జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం సందర్భం లో శాస్త్రవేత్తల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
‘‘జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం మన శాస్త్రవేత్తల ప్రతిభ కు మరియు దృఢ దీక్ష కు ప్రణామం అర్పించేటటువంటి ఒక సందర్భం. వారి లోని నూతన ఆవిష్కరణ సంబంధిత ఉత్సాహం మరియు మార్గదర్శక స్ఫూర్తి తో నిండినటువంటి పరిశోధన లు భారతదేశాని కే కాకుండా ప్రపంచాని కి కూడా సహాయకారి గా నిలచాయి. భారతదేశ విజ్ఞాన శాస్త్ర రంగం వర్ధిల్లుగాక; మరి, మన యువ మస్తిష్కాలు విజ్ఞాన శాస్త్రం అంటే మరింత ఎక్కువ కుతూహలాన్ని పెంపొందించుకొనుగాక.
మా వంతు గా, భారత ప్రభుత్వం దేశం లో వినూత్న ఆవిష్కరణలకు, పరిశోధనల కు మరింత ఉత్తమమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచడం కోసం అసంఖ్యాక ప్రయత్నాల ను చేస్తున్నది. ఈ సంవత్సరం ఆరంభం లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహించిన తరుణం లో విజ్ఞాన శాస్త్రాని కి సంబంధించిన అంశాల ను గురించి నేను మాట్లాడాను. అవే విషయాల ను మీతో మరొక్క మారు పంచుకొంటున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
On our part, the Government of India is making numerous efforts to create an even better environment for research and innovation in India. I spoke about aspects relating to science during the Indian Science Congress earlier this year. Sharing it again…https://t.co/DjSl2SrwXB
— Narendra Modi (@narendramodi) February 28, 2020
National Science Day is an occasion to salute the talent and tenacity of our scientists. Their innovative zeal and pioneering research has helped India and the world. May Indian science continue to thrive and may our young minds develop even greater curiosity towards science.
— Narendra Modi (@narendramodi) February 28, 2020