‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానిక ఉత్పాదనల కే ప్రాధానన్యాన్ని ఇవ్వడం) ఉద్యమాని కి దేశం అంతటా మంచి ఆదరణ లభిస్తోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్థానిక ఉత్పాదనల ను ప్రోత్సహిస్తూ ఉన్న ధోరణి ని గురించినటువంటి ఒక ప్రేరణాత్మకమైన వీడియో ను ఆయన శేర్ చేశారు. దేశవాళీ ఉత్పాదనల తో సెల్ఫీల ను తీసుకొని నమో ఏప్ లో శేర్ చేయవలసిందంటూను, మరి అదే మాదిరి గా చెల్లింపుల ను యుపిఐ మాధ్యం ద్వారా జరపవలసిందంటూను పౌరుల కు శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘వోకల్ ఫార్ లోకల్ ఉద్యమాని కి దేశవ్యాప్తం గా గొప్ప ఆదరణ లభిస్తోంది.’’ అని పేర్కొన్నారు.
The #VocalForLocal movement is getting great momentum across the country. pic.twitter.com/9lcoGbAvoi
— Narendra Modi (@narendramodi) November 6, 2023