సంసద్ టివి ని భారతదేశం ఉప రాష్ట్రపతి మరియు రాజ్య సభ చైర్ మన్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా లు 2021 సెప్టెంబర్ 15న సాయంత్రం 6 గంటల కు పార్లమెంట్ హౌస్ ఉప భవనం లోని ప్రధాన కమిటీ రూమ్ లో సంయుక్తం గా ప్రారంభించనున్నారు. అదే రోజు న ప్రజాస్వామ్యం అంతర్జాతీయ దినోత్సవం కూడా కావడం అనేది యాదృచ్చికం.
సంసద్ టివి ని గురించి
లోక్ సభ టివి ని, రాజ్య సభ టివి ని విలీనం చేయాలన్న నిర్ణయాన్ని 2021వ సంవత్సరం ఫిబ్రవరి లో తీసుకోవడమైంది. సంసద్ టివి కి సిఇఒ ను 2021 మార్చి నెల లో నియమించడం జరిగింది.
సంసద్ టివి లో ప్రధానం గా నాలుగు కేటగిరీల కు చెందిన కార్యక్రమాలు ఉంటాయి; అవి ఏమేమిటంటే పార్లమెంట్ మరియు ప్రజాస్వామిక సంస్థ ల పనితీరు, పథకాల/విధానాల అమలు మరియు పాలన, భారతదేశం చరిత్ర, సంస్కృతి లతో పాటు సమకాలిక స్వభావాన్ని కలిగివున్నటువంటి అంశాలు/ ప్రయోజనాలు/వ్యవహారాలు.