की बात है कि आज जहां-जहां उगते सूर्य के साथ सूरज की किरण पहुंच रही है, प्रकाश का विस्तार हो रहा है, वहाँ - वहाँ लोग योग से सूर्य का स्वागत कर रहे हैं।
— PMO India (@PMOIndia) June 21, 2018
देहरादून से लेकर डबलिन तक, शंघाई से लेकर शिकागो तक, जकार्ता से लेकर जोहानिसबर्ग तक, योग ही योग है: PM
योग व्यक्ति-परिवार-समाज-देश-विश्व और सम्पूर्ण मानवता को जोड़ता है।
— PMO India (@PMOIndia) June 21, 2018
योग आज दुनिया की सबसे Powerful Unifying Forces में से एक बन गया है: PM
The world has embraced Yoga and glimpses of this can be seen in the manner in which International Day of Yoga has been marked every year.
— PMO India (@PMOIndia) June 21, 2018
Infact, Yoga Day has become one of the biggest mass movements in the quest for good health and well-being: PM
Yoga is beautiful because it is ancient yet modern, it is constant yet evolving.
— PMO India (@PMOIndia) June 21, 2018
It has the best of our past and presents and a ray of hope for our future.
In Yoga, we have the perfect solution to the problems we face, either as individuals or in our society: PM
The way to lead a calm, creative & content life is Yoga. It can show the way in defeating tensions and mindless anxiety.
— PMO India (@PMOIndia) June 21, 2018
Instead of dividing, Yoga unites.
Instead of further animosity, Yoga assimilates.
Instead of increasing suffering, Yoga heals: PM