1. నా ప్రియ దేశవాసులారా, ఈ మంగళప్రదమైనటువంటి సందర్భం లో, మీకందరికి అభినందనలు మరియు శుభాకాంక్షలు.
2. అసాధారణమైనటువంటి ఈ యొక్క కరోనా కాలం లో, కరోనా యోధులు ‘సేవా పరమో ధర్మ’ అనే మంత్రాన్ని అనుసరిస్తున్నారు. మన డాక్టర్ లు, నర్సు లు, పారామెడికల్ ఉద్యోగులు, ఆంబులెన్స్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, రక్షకభటులు, సేవాదళం మరియు అనేక మంది ప్రజలు రాత్రనక పగలనక ఎడతెగని రీతి లో శ్రమిస్తున్నారు.
3. ప్రాకృతిక విపత్తుల కారణం గా దేశం లోని వివిధ ప్రాంతాల లో వాటిల్లిన ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఈ యొక్క ఆపన్న ఘడియ లో తోటి పౌరుల కు సంపూర్ణ సాయం ఉంటుందని మరోమారు హామీని ఇచ్చారు.
4. భారతదేశం యొక్క స్వాతంత్ర్య సమరం యావత్తు ప్రపంచానికి ప్రేరణ నిచ్చింది. విస్తరణవాదం అనే ఆలోచన కొన్ని దేశాల ను బానిసత్వం లోకి నెట్టివేసింది. భీకర యుద్ధాల నడుమన సైతం, భారతదేశం తన స్వాతంత్ర్య ఉద్యమాన్ని నష్టపడనివ్వలేదు.
5. ప్రపంచవ్యాప్త వ్యాధి కోవిడ్ నడుమ, 130 కోట్ల మంది భారతీయులు స్వయంసమృద్ధి కై సంకల్పాన్ని పూనారు; మరి వారి మనస్సు లో ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆలోచన నాటుకొంది. ఈ స్వప్నం ఒక శపథం లా మారుతున్నది. ఆత్మనిర్భర్ భారత్ ప్రస్తుతం 130 కోట్ల మంది భారతీయుల కు ఒక మంత్రం వలె అయిపోయింది. నా తోటి పౌరుల సామర్థ్యాలు, విశ్వాసం ఇంకా శక్తియుక్తుల పట్ల నాకు నమ్మకం ఉన్నది. ఏదైనా చేయాలి అని మనం గనక ఒకసారి నిర్ణయం తీసుకొన్నామా అంటే, మనం ఆ యొక్క లక్ష్యాన్ని సాధించేటంత వరకు విశ్రమించము.
6. ప్రస్తుతం, యావత్తు ప్రపంచం పరస్పరం అనుసంధానం కావడం తో పాటు, పరస్పర ఆధారితమైందిగా కూడాను ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ను భారతదేశం పోషించవలసిన తరుణం ఇది. వ్యవసాయ రంగం మొదలుకొని, అంతరిక్షం నుండి ఆరోగ్యసంరక్షణ రంగం వరకు భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మించేటందుకు అనేక చర్యలను తీసుకొంటోంది. అంతరిక్ష రంగాన్ని తెరచి ఉంచడం వంటి చర్య లు యువత కోసం నూతనమైన ఉద్యోగ అవకాశాల ను ఎన్నింటినో కల్పిస్తాయని మరి వారి కి నైపుణ్యాల ను, ఇంకా సమర్ధత ను ఇనుమడింపచేసుకొనేందుకు అవకాశాల ను అధికంగా సమకూర్చుతాయన్న నమ్మకం నాలో ఉంది.
7. కేవలం కొద్ది నెలల క్రిందట, మనం ఎన్-95 మాస్కుల ను, పిపిఇ కిట్ లను మరియు వెంటిలేటర్ లను విదేశాల నుండి దిగుమతి చేసుకొంటూ ఉండేవాళ్లము. అటువంటిది మనం విశ్వమారి కాలం లో ఎన్-95 మాస్కుల ను, పిపిఇ కిట్ లను మరియు వెంటిలేటర్ లను తయారు చేయడం ఒక్కటే కాకుండా వీటి ని ప్రపంచం లోని పలు దేశాల కు ఎగుమతి చేయగల సత్తా ను సంపాదించుకోగలిగాము.
8. ‘మేక్ ఇన్ ఇండియా’ కు తోడు గా, మనం ‘మేక్ ఫార్ వరల్డ్’ మంత్రాన్ని కూడా ను అనుసరించవలసివుంది.
9. 110 లక్షల కోట్ల రూపాయల విలువైన జాతీయ మౌలిక సదుపాయాల కల్పన కు ఉద్దేశించినటువంటి పరియోజన మొత్తంమీద మౌలిక సదుపాయాల రంగ సంబంధి పథకాల కు ఉత్తేజాన్ని ఇవ్వగలుగుతుంది. మనం ఇప్పుడు ఇక బహుళ నమూనాల తో కూడినటువంటి సంధాన సంబంధి మౌలిక సదుపాయాల కల్పన పైన శ్రద్ధ వహించనున్నాము. మనం గిరి గీసుకొని పనిచేసే పద్ధతి ని ఇక ఎంతమాత్రం అవలంబించలేము; మనం సమగ్రమైన మరియు జోడించిన మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టి ని నిలపవలసివున్నది. వేరు వేరు రంగాల లో సుమారు 7,000 పరియోజనల ను గుర్తించడమైంది. ఇది మౌలిక సదుపాయాల రంగం లో ఒక నూతన విప్లవాన్ని తీసుకువస్తుంది.
10. మన దేశం లోని ముడిపదార్థాలు తుది ఉత్పత్తి రూపు ను సంతరించుకొని భారతదేశానికి తిరిగి రావడం అనేది ఇంకా ఎంత కాలం సాగుతుంది. మన వ్యవసాయ వ్యవస్థ చాలా వెనుకపట్టు న ఉండిపోయిన కాలం అంటూ ఒకటి ఉండేది. అప్పట్లో దేశ ప్రజానీకాన్ని ఎలాగ పోషించడమా అనేది అత్యంత ప్రధానమైనటువంటి ఆందోళన గా ఉండింది. ప్రస్తుతం, మనం ఒక్క భారతదేశానికే కాకుండా ప్రపంచం లో అనేక దేశాల కు పోషణ ను అందించగలిగినటువంటి స్థితి లో ఉన్నాము. స్వవిశ్వసనీయమైనటువంటి భారతదేశం అంటే దిగుమతుల ను తగ్గించుకోవడం మాత్రమే అని కాదు అర్థం, మన నైపుణ్యాల ను మరియు మన సృజనాత్మక శక్తి ని కూడా పెంచుకోవడం అని దానికి అర్థం.
11. భారతదేశం లో అమలుపరుస్తున్నటువంటి సంస్కరణల ను యావత్తు ప్రపంచం గమనిస్తున్నది. తత్ఫలితం గా, ఎఫ్ డిఐ ప్రవాహాలు అన్ని రికార్డుల ను ఛేదించివేశాయి. భారతదేశం కోవిడ్ మహమ్మారి కాలం లో సైతం ఎఫ్ డిఐ పరం గా 18 శాతం వృద్ధి ని నమోదు చేసింది.
12. దేశం లోని పేదల యొక్క జన్ ధన్ ఖాతాల లోకి లక్షలాది కోట్ల రూపాయలు నేరు గా బదలాయింపబడుతాయి అని ఎవ్వరైనా ఊహించారా? రైతుల లబ్ధి కై ఎపిఎంసి యాక్టు లో అంత పెద్ద మార్పు చోటు చేసుకొంటుందని ఎవరైనా తలపోశారా? ప్రస్తుతం దేశం లో వన్ నేశన్- వన్ రేశన్ కార్డ్, వన్ నేశన్- వన్ ట్యాక్స్, ఇన్ సోల్వన్సి ఎండ్ బ్యాంక్ రప్టసి కోడ్, ఇంకా బ్యాంకుల విలీనం వాస్తవ రూపాన్ని దాల్చాయి.
13. మనం మహిళల సాధికారిత కల్పన కు పాటుపడ్డాము. నౌకాదళం మరియు వాయుసేన మహిళల ను పోరాట విధుల లోకి తీసుకొంటున్నాయి. మహిళ లు ప్రస్తుతం నాయకురాళ్లు గా ఉన్నారు, మరి మనం మూడు సార్లు తలాక్ ను రద్దు చేసుకొన్నాము, మహిళల కు శానిటరీ ప్యాడ్ ల ను ఒక్క రూపాయి కే సమకూర్చగలుగుతున్నాము.
14. నా ప్రియ దేశవాసులారా, మన కు ‘సామర్థ్యమూల్ స్వాతంత్ర్యం, శ్రమమూలం వైభవమ్’ అని బోధించడమైంది. సమాజం యొక్క బలం, ఏ దేశం యొక్క స్వాతంత్ర్యం దానికి శక్తి గా ఉంటుంది, ఇంకా ఆ దేశం యొక్క సౌభాగ్య మూలం మరియు ప్రగతి మూలం ఆ దేశపు శ్రమ శక్తే అవుతుంది.
15. దేశం లో 7 కోట్ల పేద కుటుంబాల కు గ్యాస్ సిలిండర్ లను ఉచితం గా ఇవ్వడం జరిగింది, 80 కోట్ల మందికి పైగా ప్రజల కు రేశన్ కార్డులు ఉన్నా, లేదా రేశన్ కార్డులు లేకపోయినా సరే ఆహారాన్ని ఉచితం గా అందించడమైంది, సుమారు 90వేల కోట్ల రూపాయల ను బ్యాంకు ఖాతాల లోకి నేరు గా బదలాయించడం జరిగింది. పేదల కు వారి యొక్క గ్రామాల లో ఉపాధి ని సమకూర్చడం కోసమని గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ను కూడా ను ఆరంభించడమైంది.
16. ‘వోకల్ ఫార్ లోకల్’, ‘రి-స్కిల్ ఎండ్ అప్-స్కిల్’ ప్రచార ఉద్యమాలు పేదరికం రేఖ కు దిగువన నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవితాల లో ఒక స్వయంసమృద్ధియుత ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించగలవు.
17. దేశం లోని అనేక ప్రాంతాలు సైతం అభివృద్ధి పరంగా చూసినప్పుడు వెనుకబడ్డాయి. ఆ తరహా 110 కి పైగా ఆకాంక్షభరిత జిల్లాల ను ఎంపిక చేయడం ద్వారా, అక్కడి ప్రజలు ఉత్తమతరమైనటువంటి విద్య, ఉత్తమతరమైనటువంటి ఆరోగ్య సదుపాయాలను మరియు ఉత్తమతరమైనటువంటి ఉద్యోగ అవకాశాల ను పొందేటట్టు ప్రత్యేక ప్రయాసలు తీసుకోవడం జరుగుతున్నది.
18. ఆత్మనిర్భర్ భారత్ కు ఒక ముఖ్యమైనటువంటి ప్రాధాన్యం ఉన్నది.. అదే స్వయంసమృద్ధియుత వ్యవసాయం మరియు స్వయంసమృద్ధియుత రైతులోకం. దేశం లో రైతుల కు ఆధునికమైనటువంటి మౌలిక సదుపాయాల ను సమకూర్చడం కోసం ఒక లక్ష కోట్ల రూపాయల తో ‘వ్యవసాయ రంగ సంబంధి మౌలిక సదుపాయాల నిధి’ ని కొద్ది రోజుల క్రిందటే ఏర్పాటు చేయడమైంది.
19. గడచిన సంవత్సరం లో, ఈ ఎర్ర కోట నుండే, ‘జల్ జీవన్ మిశన్’ ను గురించి నేను ప్రకటించాను. ప్రస్తుతం, ఈ మిశన్ లో భాగం గా, ప్రతి రోజూ ఒక లక్ష కు పైగా ఇళ్లు మంచి నీటి కనెక్శన్ ను పొందుతున్నాయి.
20. మధ్యతరగతి నుండి ఉదయిస్తున్నటువంటి వృత్తినిపుణులు ఒక్క భారతదేశం లోనే కాకుండా యావత్తు ప్రపంచం లో వారి యొక్క ముద్ర ను వదులుతున్నారు. మధ్య తరగతి కి కావలసిందల్లా అవకాశం, మధ్య తరగతి కి కావలసిందల్లా ప్రభుత్వ ప్రమేయం నుండి స్వేచ్ఛ.
21. మీరు తీసుకొన్న ఇంటి రుణం తాలూకు ఇఎంఐ చెల్లింపు కాలానికి గాను రూ. 6 లక్షల వరకు రిబేటు ను పొందడం అనేది కూడా ఇదే ప్రథమం. గడచిన సంవత్సరం లోనే, అసంపూర్తి గా ఉండిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం 25,000 కోట్ల రూపాయల తో ఓ నిధి ని ఏర్పాటు చేయడమైంది.
22. ఆధునిక భారతదేశాన్ని, స్వయంసమృద్ధియుత భారతదేశాన్ని, ఒక న్యూ ఇండియా ను, ఒక సుసంపన్న భారతదేశాన్ని నిర్మించడం లో దేశ విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ ఆలోచన తో, దేశాని కి కొత్త జాతీయ విద్యావిధానాన్ని అందించడమైంది.
23. కరోనా కాలం లో, డిజిటల్ ఇండియా ప్రచార ఉద్యమ పాత్ర ఏమిటన్నది మనం చూశాము. ఒక్క భీమ్ యుపిఐ ద్వారానే, గత నెల రోజుల లో, 3,00,000 కోట్ల రూపాయల లావాదేవీ లు నమోదయ్యాయి.
24. ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ తో కేవలం 5 డజన్ ల పంచాయతీలు 2014 సంవత్సరానికి ముందు అనుసంధానమై ఉండేవి. గత ఐదేళ్ల కాలం లో 1.5 లక్షల గ్రామ పంచాయతీల కు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ను సంధానించడమైంది. దేశం లోని మొత్తం 6 లక్షల గ్రామాల ను రాబోయే 1000 రోజుల కాలం లో ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ తో సంధానించడం జరుగుతుంది.
25. నా ప్రియ దేశవాసులారా, మహిళా శక్తి కి అవకాశం అందినప్పుడల్లా వారు దేశాని కి కీర్తి ప్రతిష్ఠల ను తీసుకు వస్తూ దేశాన్ని పటిష్ఠం చేశారని మన అనుభవాలు చెబుతున్నాయి. ఈ రోజు న మహిళ లు కేవలం భూగర్భం లోని బొగ్గు గనులలో పని చేయడమే కాదు, యుద్ధ విమానాల ను సైత నడుపుతూ గగనతలం లో కొత్త శిఖరాల కు చేరుకొంటున్నారు.
26. దేశం లో ప్రారంభమైన 40 కోట్ల జన్ ధన్ ఖాతాలలో దాదాపు గా 22 కోట్ల ఖాతా లు మహిళల వే. కరోనా కాలం లో, ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలల్లో, సుమారు గా 3,000 కోట్ల రూపాయల ను ఈ యొక్క మహిళల ఖాతాల లోకి నేరు గా బదలాయించడమైంది.
27. కరోనా మొదలైన నాటి కి, మన దేశం లో కరోనా పరీక్షల కోసం ఒకే ఒక్క ల్యాబ్ ఉండేది. దేశం లో ప్రస్తుతం 1400 కు పైగా ల్యాబ్ లు ఉన్నాయి.
28. ఈ రోజు నుండి దేశం లో మరో పెద్ద కార్యక్రమం అమలు కానుంది. అదే నేశనల్ డిజిటల్ హెల్థ్ మిశన్. దేశం లో ప్రతి ఒక్కరి కి హెల్థ్ ఐడి ని ఇవ్వడం జరుగుతుంది. నేశనల్ డిజిటల్ హెల్థ్ మిశన్ భారతదేశం యొక్క ఆరోగ్య రంగం లో ఒక పెద్ద విప్లవాన్ని తీసుకు వస్తుంది. ఏ వ్యాధికైనా సరే మీరు చేయించుకునే వైద్య పరీక్షలు, వైద్యులు మీకు ఇచ్చిన మందులు, మీ వైద్య నివేదిక లు ఎప్పుడు, ఎక్కడ వచ్చాయి వంటి సమాచారం అంతా ఈ ఒక్క ఆరోగ్య ఐడి లో నిక్షిప్తమై ఉంటుంది.
29. ఈ రోజు న, దేశం లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకం గా మూడు కరోనా టీకామందు లు పరీక్షల దశ కు చేరుకొన్నాయి. శాస్త్రవేత్త ల నుండి గ్రీన్ సిగ్నల్ అందగానే ఆ వ్యాక్సిన్ లను పెద్ద ఎత్తు న ఉత్పత్తి చేసేందుకు దేశం సిద్ధం గా ఉంది.
30. ఇది జమ్ము- కశ్మీర్ ను కొత్త అభివృద్ధి బాట లో ప్రవేశపెట్టిన సంవత్సరం. జమ్ము- కశ్మీర్ లో మహిళ లు, దళితుల కు హక్కులు కల్పించిన సంవత్సరం. జమ్ము- కశ్మీర్ లో శరణార్థుల కు గౌరవనీయమైన జీవనాన్ని అందించిన సంవత్సరం. జమ్ము- కశ్మీర్ లో స్థానిక సంస్థల కు ఎన్నికైన ప్రజాప్రతినిధులు క్రియాశీలత, సునిశితత్వం తో కొత్త అభివృద్ధి శకం లో ముందుకు సాగుతున్న ఏడాది ఇది.
31. గత సంవత్సరంలో లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతం గా ప్రకటించడం ద్వారా ఎంతో కాలం గా అపరిష్కృతం గా ఉన్న ప్రజల ఆకాంక్ష నెరవేరింది. హిమాలయ పర్వత శ్రేణుల లో ఎత్తైన ప్రాంతం లో ఉన్న లదాఖ్ అభివృద్ధి లో నూతన శిఖరాలకు చేరేందుకు ముందడుగు వేస్తున్నది. సిక్కిమ్ ఆర్గానిక్ రాష్ట్రం గా ఎలా మారిందో అదే తరహా లో రానున్న రోజులలో లద్దాఖ్ కూడా ను కర్బన రహిత ప్రాంతం గా ప్రత్యేక గుర్తింపు ను పొందనుంది. ఈ దిశ గా ప్రయత్నం ఇప్పటికే ప్రారంభమయింది.
32. దేశం లో ఎంపిక చేసిన 100 నగరాలలో కాలుష్యాన్ని అదుపు లోకి తెచ్చేందుకు సమ్యక్ దృక్పథం తో ఒక ప్రత్యేక కార్యక్రమాని కి రూపకల్పన జరుగుతోంది.
33. జీవవైవిధ్యం పై భారతదేశాని కి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. జీవవైవిధ్యం పరిరక్షణ కు, ప్రోత్సాహాని కి పూర్తి గా కట్టుబడి ఉంది. ఇటీవలి కాలం లో దేశం లో పులుల సంఖ్య త్వరిత గతి న పెరిగింది. ఆసియా ప్రాంత సింహాల సంతతి ని పరిరక్షించి అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక పరియోజన కూడా ప్రారంభం కానుంది. అదే విధం గా ప్రాజెక్టు డాల్ఫిన్ ను కూడా ప్రారంభించడం జరుగుతుంది.
34. ఎల్ ఒసి నుండి ఎల్ ఎసి వరకు దేశ సార్వభౌమత్వం పై కళ్లెగరేసిన వారెవరికైనా దేశం, దేశ సైనిక బలం అదే సంకేతాల తో సరైన సమాధానాన్ని ఇచ్చాయి. భారతదేశం యొక్క సార్వభౌమత్వ ఆదరణ మనకు మిగిలిన అన్నిటి కంటే అత్యంత ప్రధానమైనటువంటిది. ఈ సంకల్పం విషయం లో దేశాని కి చెందిన వీర సైనికులు ఏమి చేయగలరు, దేశం ఏమి చేయగలదు అనేది లద్దాఖ్ లో యావత్తు ప్రపంచం వీక్షించింది.
35. ప్రపంచ జనాభా లో నాలుగో వంతు దక్షిణాసియాలోనే నివసిస్తున్నారు. సహకారం, భాగస్వామ్యం తో మనందరం అంత భారీ జనాభా కు అపరిమితమైన అభివృద్ధి అవకాశాల ను, సుసంపన్నత ను అందించగలుగుతాము.
36. దేశ భద్రత లో మన సరిహద్దులు, కోస్తా మౌలిక వసతుల పాత్ర ఎంతో అధికం. హిమాలయ పర్వత శ్రేణులు కావచ్చు లేదా హిందూ మహాసముద్రం లోని దీవులు కావచ్చు.. అన్ని ప్రాంతాలలోనూ ఇంతకు ముందు ఎన్నడూ కని విని ఎరుగని రీతి లో రోడ్ల విస్తరణ, ఇంటర్ నెట్ అనుసంధానం చోటు చేసుకుంటున్నాయి.
37. మన దేశం లో 1300 కి పైగా దీవులు ఉన్నాయి. వాటి భౌగోళిక స్వభావాన్ని బట్టి, దేశాభివృద్ధి లో వాటి ప్రాధాన్యం ఆధారం గా ఎంపిక చేసిన ద్వీపాల లో కొత్త అభివృద్ధి పథకాలు ప్రారంభించే కృషి జరుగుతోంది. అండమాన్, నికోబార్ దీవుల తర్వాత రాబోయే 1000 రోజుల కాలం లో లక్ష దీవుల కు కూడా సబ్ మరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సంధానం సమకూరనుంది.
38. దేశం లోని 173 సరిహద్దు, కోస్తా జిల్లాల లో ఎన్ సిసి విస్తరణ జరుగనుంది. ఈ ప్రచార ఉద్యమం లో భాగం గా ఆయా ప్రాంతాల లో లక్ష మంది కొత్త ఎన్ సిసి కేడెట్ లకు ప్రత్యేక శిక్షణ నివ్వడం జరుగుతుంది. వారిలో సుమారుగా మూడింట ఒక వంతు మంది పుత్రిక లు ప్రత్యేక శిక్షణ ను పొందబోతున్నారు.
39. మన విధానాలు, మన ప్రక్రియ లు, మన ఉత్పత్తులు, ప్రతిదీ అత్యుత్తమం గా ఉండాలి, తప్పక సర్వోత్తమంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ‘ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్’ దర్శనాన్ని నెరవేర్చుకోగలుగుతాము.
40. ‘జీవించడం లో సరళత్వం’ కార్యక్రమం తో అమితం గా లబ్ధి ని పొందేది మధ్య తరగతే; చౌక గా ఇంటర్ నెట్ మొదలుకొని తక్కువ ధరల తో కూడిన విమాన టిక్కెట్ ల వరకు, హైవే స్ నుండి ఐ-వేస్ వరకు, ఇంకా తక్కువ ఖర్చు తో కూడిన గృహ నిర్మాణం నుండి పన్ను తగ్గింపు వరకు- ఈ చర్య లు అన్నీ దేశం లో మధ్య తరగతి కి సాధికారిత ను ప్రసాదించగలవు.