అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ఉప రాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా ‘‘సంసద్ టీవీ’’ని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- పార్లమెంటుతో ముడిపడిన టీవీ చానెల్ వేగంగా మారుతున్న కాలానికి... ముఖ్యంగా 21వ శతాబ్దంలో చర్చలు-సంభాషణల ద్వారా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు తగినట్లు రూపాంతరం చెందడాన్ని ప్రశంసించారు. ‘సంసద్ టీవీ’ ప్రారంభాన్ని భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయంగా ప్రధాని అభివర్ణించారు. సంసద్ టీవీ రూపంలో దేశవ్యాప్త చర్చలకు, సమాచార వ్యాప్తికి సంసద్ టీవీ ఒక మాధ్యమం కాగలదని, తద్వారా దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధులకు ఇది కొత్త గళంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘దూరదర్శన్’ 62 ఏళ్లు పూర్తిచేసుకోవడంపైనా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. మరోవైపు ఇవాళ ‘ఇంజనీర్ల దినోత్సవం’ కావడంతో దేశంలోని ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవాళ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం కూడా కావడాన్ని గుర్తుచేస్తూ- భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లివంటిది కాబట్టి ఈ విషయంలో మరింత బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. భారతదేశానికి ప్రజాస్వామ్యం ఒక వ్యవస్థ కాదని, అదొక సిద్ధాంతమని చెప్పారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం ఒక రాజ్యాంగ సౌధం కాదని, అదొక స్ఫూర్తి అని వివరించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఓ రాజ్యాంగ స్రవంతి సమాహారం మాత్రమే కాదని, అది మన జీవన స్రవంతి అని ఆయన తెలిపారు. భారత 75 ఏళ్ల స్వాతంత్ర్యం నేపథ్యంలో గత వైభవాన్ని, ఆశావహ భవిష్యత్తును మన కళ్లముందు ఉంచడంలో మాధ్యమాలకుగల పాత్రను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘స్వచ్ఛభారత్ అభియాన్’ వంటి అంశాలను మాధ్యమాలు ముందుకు తీసుకెళితే, అవి అమిత వేగంలో ప్రజల్లోకి చేరుతాయని ఆయన చెప్పారు. తదనుగుణంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేళ భారత స్వాతంత్ర్య పోరాటంపై 75 భాగాల కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల కృషిని వివరించడంలో మాధ్యమాలు తమవంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అనుబంధ సంచికలను కూడా ప్రచురించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
సారాంశ కేంద్రకపాత్ర గురించి ప్రస్తావిస్తూ- మాధ్యమ ప్రసారాల్లో అగ్రాసనం సారాంశానిదే అయినప్పటికీ, తన అనుభవాల దృష్ట్యా ‘సారాంశం అర్థవంతమైనది’గా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. ఎవరినుంచి మెరుగైన సారాంశం లభ్యమవుతుందో ప్రజానీకం స్వయంచలితంగా వారివైపు మరలుతారని ఆయన వివరించారు. ఈ విషయం మాధ్యమాలకు ఎంతగా వర్తిస్తుందో మన పార్లమెంటరీ వ్యవస్థకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంటులో రాజకీయాలు మాత్రమేగాక విధానం కూడా భాగంగా ఉంటుందని చెప్పారు. ఆ మేరకు పార్లమెంటు కార్యకలాపాలతో సాధారణ ప్రజానీకం కూడా మమేకం కావాలని పేర్కొన్నారు. తదనుగుణంగా కొత్త చానెల్ కృషి చేయాలని ఆయన కోరారు.
పార్లమెంటు సమావేశమైనపుడు విభిన్న అంశాలపై చర్చలు సాగుతుంటాయని, వాటిద్వారా యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. అలాగే పార్లమెంటు సభ్యులు కూడా మెరుగైన రీతిలో వ్యవహరించడానికి తగిన స్ఫూర్తి లభిస్తుందని, దేశమంతా వారిని చూస్తుండగా సభలో చర్చ మెరుగ్గా సాగే వీలుంటుందని పేర్కొన్నారు. అదే తరహాలో పౌరులు కూడా తమ బాధ్యతలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ దిశగా అవగాహన కల్పనలో మాధ్యమం ఎంతో ప్రభావశీలమైనదని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్య సంస్థలు, వాటి పనితీరు, పౌర బాధ్యతలు తదితరాల గురించి మన యువత ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా సభా కమిటీలు, సభా కార్యకలాపాల ప్రాముఖ్యం, చట్టసభల పనితీరు గురించి ఎంతో సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. భారత ప్రజాస్వామ్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడంలో ఈ సమాచారం ఎంతగానో తోడ్పడగలదని ప్రధాని చెప్పారు. దేశ ప్రజాస్వామ్యానికి మూలాలైన పంచాయతీల పనితీరు గురించి కూడా ‘సంసద్ టీవీ’ కార్యక్రమాలు రూపొందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కొత్త ఉత్తేజంతో భారత ప్రజాస్వామ్యానికి సరికొత్త శక్తి సమకూరుతుందని పేర్కొన్నారు.
तेजी से बदलते समय में मीडिया और टीवी channels की भूमिका भी तेजी से बदल रही है।
— PMO India (@PMOIndia) September 15, 2021
21वीं सदी तो विशेष रूप से संचार और संवाद के जरिए revolution ला रही है।
ऐसे में ये स्वाभाविक हो जाता है कि हमारी संसद से जुड़े चैनल भी इन आधुनिक व्यवस्थाओं के हिसाब से खुद को ट्रान्स्फॉर्म करें: PM
India is the mother of democracy.
— PMO India (@PMOIndia) September 15, 2021
भारत के लिए लोकतन्त्र केवल एक व्यवस्था नहीं है, एक विचार है।
भारत में लोकतंत्र, सिर्फ संवैधानिक स्ट्रक्चर ही नहीं है, बल्कि वो एक स्पिरिट है।
भारत में लोकतंत्र, सिर्फ संविधाओं की धाराओं का संग्रह ही नहीं है, ये तो हमारी जीवन धारा है: PM
मेरा अनुभव है कि- “कन्टेंट इज़ कनेक्ट।”
— PMO India (@PMOIndia) September 15, 2021
यानी, जब आपके पास बेहतर कन्टेंट होगा तो लोग खुद ही आपके साथ जुड़ते जाते हैं।
ये बात जितनी मीडिया पर लागू होती है, उतनी ही हमारी संसदीय व्यवस्था पर भी लागू होती है!
क्योंकि संसद में सिर्फ पॉलिटिक्स नहीं है, पॉलिसी भी है: PM
हमारी संसद में जब सत्र होता है, अलग अलग विषयों पर बहस होती है तो युवाओं के लिए कितना कुछ जानने सीखने के लिए होता है।
— PMO India (@PMOIndia) September 15, 2021
हमारे माननीय सदस्यों को भी जब पता होता है कि देश हमें देख रहा है तो उन्हें भी संसद के भीतर बेहतर आचरण की, बेहतर बहस की प्रेरणा मिलती है: PM @narendramodi
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి