దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఇంతకాలం సరైన రవాణా సౌకర్యాలు లేకుండా ప్రధాన స్రవంతిలో లేని ప్రాంతాలకు రైల్వే సౌకర్యాలను కల్పిస్తూ వాటిని కలపడం జరుగుతోందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ లోని కెవాడియానుంచి దేశంలోని పలు ప్రాంతాలకు వేసిన 8 కొత్త రైళ్లను ఆయన ప్రారంభించారు. అంతే కాదు పలు రైల్వే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
బ్రాడ్ గేజ్ రైళ్ల వేగాన్ని పెంచడం, విద్యుదీకరణ పనులను చేపట్టడం తదితర పనులను వేగవంతమయ్యాయని రైళ్ల వేగం మరింత పెరుగుతుందని అన్నారు. అత్యధిక వేగ సామర్థ్యాలకోసం బడ్జెట్లో నిధులను పెంచడం జరిగిందని ప్రధాని అన్నారు.రైల్వేలు పర్యావరణ హితంగా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కెవాడియా రైల్వే స్టేషన్ కు హరిత భవన సర్టిఫికెట్ లభించిందని..ఈ ఘనత సాధించిన మొదటి రైల్వే స్టేషన్ గా నిలిచిందని ఆయన అన్నారు.
రైల్వే రంగంలో ప్రారంభించిన ఆతర్మనిర్భర కార్యక్రమాల ప్రాధాన్యతను ఆయన వివరించారు.రైల్వే సంబంధిత తయారీ, సాంకేతికత అనేది ఫలితాలనిస్తోందని ఆయన అన్నారు. అత్యధిక హార్స్ పవర్ విద్యుత్ రైల్వే ఇంజిన్ ను భారతదేశంలోనే తయారు చేయడం కారణంగా , ప్రపంచ మొదటి డబుల్ స్టాక్డ్ లాంగ్ హాల్ కంటెయినర్ రైలును భారతదేశం ప్రారంభించిందని ఆయన అన్నారు. తద్వారా ఆత్మనిర్భర్ విజయవంతమైందని ఆయన అన్నారు. ఈ రోజున దేశంలోనే తయారైన పలు ఆధునిక రైళ్లు భారతీయ రైల్వేలో భాగంగా వున్నాయని ఆయన స్పష్టం చేశారు.
రైల్వేలరంగంలో మార్పులకోసం నైపుణ్యత కలిగిన మానవవనరుల అవసరం ఎంతైనా వుందని ఈ కొరత తీర్చడానికిగాను వడోదరలో రైల్వేలకు చెందిన డీమ్డ్ విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ స్థాయిలో సంస్థను కలిగిన అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి అని ఆయన అన్నారు. రైల్వేలద్వారా వస్తు రవాణాకోసం, బహుముఖ పరిశోధనలకోసం, శిక్షణలకోసం ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని ప్రధాని వివరించారు. ఇక్కడ 20 రాష్ట్రాలకు చెందిన యువతకు శిక్షణ లభిస్తోందని వారు రైల్వే రంగ ప్రగతిని ముందుకు తీసుకుపోతారని ఆయన అన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణ ద్వారా రైల్వే రంగాన్ని ఆధునీకరించడానికి ఇది దోహదంచేస్తుందని ప్రధాని అన్నారు.