మహానుభావులు, మహిళలు మరియు సజ్జనులారా, నమస్కారం.
జి-20 విద్య శాఖ మంత్రుల సమావేశాని కి గాను భారతదేశాని కి మిమ్ముల ను నేను ఆహ్వానిస్తున్నాను. విద్య మన నాగరకత కు ఆధారభూతమైన పునాది ఒక్కటే కాదు, అది మానవ జాతి భవిష్యత్తు కు వాస్తుశిల్పి గా కూడా ను ఉంది. విద్య మంత్రులు గా, అందరి కి అభివృద్ధి, అందరి కి శాంతి మరియు అందరి కి సమృద్ధి లను సాధించి పెట్టడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయాసల లో మానవ జాతి కి నాయకత్వం వహిస్తున్నటువంటి శెర్ పా గా మీరు ఉన్నారు. భారతదేశం యొక్క ధర్మ గ్రంథాల లో విద్య తాలూకు భూమిక ను ఆనందాన్ని ప్రసాదించేది అభివర్ణించడం జరిగింది. అది ‘‘విద్యా దదాతి వినయమ్, వినయద్ యాతి పాత్రతామ్. పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం, తతః సుఖమ్.’’ అని చెబుతుంది. ఈ మాటల కు ‘‘సిసలైనటువంటి జ్ఞానం అణకువ ను ఇస్తుంది. వినమ్రత నుండి యోగ్యత వస్తుంది. పాత్రత ఏ వ్యక్తి కి అయినా సంపద ను ప్రాప్తింప జేస్తుంది. సంపద ఏ వ్యక్తి ని అయినా సత్కార్యాల ను చేసే శక్తి ని అనుగ్రహిస్తుంది. మరి ఇదే ఆనందాన్ని కొనితెస్తుంది.’’ అని భావం. ఈ కారణం గా భారతదేశం లో మేం ఒక సమగ్రమైనటువంటి మరియు విస్తృత మైనటువంటి యాత్ర కు శుభారంభం చేశాం. మన యువతీ యువకుల కు మౌలిక అక్షరాస్యత అనేది ఒక బలమైన ఆధారం గా నిలుస్తుంది అని మేం విశ్వసిస్తున్నాం. మరి మేం దీని ని సాంకేతిక విజ్ఞానం తో కూడాను జోడిస్తున్నాం. దీనికి గాను మేం ‘‘నేశనల్ ఇనిశియేటివ్ ఫార్ ప్రఫిశన్సి ఇన్ రీడింగ్ విద్ అండర్ స్టాండింగ్ ఎండ్ న్యూమరసి’’ లేదా ‘‘నిపుణ్ భారత్’’ కార్యక్రమాన్ని ఆరంభించాం. ‘‘మౌలిక అక్షరాస్యత మరియు అంక జ్ఞానం’’ .. ఈ రెంటి ని మీ యొక్క సమూహం సైతం ప్రాధాన్య అంశం గా గుర్తించినందుకు నేను సంతోషిస్తున్నాను. మనం 2030 వ సంవత్సరాని కల్లా కాలబద్ధ రీతి లో దీని పై కృషి చేయాలి అనే ఒక సంకల్పాన్ని చెప్పుకొని తీరాలి.
మహానుభావులారా,
మన ఉద్దేశ్యం మెరుగైన పాలన తో నాణ్యం నిండినటువంటి విద్య ను అందించడమే అవ్వాలి. దీని కోసమై మనం సరిక్రొత్తదైన ఇ-లర్నింగ్ ను వినూత్నం గా అవలంబించి మరి ఉపయోగించుకోవలసి ఉంటుంది. భారతదేశం లో మేం మా వైపు నుండి అనేక కార్యక్రమాల ను తీసుకొన్నాం. అటువంటి కార్యక్రమాల లో ఒక కార్యక్రమమే ‘‘స్టడీ వెబ్స్ ఆఫ్ ఏక్టివ్-లర్నింగ్ ఫార్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్’’ లేదా ‘స్వయమ్’. ఈ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ లో తొమ్మిదో తరగతి పాఠ్యక్రమం మొదలుకొని స్నాతకోత్తర స్థాయి వరకు పాఠ్య క్రమాలు కలసి ఉన్నాయి. ఇది విద్యార్థులు సుదూర ప్రాంతాల లో ఉంటూనే అధ్యయనం చేసే వీలు ను కల్పిస్తుంది. అంతేకాకుండా లభ్యత, సమానత్వం మరియు నాణ్యత ల పైన కూడా దృష్టి ని కేంద్రీకరిస్తుంది. 34 మిలియన్ కు పైగా నమోదుల తో మరియు తొమ్మిది వేల కు పైచిలుకు కోర్సుల తో ఇది ఒక చాలా ప్రభావవంతం అయినటువంటి శిక్షణ మాధ్యం వలె మారిపోయింది. మేం ‘‘డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫార్ నాలిజ్ శేరింగ్’’ లేదా ‘దీక్ష’ అనే పోర్టల్ ను కూడా తీసుకు వచ్చాం. ఈ పోర్టల్ దూర ప్రాంతాల విద్యార్థుల కోసం లక్షించినటువంటిది. నియమిత తరగతుల లో పాలుపంచుకోలేని అటువంటి విద్యార్థుల కోసం దీనిని రూపొందించడమైంది. దూర విద్య పద్ధతి లో పాఠశాల విద్య ను అందించడాని కి గాను గురువు లు దీని ని వినియోగించుకొంటున్నారు. ఇది ఇరవై తొమ్మిది భారతీయ భాషల లోను, ఏడు విదేశీ భాషల లోను విద్య ను నేర్చుకోవడం లో తోడ్పడుతుంది. ఇది 137 మిలియన్ కు పైగా పాఠ్య క్రమాల ను పూర్తి చేసింది. భారతదేశాని కి ఈ అనుభవాలను మరియు వనరుల ను శేర్ చేయడం అంటే, మరీ ముఖ్యం గా అంతగా అభివృద్ధి చెందనటువంటి దేశాల కు శేర్ చేయడం అంటే అది ప్రసన్నత ను కలిగించేదే.
మహానుభావులారా,
మన యువతీ యువకుల ను భవిష్యత్తు కై తయారు చేయడం కోసం, మనం వారికి అదే పని గా స్కిల్, రీ-స్కిల్, ఇంకా అప్-స్కిల్ మెలకువల ను అందించవలసిన అవసరం ఉన్నది. ఎప్పటికప్పుడు క్రొత్త రూపు ను దాల్చుతున్నటువంటి కార్య రూపురేఖల ను మరియు అభ్యాసాల ను దృష్టి లో పెట్టుకొని వాటికి తుల తూగే విధం గా వారి దక్షతల ను అభివృద్ధిపరచవలసి ఉంది. భారతదేశం లో మేం స్కిల్ మేపింగ్ ప్రక్రియ ను మొదలుపెడుతున్నాం. మా విద్య, నైపుణ్యం మరియు శ్రమ మంత్రిత్వ శాఖ లు ఈ కార్యక్రమం లో కలిసికట్టు గా పనిచేస్తున్నాయి. జి-20 సభ్యత్వ దేశాలు ప్రపంచ స్థాయి లో స్కిల్ మేపింగు ను మొదలుపెట్టవచ్చును; అంతేకాక, భర్తీ చేయవలసినటువంటి అంతరాలు ఏమిటి ఉన్నాయి అనేది కూడాను ఈ దేశాలు తెలుసుకోవచ్చును.
మహానుభావులారా,
డిజిటల్ టెక్నాలజీ అనేది ఒక సమానావకాశాల వేదిక గాను, అన్ని వర్గాల ను కలుపుకొని ముందుకు పోవడాన్ని ప్రోత్సహించేది గాను తన పాత్ర ను పోషిస్తుంది. అది విద్య మరింత ఎక్కువ మంది కి చేరువ గా వెళ్ళేటట్టు మరియు రాబోయే కాలం తాలూకు అవసరాల కు తగినట్టు గా మలచుకోవడం లోను ఒక శక్తి గుణకం గా ఉంటుందని చెప్పాలి. ప్రస్తుతం, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) అనేది నేర్చుకోవడం లో, నైపుణ్యాల కు సాన పెట్టుకోవడం లో మరియు విద్య రంగం లో అంతులేనటువంటి సంభావ్యతల ను ఇవ్వజూపుతున్నది. అవకాశాల తో పాటే సాంకేతిక విజ్ఞానం సవాళ్ళ ను కూడా రువ్వుతున్నది. మనం సరి అయినటువంటి సంతులనాన్ని సాధించవలసిన అగత్యం ఉంది. ఈ విషయం లో జి-20ఒక ముఖ్యమైన భూమిక ను పోషించ గలుగుతుంది.
మహానుభావులారా,
భారతదేశం లో మేం పరిశోధన కు మరియు నూతన ఆవిష్కరణల కు కూడా ను పెద్ద పీట ను వేశాం. మేం దేశవ్యాప్తం గా పది వేల ‘‘అటల్ టింకరింగ్ లేబ్స్’’ ను ఏర్పాటు చేశాం. అవి మా పాఠశాల విద్యార్థుల కు పరిశోధన మరియు నూతన ఆవిష్కరణల శిక్షణాలయాలు గా ఉంటున్నాయి. 7.5 మిలియన్ కు పైచిలుకు విద్యార్థులు ఈ తరహా ప్రయోగశాల లో 1.2 మిలియన్ కు పైచిలుకు నూతన ఆవిష్కరణల సంబంధి పథకాల పై కసరత్తు చేస్తున్నారు. జి-20 సభ్యత్వ దేశాలు వాటి వాటి స్వీయ బలాల తో పరిశోధన ను మరియు నూతన ఆవిష్కరణ ను ప్రోత్సహించడం లో, మరీ ముఖ్యంగా గ్లోబల్ సౌథ్ దేశాల లో ఈ విధి ని నిర్వర్తించడం లో ఒక కీలకమైన భూమిక ను పోషించ గలుగుతాయి. పరిశోధన సంబంధి సహకారాల ను ముమ్మరం చేయడం కోసం ఒక బాట ను పరచండి అంటూ మీ అందరి కి నేను విన్నపాన్ని చేస్తున్నాను.
మహానుభావులారా,
మన పిల్లల యొక్కయు మరియు మన యువతరం యొక్కయు భవిష్యత్తు ను దిద్ది తీర్చడం లో మీరు నిర్వహిస్తున్న ఈ సమావేశాని కి ఎక్కడలేనటువంటి ప్రాముఖ్యం ఉంది. సతత అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజిస్ )ను సాధించడానికి గ్రీన్ ట్రాన్ జీశన్, డిజిటల్ ట్రేన్స్ ఫర్ మేశన్స్ మరియు మహిళల సశక్తీకరణ అనే అంశాల ను శీఘ్ర గతి న ఫలితాల ను ఇచ్చే అంశాలు గా మీ సమూహం గుర్తించినందుకు నాకు సంతోషం గా ఉంది. ఈ ప్రయాస లు అన్నింటి కి విద్య మూలం గా నిలుస్తుంది. ఈ సమూహం ఒక సమ్మిళితమైనటువంటి, కార్యోన్ముఖమైనటువంటి మరియు భవిష్యత్తు కాలం యొక్క అవసరాల కు సన్నద్ధం అయినటువంటి విద్య సంబంధి కార్యక్రమాల పట్టిక ను సిద్ధం చేస్తుంది అని నేను నమ్ముతున్నాను. దీనితో యావత్తు ప్రపంచానికి ‘వసుధైవ కుటుంబకమ్’ .. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు ’ తాలూకు సిసలు భావన యొక్క లాభం దక్కుతుంది. మీ అందరు ఒక సార్థకమైనటువంటి మరియు ఫలప్రదం అయ్యేటటువంటి సమావేశాన్ని నిర్వహించగలరని నేను కోరుకొంటున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.