భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోట బురుజుల నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా- వచ్చేనెల విశ్వకర్మ జయంతి నాడు 'విశ్వకర్మ యోజన'కు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. ఈ పథకం సంప్రదాయ వృత్తి నైపుణ్యం గల వారి కోసం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. హస్త కౌశలంతోపాటు పరికరాలను ఉపయోగించి పనిచేసే ఓబీసీ వర్గాలవారు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు. వీరిలో వడ్రంగులు, స్వర్ణకారులు, రాతి పరికరాలు తయారు చేసేవారు, రజకులు, క్షురకులు తదితరులు ఉన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు తమ కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో చేయూత ఇవ్వగలరు. ఈ పథకం 13 నుంచి 15 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు.
आने वाली विश्वकर्मा जयंती पर हाथ से काम करने वाले ज्यादातर ओबीसी समुदाय को सशक्त बनाने के लिए 13000- 15000 हजार करोड़ रुपए के परिव्यय के साथ विश्वकर्मा योजना शुरू करेगे : नरेन्द्र मोदी@ लाल किला #हर_घर_तिरंगा @PIB_India @MSJEGOI pic.twitter.com/XM09iV9cQY
— PIB-SJ&E (@pib_MoSJE) August 15, 2023
అలాగే దివ్యాంగుల కోసం సౌలభ్య భారతం దిశగా కృషి చేస్తున్నామని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా పారాలింపిక్స్ లో త్రివర్ణ పతాకం ఎగురవేసేలా దివ్యాంగుల సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ దిశగా క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
భారతదేశం నేడు జన సంపద ప్రజాస్వామ్యం వైవిధ్యంతో వర్ధిల్లుతున్నదని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతదేశం నిర్దేశించుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించగల సామర్థ్యం ఈ త్రివిధ శక్తులకు ఉన్నదని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
Let's celebrate 🫡 Independence Day🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
— PIB-SJ&E (@pib_MoSJE) August 15, 2023
We have demography, diversity , and democracy . It means we have a powerful 'TRIVENI' .#HarGharTiranga#BharatInternetUtsav@MSJEGOI @PIB_India pic.twitter.com/QkuKlaEDt3