నమస్కారం. ప్రియమైన నా దేశ వాసులారా, ఇవాళ మరో సారి ‘ మన్ కీ బాత్ ’ (మనసు లో మాట) కార్యక్రమం ద్వారా మీ అందరితో కబుర్లు చెప్పే అదృష్టం లభించింది. కొద్ది రోజుల క్రితమే బెంగళూరు లో ఒక చరిత్రాత్మక క్రికెట్ మేచ్ జరిగింది. నేను భారత్- అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మేచ్ ను గురించి మాట్లాడుతున్నానని మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఇది అఫ్గానిస్థాన్ కు ఒకటో అంతర్జాతీయ మేచ్. ఆ మేచ్ మన భారత జట్టు తో జరగడం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం. రెండు జట్లూ ఎంతో మెరుగైన ఆటను ఆడాయి. అఫ్గానిస్తాన్ కు చెందిన బౌలర్ రాశిద్ ఖాన్ ఈసారి ఐపిఎల్ లో కూదా ఎంతో చక్కని ప్రతిభ ను కనబరచాడు. అఫ్గానిస్తాన్ అధ్యక్షులు శ్రీ అశ్రఫ్ గనీ ‘‘అఫ్గానిస్తాన్ ప్రజలు తమ కథానాయకుడు రాశిద్ ఖాన్ ను చూసుకొని ఎంతో గర్విస్తున్నారు’’ అని నన్ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో రాయడం నాకు గుర్తుంది. ఈ క్రీడాకారులకు వారి యొక్క ప్రతిభను చూపెట్టడానికి ఒక వేదిక ను అందించినందుకు గానూ మన భారతీయ మిత్రులకు నేనెంతో ఋణపడి ఉంటాను. అఫ్గానిస్తాన్ లోని ఉత్తమమైన ప్రతిభకు రాశిద్ ప్రతినిధి. క్రికెట్ ప్రపంచానికి అతడు సంపద. అఫ్గానిస్తాన్ అధ్యక్షులు సరదాగా మరో మాటను కూడా రాశారు ‘‘రాశిద్ ను మేము ఎవ్వరికీ ఇవ్వబోవడం లేదు’’ అని. ఈ మేచ్ మనందరికీ ఎంతో గుర్తుండిపోతుంది. ఇది ఒకటో మేచ్ కాబట్టి తప్పకుండా గుర్తుంటుంది కానీ నాకు మాత్రం మరో విషయం కారణంగా గుర్తుంటుంది. యావత్తు ప్రపంచానికీ ఒక ఉదాహరణగా నిలచిపోయే ఒక ప్రత్యేకమైన పని ని భారత జట్టు చేసింది. ట్రోఫీ తీసుకునే సమయంలో విజేతగా నిలచిన జట్టు ఏమి చెయ్యాలో భారత జట్టు అదే పని ని చేసింది. ట్రోఫీ తీసుకునేప్పుడు భారతీయ జట్టు మొదటిసారిగా మేచ్ ఆడిన అఫ్గానిస్థాన్ జట్టు ను కూడా వేదిక మీదకు ఆహ్వానించి, ఇద్దరూ కలిపి ట్రోఫీ ని తీసుకున్నారు. క్రీడాస్ఫూర్తి అంటే ఏమిటో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. సమాజాన్ని ఏకం చెయ్యడానికి, మన యువత లో ఉన్న ప్రతిభాపాటవాలను వెలికి తియ్యడానికి, వాటిని వెతికి పట్టుకోవడానికి క్రీడలు ఒక మెరుగైన పద్ధతి. భారత, అఫ్గానిస్థాన్ జట్లు రెంటికీ ఇవే నా అభినందనలు. భవిష్యత్తు లో కూడా ఇలాగే మనం ఒకరితో ఒకరు కలిసి క్రీడాస్ఫూర్తితో ఆడతామని ఆశిస్తున్నాను; ఆడతాం కూడా.
ప్రియమైన నా దేశ వాసులారా, ఈ జూన్ 21వ తేదీ- నాలుగో ‘‘అంతర్జాతీయ యోగ దినం’ నాడు- ఒక చక్కని దృశ్యాన్ని తిలకించాను. యావత్తు ప్రపంచం కలిసికట్టుగా కనపడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆనంద ఉత్సాహాలతో యోగాభ్యాసం చేశారు. బ్రజిల్ లో యూరోపియన్ పార్లమెంట్ లోనూ, న్యూయార్క్ లో ఉన్న ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలోనూ, జపాన్ నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక లోనూ, అన్ని చోట్లా కూడా ప్రజలు యోగా చేస్తూ కనిపించారు. సౌదీ అరేబియా లో మొదటి సారి గా యోగా కు చెందిన చరిత్రాత్మక కార్యక్రమం జరిగింది. చాలా రకాల యోగాసనాలను మహిళలే ప్రదర్శించినట్టు నాకు చెప్పారు. లద్దాఖ్ లోని ఎత్తయిన మంచు శిఖరాలలో కూడా భారత , చైనా సైనికులు కలిసికట్టుగా యోగాభ్యాసం చేశారు. యోగా అన్ని సరిహద్దులనూ చెరిపి, అందరినీ జత పరుస్తుంది. వందల కొద్దీ దేశాలలో వేల కొద్దీ ఉత్సాహవంతులైన ప్రజలు జాతి, మత, ప్రాంత, లింగ భేదాలన్నింటినీ మరచి ఈ సందర్భాన్ని ఒక పెద్ద ఉత్సవంగా మార్చివేశారు. యోగ దినాన్ని ప్రపంచం అంతటా ప్రజలు ఇంత ఉత్సాహవంతంగా జరుపుకొంటూ ఉంటే, మరి మన దేశ ప్రజలు దీనిని రెట్టింపు ఉత్సాహంతో ఎందుకు జరుపుకోరు ?.
మన దేశ భద్రత దళ సైనికులు, నీటిలో, భూమిపై, ఆకాశం లో.. మూడు చోట్లా.. యోగాభ్యాసం చేయడం 125 కోట్ల ప్రజలు వీక్షించారు. కొందరు వీర జవానులు జలాంతర్గామి లో యోగా చేస్తే, కొందరు సియాచిన్ లోని మంచు కొండల్లో యోగాభ్యాసం చేశారు. వైమానిక దళానికి చెందిన మన వీరులు ఆకాశంలో భూమి కి 15000 అడుగుల ఎత్తులో నుండి యోగాసనాలు వేసి అందరినీ సంభ్రమానికి గురిచేశారు. విమానం లో కూర్చుని కాకుండా గాలిలో తేలుతూ యోగాసనాలు వెయ్యడం చూసి తీరాల్సిన దృశ్యం. పాఠశాలలు, కళాశాలలు,
కార్యాలయాలు, ఉద్యానవనాలు, ఎత్తయిన భవనాలు, క్రీడా మైదానాలు.. అన్ని చోట్లా యోగాభ్యాసం జరిగింది.
అహమదాబాద్ లోని ఒక దృశ్యం మాత్రం మనసుకు హత్తుకుంది. అక్కడ దాదాపు 750 దివ్యాంగ సోదరులు మరియు సోదరీమణులు ఒక చోట కలిసి యోగాభ్యాసం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. కుల, మత మరియు భూగోళ పరిధిని దాటి యోగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకం చేసే పని చేసింది. మన ఋషులు, మునులు, సాధువులు ఎప్పుడూ చెప్తూ వచ్చిన ‘వసుధైక కుటుంబకమ్’ అనే భావాన్ని మనం శతాబ్దాలుగా నమ్ముతూ వస్తున్నాము. యోగా ఆ భావాన్ని సరైన విధంగా నిరూపించి చూపెట్టింది. ఇవాళ ఆరోగ్యం ఒక ఉద్యమం గా మారింది. యోగాభ్యాసం వల్ల ఆరోగ్యం పట్ల మొదలైన ఈ ప్రచారం ముందుకు సాగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎక్కువ శాతం ప్రజలు దీనిని తమ జీవితాలలో భాగం చేసుకుంటారు.
ప్రియమైన నా దేశవాసులారా, mygov, నరేంద్ర మోదీ యాప్ లలో ఈసారి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో జులై ఒకటో తేదీన జరుగబోతున్న ‘డాక్టర్స్ డే’ ను గురించి చెప్పమని చాలా మంది నాకు రాశారు. మంచి సంగతి. ఇబ్బంది ఎదురైనప్పుడే మనం వైద్యుడి దగ్గరకు వెళ్తాము. కానీ ఆ రోజున మన దేశం లోని వైద్యుల ప్రగతి ని ఉత్సవంగా జరుపుకోబోతున్నాం. సమాజానికి వారు అందిస్తున్న సేవలకు గాను వారికి అనేకానేక ధన్యవాదాలు. మాతృమూర్తి ని భగవత్స్వరూపంగా పూజించే వాళ్ళము మనం. తల్లి ని భగవంతుడితో సమానంగా భావిస్తాము. ఎందుకంటే తల్లి మనకు జన్మను ఇస్తుంది. తల్లి జన్మ ను అందిస్తే, వైద్యుడు మనకు పునర్జన్మ ను అందిస్తాడు. కేవలం రోగాలను తగ్గించడం తోనే వైద్యుని పాత్ర ముగిసిపోదు. కుటుంబానికి స్నేహితుడి లాంటి వాడు వైద్యుడు. “They not only cure but also heal” అన్న మాటలు మన జీవన విధానంలో మార్గదర్శకాలు. ఇవాళ వైద్యుల వద్ద వైద్య విద్వత్తు తో పాటుగా సాధారణ జీవన విధాన పద్ధతులు మన ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావాన్ని చూపగలవు అన్న విషయాలపై లోతైన అవగాహన, అనుభవం ఉంటున్నాయి. భారతీయ వైద్యులు వారి సామర్థ్యం, ఇంకా నైపుణ్యాలతో యావత్తు ప్రపంచంలో తమ గుర్తింపును చాటుకున్నారు. వైద్య వృత్తిలో ఉండే పట్టుదలతో, పరిశ్రమతో పాటు క్లిష్టమైన వైద్య సమస్యలను పరిష్కరించగలరన్న పేరును తెచ్చుకొన్నారు మన భారతీయ వైద్యులు. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) మాధ్యమం ద్వారా నేను దేశప్రజలందరి తరఫునా మన వైద్య మిత్రులందరికీ వచ్చే జులై ఒకటో తేదీన జరుగబోతున్న ‘డాక్టర్స్ డే’ సందర్భంగా అనేకానేక అభినందనలను తెలుపుతున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, ఈ భరత భూమిపై జన్మించినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. మన భారత దేశ చరిత్రలో ఏదో ఒక చారిత్రాత్మక ఘటన జరగని ఏ ఒక్క నెలా, ఏ ఒక్క రోజూ లేదు. భారతదేశంలో ప్రతి ప్రదేశానికీ తనదైన ఒక వారసత్వం ఉంది. ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న ఎవరో ఒక సాధువు, మహా పురుషుడు, ఒక ప్రసిధ్ధ వ్యక్తి ఆ యా ప్రాంతాలకి తమ వంతు సహకారాన్ని అందించారు. గొప్పతనాన్ని ఇచ్చారు.
‘‘ప్రధాన మంత్రిగారూ నమస్కారం. నేను డాక్టర్ సురేంద్ర మిశ్ర ను మాట్లాడుతున్నాను. మీరు జూన్ 28న మఘర్ కు వస్తున్నారని తెలిసింది. నేను మఘర్ పక్కనే గోరఖ్ పుర్ కు చెందిన చిన్న గ్రామం టడ్వా లో నివసిస్తున్నాను. మఘర్ లో కబీర్ సమాధి ఉంది. కబీర్ గారిని ఇక్కడి ప్రజలు సామాజిక సామరస్యానికి పాటుపడిన వ్యక్తి గా గౌరవిస్తారు. కబీర్ గారి భావాలపై ప్రతి చోటా చర్చలు జరుగుతాయి. మీరు చేస్తున్న కార్యక్రమాలు సమాజం లోని అన్ని వర్గాలపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. దయచేసి ప్రభుత్వం చేపట్టబోతున్న మరిన్ని కార్యక్రమాల గురించి మాకు తెలియజేయవలసిందంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాను.’’ అని
ఈ ఫోన్ కాల్ ను చేసినందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు. 28వ తేదీన నేను మఘర్ వస్తున్న సంగతి నిజమే. గుజరాత్ లోని కబీర్వాడ్ మీకు తెలిసే ఉంటుంది. గుజరాత్ లోని కబీర్ వడ్ లో నేను పనిచేసేప్పుడు సత్పురుషుడు కబీర్ గారి సంప్రదాయాన్ని పాటించే కొందరు వ్యక్తులతో ఒక జాతీయ సమ్మేళనాన్ని నిర్వహించాను. కబీర్ దాస్ గారు మఘర్ కు ఎందుకు వెళ్ళారో మీకు తెలుసా ? మఘర్ లో మరణిస్తే స్వర్గాన్ని చేరరు అని ఒక నమ్మకం వుండేది అప్పట్లో. కాశీ లో దేహ త్యాగం చేస్తేనే స్వర్గం వెళ్తారని నమ్మే వారు. మఘర్ ను అపవిత్రంగా చూసే వారు. సత్పురుషుడు కబీర్ దాస్ గారు దీనిని విశ్వసించే వారు కాదు. తన జీవిత కాలంలో ఉన్న మూఢ విశ్వాసాలను, దురాచారాలను నిర్మూలించడానికి ఆయన ప్రయత్నించారు. అందుకనే ఆయన మఘర్ కు వెళ్ళి అక్కడే సమాధి చెందారు. కబీర్ దాస్ తన రచనలు, పద్యాల ద్వారా సామాజిక సమానత్వాన్ని, శాంతి ని, సౌభ్రాతృత్వాన్ని సమర్థించారు. ఇవే ఆయన ఆదర్శాలు. ఆయన రచనలలో ఇదే ఆదర్శం మనకు కనబడుతుంది. ఈ కాలంలో కూడా అవి మనకు ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఆయన రాసిన ఒక పద్యం ఇది-
‘‘కబీర్ సోయీ పీర్ హై, జో జానే పర్ పీర్
జో పర్ పీర్ న జానహీ, సో కా పీర్ మే పీర్’’..
దీనికి సాటి వారి బాధను అర్థంచేసుకున్న వాడే నిజమైన శ్రేష్ఠ సాధువు అని భావం. ఎదుటివారి దు:ఖాన్ని అర్థం చేసుకోలేని వాడు నిర్దయుడు. కబీర్ దాస్ గారు సామాజిక ఐక్యత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. ఆయన తన కాలం నాటి కంటే భవిష్య కాలాన్ని గురించి ఎక్కువ ఆలోచించే వారు. అసంతులత, సంఘర్షణ నిండిన ఆనాటి కాలంలో ఆయన శాంతి, సద్భావాల సందేశాన్ని అందించారు. ప్రజల మనసులను ఏకత్రపరచి అభిప్రాయ భేదాలను అంతం చేసే ప్రయత్నం చేశారు.
జగ్ మే బైర్ కోయీ నహీ, జో మన్ శీతల్ హోయ్
యహ్ ఆపా తో డాల్ దే, దయా కరే సబ్ కోయ్.
మరో పద్యంలో కబీర్ ఏమన్నారంటే-
"జహా దయా తహా ధర్మ్ హై, జహా లోభ్ తహా పాప్
జహా క్రోధ్ తహా కాల్ హై, జహా క్షమా తహా ఆప్ అని.
ఆయన మరో చోట అన్నారు
‘జాతి న పూఛో సాధూ కీ, పూఛ్ లీజియే జ్ఞాన్ ’ అని.
అంటే కుల, మతాలకు అతీతంగా మనుషులను జ్ఞానం ఆధారంగా కొలవండని, మర్యాదను ఇవ్వండని ప్రజలను ఆయన వేడుకొన్నారు. శతాబ్దాల తరువాత కూడా ఆయన మాటలు ఈనాటికీ ప్రభావవంతమైనవే. ఇవాళ మనం ఆయన కథనాలను వింటూ వుంటే ఇవాళ్టి జ్ఞాన యుగానికి చెందిన మాటలనే ఆయన చెప్తున్నారని అనిపిస్తుంది.
సత్పురుషుడు కబీర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి , ఆయన రాసిన మరొక పద్యం గుర్తొస్తోంది నాకు. అందులో ఆయన ఏమన్నారంటే,
గురు గోవింద్ దోఊ ఖడే, కాకే లాగూ పాయ్
బలిహారీ గురు ఆప్ నే, గోవింద్ దియో బతాయ్.
గురువు తాలూకూ గొప్పతనం అలాంటిది. ఇలాంటి గురువే మరొకరు ఉన్నారు- ఆయన జగద్గురువు- భగవంతుడు గురు నానక్. కోట్ల కొద్దీ ప్రజలకు సన్మార్గాన్ని చూపెట్టిన దేవుడు ఆయన. శతాబ్దాలుగా ప్రేరణను అందిస్తునే ఉన్నారు. గురు నానక్ భగవానుడు సమాజంలో జాతి, మత బేధాలను నిర్మూలించాలని, యావత్తు మానవ జాతి ని ఒక్కటిగా తలచి ఆలింగనం చేసుకోవాలని బోధించారు. పేదల, నిరాశ్రయుల సేవే భగవంతుడికి మనం అందించే సేవ అని వారు అనే వారు. వారు ఎక్కడికి వెళ్ళినా సమాజానికి ఉపయోగపడే పనులే చేశారు. సామాజిక భేద భావాలకు అతీతంగా ఉండే వంటశాల ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతి జాతి, కుల, మత, సంప్రదాయాలకు చెందిన వ్యక్తులు వచ్చి వంట చేయవచ్చు. భగవాన్ గురు నానక్ గారే ఈ లంగరు వ్యవస్థ ను మొదలుపెట్టారు. 2019 లో భగవాన్ గురు నానక్ గారి 550వ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాము. మనం అందరమూ ఆనందోత్సాహలతో ఈ ఉత్సవంలో పాలుపంచుకోవాలని నేను కోరుకుంటూన్నాను. గురు నానక్ గారి ఈ 550వ జయంతి ఉత్సవాన్ని యావత్తు సమాజం, యావత్తు ప్రపంచం ఎలా జరుపుకోవాలి అనే విషయం పై కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త సూచనలు, కొత్త కొత్త ఊహలు చేసి, మనం ఆలోచించి, సరైన ఏర్పాట్లు చేద్దాం. ఎంతో గౌరవంతో పాటు ఈ జయంతి ఉత్సవాన్ని మనం ప్రేరణాత్మకమైన ఉత్సవంగా మారుద్దాము.
ప్రియమైన నా దేశ వాసులారా, భారత దేశ స్వాతంత్రపోరాటం చాలా పెద్దది. చాలా విస్తృతమైనది. లోతైనది. లెఖ్ఖలేనన్ని బలిదానాలతో నిండిన సంగ్రామం ఇది. పంజాబ్ తో ముడిపడి ఉన్న ఒక చరిత్ర ఉంది. యావత్ మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసిన జలియన్వాలాబాగ్ దుర్ఘటన జరిగి 2019 కల్లా వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. 1919 , ఏప్రిల్13, నాటి ఆ చీకటి రోజు ను ఎవరు మరచిపోగలరు ? అధికార దుర్వినియోగంతో క్రూరత్వం హద్దులన్నీ దాటి నిర్దోషులైన, నిరాయుధులైన, అమాయక ప్రజలపై తుపాకీ గుళ్ల వర్షాన్ని కురిపించిన రోజు అది. ఈ సంఘటన జరిగి వంద సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. ఇటువంటి రోజు ను మనం ఎలా గుర్తుచేసుకోవాలి అని అందరమూ ఆలోచిద్దాము. ఈ సంఘటన అందించిన అమర సందేశాన్ని మాత్రం మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. హింస తోనూ, క్రూరత్వం తోనూ ఎప్పుడూ ఏ సమస్య కూ పరిష్కారం లభించదు అనే సందేశాన్ని ఈ సంఘటన అందిస్తుంది. ఎప్పుడూ కూడా శాంతిని, అహింసను, త్యాగాన్ని, బలిదానాన్నే విజయం వరిస్తుంది.
ఢిల్లీ లో రోహిణి కి చెందిన శ్రీ రమణ్ కుమార్ నరేంద్ర మోదీ యాప్ లో-
రాబోయే జులై 6 వ తేదీన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మదినం కాబట్టి, ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం ద్వారా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి గురించి దేశ ప్రజలకు తెలపవలసిందిగా కోరారు.
రమణ్ గారూ, ముందుగా మీకు అనేకానేక ధన్యవాదాలు. భారతదేశ చరిత్ర పై మీకున్న ఆసక్తి ని చూసి ఆనందం కలిగింది. మీకు తెలిసే వుంటుంది.. నిన్ననే జూన్ 23న ఆయన వర్ధంతి. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్నారు. కానీ వారికి అత్యంత ప్రియమైన అంశాలు విద్య, పరిపాలన, పార్లమెంటరీ వ్యవహారాలు. కలకత్తా విశ్వవిద్యాలయం ఉప కులపతులు అయిన వారందరి లోకీ ఆయన అతి పిన్న వయస్కుడైన ఉప కులపతి అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఉప కులపతి అయినప్పుడు ఆయన వయస్సు కేవలం 33 ఏళ్ళు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఆహ్వానం పై గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ గారు 1937 లో కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని వంగ భాష లో సంబోధించారు అన్న సంగతి చాలా కొద్ది మందికే ఇది తెలుసు. ఆంగ్ల పరిపాలన జరుగుతున్న సమయంలో, కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని వంగ భాషలో సంబోధించడం అదే మొదటిసారి. 1947 నుండి 1950 వరకు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశ ఒకటో పారిశ్రామిక మంత్రి గా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాదిని అందించింది ముఖర్జీ గారే. భారత పారిశ్రామిక అభివృద్ధి కి ఆయన ఒక బలమైన పునాది ని వేసి, ఒక బలమైన వేదిక ను తయారుచేశారు. 1948 లో వచ్చిన స్వతంత్ర భారతదేశ మొదటి పారిశ్రామిక విధానం, ఆయన ఆలోచనలు, ఆయన దార్శనిక ముద్రతో వచ్చింది. భారతదేశం ప్రతి రంగం లోనూ పారిశ్రామికంగా స్వయం సమృద్ధిగా, సమర్థవంతంగా, సంపన్నంగా ఉండాలనేది డాక్టర్ ముఖర్జీ కల. భారతదేశం పెద్ద పెద్ద పరిశ్రమలను స్థాపించాలని, దానితో పాటుగా ఎమ్ఎస్ఎమ్ ఇ, చేనేత, వస్త్రాలు, కుటీర పరిశ్రమల పట్ల కూడా పూర్తి శ్రద్ధ ను చూపెట్టాలని ఆయన కోరుకునే వారు. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు సమంగా అభివృద్ధి చెందాలని, వాటికి ఆర్థిక సహాయం, సంస్థల ఏర్పాటు లభించాలని, దాని కోసం 1948 నుండి 1950 ల మధ్య ఆల్ ఇండియా హ్యాండి క్రాఫ్ట్స్ బోర్డ్, ఆల్ ఇండియా హ్యాండ్ లూమ్ బోర్డ్, ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మొదలైన వాటిని స్థాపించారు. డాక్టర్ ముఖర్జీ గారు భారతదేశ రక్షణ ఉత్పత్తి తాలూకూ దేశీయకరణపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు. ముఖర్జీ గారు స్థాపించిన కర్మాగారాలలో చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ కర్మాగారం, హిందుస్తాన్ ఎయర్ క్రాఫ్ట్ కర్మాగారం, సిందరీ లోని ఎరువుల కర్మాగారం, దామోదర్ ఘాటీ కార్పొరేషన్ - ఈ నాలుగు అన్నింటి కన్నా సఫలమైన పెద్ద ప్రాజెక్టులు. తక్కిన రివర్ వేలీ ప్రాజెక్టుల స్థాపన లలో కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారిది పెద్ద సహకారమే. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కోసం ఆయన చాలా పాటుపడ్డారు. ఆయన ఆలోచన, విచక్షణ, క్రియాశీలతల వల్లే బెంగాల్ లో ఒక భాగం రక్షించబడింది. ఇవాళ ఆ భాగం భారతదేశం లో ఉండడానికి ఆయనే కారణం. భారతదేశ సమగ్రత, ఐక్యత- ఈ రెండూ ఆయన అన్నింటి కన్నా ప్రాముఖ్యాన్ని ఇచ్చిన అంశాలు. వీటి కోసమే 52 ఏళ్ల చిన్న వయస్సు లోనే ఆయన తన ప్రాణాలను సైతం కోల్పోవలసి వచ్చింది. రండి, మనందరమూ ఎప్పటికీ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఐక్యతా సందేశాన్ని గుర్తు పెట్టుకొని, సద్భావంతో, సౌభ్రాతృత్వ భావంతో భారతదేశ అభివృద్ధి కోసం సర్వ శక్తులతో ఏకం అవుదాము.
ప్రియమైన నా దేశవాసులారా, గత కొన్ని వారాలలో నాకు వీడియో కాల్ మాధ్యమం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రణాళికల ద్వారా లబ్ధి ని పొందిన వారితో సంభాషణ జరిపే అవకాశం లభించింది. ఫైళ్ల పరిధిని దాటి ప్రజల జీవితాలలో ఏటువంటి మార్పులు వస్తున్నాయో, వారి ద్వారానే వినే అవకాశం లభించింది. ప్రజలు వారి సంకల్పాలను, వారి సుఖ దు:ఖాలను, వారి సదుపాయాలను గురించి చెప్పారు. నాకు ఇది కేవలం ఒక ప్రభుత్వపరమైన కార్యక్రమం కాదు. నాకు ఇది ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అనుభవం. ఈ కార్యక్రమం ద్వారా నాకు ప్రజల ముఖంలో సంతోషం కనపడింది. ఇంతకన్నా ఆనందకరమైన క్షణాలు ఎవరి జీవితంలోనైనా ఏమి ఉంటాయి ? సామాన్య ప్రజల కథలు, అమాయకపు మాటల్లో వారి అనుభవాల కథలు, నా మనస్సుకు హత్తుకుపోయాయి. మారుమూల పల్లెల లోని ఆడపడుచులకు కామన్ సర్వీస్ సెంటర్ మాధ్యమం ద్వారా పల్లెల లోని వయోవృద్ధుల పెన్షన్ నుండీ పాస్ పోర్ట్ ను తయారు చేయించుకునే సేవ వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ లోని ఒక సోదరి సీతాఫలాలను ఏరి, వాటితో ఐస్ క్రీమ్ ను తయారు చేస్తోంది. ఝార్ ఖండ్ లో అంజనా ప్రకాశ్ లాగానే దేశం లోని లక్షలాది యువత జన ఔషధి కేంద్రాలను నడపడం తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి చౌకగా మందులను అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని ఒక యువకుడు రెండు, మూడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం అన్వేషిస్తూ వచ్చి ఇప్పుడు ఓ వ్యాపారాన్ని విజయవంతంగా చేసుకుంటున్నాడు. అంతే కాదు పది, పదిహేను మందికి అతడు తానే ఉద్యోగాలను ఇస్తున్నాడు. తమిళ నాడు, పంజాబ్ , గోవా ల లోని పాఠశాలల్లో విద్యార్థులు వారి చిన్న వయస్సు లోనే పాఠశాల లోని టింకరింగ్ లేబ్ లో వ్యర్థ పదార్థాల మేనేజ్ మెంట్ వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టి పని చేస్తున్నారు. ఇటువంటివి మరెన్నో కథలు ఉన్నాయి. ప్రజలు వారి విజయాల తాలూకూ కబుర్లు చెప్పని ప్రాంతం దేశంలో ఏమూల లోనూ లేనే లేదు. ఈ కార్యక్రమం మొత్తంలో ప్రభుత్వం విజయాన్ని సాధించడం కన్నా ఎక్కువగా సామాన్య ప్రజలు విజయాన్ని సాధించడం నాకు సంతోషం కలిగించిన విషయం. ఇదే దేశ శక్తి, న్యూ ఇండియా స్వప్నాలకు ఉన్నటువంటి శక్తి, న్యూ ఇండియా యొక్క సంకల్ప శక్తి. ఇది నాకు బాగా తెలుస్తోంది. సమాజంలో కొందరు ఉంటారు.. వారు నిరాశగా మాట్లాడకపోతే, నిరుత్సాహంగా మాట్లాడపోతే, అవిశ్వాసపరమైన మాటలు మాట్లాడకపోతే, కలపడానికి బదులు విడదీసే మార్గాలు వెతకకుండా ఉంటే, వారికి నిద్ర పట్టదు. ఇలాంటి వాతావరణంలో సామాన్య ప్రజలు కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో తమ జీవితాలలో జరుగుతున్న సంఘటనలను గురించి మాట్లాడితే అది ప్రభుత్వం గొప్పతనం కాదు. మారుమూల ఉన్న చిన్న పల్లె లోని ఒక చిన్న పిల్ల సంఘటన కూడా నూటపాతిక కోట్ల దేశ ప్రజలకు ప్రేరణను అందించగలదు. సాంకేతిక విజ్ఞానం సహాయంతో, వీడియో బ్రిడ్జ్ మాధ్యమం ద్వారా ప్రభుత్వ ప్రణాళికల వల్ల లబ్ధి పొందిన ప్రజలతో సమయాన్ని గడపిన క్షణాలన్నీ నాకు ఎంతో ప్రేరణాత్మకమైనవీ, ఆనందకరమైనవీనూ. దీని వల్ల పని చేసిన ఆనందం లభించడమే కాకుండా ఇంకా ఎక్కువ పని చెయ్యాలన్న ఉత్సాహం కూడా కలుగుతుంది. నిరుపేద వ్యక్తి కోసం జీవితాన్ని అంకితం చెయ్యాలన్న కొత్త ఆనందం,కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణ లభిస్తాయి.
దేశప్రజలకు నేనెంతో ఋణపడి వుంటాను.. 40, 50 లక్షల మంది ప్రజలు ఈ వీడియో బ్రిడ్జ్ కార్యక్రమంలో పాల్గొని, నాకు కొత్త శక్తి ని ఇచ్చే పని చేశారు. మరో సారి మీ అందరికీ నేను ఋణపడి వుంటాను అని తెలియచేస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, నేను ఎప్పుడూ గమనిస్తాను, మనం మన చుట్టుపక్కల గనుక గమనిస్తే ఎక్కడో అక్కడ ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంటుంది. మంచి చేసే మనుషులు ఉంటారు. ఆ మంచితనపు సుగంధాన్ని మనమూ ఆస్వాదించవచ్చు. కొద్ది రోజుల క్రితం ఒక సంగతి నా దృష్టికి వచ్చింది. ఇది ఒక గొప్ప కలయిక. ఇందులో ఒక పక్క ఇంజినీయర్లు, వృత్తినిపుణులు ఉన్నారు. మరో పక్క పొలంలో పని చేసే వారు, వ్యవసాయంతో ముడిపడి వున్న మన రైతు సోదరులు మరియు సోదరీమణులు ఉన్నారు. ఇవి రెండూ విభిన్నమైన రంగాలు కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. వీటికి సంబంధం ఏమిటీ అంటే- బెంగళూరులో కార్పొరేట్ ప్రొఫెషనల్స్, ఐటి ఇంజినీయర్లు ఒకటయ్యారు. వారంతా కలిసి ఒక సహజ సమృద్ధి ట్రస్టు ను ఏర్పరచారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చెయ్యడానికి ఈ ట్రస్టు ను స్థాపించారు. రైతులను కలుపుకొంటూ, ప్రణాళికలను తయారు చేస్తూ, రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడానికి ప్రయత్నాలు చేశారు. వ్యవసాయానికి ఉపయోగపడే కొత్త లక్షణాలతో పాటు, కొత్త పంటలను ఎలా పండించాలి అని ఈ ట్రస్టు ద్వారా ప్రొఫెషనల్, ఇంజినీయర్, టెక్నోక్రాట్ ల ద్వారా రైతులకు శిక్షణను అందించడం మొదలుపెట్టారు. ఇదివరకు ఏయే రైతులు వారి పొలంలో ఒకే రకమైన పంటను పండించారో, ఏయే రైతులు ఎక్కువ పంటను పండించలేకపోయారో, లాభాలను ఎక్కువగా పొందలేకపోయారో వారు ఇవాళ కాయగూరలను పండిస్తున్నారు. వాటికి సొంతంగా మార్కెటింగ్ కూడా ట్రస్టు ద్వారా చేసుకొని, మంచి లాభాలను పొందుతున్నారు. ధాన్యాన్ని పండించే రైతులు కూడా ఈ ట్రస్టు తో కలిశారు. పంటను పండించడం మొదలు మార్కెటింగ్ వరకు మొత్తం పనిలో రైతులే ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. దీనివల్ల లాభాలన్నీ రైతులవే. రైతుల భాగస్వామ్యాన్ని, రైతుల హక్కును నిశ్చితంగా ఉంచే ప్రయత్నం ఇది. పంటలు బాగా పెరగడానికి దానికి సరైన నాణ్యమైన విత్తనాల కోసం ప్రత్యేకంగా ఒక సీడ్ బ్యాంక్ కూడా తయారుచెయ్యబడింది. మహిళలు ఈ సీడ్ బ్యాంక్ పనులను చూస్తారు. ఈ అభినవ ప్రయత్నం చేసిన యువకులందరికీ నేను అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను. ప్రొఫెషనల్స్, టెక్నోక్రాట్, ఇంజినీయరింగ్ లోకాల నుండి వచ్చిన ఈ యువకులు వారి పరిధిని దాటి వచ్చి రైతులకు సహాయంగా నిలబడి, పల్లెలతో ముడివడి వ్యవసాయంతో,ధాన్యంతో ముడిపడే మార్గాన్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరోసారి నేను ఈ దేశ యువత ను వారి ఈ అభినవ ప్రయోగాలకు గానూ, నాకు తెలిసిన వాటికీ, నాకు తెలియని వాటికీ, ప్రజలకు తెలిసినా, తెలియకపోయినా, కోట్ల కొద్దీ ప్రజలకు మంచి చేస్తున్న వారి నిరంతర ప్రయత్నాలకు గానూ వారందరికీ నా తరఫున అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, జిఎస్ టి అమలులోకి వచ్చి ఒక సంవత్సరం కావస్తోంది. ‘ఒకే దేశం, ఒకే పన్ను’ అనేది దేశ ప్రజల స్వప్నం. అది ఇవాళ సాకారమైంది. ‘ఒకే దేశం, ఒకే పన్ను సంబంధ సంస్కరణ’.. దీనికంటూ ఎవరినైనా అభినందించవలసి వస్తే నేను రాష్ట్రాలనే అభినందిస్తాను. జిఎస్ టి అనేది సహకారాత్మక సమాఖ్య విధానానికి ఒక గొప్ప ఉదాహరణ. అన్ని రాష్ట్రాలూ కలిసి దేశ హితం కోసం నిర్ణయాన్ని తీసుకున్నాయి కాబట్టే దేశంలో ఇంత పెద్ద పన్నుల సంబంధ సంస్కరణ అమలు లోకి రావడం జరిగింది. ఇప్పటి వరకూ జిఎస్ టి కౌన్సిల్ తాలూకూ 27 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో వివిధ రాష్ట్రాల ప్రజలు పాల్గొంటారు, విభిన్న రాజకీయ ఆలోచనలు కలిగిన వ్యక్తులు పాల్గొంటారు, వేరు వేరు స్థానాలున్న రాష్ట్రాలు ఉంటాయి. కానీ ఈ జిఎస్ టి కౌన్సిల్ ఇంతవరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడాను అందరి సమ్మతం తో తీసుకున్నవే. జిఎస్ టి కన్నా ముందు దేశంలో 17 రకాల వివిధ రకాలైన పన్నులు ఉండేవి. కానీ ఈ వ్యవస్థ ఏర్పాటైన తరువాత యావత్తు దేశంలో ఒకే ఒక పన్ను అమలులోకి వచ్చింది. నిజాయతీ కి లభించిన విజయం జిఎస్ టి. ఒక రకంగా నిజాయతీకి పండుగ కూడాను. ఇంతకు ముందు దేశంలో చాలా సార్లు పన్నుల విషయంలో అజమాయిషీలపై ఫిర్యాదులు వస్తూ ఉండేవి. జిఎస్ టి లో జిఎస్ టి అజమాయిషీ స్థానాన్ని ఐటి రంగం తీసుకుంది. రిటర్న్ నుండి రిఫండ్ వరకు.. అంతా ఆన్ లైన్ లోనే ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ ద్వారానే జరుగుతుంది. జిఎస్ టి వల్ల తనిఖీ లు ఆగాయి. సరుకుల కదలిక వేగవంతం అయింది. దీనివల్ల కేవలం సమయం ఆదా అవడమే కాక లాజిస్టిక్స్ రంగానికి కూడా ఎంతో లాభం చేకూరుతోంది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పన్ను సంస్కరణ జిఎస్ టి అయి వుంటుంది. భారతదేశంలో ఇంత పెద్ద పన్ను సంస్కరణ విజయవంతం కావడానికి కారణం ప్రజలు దీనిని సొంతం చేసుకోవడమే. జన శక్తి ద్వారానే జిఎస్ టి విజయవంతం అయింది. సాధారణంగా ఇంత పెద్ద సంస్కరణ, ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద జనాభా లో స్థిరంగా మారడానికి ఐదు నుండి ఏడు సంవత్సరాలు సులువుగా పడుతుంది. కానీ దేశంలోని నిజాయతీ పరుల ఉత్సాహం, నిజాయతీపరుల ఉత్సాహవంతమైన జన శక్తి భాగస్వామ్యానికి ప్రతిఫలంగా కేవలం ఒక్క సంవత్సరం లోనే చాలా వరకు ఈ కొత్త పన్ను విధానం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అంతేకాక అవసరార్థం తన అంతర్నిర్మిత వ్యవస్థ ద్వారా మార్పులు కూడా చేసుకుంటోంది. ఇది ఎంతో పెద్ద విజయం. ఈ విజయాన్ని 125 కోట్ల దేశప్రజలు సంపాదించుకున్నారు.
ప్రియమైన నా దేశవాసులారా, మరో సారి ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమాన్ని ముగిస్తూ, మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడే మరో అవకాశం కోసం రాబోయే ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం కోసం ఎదురుచూస్తూంటాను.
మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
అనేకానేక ధన్యవాదాలు.
A historic test match in Bengaluru. #MannKiBaat pic.twitter.com/9N9maegX3L
— PMO India (@PMOIndia) June 24, 2018
PM @narendramodi lauds the Indian cricket team for their gesture during the test match against Afghanistan. #MannKiBaat pic.twitter.com/3c0aTcZhWo
— PMO India (@PMOIndia) June 24, 2018
Sports unites people. #MannKiBaat pic.twitter.com/NmixwI2jjH
— PMO India (@PMOIndia) June 24, 2018
Great enthusiasm during this year's Yoga Day. #MannKiBaat pic.twitter.com/5hGZ25dTf3
— PMO India (@PMOIndia) June 24, 2018
Yoga unites humanity. #MannKiBaat pic.twitter.com/WEObjPT6PX
— PMO India (@PMOIndia) June 24, 2018
Sights that made 125 crore Indians proud. #MannKiBaat pic.twitter.com/PKgiWwBKuQ
— PMO India (@PMOIndia) June 24, 2018
Yoga is ushering a wellness revolution. #MannKiBaat pic.twitter.com/TpNwlDg6kG
— PMO India (@PMOIndia) June 24, 2018
The doctors of India can solve complex medical problems thanks to their diligence. #MannKiBaat pic.twitter.com/gBtGxBfvcC
— PMO India (@PMOIndia) June 24, 2018
Hear #MannKiBaat. PM is talking about the life and message of Sant Kabir Das Ji. https://t.co/zuDP05llHv
— PMO India (@PMOIndia) June 24, 2018
The thoughts and ideals of Sant Kabir Das Ji emphasize on social harmony. #MannKiBaat pic.twitter.com/eGUQmaQ8zS
— PMO India (@PMOIndia) June 24, 2018
In 2019 we mark the 550th Prakash Parv of Guru Nanak Dev Ji. Let us think about ways in which we can mark this historic occasion. #MannKiBaat pic.twitter.com/gA4o2Oo1eV
— PMO India (@PMOIndia) June 24, 2018
Remembering the martyrs of the Jallianwala Bagh massacre. #MannKiBaat pic.twitter.com/XLd5ivgxlD
— PMO India (@PMOIndia) June 24, 2018
PM @narendramodi remembers the great Dr. Syama Prasad Mookerjee during #MannKiBaat.
— PMO India (@PMOIndia) June 24, 2018
He remembers Dr. Mookerjee's role in the education sector and industrial development of India. pic.twitter.com/yt2iaMa6Hf
Over the last few days, I have been interacting with beneficiaries of various initiatives of the Government of India. I learnt a lot from their experiences and life journeys: PM @narendramodi #MannKiBaat
— PMO India (@PMOIndia) June 24, 2018
PM @narendramodi speaks about the historic GST, calls it a great example of cooperative federalism. #MannKiBaat pic.twitter.com/ciDAPfPEdr
— PMO India (@PMOIndia) June 24, 2018