సహాయక కార్యదర్శుల (2016వ సంవత్సరపు బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారుల) ముగింపు సమావేశం లో భాగంగా వారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో నేడు నివేదికలను సమర్పించారు.
అధికారులు 8 ఎంపిక చేసిన నివేదికలను సమర్పించారు. అవి వ్యవసాయ ఆదాయాల పెంపు, భూమి స్వస్థత కార్డులు, ఫిర్యాదుల పరిష్కారం, పౌర ప్రధాన సేవలు, విద్యుత్తు రంగ సంస్కరణలు, పర్యటకులకు సదుపాయాల కల్పన, ఇ-వేలంపాటలు, ఇంకా స్మార్ట్ అర్బన్ డివెలప్ మెంట్ సొల్యూశన్స్ వంటి ఇతివృత్తాలతో కూడివున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, జూనియర్-మోస్ట్ అధికారులు మరియు సీనియర్-మోస్ట్ అధికారులు ఒకరితో మరొకరు ముఖాముఖి సంభాషించుకొనేందుకు ఒక అవకాశాన్ని సహాయక కార్యదర్శుల కార్యక్రమం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా వారిని వివిధ మంత్రిత్వ శాఖ లకు జోడించిన కాలం లో అత్యుత్తమ అనుభవాలను సముపార్జించుకోవలసిందిగా యువ అధికారులను ఆయన ప్రోత్సహించారు. యువ అధికారులు వారి వృత్తి లో ఏయే పదవుల లో సేవ చేస్తూవున్నప్పటికీ కూడాను ప్రభుత్వం పైన ప్రజలు పెట్టుకొన్న ఆశ లను అధికారులు వారి మనస్సు లలో లక్ష్యపెట్టుకోవాలని ఆయన ఉద్బోధించారు.
అధికారులు వారి విధి నిర్వహణ క్రమం లో వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలతో, వారు సేవలు అందించే ప్రజలతో ఒక సంధానాన్ని అభివృద్ధి పరచుకోవాలంటూ ప్రధాన మంత్రి అధికారులను ప్రోత్సహించారు. ప్రజలతో సన్నిహిత సంబంధం పెంచుకోవడం వారి కార్యభారాలు మరియు ధ్యేయాలలో సాఫల్యం సాధించడంలో ఒక కీలకమైన సాధనం అని ఆయన చెప్పారు.
యువ అధికారులు సమర్పించినటువంటి నివేదిక లను ప్రధాన మంత్రి ప్రశంసించారు.