ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యునైటెడ్ కింగ్ డమ్ విదేశీ మరియు కామన్ వెల్త్ వ్యవహారాల సెక్రటరీ ఆఫ్ స్టేట్ శ్రీ బోరిస్ జాన్ సన్ ఈ రోజు భేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి 2015 నవంబరు లో తాను యుకెలో పర్యటించినప్పుడు, శ్రీ జాన్ సన్ లండన్ నగర మేయర్ గా ఉన్నారంటూ అప్పట్లో జరిగిన సమావేశాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. శ్రీ జాన్ సన్ ఫారిన్ సెక్రటరీ గా నియమితులైనందుకు ప్రధాన మంత్రి ఆయనను అభినందించారు.
బ్రిటిషు ప్రధాని థెరిసా మే 2016 నవంబర్ లో భారతదేశంలో పర్యటించడంతో రానున్న రోజులలో భారతదేశం మరియు యుకె ల సంబంధాలకు మార్గదర్శకత్వం వహించగలిగిన ఫ్రేమ్ వర్క్ సిద్ధం అయినట్లు ప్రధాన మంత్రి చెప్పారు.
వేరు వేరు రంగాలలో, ప్రత్యేకించి శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక రంగం మరియు రక్షణ & భద్రత రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పటిష్టపరచుకోవడంలో సాధించిన పురోగతిని ప్రధాన మంత్రి అభినందించారు.
యుకె లోని ప్రవాస భారతీయ కుటుంబాలు రెండు దేశాల మధ్య ఒక సేతువు వలె వ్యవహరిస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు. వీరు ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలకు కీలకమైన చోదక శక్తిగా నిలుస్తున్నారని, ఈ సంబంధాలను పెంపొందించుకొనేందుకు కృషి చేయడాన్ని ఇరు పక్షాలు కొనసాగించగలవన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
Mr. @BorisJohnson, UK's Secretary of State for Foreign & Commonwealth Affairs met the Prime Minister. @foreignoffice pic.twitter.com/RcxSqA8PPw
— PMO India (@PMOIndia) January 18, 2017