ఉద్యోగాల లో క్రొత్త గా నియమించిన వారికి సంబంధించిన 70,000 కు పైచిలుకు నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జులై 22 వ తేదీ నాడు ఉదయం పూట పదిన్నర గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఉద్యోగ నియామకం జరిగిన వ్యక్తుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రసంగించనున్నారు.
రోజ్ గార్ మేళా ను దేశ వ్యాప్తం గా 44 చోట్ల నిర్వహించడం జరుగుతుంది. ఈ నియామకాలు వివిధ కేంద్ర ప్రభుత్వాల విభాగాల తో పాటు ఈ కార్యక్రమానికి సమర్థన ను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల లో/కేంద్రపాలిత ప్రాంతాల లో చోటు చేసుకొంటున్నాయి. దేశ వ్యాప్తం గా ఎంపిక చేసి క్రొత్త గా ఉద్యోగం లో నియమించినటువంటి వారు ప్రభుత్వం లోని రెవిన్యూ విభాగం, ఆర్థిక సేవ ల విభాగం, తపాలా విభాగం, పాఠశాల విద్య విభాగం, ఉన్నత విద్య విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, కేంద్రీయ ప్రభుత్వ రంగ సంస్థలు, జల వనరుల విభాగం, సిబ్బంది మరియు శిక్షణ విభాగం మరియు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లతో పాటు తదితర వివిధ విభాగాల లో చేరనున్నారు.
ఉద్యోగాల కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇచ్చే విషయం లో ప్రధాన మంత్రి యొక్క వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక అడుగు గా ఉంది. రోజ్ గార్ మేళా ఉద్యోగాల కల్పన ను పెంపొందింప జేయడం లో ఒక ఉత్ప్రేరకం వలె పనిచేయగలదన్న భావన ఉంది. అంతేకాక యువతీ యువకుల సశక్తీకరణ తో పాటు గా దేశాభివృద్ధి లో పాలుపంచుకోవడం లో సార్థకం కాగల అవకాశాల ను కూడా ఈ రోజ్ గార్ మేళా వారికి అందిస్తుందన్న భావన సైతం ఉంది.
క్రొత్త గా ఉద్యోగాల లో నియామకం జరిగిన వారు ‘కర్మయోగి ప్రారంభ్’ ద్వారా వారంతట వారు గా శిక్షణ ను పొందే అవకాశాన్ని కూడా దక్కించుకోనున్నారు. ‘కర్మయోగి ప్రారంభ్’ అనేది ఐజిఒటి కర్మయోగి పోర్టల్ ( iGOT Karmayogi portal ) కు చెందిన ఒక ఆన్ లైన్ మాడ్యూల్. ఈ పోర్టల్ లో 580 కి పైగా ఇ-లర్నింగ్ పాఠ్యక్రమాల ను ‘ఎక్కడయినా ఏ డివైస్ నుండి అయినా’ నేర్చుకొనే ఫార్మేట్ లో అందుబాటు లో కి తీసుకు రావడమైంది.