ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యుఎస్ ఇండియా స్ట్రటీజిక్ పార్ట్‌నర్‌శిప్ ఫోరమ్ (యుఎస్ఐఎస్‌పిఎఫ్) సభ్యులు న్యూ ఢిల్లీ లోని నెంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఈ రోజున సమావేశమయ్యారు. ఈ ప్రతినిధి వర్గానికి యుఎస్ఐఎస్‌పిఎఫ్ చైర్ మన్ శ్రీ జాన్ చాంబర్స్ నాయకత్వం వహించారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసినందుకు ప్రతినిధి వర్గానికి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. దేశం లో ఎదుగుతున్న స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ ను గురించి ఆయన ఈ సందర్భం గా ప్రస్తావించారు. భారతదేశం లోని యువత నష్ట భయాన్ని తట్టుకొనే నవ పారిశ్రామికత్వ సామర్ధ్యాన్ని పుణికిపుచ్చుకొంటోందని ప్రధాన మంత్రి అన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ, సమస్యల ను పరిష్కరించడం మరియు నూతన ఆవిష్కరణల శక్తి కి ఉత్తేజాన్ని అందించడం కోసం హ్యాకథన్ ను నిర్వహించడం తో పాటు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సహా ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల ను గురించి కూడా ఆయన వివరించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు పూచీ పడటం కోసం చేపడుతున్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి చాటి చెప్పారు. కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గించడం మరియు శ్రామిక సంస్కరణల ను చేపట్టడం జరిగినట్లు తెలియ జేశారు. ఈజ్ ఆఫ్ లివింగ్ కు పూచీ పడటం లో ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన విడమరచి చెప్పారు. మూడు డి లు – డెమోక్రసీ, డెమోగ్రఫీ మరియు ‘దిమాగ్’ ల లభ్యత భారతదేశం యొక్క విశిష్ట శక్తి గా ఉన్నదని ఆయన అన్నారు.
దేశం కోసం ప్రధాన మంత్రి ఆచరణ లో పెడుతున్న దార్శనికత పట్ల ప్రతినిధి వర్గం నమ్మకాన్ని వెలిబుచ్చింది. రాగల అయిదు సంవత్సరాల కాలం లో భారతదేశం అనుసరిస్తున్న విధానాలు ప్రపంచాని కి తదుపరి ఇరవై అయిదు సంవత్సరాల కాలం ఉండేది నిర్వచిస్తుందని వారు అన్నారు.
యుఎస్ఐఎస్‌పిఎఫ్ గురించి
యుఎస్ఐఎస్‌పిఎఫ్ అనేది ఒక లాభాపేక్ష రహిత సంస్థ గా ఉంది. దీని ప్రధాన ధ్యేయం ఆర్థిక వృద్ధి, నవ పారిశ్రామికత్వం, ఉపాధి కల్పన మరియు నూతన ఆవిష్కరణ ల రంగాల లో అనుసరించదగిన విధానాల ను సూచించడం ద్వారా భారతదేశం యుఎస్ ద్వైపాక్షిక మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలవత్తరం గా మార్చడమే.