శ్రేష్ఠులు, మహిళలు మరియు సజ్జనులారా, నమస్కారం.
మీ అందరినీ భారతదేశాని కి ఆహ్వానిస్తున్నాను. వ్యవసాయం అనేది మానవ నాగరకత లో కేంద్ర స్థానం లో ఉంది. ఈ కారణం గా, వ్యవసాయ మంత్రులు గా, పని ఆర్థిక వ్యవస్థ లో ఒక రంగాన్ని నిర్వహించడం ఒక్కటే కాక, మానవాళి యొక్క భవిష్యత్తు కోసం పాటుపడవలసినటువంటి ఒక పెద్ద బాధ్యత మీ మీద ఉంది. ప్రపంచం స్థాయి లో, వ్యవసాయం 2.5 బిలియన్ కు పైగా ప్రజల కు బ్రతుకుదెరువు ను అందిస్తున్నది. అంతగా అభివృద్ధి చెందని ప్రపంచ దేశాల (గ్లోబల్ సౌథ్) లో, వ్యవసాయం జిడిపి లో దాదాపు గా 30 శాతం తోడ్పాటు ను అందిస్తోంది; మరి 60 శాతాని కి పైచిలుకు ఉద్యోగాలు ఈ రంగం పైన ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రంగం అనేకమైన సవాళ్ళ ను ఎదుర్కొంటోంది. మహమ్మారి వల్ల ఏర్పడిన సరఫరా వ్యవస్థ తాలూకు అంతరాయాలు భౌగోళిక ఉద్రిక్తత ల మరియు రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం తో ఇంకా దిగజారిపోయాయి. జలవాయు పరివర్తన, వాతావరణం లో తీవ్ర ఒడుదొడుకుల ను తరచు గా కలిగిస్తున్నది. ఈ సవాళ్ళు గ్లోబల్ సౌథ్ దేశాల లో మరింత గా ఉంటున్నాయి.
మిత్రులారా,
ఈ విధం గా అన్నింటి కంటే మహత్వపూర్ణం అయినటువంటి రంగం లో భారతదేశం ఏమి చేస్తున్నదీ మీకు నేను వెల్లడి చేయదలచుకున్నాను. మేం ‘మళ్ళీ మూలాల్లోకి’ (బేక్ టు బేసిక్స్) , అలాగే ‘రాబోయే కాలం లోకి అడుగులు వేయడం (మార్చ్ టు ఫ్యూచర్).. ఈ రెండు విధానాల ను కలబోసినటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాం. మేం ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం తో పాటు సాంకేతిక విజ్ఞానం అండదండల తో సేద్యాని కి కూడాను ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. భారతదేశం నలుమూలలా రైతులు ప్రస్తుతం ప్రాకృతిక వ్యవసాయాన్ని అక్కున చేర్చుకొంటున్నారు. వారు కృత్రిమ ఎరువుల ను గాని, లేదా పురుగు మందుల ను గాని వాడడం లేదు. వారు భూ మాత కు నవ జవసత్వాల ను అందించడంపైన, భూమి స్వస్థత ను పరిరక్షించడం పైన, ‘ఒక్కొక్క నీటి చుక్క కు మరింత ఎక్కువ పంట’ ను ఉత్పత్తి చేయడం పైన మరియు సేంద్రియ ఎరువుల ను వినియోగించడం, ఇంకా సస్య రక్షణ పద్ధతుల వైపు మొగ్గు చూపడం పైన శ్రద్ధ ను తీసుకొంటున్నారు. అదే కాలం లో, మా రైతులు ఫలసాయాన్ని పెంపొందింప చేయడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివి గా ఉపయోగిస్తున్నారు. వారు వారి వ్యవసాయ క్షేత్రాల లో సౌర శక్తి ని ఉత్పత్తి చేసుకొంటూ, దానిని వినియోగం లోకి తీసుకు వస్తున్నారు. పంటల ఎంపిక లో గరిష్ఠ ప్రయోజనాల ను అందుకోవడం కోసం సాయిల్ హెల్థ్ కార్డుల ను ఉపయోగించుకొంటున్నారు. అంతేకాక, పౌష్టిక పదార్థాల ను పొలం లో చల్లేందుకు మరియు వారి యొక్క పంటల స్థితి ని పర్యవేక్షించేందుకు డ్రోన్ లను వినియోగిస్తున్నారు. ఈ ‘‘మిశ్రిత దృష్టికోణం’’ వ్యవసాయం లో ఎన్నో సమస్యల ను పరిష్కరించుకోవడాని కి అన్నింటి కంటే మంచి పద్ధతి గా ఉంది అని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
మీకు తెలుసును.. 2023 వ సంవత్సరాన్ని ‘చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం’ గా జరుపుకొంటున్నాం అన్న సంగతి. హైదరాబాద్ లో చిరుధాన్యాల తో వండిన అనేక భోజ్య పదార్థాల ను మీకు మీ ఆహారపు పళ్లెం లో వడ్డించే విషయాన్ని గమనించ గలరు. వాటిలో చాలా భోజ్య పదార్థాల ను చిరుధాన్యాల తో లేదా భారతదేశం లో మేం వాటి ని వ్యవహరించే ‘శ్రీ అన్నం’ తో తయారు చేసినవే ఉంటాయన్న మాట. ఈ మహా తినుబండారాలు సేవించడానికి ఆరోగ్యదాయకం గా ఉండడం ఒక్కటే కాకుండా అవి తక్కువ నీటి ని తీసుకొంటూ, తక్కువ ఎరువుల తో సరిపెట్టుకొంటూ, అధిక భాగం కీటక నాశనుల ను తట్టుకొంటూ మా రైతుల ఆదాయాల ను అధికం చేయడం లో సాయపడతాయి. వాస్తవానికి చిరుధాన్యాలు అనేవి ఒక క్రొత్త విషయం ఏమీ కాదు, వేల కొద్దీ సంవత్సరాల కు పూర్వం నుండే వాటి ని సాగు చేస్తున్నారు. అయితే, బజారులు మరియు విక్రయ విధానం మన ఎంపికల ను ప్రభావితం చేశాయి. అది కూడా ఎంతలా అంటే మనం సాంప్రదాయికం గా పండిస్తూ వచ్చిన ఆహార పంటల యొక్క విలువ ను మరచిపోయేటంత గా. రండి, ‘శ్రీ అన్నం’ చిరుధాన్యాల ను మనకు నచ్చిన ఆహారం గా స్వీకరించుదాం. మా స్వీయ నిబద్ధత లో భాగం గా, భారతదేశం ఒక ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మిలెట్ రిసర్చ్ ను ఏర్పాటు చేస్తున్నది. చిరుధాన్యాల లో అత్యుత్తమ అభ్యాసాల ను పరిశోధన ను మరియు సాంకేతికతల ను పరస్పరం వెల్లడి చేసుకోవడం కోసం ఈ సంస్థ ను ఒక ఉత్కృష్టత కేంద్రం గా తీర్చిదిద్దడం జరుగుతున్నది.
మిత్రులారా,
ప్రపంచం లో ఆహార భద్రత లక్ష్యాన్ని సాధించడం కోసం సామూహిక కార్యాచరణ ను ఏ విధం గా చేపట్టాలో అనే అంశం పై సంప్రదింపు లను జరపవలసిందంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చిరకాలం నిలచి ఉండేటటువంటి మరియు సమ్మిళిత ఖాద్య వ్యవస్థల ను నిర్మించడాని కి సన్నకారు రైతుల ప్రయోజనాల పై దృష్టి ని కేంద్రీకరించే పద్ధతుల ను మనం కనుగొని తీరాలి. ప్రపంచం లో ఎరువుల సరఫరా వ్యవస్థ ను బలోపేతం ఎలా చేయవచ్చో మనం తప్పక వెదకాలి. అదే కాలం లో, నేల లో సారం, పంట యొక్క చేవ మరియు దిగుబడి మెరుగైనవి గా ఉండేటట్లు గా తగిన వ్యావసాయిక అభ్యాసాల ను సైతం మనం ఆచరించవలసివుంది. పున:పోషణ ప్రధానమైనటువంటి వ్యవసాయం తాలూకు ప్రత్యామ్నాయ మార్గాల ను కనుగొనడాని కి మనకు అవసరమైన ప్రేరణ ను ప్రపంచం లోని వేరు వేరు ప్రాంతాల లో సాంప్రదాయిక అభ్యాసాలు అందించే అవకాశం ఉంది. నూతన ఆవిష్కరణ లు మరియు డిజటల్ టెక్నాలజీ ల ద్వారా మనం మన రైతుల కు సాధికారిత ను కల్పించవలసిన అవసరం ఉంది. అంతేకాదు, అంతగా అభివృద్ధి చెందనటువంటి దేశాల లో చిన్న రైతుల కోసం మరియు సన్నకారు రైతుల కోసం తక్కువ ఖర్చు కు అందుబాటు లోకి వచ్చే పరిష్కారాల ను సైతం మనం రూపొందించాలి. వ్యవసాయపరమైనటువంటి దుబారా ను మరియు ఆహార వ్యర్థాల దుర్వినియోగాన్ని తగ్గించవలసిన మరియు తక్షణ కర్తవ్యం కూడా ఉంది. చెత్త నుండి సంపద ను తయారు చేయడం పై పెట్టుబడుల ను కూడా పెట్టవలసివుంది.
మిత్రులారా,
‘ఒక ధరణి’ కి స్వస్థత ను ప్రసాదించడం, ‘ఒకే కుటుంబం’ లో సద్భావన ను నెలకొల్పడం, ‘ఒక భవిష్యత్తు’ కోసం ఆశ ను రేకెత్తించడం వంటివి వ్యవసాయ రంగం లో భారతదేశం యొక్క జి20 ప్రాధాన్యాల లో భాగం గా ఉన్నాయి. మీరు రెండు నిర్దిష్ట ఫలితాల సాధన కై శ్రమిస్తున్నారు అని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. అవి ఏమేమిటి అంటే వాటిలో ‘‘దక్కన్ హై లెవల్ ప్రిన్సిపల్స్ ఆన్ ఫూడ్ సెక్యూరిటీ ఎండ్ న్యూట్రిశన్’’; అలాగే చిరుధాన్యాలు, ఇంకా ఇతర తిండి గింజల కు సంబంధించి ‘‘మహర్షి’’ కార్యక్రమం అనేవే. ఈ రెండు కార్యక్రమాల కు అందించే సమర్థన సమ్మిళితమైనటువంటి, చిరకాలం మనుగడ లో ఉండేటటువంటి మరియు ఆటు పోటుల కు తట్టుకొని నిలబడగలిగేటటువంటి వ్యవసాయాని కి అండ ను ఇవ్వడమే అవుతుంది. మీ యొక్క చర్చోపచర్చలు సఫలం అవ్వాలి అని నేను కోరుకొంటున్నాను.
మీకు ధన్యవాదాలు.