1. భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి గౌరవనీయులైన బోరిస్ జాన్సన్ 2022 ఏప్రిల్ 21-22 మధ్య అధికారిక పర్యటనలో ఉన్నారు. బ్రిటన్ ప్రధానిగా ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

 

  1.  ఏప్రిల్ 22, 2022న రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి జాన్సన్‌కు లాంఛనప్రాయ స్వాగతం లభించింది, అక్కడ ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. పిఎం జాన్సన్ తర్వాత రాజ్ ఘాట్‌ని సందర్శించి మహాత్మా గాంధీకి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

 

  1. హైదరాబాద్ హౌస్‌లో పర్యటించిన ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంప్రదింపులు జరిపారు. ఆయన గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేశారు. అంతకుముందు, విదేశాంగ మంత్రి, డాక్టర్ ఎస్.  జైశంకర్, యూకే ప్రధాన మంత్రిని కలిశారు.

 

  1. ద్వైపాక్షిక చర్చల్లో, మే 2021లో జరిగిన వర్చువల్ సమ్మిట్‌లో ప్రారంభించిన రోడ్‌మ్యాప్ 2030లో సాధించిన పురోగతిని ఇద్దరు ప్రధానులు ప్రశంసించారు. ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్పెక్ట్రమ్‌లో మరింత పటిష్టమైన మరియు కార్యాచరణ ఆధారిత సహకారాన్ని కొనసాగించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. వారు కొనసాగుతున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందం పై చర్చలు మరియు మెరుగైన వాణిజ్య భాగస్వామ్యం అమలులో పురోగతిని అభినందించారు మరియు అక్టోబర్ 2022 చివరి నాటికి సమగ్ర మరియు సమతుల్య వాణిజ్య ఒప్పందాన్ని ముగించాలని అంగీకరించారు. స్వేచ్చా వాణిజ్య ఒప్పందం 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి మార్గం సుగమం చేస్తుంది.

 

  1. భారతదేశం-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క కీలక అంశంగా రక్షణ మరియు భద్రతా సహకారాన్ని మార్చడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు మరియు రెండు దేశాల సాయుధ దళాల అవసరాలను తీర్చడానికి సహ-అభివృద్ధి మరియు సహ-ఉత్పత్తితో సహా రక్షణ సహకారానికి అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా సైబర్ గవర్నెన్స్, సైబర్ డిటరెన్స్ మరియు కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాలను పరిరక్షించడం వంటి రంగాల్లో సైబర్ సెక్యూరిటీపై సహకారాన్ని మరింత తీవ్రతరం చేయడం కోసం ఇరుపక్షాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తీవ్రవాదం మరియు రాడికల్ తీవ్రవాదం యొక్క నిరంతర ముప్పును ఎదుర్కోవడంలో సన్నిహితంగా సహకరించడానికి కూడా వారు అంగీకరించారు.

 

  1. ఇండో-పసిఫిక్, ఆఫ్ఘనిస్తాన్, యూ.ఎన్.ఎస్.సి , జి20 మరియు కామన్వెల్త్‌లలో సహకారంతో సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై కూడా ప్రధానమంత్రులిద్దరూ అభిప్రాయాలను పంచుకున్నారు. మారిటైమ్ సెక్యూరిటీ పిల్లర్ కింద ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ లో యుకె చేరడాన్ని భారతదేశం స్వాగతించింది మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సంబంధాలను పెంపొందించడానికి అంగీకరించింది.

 

  1. ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న వివాదంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. పెరుగుతున్న మానవతా సంక్షోభంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మరియు హింసను తక్షణమే నిలిపివేయాలని మరియు ప్రత్యక్ష చర్చలు మరియు దౌత్యానికి తిరిగి రావడమే ఏకైక మార్గంగా తన పిలుపుని పునరుద్ఘాటించారు.

 

  1. గత సంవత్సరం COP26 విజయవంతంగా నిర్వహించబడినందుకు ప్రధాన మంత్రి జాన్సన్‌ను పిఎం  మోడీ అభినందించారు. పారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలను సాధించడానికి మరియు గ్లాస్గో వాతావరణ ఒప్పందాన్ని అమలు చేయడంలో ప్రతిష్టాత్మక వాతావరణ చర్యకు వారు నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆఫ్-షోర్ విండ్ ఎనర్జీ మరియు గ్రీన్ హైడ్రోజన్‌తో సహా క్లీన్ ఎనర్జీ యొక్క వేగవంతమైన విస్తరణపై సహకారాన్ని పెంపొందించడానికి మరియు ISA క్రింద గ్లోబల్ గ్రీన్ గ్రిడ్స్-వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ (OSOWOG) మరియు CDRI క్రింద IRIS ప్లాట్‌ఫారమ్ యొక్క ముందస్తు కార్యాచరణ కోసం సన్నిహితంగా పనిచేయడానికి వారు అంగీకరించారు. COP26 వద్ద భారతదేశం మరియు UK సంయుక్తంగా ప్రారంభించబడ్డాయి.

 

  1. భారత్-యుకె గ్లోబల్ ఇన్నోవేషన్ పార్టనర్‌షిప్ అమలుపై మరియు గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్‌నర్‌షిప్ (జిసిఎన్‌ఇపి)పై రెండు అవగాహన ఒప్పందాలు ఈ పర్యటనలో మార్పిడి చేయబడ్డాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ పార్టనర్‌షిప్ ద్వారా, క్లైమేట్ స్మార్ట్ సస్టైనబుల్ ఇన్నోవేషన్‌లను మూడవ దేశాలకు బదిలీ చేయడానికి మరియు స్కేల్ అప్ చేయడానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం మరియు యూకే  £ 75 మిలియన్ల వరకు సహ-ఫైనాన్స్ చేయడానికి అంగీకరించాయి. ఈ భాగస్వామ్యం క్రింద సృష్టించబడిన వినూత్న GIP ఫండ్ భారతీయ ఆవిష్కరణలకు మద్దతుగా మార్కెట్ నుండి అదనంగా £100 మిలియన్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

  1.  కింది ప్రకటనలు కూడా చేయబడ్డాయి - (I) స్ట్రాటజిక్ టెక్ డైలాగ్ – 5G, AI మొదలైన కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ టెక్నాలజీలపై మంత్రుల స్థాయి సంభాషణ. (II) ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్‌పై సహకారం - రెండు నౌకాదళాల మధ్య సాంకేతికత సహ – అభివృద్ధి.

 

  1. ప్రధాని జాన్సన్ అంతకుముందు ఏప్రిల్ 21న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తన పర్యటనను ప్రారంభించారు, అక్కడ సబర్మతీ ఆశ్రమం, వడోదరలోని మస్వాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని JCB ప్లాంట్ మరియు గాంధీనగర్‌లోని GIFT సిటీలోని గుజరాత్ బయోటెక్నాలజీ యూనివర్సిటీని సందర్శించారు.

 

  1. భారత అధ్యక్షతన G20 సమ్మిట్ కోసం 2023లో ప్రధానమంత్రి జాన్సన్‌ను ప్రధాని మోదీ భారతదేశానికి ఆహ్వానించారు. యూకేలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీకి ప్రధాని జాన్సన్ తన ఆహ్వానాన్ని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.

 

  1. మార్పిడి చేసుకున్న అవగాహన ఒప్పందాల జాబితా

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"