సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇచ్చారు. ఎ.ఎమ్.కె, కెబున్ బారు మరియు వైసికె ల నివాసుల తో కలసి పొంగల్ పర్వదినాన్ని ఆలస్యం గా జరుపుకొన్నట్లు శ్రీ లీ సీన్ లూంగ్ తన ట్వీట్ లో తెలియ జేశారు.
ఆ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ -
‘‘దీనిని చూసి సంతోషం కలిగింది, చైతన్య భరితం అయినటువంటి తమిళ సంస్కృతి ప్రపంచ స్థాయి లో లోకప్రియత్వాన్ని సంతరించుకొంది’’ అని పేర్కొన్నారు.
This is gladdening to see. The vibrant Tamil culture is popular globally. https://t.co/81WsjM5KFS
— Narendra Modi (@narendramodi) February 13, 2023