ప్రయివేటు పెట్టుబడులకు అనుకూలమైన విధానం: కేంద్ర సహాయానికి పిపిపి నిబంధన తప్పనిసరి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి - ఒక కొత్త మెట్రో రైల్ విధానాన్ని ఆమోదించింది. పెద్ద సంఖ్యలో నగరాల్లో మెట్రో రైలు పట్ల పెరుగుతున్న ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని - ఒక బాధ్యతాయుతమైన పద్దతిలో అమలయ్యే విధంగా - ఈ విధానానికి ఆమోదం తెలిపింది.
కొత్త మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర సహాయం పొందాలంటే - పిపిపి (PPP) నిబంధనను తప్పనిసరి చేస్తూ - మెట్రో నిర్వహణ లోని వివిధ విభాగాలలో ప్రయివేటు పెట్టుబడులకు ఈ విధానం పెద్ద పీట వేస్తుంది. మెట్రో ప్రాజెక్టులలో మూలధనం పెట్టుబడులకు పెద్ద ఎత్తున వనరుల అవసరం ఉన్న దృష్ట్యా - ప్రయివేటు పెట్టుబడులు, ఇతర వినూత్న రూపాల్లో మెట్రో ప్రాజెక్టులకు ఆర్ధిక సహాయం చేయడం తప్పనిసరి.
" మెట్రో రైలు లో పూర్తిస్థాయి ప్రయివేటు భాగస్వామ్యం లేదా టిక్కెట్టు ధరల వసూలు చేయడం, సేవల నిర్వహణ వంటి కొన్ని విభాగాలలో పెట్టుబడులు పెట్టాలంటే - పిపిపి నిబంధన ను తప్పనిసరి చేసినట్లు ఈ విధానంలో పేర్కొన్నారు. ప్రయివేటు వనరులు, నైపుణ్యం, వ్యవస్ధాపకత వంటి వాటిని పెట్టుబడులుగా మార్చుకునేందుకు - ఈ విధానం ఉపయోగాపడుతుంది.
ప్రస్తుతం గమ్యం చివరి వరకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో - మెట్రో స్టేషన్లకు రెండు వైపులా 5 కిలోమీటర్ల పరిధిలో అవసరమైన రవాణా సౌకర్యం కల్పించడంకోసం రాష్ట్రప్రభుత్వాలు తగిన ప్రాజెక్ట్ రిపోర్టులు దాఖలు చేయవలసి ఉంటుంది. కాలినడక బాటలు, సైకిల్ మార్గాలు వంటి అనుబంధ సౌకర్యాలు కల్పించాలి. రాష్ట్రాలు, కొత్త మెట్రో ప్రోజెక్టుల కోసం చేసే - తమ ప్రాజెక్టు నివేదికల్లో ఈ సేవల గురించి, పెట్టుబడుల గురించీ పేర్కొనవలసి ఉంటుంది.
తక్కువ వ్యయంతో ప్రజలకు ప్రభుత్వ రవాణా సౌకర్యం కల్పించాలనుకునే రాష్ట్రాలు - BRTS ( బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్), లైట్ రైల్ ట్రాన్సిట్, ట్రామ్ వేస్, మెట్రో రైల్, రీజినల్ రైల్ వంటి ఇతర ప్రజా రవాణా సౌకర్యాల డిమాండు, సామర్ధ్యం, వ్యయం, అమలు విధానం తదితర అంశాల గురించి - ప్రత్యామ్నాయ విశ్లేషణ తప్పనిసరిగా దాఖలు చేయవలసి ఉంటుంది. పట్టణ మెట్రోపాలిటన్ రవాణా సాధికార సంస్థ (UMTA) ను నెలకొల్పుకోవడం తప్పనిసరి. అందుబాటులో ఉన్న సామర్ధ్యాలను భారీగా వినియోగించుకోవడం కోసం పూర్తి స్థాయి మల్టీ మోడల్ రవాణా వ్యవస్థపై - ఈ సంస్థ సమగ్ర రవాణా ప్రణాళికలను తయారు చేయవలసి ఉంటుంది.
కొత్త మెట్రో ప్రతిపాదనలను క్షుణ్ణంగా అంచనా వేసి, పట్టాన రవాణా సంస్థ, లేదా అటువంటి ఇతర సమర్ధవంతమైన కేంద్రాలను - స్వతంత్ర మూడవ పక్షాన్ని ప్రభుత్వం గుర్తించడానికి ఈ కొత్త మెట్రో రైల్ విధానం వీలు కల్పిస్తుంది.
గణనీయమైన సాంఘిక, ఆర్ధిక, పర్యావరణ పరంగా మెట్రో ప్రాజెక్టులకు కలిగే లాభాలను గుర్తించి, అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా - మెట్రో ప్రాజెక్టులకు అనుమతి లభించేందుకు - ప్రస్తుతం 8 శాతంగా ఉన్న "ఆర్ధిక అంతర్గత ప్రయోజనం" 14 శాతానికి పెరిగేలా ఈ విధానం అవకాశం కల్పిస్తుంది.
పట్టణ ప్రజా రవాణా ప్రాజెక్టులను కేవలం పట్టణ రవాణా ప్రాజెక్టులుగానే చూడకూడదు. వాటిని పట్టణ పరివర్తన ప్రాజెక్టులుగా చూడాలి. ఈ కొత్త విధానం - ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు మెట్రో మార్గం వెంబడి పట్టణాభివృద్ధి జరగడంతో - దీన్ని - రవాణా సంబంధ అభివృద్ధిగా (TOD) - భావించాలి. పట్టణ ప్రాంతాల్లో భామి సమర్ధంగా వినియోగించబడుతుంది. ఈ విధానం కింద రాష్ట్రాలు - " బెటర్ మెంట్ లెవీ " ద్వారా పెరిగిన ఆస్తుల విలువలో వాటాను చేజిక్కించుకోవడం ద్వారా మెట్రో ప్రాజెక్టులకు ఆర్ధిక వనరులను తరలించుకోవాలి. రాష్ట్రాలు - వేల్యూ క్యాప్చర్ వంటి అత్యాధునిక ఆర్ధిక విధానాలను అవలంబించవలసిన అవసరం ఉంది. మెట్రో ప్రాజెక్టులకోసం కార్పొరేట్ బాండ్లు విడుదల చేయడం ద్వారా రాష్ట్రాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడులు రాబట్టాలి.
ఈ మెట్రో ప్రాజెక్టులు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు - టికెట్ ధర ఆదాయం కాకుండా -స్టేషన్లలోనూ - ఇతర పట్టణ భూముల వద్ద ప్రకటనలు, లీజు ద్వారా, ఇతరత్రా మార్గాలద్వారా వాణిజ్య పరంగా - ఆస్తుల అభివృద్ధి కి చట్టపరంగా చేపట్టే చర్యలను రాష్ట్రాలు తమ ప్రాజెక్టు రిపోర్ట్ ల్లో స్పష్టంగా పొందుపరచవలసి ఉంటుంది. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు, ఆమోదాలను తీసుకుంటామని కూడా రాష్ట్రాలు హామీ ఇవ్వవలసి ఉంటుంది.
సమయానుకూలంగా చార్జీలను సవరించుకోడానికి వీలుగా ఒక శాశ్వత ధరల నిర్ణాయక సాధికార సంస్థను ఏర్పాటు చేసుకోడానికి - నియమ నిబంధనలు రూపొందించుకోవడానికి - ఈ కొత్త విధానం - రాష్ట్రాలకు - అధికారాన్ని ఇస్తుంది. మెట్రో ప్రాజెక్టులు చేపట్టే రాష్ట్రాలు - కేంద్ర సహాయం పొందడానికి - ఈ మూడు అవకాశాలలో ఏదైనా వినియోగించుకోవచ్చు. అవి : ఆర్ధిక మంత్రిత్వశాఖ కు చెందిన " వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పధకం" కింద కేంద్ర సహాయంతో PPP, ప్రాజెక్టు వ్యయం లో 10 శాతం కేంద్ర సహాయం భారత ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 50:50 ఈక్విటీ పంచుకునే విధానం ఉంటుంది. అయితే - ఈ అవకాశాలన్నింటిలో ప్రయివేటు భాగస్వామ్యం తప్పనిసరి.
ఈ విధానంలో వివిధ మార్గాలలో మెట్రో సేవల " ఓ & ఎం " లో ప్రయివేటు రంగం భాగస్వామ్యం ఉంటుంది. వాటిలో -
1. వ్యయం తో పాటు ఫీజు కాంట్రాక్టు : ప్రయివేటు ఆపరేటర్ కు ఈ విధానంలో ‘‘ O & M ’’ కింద నెలవారీ లేదా ఏడాదికి ఒకసారి చెల్లింపు జరుగుతుంది. సేవల నాణ్యతను బట్టి ఇందులో స్థిరమైన మొత్తం ఉంటుంది. వేరియబుల్ మొత్తం ఉంటుంది. నిర్వహణ లోనూ, ఆదాయం లోనూ ఉండే చిక్కులు, ఇబ్బందులు యజమానే భరించాలి.
2. స్థూల వ్యయం కాంట్రాక్టు: కాంట్రాక్టు కాలానికి ప్రయివేటు ఆపరేటర్ కు ఒక స్థిరమైన మొత్తం చెల్లించడం జరుగుతుంది. ఆపరేటర్ ‘‘ O & M ’’ ఒడిదుడుకులను భరిస్తాడు. యజమాని ఆర్ధిక లాభ నష్టాలను భరిస్తాడు.
3. నికర వ్యయం కాంట్రాక్టు : తాను సమకూర్చే సేవలకు వసూలు చేసే మొత్తం రాబడిని ఆపరేటర్ తీసుకుంటాడు. ఒకవేళ ‘‘ O & M ’’ వ్యయం రాబడి కంటే తక్కువగా ఉంటే, వ్యత్యాసాన్ని యజమాని భర్తీ చేసే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం 8 నగరాల్లో మొత్తం 370 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. అవి - ఢిల్లీ (217 కి.మీ), బెంగళూరు (42.30 కి.మీ), కోల్ కతా (27.39 కి.మీ), చెన్నై (27.36 కి.మీ), కోచి (13.30 కి.మీ), ముంబయి (మెట్రో ఒకటవ లైన్ - 11.40 కి.మీ), మోనో రైల్ 1వ పేజ్ (9.0 కి.మీ), జయ్ పుర్ (9.00 కి.మీ), గురుగ్రామ్ (ర్యాపిడ్ మెట్రో - 1.60 కి.మీ).
పైన పేర్కొన్న 8 నగరాలతో సహా 13 నగరాలలో - మొత్తం 537 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మెట్రో సేవలు కొత్తగా అందుబాటులోకి వస్తున్నవి; హైదరాబాద్ (71 కి.మీ), నాగ్ పుర్ (38 కి.మీ), అహమదాబాద్ (36 కి.మీ), పుణే (31.25 కి.మీ), లఖ్ నవూ (23 కి.మీ).
10 కొత్త నగరాలతో సహా - 13 నగరాల్లో - మొత్తం 595 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టులు - వివిధ ప్రణాళికా, అంచనా దశల్లో ఉన్నాయి. అవి ; ఢిల్లీ మెట్రో 4వ దశ - 103.93 కి.మీ, ఢిల్లీ & ఎన్ సిఆర్ - 21.10 కి.మీ, విజయవాడ - 26.03 కి.మీ, విశాఖపట్నం - 42.55 కి.మీ, భోపాల్ - 27.87 కి.మీ, ఇందౌర్ - 31.55 కి.మీ, కోచి మెట్రో 2వ దశ - 11.20 కి.మీ, గ్రేటర్ చండీగఢ్ రీజియన్ మెట్రో ప్రాజెక్ట్ - 37.56 కి.మీ, పాట్నా - 27.88 కి.మీ, గువాహాటీ - 61 కి.మీ, వారాణసీ - 29.24 కి.మీ, తిరువనంతపురం & కోఝికోడ్ (లైట్ రైల్ ట్రాన్స్ పోర్ట్) - 35.12 కి.మీ, చెన్నై 2వ దశ - 21.10 కి.మీ.