ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం-మధ్య ఆసియా శిఖర సమ్మేళనం తాలూకు ఒకటో సమావేశాని కి 2022వ సంవత్సరం జనవరి 27వ తేదీ న వర్చువల్ పద్ధతి లో ఆతిథ్యాన్ని ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం లో కజాకిస్తాన్, కిర్గిజ్ గణతంత్రం, తాజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇంకా ఉజ్ బెకిస్తాన్ ల అధ్యక్షులు పాలుపంచుకోనున్నారు. రాజకీయ నేతల స్థాయి లో భారతదేశం మరియు మధ్య ఆసియా దేశాల మధ్య ఈ తరహా లో జరుగుతున్నటువంటి తొలి కార్యక్రమం ఇదే కానున్నది.
ఇండియా-సెంట్రల్ ఏశియా సమిట్ తొలి కార్యక్రమం మధ్య ఆసియా దేశాల తో భారతదేశానికి పెరుగుతున్నటువంటి అనుబంధాని కి అద్దం పడుతున్నది. మధ్య ఆసియా దేశాలు భారతదేశం యొక్క ‘‘విస్తరించిన ఇరుగు పొరుగు దేశాల’’ (ఎక్స్ టెండెడ్ నేబర్ హుడ్) లో ఓ భాగం గా ఉన్నాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015వ సంవత్సరం లో మధ్య ఆసియా దేశాలన్నిటి లోనూ చరిత్రాత్మక యాత్ర ను జరిపారు. ఆ తరువాత, ద్వైపాక్షిక వేదికల లోను, బహు పక్షీయ వేదికల లోను ఉన్నత స్థాయి లో ఆదాన ప్రదానాలు చోటు చేసుకొన్నాయి.
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల స్థాయి లో ఇండియా-సెంట్రల్ ఏశియా డైలాగ్ ఆరంభం కావడం భారతదేశాని కి, మధ్య ఆసియా దేశాల కు మధ్య సంబంధాల కు ప్రోత్సాహాన్ని అందించింది. ఈ స్థాయి లో మూడో సమావేశం న్యూ ఢిల్లీ లో 2021 వ సంవత్సరం డిసెంబర్ 18-20వ తేదీ ల మధ్య జరిగింది. 2021వ సంవత్సరం నవంబరు 10వ తేదీ న న్యూ ఢిల్లీ లో జరిగిన అఫ్ గానిస్తాన్ కు సంబంధించిన ప్రాంతీయ భద్రత సంభాషణ కార్యక్రమం లో మధ్య ఆసియా దేశాల జాతీయ భద్రత మండలుల కార్యదర్శులు పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం అఫ్ గానిస్తాన్ విషయం లో ఒక సర్వమాన్య ప్రాంతీయ దృష్టికోణాన్ని చాటి చెప్పింది.
ఇండియా-సెంట్రల్ ఏశియా సమిట్ ఒకటో సమావేశం లో, భారతదేశం, మధ్య ఆసియా సంబంధాల ను సరికొత్త శిఖరాల కు తీసుకు పోవడం కోసం రాజకీయ నేత లు చేపట్టదగ్గ చర్యల పైన చర్చ జరగవచ్చన్న అంచనా ఉంది. వారు పరస్పరం హితకరమైన ప్రాంతీయ అంశాల ను మరియు అంతర్జాతీయ అంశాల ను ప్రస్తావించి, విశేషించి ప్రాంతీయ భద్రత స్థితి లోని మార్పుల పట్ల ఒకరి అభిప్రాయాల ను మరొకరి కి వెల్లడించుకొంటారన్న ఆశ కూడా ఉంది.
ఈ శిఖర సమ్మేళనం ఒక సంపూర్ణమైనటువంటి మరియు కాల పరీక్ష కు తట్టుకొని నిలబడేటటువంటి భారతదేశం-మధ్య ఆసియా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి గాను భారతదేశం మరియు మధ్య ఆసియా దేశాల నేతలు కట్టబెడుతున్న ప్రాముఖ్యాని కి ఒక సంకేతం గా నిలవనుంది.