అన్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కరదీపికను చదివిన తర్వాత జార్ఖండ్‌లోని కోదర్మాలోగల ఓ పాఠశాల విద్యార్థులు పరీక్షల సంబంధిత ఒత్తిడి నుంచి విముక్తులయ్యారంటూ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి ట్వీట్ చేశారు.
శ్రీ మోదీ ఈ ట్విట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“అద్భుతం! విద్యార్థులు పరీక్షల విషయంలో ఎంతమాత్రం ఒత్తిడికి గురికాకూడదు. ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యం ఇదే”నని పేర్కొన్నారు.
बहुत अच्छा! विद्यार्थी परीक्षा को लेकर हर प्रकार के तनाव से मुक्त हों, यही तो एग्जाम वॉरियर्स का उद्देश्य है… https://t.co/d9pbPrzzoS
— Narendra Modi (@narendramodi) February 25, 2023