‘‘క్రీడా స్ఫూర్తి అనేది రాబోయే కాలం లో క్రీడాకారులు అందరి సాఫల్యానికి తలుపుల ను తెరుస్తుంది’’
‘‘ప్రాంతీయ స్థాయి లో జరిగే పోటీ లు స్థానిక ప్రతిభ ను వృద్ధి చెందింప చేడయంఒక్కటే కాకుండా యావత్తు ప్రాంతం లో క్రీడాకారుల లో ధైర్యాన్నిపెంచుతాయి కూడాను’’
‘‘సాంసద్ ఖేల్ మహాకుంభ్ అనేది ఒక కొత్త దారి, అది ఒక కొత్త వ్యవస్థ అని చెప్పాలి’’
‘‘క్రీడల జగతి లో దేశం యొక్క శక్తియుక్తుల ను ప్రముఖం గా చాటడం లో సాంసద్ఖేల్ మహాకుంభ్ కు ఒక ప్రముఖమైన పాత్రంటూ ఉంది’’
‘‘క్రీడా రంగ భవిష్యత్తు తాలూకు భవ్యమైన మౌలిక సదుపాయాల కల్పన కు సాంసద్ ఖేల్ మహాకుంభ్ ఒక బలమైన పునాది ని వేస్తుంది’’
‘‘క్రీడల మంత్రిత్వ శాఖ కు బడ్జెట్ కేటాయింపు 2014 వ సంవత్సరం తో పోలిస్తే దాదాపు గా 3 రెట్లు అధికం గా ఉంది’’

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ జీ, గోరఖ్ పూర్ ఎంపి శ్రీ రవికిషన్ శుక్లాజీ, యువ క్రీడాకారులు, కోచ్ లు, తల్లిదండ్రులు, సహచరులారా!

మహాయోగి గురు గోరఖ్ నాథ్ పవిత్ర భూమికి నేను శిరసు వంచి అభివాదం చేస్తున్నాను. ‘సన్సద్ ఖేల్’లో  పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేస్తున్నాను. మీరంతా ఎంతో శ్రమించి కృషి చేశారు. ఈ  పోటీల్లో కొందరు క్రీడాకారులు విజేతలు కావచ్చును, మరి కొందరు పరాజయం ఎదుర్కొనవలసిరావచ్చు. క్రీడా మైదానం అయినా, జీవిత రంగస్థలం అయినా గెలుపు ఓటములు అందులో అంతర్భాగం. ఇంత దూరం వచ్చిన మీలో ఎవరూ పరాజితులు కాదు.  మీరు ఎంతో నేర్చుకున్నారు, జ్ఞానం సముపార్జించారు, అనుభవం సాధించారు. ఇదే విజయానికి అతి పెద్ద మూలధనం. మీలోని క్రీడా స్ఫూర్తి భవిష్యత్తులో మీకు విజయద్వారాలు తెరుస్తుంది.

నా యువ మిత్రులారా,

రెజ్లింగ్, కబడ్డీ, హామీ వంటి క్రీడలతో పాటు చిత్రలేఖనం, జానపద గేయాలు, జానపద నృత్యాలు, తబలా, ఫ్లూట్ పోటీల్లో కళాకారులు కూడా పాల్గొన్నట్టు నాకు తెలిసింది. ఇది ఒక అద్భుతమైన, ప్రశంసనీయమైన, స్ఫూర్తిదాయకమైన చొరవ. క్రీడలైనా, కళలైనా. సంగీతం అయినా వారిలోని ప్రతిభ, స్ఫూర్తి, శక్తి ఒకేలా ఉంటాయి. మన భారతీయ సాంప్రదాయాలు, జానపద ఆచార వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లాల్సిన ఉమ్మడి నైతిక బాధ్యత మనందరిపై ఉంది. రవికిషన్ జీ స్వయంగా ప్రతిభావంతుడైన కళాకారుడు. అందువల్ల ఆయన కళ ప్రాధాన్యతను బాగా అర్ధం చేసుకోవడం సహజం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు రవికిషన్ జీని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

మిత్రులారా,

గత మూడు వారాలుగా నేను మూడో సన్సద్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. భారతదేశం ప్రపంచంలో ఉత్తమ క్రీడాశక్తిగా ఎదిగిందని నేను విశ్వసిస్తున్నాను. అందువల్ల మనం కొత్త మార్గాలు, కొత్త వ్యవస్థలు కూడా కనుగొనాలి. సన్సద్ ఖేల్ మహాకుంభ్ అలాంటి కొత్త మార్గం, వ్యవస్థల్లో ఒకటి. దేశంలో క్రీడా ప్రతిభను పెంచడానికి స్థానికంగా క్రమం తప్పకుండా క్రీడల పోటీలు నిర్వహించడం అత్యంత ప్రధానం. లోక్ సభ స్థాయిలో ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల స్థానిక ప్రతిభా సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రాంతీయంగా క్రీడాకారులందరిలోనూ నైతికత ఉత్తేజితం అవుతుంది. గోరఖ్ పూర్ లో ఖేల్ మహాకుంభ్ నిర్వహించినప్పుడు 18000-20000 మంది క్రీడాకారులు పాల్గొనడం మీరంతా చూస్తున్నారు. ఈ సారి వారి సంఖ్య 24000-25000కి పెరిగింది. వారిలో 9000 మంది మన కుమార్తెలు సహా యువ క్రీడాకారులు. చిన్న గ్రామాలు, చిన్న పట్టణాల నుంచి వచ్చిన వేలాది మంది యువ క్రీడాకారులు మీలో ఉండవచ్చు. సన్సద్ ఖేల్ పోటీలు యువ క్రీడాకారులకు కొత్త అవకాశాలు కల్పించే ఒక కొత్త వేదికగా ఎలా మన ముందుకు వచ్చాయనేందుకు ఇది నిదర్శనం.

మిత్రులారా,

యవ్వన దశలో ఉన్న బాలలు పొడుగు పెరగాలన్న తపనతో ఎత్తులో ఉన్న ఏదైనా ఒక కడ్డీ లేదా చెట్టును పట్టుకుని వేలాడడం మనం తరచు చూస్తూ ఉంటాం. వయసు ఏదైనా దారుఢ్యంతో ఉండాలనేది అందరిలో అంతర్గతంగా ఉండే కోరిక. ఒకప్పుడు గ్రామాల్లో జరిగే జాతరలు, ఉత్సవాల్లో పలు క్రీడలు, ఆటలు కూడా నిర్వహించే వారు. అఖాడాల్లో కూడా ఎన్నో క్రీడా కార్యక్రమాలుండేవి. కాని కాలం మారిపోయింది, ఈ ప్రాచీన వ్యవస్థలన్నీ క్రమంగా అంతరించిపోవడం ప్రారంభమయింది. ఈ ధోరణి కారణంగా దేశం మూడు, నాలుగు తరాలను కోల్పోయింది. ఫలితంగా దేశంలో క్రీడా వ్యవస్థలు పెరగలేదు, కొత్త క్రీడా వసతులు ఏర్పడలేదు. టివిల్లో వచ్చే వివిధ ప్రతిభా అన్వేషణ కార్యక్రమాలు వీక్షించినట్టయితే చిన్న పట్టణాలకు చెందిన ఎందరో బాలలను మీరు చూస్తారు. అలాగే మన దేశంలో దాగి ఉన్న ప్రతిభ ఎంతో ఉంది. చాలా మంది దాన్ని వెలికి తీసేందుకు ఆసక్తి, ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. క్రీడా ప్రపంచంలోని అలాంటి సామర్థ్యాలనువ వెలికి తీయడంలో సన్సద్ మహాకుంభ్ పెద్ద పాత్ర పోషిస్తుంది. నేడు వందలాది మంది బిజెపి ఎంపిలు ఇలాంటి క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో యువ క్రీడాకారులకు అవకాశం లభించడం అంటే దాని ప్రభావం ఎంతగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.  ఈ క్రీడాకారుల్లో చాలా మంది రాష్ర్ట, జాతీయ స్థాయిల్లో కూడా ఆడతారు. మీలో చాలా మంది ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి పతకాలు కూడా గెలిచి తెస్తారు.  అందుకే సన్సద్ ఖేల్  మహాకుంభ్  ను నేను భవిష్యత్తులో నిర్మించబోయే దివ్యభవనానికి బలమైన పునాదిగా నేను భావిస్తాను.

మిత్రులారా,

ఖేల్ మహాకుంభ్ వంటి కార్యక్రమాలతో పాటు చిన్న పట్టణాల్లో క్రీడా వసతుల నిర్మాణంపై కూడా దేశం ఆసక్తి ప్రదర్శిస్తోంది. గోరఖ్ పూర్ లోని ప్రాంతీయ క్రీడా స్టేడియం ఇందుకు చక్కని ఉదాహరణ. గోరఖ్ పూర్ చుట్టుపక్కల గల గ్రామీణ ప్రాంతాల్లో యువత కోసం 100కి పైగా క్రీడా మైదానాల నిర్మాణం జరిగింది. చౌరీ చౌరాలో మినీ గ్రామీణ స్టేడియం నిర్మిస్తున్నట్టు నాకు చెప్పారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద క్రీడా వసతుల నిర్మాణంతో పాటు క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంపై కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. నేడు దేశం సమ్యక్ దృక్పథంతో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది బడ్జెట్  లో ఇందుకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. 2014 సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు మూడు రెట్లు పెరిగాయి. నేడు దేశంలో పలు ఆధునిక స్టేడియంలు నిర్మాణంలో ఉన్నాయి. టాప్స్  వంటి పథకాల ద్వారా క్రీడాకారుల శిక్షణకు లక్షలాది రూపాయల సహాయం చేస్తున్నారు. ఖేలో ఇండియాతో పాటుగా ఫిట్ ఇండియా, యోగా కార్యక్రమాలు కూడా జోరందుకుంటున్నాయి. పోషకాహారం కోసం ముతక ధాన్యాల కోవలోకి వచ్చే చిరుధాన్యాలకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం. జొన్న, రాగులు వంటి ముతక ధాన్యాలు సూపర్ ఫుడ్స్  శ్రేణిలోకి వస్తాయి. అందుకే నేడు దేశం శ్రీ అన్న పేరిట ముతకధాన్యాలకు గుర్తింపు అందిస్తోంది. మీరందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని దేశం చేపట్టే కార్యక్రమాలకు నాయకత్వం వహించాలి. నేడు ఒలింపిక్స్, ఇతర భారీ టోర్నమెంట్లలో భారత క్రీడాకారులు పతకాలు గెలుచుకుంటున్న తరహాలోనే మీ వంటి క్రీడాకారులందరూ ఆ వారసత్వాన్ని ముందుకు నడుపుతారు.

మీరంతా విజయాలు సాధించి తద్వారా దేశానికి ప్రశంసలు తీసుకువస్తారని, దేశ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చి దిద్దుతారన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. మీ అందరికీ శుభాకాంక్షలతో ధన్యవాదాలు.

గమనిక : ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi