Quote“భవిష్యత్‌ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ‘నివారణ.. సన్నద్ధత.. ప్రతిస్పందన’కు మనం సదా సన్నద్ధులమై ఉండాలి”;
Quote“సంపూర్ణ ఆరోగ్యంపై సార్వజనీన ఆకాంక్షకు అంతర్జాతీయ యోగా దినోత్సవ విజయమే తార్కాణం”;
Quote“ప్రపంచవ్యాప్తంగా 2030కల్లా క్షయ వ్యాధి నిర్మూలనకు గడువు నిర్దేశించినప్పటికీ భారత్‌ ఎంతో ముందుగానే లక్ష్యం సాధించనుంది”;
Quote“మన ఆవిష్కరణలను ప్రజా శ్రేయస్సుకు వినియోగిద్దాం.. నిధుల నకలును నివారిస్తూ సాంకేతిక పరిజ్ఞాన సమాన లభ్యతకు కృషి చేద్దాం”

మహానుభావులారా,

మహిళలు మరియు సజ్జనులారా,

నమస్కారం.

భారతదేశం లోని 1.4 బిలియన్ ప్రజల తరుఫున మీకు భారతదేశం లోకి మరియు నా యొక్క స్వరాష్ట్రం అయిన గుజరాత్ లోకి ఎంతో ఆప్యాయం గా నేను ఆహ్వానిస్తున్నాను. నాతో పాటు గా మీకు స్వాగతం పలుకుతున్న వారిలో 2.4 మిలియన్ మంది డాక్టర్ లు, 3.5 మిలియన్ మంది నర్సు లు, 1.3 మిలియన్ మంది పారామెడిక్స్, 1.6 మిలియన్ మంది ఫార్మాసిస్టు లు మరియు భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ రంగం లో పాలుపంచుకొంటున్న మిలియన్ ల కొద్దీ ఇతరులు కూడా ఉన్నారు.

మిత్రులారా,

గాంధీ గారు ఆరోగ్యాన్ని ఎంతటి ముఖ్యమైన అంశం గా భావించారు అంటే ఆయన ఈ విషయం గురించి ‘‘ఆరోగ్యాని కి తాళం చెవి’’ శీర్షిక తో ఒక పుస్తకాన్ని వ్రాశారు. ఆరోగ్యం గా ఉండడం అంటే ఒక వ్యక్తి తన మనస్సు ను మరియు శరీరాన్ని సమతౌల్యమైంది గాను, సద్భావన తో కూడుకొన్నది గాను అట్టిపెట్టుకోవడమే అని ఆయన అన్నారు. నిజాని కి ఆరోగ్యం అనేది జీవనాని కి ఒక పునాది వంటిది అని చెప్పాలి. భారతదేశం లో మాకు సంస్కృత భాష లో ఒక సూక్తి ఉంది: అదే..

‘‘ఆరోగ్యం పరమం భాగ్యం, స్వాస్థ్యం సర్వార్థ సాధనం’’ అనేది.

ఈ మాటల కు, ‘‘ఆరోగ్యం అనేది అంతిమ సంపద; అంతే కాదు, మంచి ఆరోగ్యం తో ఎటువంటి కార్యాన్ని అయినా సాధించవచ్చును.’’ అని భావం.

మిత్రులారా,

మనం తీసుకొనే నిర్ణయాల లో కేంద్ర స్థానం లో ఆరోగ్యం ఉండాలి అనేటటువంటి అంశాన్ని కోవిడ్-19 మహమ్మారి మనకు గుర్తుకు తెచ్చింది. అది మందుల విషయం లో అయినా, టీకామందు అందజేత విషయంలో అయినా లేదా మా ప్రజల ను స్వదేశాని కి రప్పించడం లో అయినా.. అంతర్జాతీయ సహకారం యొక్క విలువ ను కూడా మనకు చాటిచెప్పింది. వేక్సీన్ మైత్రి కార్యక్రమం లో భాగం గా భారతదేశం వంద కు పైగా దేశాల కు 300 మిలియన్ వేక్సీన్ డోజుల ను అందించింది, ఈ వంద దేశాల లో గ్లోబల్ సౌథ్ దేశాలు అనేకం కూడా కలిసి ఉన్నాయి. ఈ కాలం లో ఆటుపోటుల కు తట్టుకొని నిలబడడం అనేది అతి పెద్ద పాఠాల లో ఒకటి గా తెర మీద కు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ లు సైతం ఆటుపోటుల ను తట్టుకొని నిలబడగలిగేవిగా రూపుదిద్దుకోవలసి ఉంది. మనం తదుపరి ఆరోగ్య రంగ అత్యవసర స్థితి కి ప్రతిస్పందించేటట్లు గాను, సన్నద్ధం గాను మరియు నివారణ ప్రధానం గాను మారి తీరాలి. ప్రస్తుత పరస్పర సంధాన యుక్త ప్రపంచం లో ఇది విశేషించి కీలకం అయినటువంటిది గా ఉంది. మహమ్మారి కాలం లో మనం గమనించిన విధం గా, ఆరోగ్యకరమైన అంశాలు ప్రపంచం లో ఏ మూలనైనా తల ఎత్తాయా అంటే గనక అవి అతి కొద్ది కాలం లో ప్రపంచం లోని ఇతర ప్రాంతాల ను ప్రభావితం చేయగలుగుతాయన్నమాట.

మిత్రులారా,

భారతదేశం లో మేం, ఒక సంపూర్ణమైనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాం. మేం ఆరోగ్య రంగం లో మౌలిక సదుపాయాల ను విస్తరిస్తున్నాం, సాంప్రదాయిక వైద్య వ్యవస్థల ను వ్యాప్తి లోకి తీసుకు వస్తున్నాం, మరి అలాగే అందరికి తక్కువ ఖర్చు తో ఆరోగ్య సంరక్షణ ను సమకూర్చుతున్నాం. యోగ అంతర్జాతీయ దినాన్ని ప్రపంచం అంతటా ఒక పండుగ వలే జరుపుకోవడం అనేది సమగ్ర ఆరోగ్య సంబంధి సార్వజనీన అభిలాష ను సూచిస్తున్నది. ఈ సంవత్సరాన్ని, అంటే 2023 ను చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం గా పాటించుకోవడం జరుగుతున్నది. మిలిట్స్ లేదా భారతదేశం లో శ్రీ అన్న గా ప్రచారం లో ఉన్న చిరుధాన్యాల వల్ల అనేకమైన ఆరోగ్య సంబంధి లాభాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యం మరియు వెల్ నెస్ లు ఆటు పోటుల ను తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యాన్ని అందరిలోను వృద్ధి చెందింప చేసుకోవడం లో తోడ్పడతాయి అని మేం నమ్ముతున్నాం. గుజరాత్ లోని జామ్ నగర్ లో డబ్ల్యుహెచ్ఒ గ్లోబల్ సెంటర్ ఫార్ ట్రెడిశనల్ మెడిసిన్ ను ఏర్పాటు చేయడం ఈ దిశ లో వేసినటువంటి ఒక ముఖ్యమైన అడుగు గా ఉంది. అంతేకాకుండా జి-20 ఆరోగ్య మంత్రుల సమావేశం తో పాటుగా డబ్ల్యుహెచ్ఒ గ్లోబల్ సమిట్ ఆన్ ట్రెడిశనల్ మెడిసిన్ ను నిర్వహించుకోవడమంటే తత్సంబంధి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం కోసం ప్రయాసల ను ముమ్మరం చేయడం వంటిదే అని చెప్పాలి. సాంప్రదాయిక మందుల కు సంబంధించి ఒక ప్రపంచ భండారాన్ని ఏర్పాటు చేసేందుకు మనం అంతా కలసి యత్నించాలి.

మిత్రులారా,

ఆరోగ్యం మరియు పర్యావరణం.. ఈ రెండు పరస్పరం ఒకదాని తో మరొకటి పెనవేసుకొన్నవే. స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన త్రాగునీరు, చాలినంత పోషణ విజ్ఞానం మరియు భద్రమైన ఆశ్రయం అనేవి ఆరోగ్యాని కి దోహదం చేసే ప్రధాన కారకాలు గా ఉన్నాయి. క్లయిమేట్ ఎండ్ హెల్థ్ ఇనిశియేటివ్ ను ప్రారంభించే దిశ గా చర్యల ను తీసుకొన్నందుకు గాను మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఏంటి-మైక్రోబియల్ రిజిస్టన్స్ (ఎఎమ్ఆర్) తాలూకు బెదరింపు ను నిలువరించడం కోసం చేపట్టిన చర్యలు కూడా ప్రశంసనీయమైనటువంటివే. ఎఎమ్ఆర్ అనేది ప్రపంచ సార్వజనిక ఆరోగ్యాని కి మరియు ఔషధ నిర్మాణపరమైన పురోగామి చర్యలన్నిటికి ఇంతవరకు ఎదురైనటువంటి ఒక తీవ్ర ముప్పు గా ఉంది. ‘‘వన్ హెల్థ్’’ ను ప్రాధాన్య అంశం గా జి-20 హెల్థ్ వర్కింగ్ గ్రూపు స్వీకరించినందుకు కూడాను నేను సంతోషిస్తున్నాను. మనుషుల కు, పశువుల కు, మొక్కల కు మరియు పర్యావరణాని కి, అంటే యావత్తు జీవావరణ వ్యవస్థ కు మంచి ఆరోగ్యం ప్రాప్తించాలనేదే మా ‘‘వన్ అర్థ్, వన్ హెల్థ్’’ యొక్క దృష్టి కోణం గా ఉంది. ఈ ఏకీకృత దృష్టికోణం ఏ ఒక్కరి ని వెనుకపట్టు న వదలి వేయరాదు అంటూ గాంధీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని తన లో ఇముడ్చుకొని ఉంది.

మిత్రులారా,

ఆరోగ్య రంగం లో అమలు పరచేటటువంటి కార్యక్రమాలు సఫలం కావడం లో సర్వ జన భాగస్వామ్యం ఒక కీలకమైన అంశం గా ఉంటుంది. మేం ఆచరించినటువంటి కుష్ఠువ్యాధి నిర్మూలన సంబంధి ప్రచార ఉద్యమం సఫలం కావడంలో తోడ్పడిన ప్రధానమైన కారణాల లో సర్వజన భాగస్వామ్యం ఒక కారణం గా ఉండింది. క్షయ వ్యాధి నిర్మూలన విషయం లో మేం అమలు పరుస్తున్న మహత్వాకాంక్ష యుక్త కార్యక్రమం సైతం సర్వజన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నది ‘ని-క్షయ మిత్ర’ లేదా ‘‘టిబి నిర్మూలన కు నడుం బిగించిన స్నేహితులు’’ గా ముందుకు రావలసింది గా దేశ ప్రజల కు మేం పిలుపును ఇచ్చాం. ఈ కార్యక్రమం లో భాగం గా సుమారు గా ఒక మిలియన్ మంది రోగుల ను పౌరులు దత్తత తీసుకొన్నారు. ఇక టిబి నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్త లక్ష్యం గా నిర్దేశించుకొన్న 2030 వ సంవత్సరాని కంటే ఎంతో ముందుగా ఆ పని ని పూర్తి చేసే దారి లో మేం ముందుకు సాగిపోతున్నాం.

మిత్రులారా,

మా యొక్క ప్రయాసల ను సమతావాది గాను మరియు అన్ని వర్గాల ను కలుపుకొనిపోయేటటువంటివి గాను మలచడం లో ఉపయోగపడేటటువంటి సాధనాలు గా డిజిటల్ సాల్యూశన్స్ మరియు నూతన ఆవిష్కరణ లు ఉన్నాయి. సుదూర ప్రాంతాల కు చెందిన రోగులు నాణ్యమైన సంరక్షణ ను టెలి-మెడిసిన్ ద్వారా అందుకో గలుగుతారు. భారతదేశం లో ఓ జాతీయ వేదిక అయినటువంటి ఇ-సంజీవని ( e-Sanjeevani ) ఇంతవరకు 140 మిలియన్ టెలి-హెల్థ్ కన్సల్టేశన్ లకు మార్గాన్ని సుగమం చేసింది. భారతదేశం రూపుదిద్దినటువంటి కోవిన్ (COWIN) ప్లాట్ ఫార్మ్ మానవ చరిత్ర లోనే అతి పెద్దది అయినటువంటి టీకాకరణ కార్యక్రమాని కి విజయవంతమైన రీతి లో తోడ్పడింది. ఆ ప్లాట్ ఫార్మ్ 2.4 బిలియన్ పైచిలుకు వేక్సీన్ డోజుల ను అందించడం లో ఉపయోగపడింది, అంతేకాకుండా, దాని ద్వారా ప్రపంచం లో గుర్తింపున కు అర్హమైన టీకాకరణ ధ్రువప్రతాలు వాస్తవ కాల ప్రాతిపదిక న అందుబాటు లోకి వచ్చాయి. గ్లోబల్ ఇనిశియేటివ్ ఆన్ డిజిటల్ హెల్థ్ వివిధ డిజిటల్ హెల్థ్ కార్యక్రమాల ను ఒకే వేదిక మీదకు తీసుకొని రాగలుగుతుంది. రండి, సర్వజన హితం కోసం మనం ఎటువంటి దాపరికాని కి తావు ఉండని విధం గా నూతన ఆవిష్కరణల ను తీసుకు వద్దాం. నిధుల ను సమకూర్చడం లో అవకతవకల ను మనం నివారించుదాం, రండి. సమతావాది సాంకేతిక విజ్ఞానానికి బాటను పరచుదాం రండి. ఆరోగ్య సంరక్షణ సంబంధి సేవల అందజేత లో అంతరాయాన్ని గ్లోబల్ సౌథ్ దేశాలు తొలగించేందుకు వీలు ను ఈ కార్యక్రమం కల్పిస్తుంది. అది సార్వజనిక ఆరోగ్య సేవ ల అందజేత ను సాకారం చేయాలన్న మన గమ్యం దిశ లో మనం మరొక అడుగు ను వేసేటట్టు చేస్తుంది.

మిత్రులారా,

మానవాళి కి సంబంధించిన ప్రాచీన భారతదేశం యొక్క ఆకాంక్ష ను చెప్పి, నా ప్రసంగాన్ని ముగిస్తాను. అది ఏమిటి అంటే ‘సర్వే భవన్తు సుఖిన: సర్వే సన్తు నిరామయ: ’ అనేదే. ఈ మాటల కు.. అందరు సంతోషం గా ఉందురు గాక. అందరు జబ్బుల బారి న పడకుండా ఉందురు గాక.. అని భావం. మీ చర్చోపచర్చల లో మీరు సఫలం అవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

మీకు ఇవే ధన్యావాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Blood boiling but national unity will steer Pahalgam response: PM Modi

Media Coverage

Blood boiling but national unity will steer Pahalgam response: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh
April 27, 2025
QuotePM announces ex-gratia from PMNRF

Prime Minister, Shri Narendra Modi, today condoled the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The Prime Minister's Office posted on X :

"Saddened by the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi"