బనాస్ కాంఠా జిల్లా లోని అంబాజీ పట్టణానికి చెందిన ఆదివాసీ బాలల తో కూడినటువంటి సంగీతమయ దళం అక్టోబర్ 31వ తేదీ నాడు కేవడియా లో ప్రధాన మంత్రి సమక్షం లో ప్రదర్శన ను ఇవ్వనుంది. రాష్ట్రీయ ఏక్ తా దివస్ సందర్భం లో కేవడియా ను ప్రధాన మంత్రి సందర్శించనున్నారు.
ప్రధాన మంత్రి ఎదుట సంగీత మయ దళం ప్రదర్శన ను ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటి సారి కాదు. ఇంతకు ముందు 2022 సెప్టెంబర్ 30వ తేదీ న ప్రధాన మంత్రి సార్వజనిక కార్యక్రమం కోసం గుజరాత్ లోని అంబాజీ ని చేరుకొన్నప్పుడు ఆయన కు స్వాగతం పలుకుతూ ఈ బ్యాండు తన కళారూపాన్ని ప్రదర్శించింది. ఆ తరుణం లో విభిన్న అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయడం తో పాటు గా 7200 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన పథకాల కు శంకుస్థాపన కూడా చేశారు.
యువ సంగీతకారుల దళం ఇచ్చిన ప్రదర్శన ను ప్రధాన మంత్రి ప్రశంసించడం ఒక్కటే కాకుండా ఆ కార్యక్రమాన్ని ఆనందించారు కూడాను. అంతేకాదు, సార్వజనిక కార్యక్రమం ఆరంభం అయ్యే కంటే ముందే వారి తో ఆయన స్వయం గా మాట్లాడారు. ఆయన తన యువ మిత్రుల ను ప్రోత్సహించడం కోసం, వారితో కలసి ఒక సమూహ ఛాయాచిత్రం లో పాల్గొన్నారు.
అంతటి అసాధారణ సంగీత కౌశలాన్ని నేర్చుకొన్న ఈ ఆదివాసీ బాలల గాథ తెలుసుకోదగ్గది గా ఉంది. ఈ బాలలు ఒకప్పుడు వారి కనీస అవసరాల ను తీర్చుకోవడం కోసం మరియు చదువుకోవడం కోసం పోరాటం సలుపుతూ వచ్చారు. వారు చాలా సార్లు అంబాజీ దేవాలయం సమీపం లో కనపడుతూ మరి ఆగంతుకుల ఎదుట భిక్ష ను అడుగుతూ ఉండే వారు. శ్రీ శక్తి సేవా కేంద్ర పేరు తో ఉన్నటువంటి అక్కడి ఒక ఎన్ జిఒ ఈ బాలల కు విద్య ను నేర్పించడానికే కాకుండా వారి లోని ప్రావీణ్యాల ను వెలికితీయడం కోసం కూడా ను వారి తో కలసి పనిచేసింది. మ్యూజికల్ బ్యాండు తో ఉన్నటువంటి ఆదివాసీ బాలల కు ఎన్ జిఒ శ్రీ శక్తి సేవా కేంద్రం నైపుణ్యాల ను కూడా అలవరచింది.
యువ సంగీత మేళం యొక్క ప్రదర్శన ను ప్రధాన మంత్రి ఎంతగా ఆస్వాదించి మరి వారిని మెచ్చుకొన్నారంటే రాష్ట్రీయ ఏక్ తా దివస్ సందర్భం లో, అక్టోబర్ 30వ తేదీ నాడు, సందర్భం లో బ్యాండు ను కేవడియా కు ఆహ్వానించారు కూడాను. తద్ద్వారా, ఆ చరిత్రాత్మక దినాన జరిగే కార్యక్రమం లో సంగీతకారులు పాలుపంచుకోవడంతో పాటు గా ప్రదర్శన ను కూడా ఇచ్చే అవకాశాన్ని పొందాలి అని ప్రధాన మంత్రి తలచారు.
అక్టోబర్ 31వ తేదీ నాడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేవడియా ను సందర్శించనున్నారు. ఆ రోజు న సర్ దార్ పటేల్ గారి 147వ జయంతి సందర్భం లో ఆయన కు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని ఘటించనున్నారు. ఏక్ తా దివస్ కవాతు లో కూడా ప్రధాన మంత్రి పాలుపంచుకోవడం తో పాటు గా, లాల్ బహాదుర్ శాస్త్రి నాశ్ నల్ అకైడమి ఆఫ్ అడ్ మినిస్ ట్రేశన్ లో ఫౌండేశన్ కోర్సు ను అభ్యసించేటటువంటి వివిధ సివిల్ సర్వీసుల కు చెందిన అధికారి శిక్షణార్థుల తో మాట్లాడనున్నారు.