నేశనల్ కేపిటల్ రీజియన్ లో గత ఆదివారం నాటి నుండి వాయు కాలుష్యాన్ని నియంత్రించడం కోసం చేపట్టిన ఏర్పాట్ల లో పురోగతి ని యూనియన్ కేబినెట్ సెక్రటరి సమీక్షించారు.
హరియాణా లో మరియు పంజాబ్ లో పంట కోతల అనంతరం గడ్డి దుబ్బుల కాల్చివేత ఘటన లు ఇప్పటి కీ కొనసాగుతూనే ఉన్నాయని, ఈ విషయం లో మరింత అధిక శ్రద్ధ ను తీసుకోవలసిన ఆవశ్యకత ఉందని గమనించడమైంది.
తగిన జరిమానాల ను అతిక్రమణదారుల కు విధించి వారు దారి కి వచ్చేటట్లు చూడటం కోసం మరిన్ని పర్యవేక్షక బృందాల ను రంగం లోకి దింపవలసింది గా ఈ రాష్ట్రాల ను ప్రస్తుతం ఆదేశించడమైంది.
వివిధ ఏజెన్సీలు సమన్వయం తో పని చేస్తున్న రాజధాని లో పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని కూడా చర్చించారు. పరిస్థితి ని అదుపు లోకి తీసుకు రావడం కోసం ఇతోధిక ప్రయత్నాలను చేపట్టవలసిన అవసరం ఉన్నదని అభిప్రాయపడటం జరిగింది.
భవిష్యత్తు లో ఎటువంటి అగత్యం ఏర్పడినప్పటికీ దాని ని సంబాళించడం కోసం పూర్తి స్థాయి లో సన్నద్ధం గా ఉండవలసింది గా రాష్ట్రాల కు సైతం ఆదేశాల ను ఇవ్వడమైంది.