గుజరాత్ లో పలు రైల్వే ప్రాజెక్టులు కూడా ప్రారంభం
ఎంజిఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి
ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక గమ్యంగా కెవాడియా మారుతోంది : ప్రధానమంత్రి
భారత రైల్వేలు లక్ష్య ఆధారిత చర్యలతో పరివర్తన చెందుతున్నాయి : ప్రధానమంత్రి

నమస్కారం !

‘ఏక్ భారత్-శ్రేష్ట భారత్’ కు అందమైన ప్రతిరూపాన్ని ఈ రోజు ఇక్కడ కనిపిస్తోంది. ఈ కార్యక్రమ ఆకృతి చాలా విస్తృతమైనది, చారిత్రాత్మకమైనది.

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవరత్ గారు; గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గారు; కేవాడియాలో ఉన్నారు. గుజరాత్ శాసనసభ స్పీకర్ శ్రీ రాజేంద్ర త్రివేది గారు ప్రతాప్ నగర్ లో ఉన్నారు. గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ గారు అహ్మదాబాద్ లో ఉన్నారు. కాగా - కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన శ్రీ పియూష్ గోయల్ గారు, విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ గారు, డాక్టర్ హర్ష వర్ధన్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి భాయ్ అరవింద్ కేజ్రీవాల్ గారు, ఢిల్లీ నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాతో పాటు మధ్యప్రదేశ్ లోని రేవా లో ఉన్నారు. వీరితో పాటు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి భాయ్ ఉద్ధవ్ ఠాక్రే గారు ముంబైలో ఉన్నారు. ఇంకా, వారణాసి నుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మాతో అనుసంధానమై ఉన్నారు. అలాగే, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గౌరవ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కూడా మాతో పాటు, ఈ రోజు, ఈ భారీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంద్ లో ఉన్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి విస్తరించిన కుటుంబంలోని చాలా మంది సభ్యులు ఈ రోజు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఈ రోజున, కళా ప్రపంచానికి చెందిన చాలా మంది సీనియర్ కళాకారులు, క్రీడా ప్రపంచంలోని చాలా మంది క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అనుసంధానమై ఉన్నారు. వారితో పాటు, భగవంతుని ప్రతిరూపాలైన ప్రజలు, మన ప్రియమైన సోదర, సోదరీమణులు, మన భారతదేశ ఉజ్వల భవిష్యత్తును సూచించే చిన్నారులూ వచ్చారు. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఒకే చోటికి ఇంత పెద్ద సంఖ్యలో రైళ్లు ప్రారంభించడం బహుశా, రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. నిజానికి, కెవాడియా అంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. దేశాన్ని ఒకటిగా చేసిన ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’ అనే మంత్రాన్ని దేశానికి ప్రసాదించిన సర్దార్ పటేల్ యొక్క ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం, "ఐక్యతా విగ్రహం" వల్ల మరియు సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల, ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చింది. నేటి సంఘటన నిజంగా భారతదేశాన్ని ఒకటిగా సూచిస్తుంది. అదేవిధంగా భారత రైల్వేల దృష్టితో పాటు, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ యొక్క ఆశయాన్నీ - రెండింటినీ ఇది నిర్వచిస్తుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

కెవాడియాకు ఈరోజు ప్రారంభిస్తున్న రైళ్లలో ఒకటి పురట్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి కూడా వస్తోంది. యాదృచ్చికంగా, ఈ రోజు భారత రత్న ఎం.జి.ఆర్. జన్మదినం కూడా కావడం ఒక ఆహ్లాదకరమైన విషయం. సినిమా జీవితం నుండి రాజకీయ జీవితం వరకు ఎం.జి.ఆర్. ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన జీవనయానం, ఆయన రాజకీయ ప్రయాణం మొత్తం పేదలకే అంకితమయ్యాయి. పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలని, ఆయన నిర్విరామంగా కృషిచేశారు. భారత రత్న ఎం.జి.ఆర్. యొక్క ఈ ఆదర్శాలను నెరవేర్చడానికి, ఈ రోజు, మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కొన్నేళ్ల క్రితం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును, ఆయన గౌరవార్థం మార్చడం జరిగింది. నేను, భారత రత్న ఎం.జి.ఆర్. కు వందనం చేసి, నివాళులర్పిస్తున్నాను.

స్నేహితులారా !

ఈ రోజు, దేశంలోని అన్ని ప్రాంతాల నుండి కెవాడియా కు ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని కలిగి ఉండటం మొత్తం దేశానికి అద్భుతమైన, గర్వకారణమైన రోజు. కొద్దిసేపటి క్రితం, చెన్నైతో పాటు, వారణాసి, రేవా, దాదర్, ఢిల్లీ నుండి కెవాడియా ఎక్స్‌ప్రెస్ రైలు, అదేవిధంగా అహ్మదాబాద్ నుండి జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు కేవాడియాకు బయలుదేరాయి. అదేవిధంగా, కెవాడియా, ప్రతాప్ నగర్ మధ్య కూడా మెము రైలు సేవ ప్రారంభమైంది. దభోయ్-చందోద్ రైల్వే లైను విస్తరణతో పాటు, చందోద్ మరియు కెవాడియా మధ్య కొత్త రైల్వే లైను ఇప్పుడు కేవాడియా అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాయి. ఈ రోజు, నేను ఈ రైల్వే కార్యక్రమంతో సంబంధం కలిగి ఉన్న సమయంలో, కొన్ని పాత జ్ఞాపకాలు కూడా మదిలో మెదులుతున్నాయి. బరోడా - దభోయ్ మధ్య నారో గేజ్ రైలు నడుస్తుండేదన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ మార్గంలో అప్పట్లో తరచుగా ప్రయాణించే అవకాశం నాకు వచ్చింది. ఒకానొక సమయంలో, నర్మదా మాత పట్ల నాకు చాలా ప్రత్యేకమైన ఆకర్షణ ఉండడంతో, నేను తరచూ ఇక్కడకు వచ్చేవాడిని. నేను నర్మదా మాత ఒడిలో కొన్ని క్షణాలు గడిపాను, ఆ సమయంలో మేము ఈ నారో గేజ్ రైలులో ప్రయాణించేవాళ్ళం. దానికి తోడు, ఈ నారో గేజ్ రైలు ప్రయాణంలో సరదా ఏమిటంటే దాని వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది, అదే సమయంలో మీరు రైలు లో నుండి కిందకి దిగి తిరిగి రైలులోకి ఎక్కవచ్చు. ఒక్కోసారి, మీరు రైలు దిగి, దా నితో పాటు నడిస్తే, మీ వేగం, రైలు వేగం కంటే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. నేను కూడా దాన్ని ఆస్వాదించాను, కాని ఈ రోజు అది బ్రాడ్-గేజ్ గా మారుతోంది. ఈ రైలు మార్గాల అనుసంధానత వల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఐక్యతా విగ్రహం చూడటానికి వచ్చే పర్యాటకులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇది గిరిజన సోదర, సోదరీమణుల జీవితాలను కూడా మార్చనుంది. ఈ అనుసంధానత వల్ల రవాణా సౌలభ్యాన్ని అందించడంతో పాటు ఉపాధి, స్వయం ఉపాధికి కొత్త అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఈ రైల్వే మార్గం, నర్మదా నది ఒడ్డున ఉన్న కర్ణాలి, పోయిచా, గరుడేశ్వర్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా కలుపుతుంది. మొత్తం ప్రాంతం ఆధ్యాత్మిక ప్రకంపనలతో నిండి ఉంటుందనేది వాస్తవం. సాధారణంగా ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఇక్కడకు వచ్చే ప్రజలకు, ఈ అభివృద్ధి కార్యక్రమం చాలా పెద్ద బహుమతి.

 

సోదర, సోదరీమణులారా !

ఈ రోజు, కేవాడియా గుజరాత్ యొక్క మారుమూల ప్రాంతంలోని ఒక చిన్న బ్లాకు కాదు, అయితే, ఇది ఇప్పుడు, ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. అమెరికాలోని "స్టాట్యూ అఫ్ లిబర్టీ" ని సందర్శించే పర్యాటకుల కంటే ఈ ఐక్యతా విగ్రహాన్ని చూడటానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువ. ఐక్యతా విగ్రహం ప్రారంభించినప్పటి నుండి, ఇప్పటి వరకు ఈ విగ్రహాన్ని చూడటానికి సుమారు 50 లక్షల మంది వచ్చారు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు మూసివేసిన అనంతరం, కెవాడియాకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఇప్పుడు వేగంగా పెరుగుతోంది. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో భవిష్యత్తులో ప్రతిరోజూ లక్ష మంది వరకు కేవాడియాకు రావడం ప్రారంభమవుతుందని ఒక సర్వే అంచనా వేసింది.

మిత్రులారా,

ప‌ర్యావ‌ర‌ణాన్ని ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో అభివృద్ధి చేయ‌డంతోపాటు ఆర్ధిక వ్య‌వ‌స్థ‌, ప‌ర్యావ‌ర‌ణాన్నిరెండింటినీ గ‌ణ‌నీయంగా ఎలా అభివృద్ధి చేయ‌వ‌చ్చో చిన్న అంద‌మైన కెవాడియా ఒక అద్భుత ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చాలామంది ప్ర‌ముఖులు కెవాడియాను ద‌ర్శించి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ మీరు ఈ ప్ర‌దేశాన్ని ఒక సారి చూస్తే, ఈ మ‌హాద్భుత ప్ర‌దేశం మీ దేశంలో ఉన్నందుకు మీరు ఎంతో గ‌ర్వ‌ప‌డ‌తారు. అలాగే మీరు కెవాడియా అభివృద్ధి ప్ర‌స్థానాన్ని క‌ళ్లారా చూడ‌గ‌లుగుతారు.

మిత్రులారా,

నాకు బాగా గుర్తు,నేను కెవాడియాను ప్ర‌పంచంలోకెల్లా అత్యుత్త‌మ కుటుంబ ప‌ర్యాట‌క ప్రాంతంగా రూపొందించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌పుడు ప్ర‌జ‌లు ఇదొక క‌ల‌గా భావించారు. జ‌నం దీనిగురించి మాట్లాడుకుంటూ, ఇది సాధ్యం కాదు. అది జ‌ర‌గ‌దు. ఇలా చేయ‌డానికి ఎన్నో ద‌శ‌బ్దాలు ప‌డుతుంది అని అంటూ వ‌చ్చారు.నిజ‌మే వాళ్లు అలా అనుకోవ‌డానికి కార‌ణం, వారి పాత అనుభ‌వాలే. కెవాడియా వెళ్ల‌డానికి విశాల‌మైన రోడ్లు లేవు. వీధి దీపాలు లేవు. ప‌ర్యాట‌కులు ఉండ‌డానికి మెరుగైన స‌దుపాయాలు ఉండేవి కావు. కెవాడియా అప్ప‌ట్లో దేశంలోని ఇత‌ర చిన్న గ్రామాల మాదిరే ఉండేది. కాని కేవ‌లం కొద్ది సంవ‌త్స‌రాల‌లోనే కెవాడియా పూర్తిగా మారిపోయింది. కెవాడియా చేర‌డానికి విశాల‌మైన రోడ్లు వ‌చ్చాయిఇ. ఉండ‌డానికి టెంట్ సిటీ ఏర్ప‌డింది. ఇంకా ఎన్నో ర‌కాల స‌దుపాయాలు అక్క‌డ వ‌చ్చాయి. మెరుగైన మొబైల్ అనుసంధాన‌త వ‌చ్చింది. మంచి ఆస్ప‌త్రులు వ‌చ్చాయి. కొద్ది రోజుల క్రితం సీప్లేన్ స‌ర్వీస్ ప్రారంభ‌మైంది. ఇవాళ కెవాడియా దేశంలోని ఎన్నో రైలు మార్గాల‌తో అనుసంధాన‌మైంది.ఈ ప‌ట్ట‌ణం ఇప్పుడు పూర్తి ఫ్యామిలీ ప్యాకేజ్ ని అందిస్తున్న‌ది. మీరు ఐక్య‌తా విగ్ర‌హం ఎంత పెద్ద‌దో చూడండి. స‌ర్దార్ స‌రోవ‌ర్ డ్యామ్ ఎంత భారీ ప్రాజెక్టో మీరు కెవాడియా ద‌ర్శించ‌న త‌రువాత తెలుసుకోగ‌లుగుతారు. ఇప్పుడు అక్క‌డ స‌ర్దార్‌ప‌టేల్ జంతు ప్ర‌ద‌ర్శ‌న శాల ఏర్పాటైంది.వంద‌లాది ఎక‌రాల‌లో అది ఏర్ప‌డింది. జంగిల్ స‌ఫారీ కూడా ఉంది. మ‌రోవైపు ఆయుర్వేద‌, యోగా ఆధారిత వెల్‌నెస్ పార్క్ కూడా అక్క‌డ ఉంది. న్యూట్రిష‌న్ పార్కు ఉంది.

రాత్రిపూట మెరిసే గ్లో గార్డెను ఉంది. కాక్ట‌స్ గార్డెన్‌, సీతాకోక చిలుక‌ల గార్డెన్ ఉన్నాయి. ప‌ర్యాట‌కుల‌కు ఏక్తా క్రూయిజ్ ఉంది. మ‌రోవైపు యువ‌త‌కు రాఫ్టింగ్ ఉంది. ప్ర‌తి ఒక్క‌రికి అవ‌స‌ర‌మైన‌వ‌న్నీ ఉన్నాయి అక్క‌డ‌. పిల్ల‌లు, యువ‌కులు, వృద్ధులు అన్ని వ‌య‌సుల వారికి కావ‌ల‌సిన వ‌న్నీ అక్క‌డ ఉన్నాయి. ప‌ర్యాట‌క రంగం అక్క‌డ అభివృద్ధి చెందుతుండ‌డంతో గిరిజ‌న యువ‌త ఉపాధి అవ‌కాశాలు పొందుతున్న‌ది..అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆధునిక స‌దుపాయాలు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. కొంద‌రు మేనేజ‌ర్లు అయితే మ‌రికొంద‌రు కెఫే య‌జ‌మానులు అయ్యారు. మ‌రికొంద‌రు ప‌ర్యాట‌క గైడ్లు అయ్యారు. నేను జూ పార్క్ లోని ప్ర‌త్యేక ఎవియ‌రీ డోమ్‌లోకి ప‌క్షుల‌ను చూసేందుకు వెళ్లిన‌పుడు, అక్క‌డ ఒక మ‌హిళ గైడ్‌గా ఉన్నారు. ఆమె అక్క‌డి విశేషాలు నాకు చ‌క్క‌గా వివ‌రించ‌డం నాకు గుర్తు ఉంది. దీనికితోడు కెవాడియాకు చెందిన స్థానిక మ‌హిళ‌లు త‌మ హ‌స్త‌క‌ళారూపాల‌ను ఎక‌తా మాల్‌లో అమ్ముకోగ‌లుగుతున్నారు. కెవాడియాలో ప‌ర్యాట‌కులు ఉండ‌డానికి 200 రూమ్‌లు హోమ్‌స్టే కింద ఎంపిక చేసిన‌ట్టు నాకు తెల‌సింది.

సోద‌ర‌, సోద‌రీమ‌ణులారా,

సోద‌ర సోద‌రీ మ‌ణులారా,

కెవాడియాలో నిర్మించిన రైల్వే స్టేష‌న్ ప‌ర్యాట‌కుల అవ‌స‌రాలు తీర్చ‌డంతోపాటు వారికి సౌక‌ర్య‌వంతంగా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ట్రైబ‌ల్ ఆర్ట్ గ్యాల‌రీ, దృశ్య గ్యాల‌రీ కూడా ఇక్క‌డ ఏర్పాటు అవుతున్నాయి. ప‌ర్యాట‌కులు ఐక్య‌తా విగ్ర‌హాన్ని ఆ వ్యూయింగ్ గ్యాల‌రీ నుంచి చూడ‌గ‌లుగుతారు.

మిత్రులారా,

నిర్దేశిత ల‌క్ష్యంతో రైల్వేలు చేస్తున్న కృషి మారుతున్న రైల్వేల స్వ‌భావానికి అద్దం ప‌డుతున్న‌ది. భార‌తీయ రైల్వేలు సంప్ర‌దాయికంగా పాసింజ‌ర్ రైళ్లు, స‌ర‌కు ర‌వాణా రైళ్ల విష‌యంలో కీల‌క పాత్ర పోషించ‌డ‌మే కాక‌, మన దేశంలోని ప్ర‌ధాన ప‌ర్యాట‌క కేంద్రాల‌కు ,ఆథ్యాత్మిక స‌ర్క్యూట్‌ల‌కు నేరుగా అనుసంధాన‌త‌ను క‌ల్పిస్తున్నాయి. ప్ర‌స్తుతం విస్టాడోమ్ కోచ్‌లు భార‌తీయ రైల్వేల‌లో ప్ర‌యాణాన్ని ప‌లు మార్గాల‌లో మ‌రింత ఆక‌ర్షణీయంగా చేయ‌నున్నాయి. అహ్మ‌దాబాద్ - కెవాడియా జ‌న్ శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా ఇలాంటి విస్టాడోమ్ కోచ్ ల స‌దుపాయాన్ని క‌లిగి ఉండ‌నుంది.

మిత్రులారా,

గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా భార‌తీయ రైల్వేల‌ను ఆధునికరించ‌డానికి మున్నెన్న‌డూ లేనంత స్థాయిలొ ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి జ‌రిగాయి. స్వాతంత్ర్యానంత‌రం మ‌న శ‌క్తి యుక్తుల‌న్నీ ప్ర‌స్తుత రైల్వే వ్య‌వ‌స్థ‌లో లోటుపాట్లు స‌రిదిద్దుకోవ‌డం, లేదా ప్ర‌స్తుత రైల్వే వ్య‌వ‌స్థ‌ను మెరుగ‌ప‌ర‌చుకోవ‌డం పైనే ఉంది. అప్ప‌ట్లో నూత‌న ఆలోచ‌న‌లు, నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం గురించిన ఆలోచ‌న‌లు స్వ‌ల్పంగా ఉండేవి. ఆ దృక్ఫ‌థం మారాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అందువ‌ల్ల మొత్తం రైల్వే వ్య‌వ‌స్థ‌లో గ‌త కొద్ది సంవ‌త్స‌రాల‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు చేయ‌డం జ‌రిగింది. ఈ మార్పులు ప‌లు రంగాల‌లో ఏక కాలంలో తీసుకురావ‌డం జ‌రిగింది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ ప్రాజెక్టు కెవాడియాను రైలు నెట్ వ‌ర్కు తో అనుసంధానం చేయ‌డానికి సంబంధించిన‌ది. వీడియోలో చూపించిన‌ట్టు ఎన్నో ఇబ్బందులు ఇందులో ఉన్నాయి . వాతావ‌ర‌ణం, నిర్మాణ స‌మంయ‌లో క‌రోనా మ‌హమ్మారి వంటివి. అయితే రికార్డు స‌మ‌యంలో ప‌నులు పూర్తి అయ్యాయి. రైల్వేలు వినియోగిస్తున్న ఆధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం ఎంతో స‌హాయ‌ప‌డింది. ట్రాక్‌లు వేయ‌డం ద‌గ్గ‌ర నుంచి బ్రిడ్జిల నిర్మాణం వ‌ర‌కు కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌ను వాడ‌డం జ‌రిగింది. సిగ్న‌లింగ్ వ‌ర్కుకు ప‌రీక్ష‌లు వ‌ర్చువ‌ల్ మోడ్‌లో నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఇంత‌కు ముందు ఇలాంటి అడ్డంకుల‌వ‌ల్ల ప్రాజెక్టుల అమ‌లులో జాప్యం జరిగేది.

మిత్రులారా,

ప్ర‌త్యేకించి స‌ర‌కు ర‌వాణా కారిడార్ ప్రాజెక్టు మ‌న దేశంలో ఉన్న ప‌ని సంస్కృతికి నిద‌ర్శ‌నంగా ఉండేది. తూర్పు,ప‌శ్చిమ ప్రాంతంలోని చాలా భాగం ప్ర‌త్యేక స‌ర‌కు ర‌వాణా కారిడార్ ను నేను కొద్ది సంవ‌త్స‌రాల క్రితం ప్రారంభించాను. ఈ ప్రాజెక్టు దేశానికి ఎంతో కీల‌క‌మైన‌ది. 2006 నుంచి 2014 వ‌ర‌కు ఇది కాగితాల‌కే ప‌రిమిత‌మై పోయింది. 2014 వ‌ర‌కు క‌నీసం ఒక్క కిలోమీట‌ర ట్రాక్ కూడా వేయ‌లేదు. ఇప్ప‌డు ఇక కొద్ది నెల‌ల్లో మొత్తంగా 1100 కిలోమీట‌ర‌ల్ ట్రాక్‌ను మ‌నం పూర్తి చేసుకోబోతున్నాం.

మిత్రులారా,

దేశంలో రైల్వే నెట్ వ‌ర్క్ ఆధునీక‌ర‌ణ‌తో ఇవాళ ఇంత‌కు ముందు అనుసంధానం కాని దేశంలోని వివిధ ప్రాంతాలు రైల్వేతో అనుసంధాన మ‌య్యాయి.పాత రైల్వే మార్గాల‌ను వెడ‌ల్పు చేయ‌డం, విద్యుదీక‌రించ‌డం, వేగం పెంపు, వంటివి మున్నెన్న‌డూ లేనంత‌టి వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రింత వేగంతొ రైళ్లు న‌డిపేందుకు ట్రాక్‌ల‌ను సిద్ధం చేయ‌డం జ‌రుగుతోంది. ఇందువ‌ల్లే సెమీ హై స్పీడ్ రైళ్లు న‌డ‌ప‌డానికి వీలు క‌లుగుతోంది. మ‌నం హైస్పీడు రైళ్లు న‌డిపే దిశ‌గా వెళుతున్నాం. అలాగే రైల్వేల‌ను ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌రంగా తీర్చిదిద్దుతున్నాం. కెవాడియా రైల్వే స్టేష‌న్ , దేశంలోనే మొద‌టి నుంచి గ్రీన్ బిల్డింగ్ స‌ర్టిఫికేష‌న్ పొందిన ఏకైక రైల్వేస్టేష‌న్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా,

రైల్వేల‌ను స‌త్వ‌ర ఆధునీక‌ర‌ణ చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం, మా దృష్టి అంతా రైల్వేల త‌యారీ, రైల్వే సాంకేతిక ప‌రిజ్ఞానంలో స్వావ‌లంబ‌న సాధించేట్టు చేయ‌డం. ఈ దిశ‌గా గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా సాగించిన కృషి స‌త్ఫ‌లితాల‌నిచ్చి మ‌న‌కు దాని ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. మ‌నం బాగా ఎక్కువ హార్స్ ప‌వ‌ర్ ఉన్న ఎల‌క్ట్రిక్ లోకోమోటివ్‌లు ఇండియాలో త‌యారు చేయ‌క‌పోతే ప్ర‌పంచంలోనే పొడ‌వైన డ‌బుల్ స్టాక్ హాల్ కంటెయిన‌ర్ రైలు ఇండియాలో న‌డిచేదా? ఇవాళ ఇండియాలో నిర్మించిన ఆధునిక రైల్ళు భార‌తీయ రైల్వేల‌లో భాగం..

సోద‌ర సోద‌రీమ‌ణుల‌రా,

ఇవాళ‌, మ‌నం భార‌తీయ రైల్వేల ప‌రివ‌ర్త‌న దిశ‌గా క‌దులుతున్న‌ప్పుడు అత్యంత నైపుణ్యం క‌లిగిన ప్ర‌త్యేక శిక్ష‌ణ‌పొందిన వారు, ప్రొఫెష‌న‌ల్స్‌, ఎంతో ముఖ్యం. ఈ ఉద్దేశంతోనే భార‌త‌దేశ‌పు మొద‌టి డీమ్డ్ రైల్వే విశ్వ‌విద్యాల‌యాన్ని వ‌డోద‌ర లో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. రైల్వేల కోసం ఇలాంటి సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసిన ప్ర‌పంచంలోని అతి కొద్ది దేశాల‌లో ఇండియా ఒక‌టి. రైల్వే ర‌వాణా, బ‌హుళ ప‌క్ష ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ ను ఇక్క‌డ అందించ‌నున్నారు. వంద‌లాది మంది ప్ర‌తిభ‌గ‌ల యువ‌త 20 రాష్ట్రాల నుంచి ఇక్క‌డ శిక్ష‌ణ అందుకుని రైల్వేల ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్‌ను మెరుగుప‌ర‌చ‌నున్నారు. ఆవిష్క‌ర‌ణ‌లు, ప‌రిశోధ‌న భార‌తీయ రైల్వేల‌ను ఆధునీక‌రించ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దేశ ప్ర‌గ‌తి ప‌థానికి మ‌రింత వూపు భార‌తీయ రైల్వేలు ఇవ్వాల‌ని నేనే ఆకాంక్షిస్తున్నాను. ఈ కొత్త రైల్వే స‌దుపాయాలు అందుబాటులోకి వ‌చ్చిన సంద‌ర్భంగా గుజ‌రాత్‌తో స‌హా మొత్తం దేశానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న‌. వివిధ భాష‌లు మాట్లాడే ప్ర‌జ‌లు ప‌విత్ర ప్ర‌దేశ‌మైన‌ ఐక్య‌తా విగ్ర‌హాన్ని సంద‌ర్శిస్తున్న‌పుడు, వారు దేశంలోని వివిధ ప్రాంతాల‌కు సంబంధించిన దుస్తులు ధ‌రిస్తున్న‌ప్పుడు మినీ ఇండియా రూపంలో దేశ ఐక్య‌త క‌నిపించిన‌పుడు స‌ర్దార్ సాహెబ్ క‌ల‌లు క‌న్న ఏక్‌భార‌త్ , శ్రేష్ఠ్ భార‌త్ ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇవాళ కేవాడియాకు ప్ర‌త్యేక దినం. దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త కోసం జ‌ర‌గుతున్న నిరంత‌ర కృషిలో ఇది నూత‌న అధ్యాయం.

మ‌రోసారి ప్ర‌తిఒక్క‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.