ప్రభువు శ్రీ రాముని కి అయోధ్య లో స్వాగతం పలకడం కోసం ప్రతి ఒక్కరు వారి వారి మనోభావాల ను పరిపరి విధాలు గా వ్యక్తం చేస్తున్నారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. యావత్తు దేశ ప్రజలు ఉత్సాహం తో ఉన్నారు మరి భక్తులు ఈ మంగళప్రదం అయినటువంటి రోజు న రామ్ లలా పట్ల భక్తి లో తలమునకలు గా ఉంటున్నారు అని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రభువు శ్రీ రాముని కి అంకితం ఇస్తూ, శ్రీ హంస్‌రాజ్ రఘువంశీ పాడినటువంటి ఒక భజన ను సైతం శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రభువు శ్రీ రాముని కి అయోధ్య లో స్వాగతం పలికే సందర్భం కోసం యావత్తు దేశం రామ మయం గా మారిపోయింది. రామ్ లలా యొక్క భక్తి లో మునిగి తేలుతున్న భక్తజనులు ఈ శుభ దినం కోసం పరిపరి విధాలు గా వారి యొక్క భావనల ను ప్రకటిస్తూ వస్తున్నారు. భగవాన్ శ్రీ రాముని కి అంకితం చేసిన శ్రీ హంస్‌రాజ్ రఘువంశీ గారి ఈ యొక్క భజన గీతాన్ని మీరు కూడా వినగలరు... #ShriRamBhajan’’ అని పేర్కొన్నారు.
अयोध्या में प्रभु श्री राम के स्वागत को लेकर पूरा देश राममय है। राम लला की भक्ति में डूबे भक्तजन इस शुभ दिन के लिए तरह-तरह से अपनी भावनाएं प्रकट कर रहे हैं। भगवान श्री राम को समर्पित हंसराज रघुवंशी जी का ये भजन सुनिए… #ShriRamBhajan https://t.co/kDSO8SNzxW
— Narendra Modi (@narendramodi) January 4, 2024