ప్రపంచం లో కెల్లా అత్యంత భారీ స్థాయి లో జరిగిన ఉచిత టీకా మందు పంపిణీ కావచ్చు, లేదా వైద్య సంబంధి మౌలిక సదుపాయల అభివృద్ధి కావచ్చు.. భారతదేశం ఆరోగ్యం రంగం లో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కరోనా కు వ్యతిరేకం గా పోరాడడం లో 130 కోట్ల మంది దేశ ప్రజలు చాటినటువంటి సంకల్పం అనేది న్యూ ఇండియా యొక్క శక్తి ని సూచిస్తోంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కరోనా తో పోరాటం లో 130 కోట్ల మంది దేశ ప్రజలు ఏ సంకల్ప శక్తి ని అయితే చాటారో, అది ‘న్యూ ఇండియా’ యొక్క సామర్ధ్యాని కి గుర్తింపు గా ఉంది. స్వదేశీ టీకామందుల కు తోడు ప్రపంచం లో అన్నిటి కంటే పెద్దదైన ఉచిత వేక్సీనేశన్ కార్యక్రమం కావచ్చు, లేదా వైద్య సంబంధి మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం కావచ్చు.. ఆరోగ్యం రంగం లో దేశం రోజూ కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది’’ అని పేర్కొన్నారు.
कोरोना से लड़ाई में 130 करोड़ देशवासियों ने जिस संकल्प शक्ति का परिचय दिया है, वो नए भारत के सामर्थ्य की पहचान है। स्वदेशी टीकों के साथ विश्व का सबसे बड़ा मुफ्त वैक्सीनेशन अभियान हो या मेडिकल इंफ्रास्ट्रक्चर का विकास, स्वास्थ्य के क्षेत्र में देश नित नए मानदंड स्थापित कर रहा है। pic.twitter.com/E92ZC9UxcA
— Narendra Modi (@narendramodi) April 12, 2022