ఖరీఫ్ పంటలకు రైతులకు తమ ఉత్పత్తులకు తగిన ధరలు వచ్చే విధంగానూ, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించే విధంగానూ ప్రభుత్వం 2023-2024 మార్కెటింగ్ సీజన్ కు కనీస మద్దతు ధరలు పెంచింది. ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2023-2024 కు కనీస మద్దతు ధర
(Rs. per quintal)
పంటలు |
2014-15 కనీస మద్దతు ధర |
2022-23 కనీస మద్దతు ధర |
2023-24 కనీస మద్దతు ధర |
ఖర్చు * ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2023-24 |
2022-23 కంటే కనీస మద్దతు ధర పెరుగుదల |
ఖర్చుకంటే అదనం (శాతంలో) |
వరి - సాధారణ రకం |
1360 |
2040 |
2183 |
1455 |
143 |
50 |
వరి - ఎ గ్రేడ్ |
1400 |
2060 |
2203 |
- |
143 |
- |
జొన్న హైబ్రిడ్ |
1530 |
2970 |
3180 |
2120 |
210 |
50 |
జొన్న -మాల్దండి |
1550 |
2990 |
3225 |
- |
235 |
- |
సజ్జలు |
1250 |
2350 |
2500 |
1371 |
150 |
82 |
రాగులు |
1550 |
3578 |
3846 |
2564 |
268 |
50 |
మొక్క జొన్నలు |
1310 |
1962 |
2090 |
1394 |
128 |
50 |
కందులు |
4350 |
6600 |
7000 |
4444 |
400 |
58 |
పెసలు |
4600 |
7755 |
8558 |
5705 |
803 |
50 |
మినుములు |
4350 |
6600 |
6950 |
4592 |
350 |
51 |
వేరు శెనగ |
4000 |
5850 |
6377 |
4251 |
527 |
50 |
ప్రొద్దుతిరుగుడు గింజలు |
3750 |
6400 |
6760 |
4505 |
360 |
50 |
సోయాబీన్ ( పసుపు పచ్చ) |
2560 |
4300 |
4600 |
3029 |
300 |
52 |
నువ్వులు |
4600 |
7830 |
8635 |
5755 |
805 |
50 |
నైగర్ విత్తనాలు |
3600 |
7287 |
7734 |
5156 |
447 |
50 |
ప్రత్తి (మధ్యరకంపింజె ) |
3750 |
6080 |
6620 |
4411 |
540 |
50 |
ప్రత్తి (పొడవు పింజె ) ^ |
4050 |
6380 |
7020 |
- |
640 |
- |
*చెల్లించిన అన్ని ఖర్చులూ కలుపుకొని ( కూలీలకు చెల్లింపులు, ఎడ్ల దున్నకం / యంత్రాలతో దున్నకం చెల్లింపు, పొలం కౌలు, విత్తనాలకు, ఎరువులకు, నీటి పారుదలకు, పనిముట్లు, వ్యవసాయ భవనాల తరుగుదల, నిర్వహణ మూలధనానికి వడ్డీ, పంపుసెట్ల నిర్వహణకు డీజిల్/విద్యుత్ ఛార్జీలు తదితరాలు. ) కుటుంబ సభ్యు;ల శ్రమ ఖర్చు
^ వారి ( గ్రేడ్ ఎ కు, జొన్న ( మాల్దండి) కి, ప్రత్తి (పొడవి పింజె) కు విడిగా ఖర్చు సమాచారం సేకరించలేదు
2023-24 ఖరీఫ్ సీజన్ కు కనీస మద్దతు ధర పెంపు 2018-19 బడ్జెట్ లో చేసిన ప్రకటనకు అనుగుణంగా అఖిల భారత స్థాయిలో ఉత్పత్తి వ్యయపు సగటుకు ఒకటిన్నర రెట్లు ఉండేలా జరిగింది. దీనివలన రైతులకు అర్థవంతమైన లాభం ఉంటుందని అంచనావేశారు. అంచనా వేసిన లాభం అత్యధికంగా జొన్నకు 82% ఉండగా, ఆ తరువాత స్థానంలో ఉన్న కందులకు 58%, సోయాబీన్ కు 52%, మినుములకు 51% ఉంది. మిగిలిన పంటలకు రైతులకు వారి ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% అధికంగా ఉంది.
ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాల వంటివి పండించటాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే ఈ పంటలకు అత్యధికంగా కనీస మద్దతు ధర ఇస్తోంది. ప్రభుత్వం అదనంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి చొరవల ద్వారా రైతులు తమ పంటలలో వైవిధ్యం చూపేలా ప్రోత్సహిస్తోంది.
2022-23 ముందస్తు అంచనాల ప్రకారం దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 330. 5 మిలియన్ టన్నులు ఉంటుందని లెక్కించారు. ఇది అంతకు ముందు సంవత్సరం 2021-22 కంటే 14.9 మిలియన్ టన్నులు అధికం. ఇది గత అయిదేళ్లలో అత్యధిక పెరుగుదల.