ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ నాడు అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో కలసి ఒక వర్చువల్ సమావేశం లో పాల్గొననున్నారు. ఇద్దరు నేత లు దక్షిణ ఆసియా, ఇండో-పసిఫిక్ రీజియన్ మరియు ప్రపంచ అంశాల పై ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించనున్నారు. దీనితో పాటుగా, పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాలపైన వారి వారి అభిప్రాయాల ను వెల్లడి చేసుకొంటారు. ఈ సమావేశం లో ఇరు పక్షాలు ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకొనే ఉద్దేశ్యం తో తమ నియమిత మరియు ఉన్నత స్థాయి సంబంధాల ను కొనసాగించడం పట్ల కూడా శ్రద్ధ తీసుకోనున్నారు.
నేతలిద్దరి మధ్య ఈ వర్చువల్ సమావేశం అనేది నాలుగో ఇండియా-యుఎస్ 2+2 మంత్రుల స్థాయి సంభాషణ కన్నా ముందు జరుగనుంది. ఈ సంభాషణ కు భారతదేశం పక్షాన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్ లు నాయకత్వం వహిస్తారు. అదే విధం గా యుఎస్ పక్షాన అమెరికా రక్షణ మంత్రి శ్రీ లాయడ్ ఆస్టిన్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఎంటనీ బ్లింకన్ లు నేతృత్వం వహిస్తారు.