ఉక్రెయిన్లో యుద్ధ పీడిత ప్రాంతం నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. విద్యార్థులు తమ తరలింపు అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు.
ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో ఈ భేటీ జరిగింది. ఉక్రెయిన్ నుండి మన పౌరులను తిరిగి తీసుకురావడానికి జరుగుతున్న ఆపరేషన్ గంగా కోసం భారత ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలు మరియు ప్రధాని మోదీ ని విద్యార్థులు అభినందించారు. భారత్ త్రివర్ణ పతాకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఏ ప్రయత్నాన్ని కూడా వదలడం లేదని మరియు మిగిలిన విద్యార్థులను త్వరగా తరలించడానికి భారత ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని మోదీ వారికి హామీ ఇచ్చారు.