మిత్రులారా, నమస్కారం.

చలికాలం బహుశా ఆలస్యం గా రావడమే కాకుండా మనల ను చాలా నెమ్మదిగా సమీపిస్తున్నది, అయితే రాజకీయ వేడిమి చాలా వేగం గా పెరుగుతూ ఉన్నది. నిన్నటి రోజున నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యాయి. మరి ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరం గానూ ఉన్నాయి.

సామాన్య మానవుడి శ్రేయం కోసం కట్టుబడిన వారందరి కీ మరియు దేశం యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు కు అంకితం అయినవారి కి, ప్రత్యేకించి అన్ని సమాజాల లో అన్ని వర్గాల వారి కి; ప్రతి ఒక్క గ్రామం, ఇంకా నగరం లో మహిళల కు; ప్రతి ఒక్క గ్రామం మరియు నగరాల లో అన్ని సామాజిక సమూహాల వరకు; రైతులు మొదలుకొని ప్రతి ఒక్క సముదాయం వరకు; ఇంకా నా దేశం లో పేద ప్రజల కు ఈ ఫలితాలు ప్రోత్సాహకరం గా ఉన్నాయి. ఈ నాలుగు ముఖ్యమైన కులాల కు సాధికారిత ను కల్పించాలి అనే సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి వారికి మరియు వారి యొక్క ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తు కు పూచీ పడే వారికి, మరి అలాగే నిర్దిష్ట ప్రణాళికల ను చివరి మజిలీ వరకు తీసుకు పోయేటటువంటి వారి కి బలమైన సమర్దన లభించింది. ప్రజల సంక్షేమం కోసం సుపరిపాలన మరియు నిరంతరాయమైనటువంటి సమర్దన ఉన్నట్లయితే కనుక ‘పాలకపక్ష- వ్యతిరేకత’ అనే పదం అర్థరహితం అవుతుంది. కొంత మంది దీనిని అధికార పక్ష సానుకూలత, సుపరిపాలన, పారదర్శకత్వం, దేశ విశాల హితం, లేదా సార్వజనిక సంక్షేమాని కి ఘనమైనటువంటి ప్రణాళికలు అని పేర్కొనవచ్చును, అయితే ఇది ఎటువంటి ఒక అనుభూతి అంటే దీనిని మనం నిరంతరం గా గమనించుకొంటూ వస్తున్నాం. మరి, ఈ రోజు న మనం అటువంటి అద్భుతమైన ప్రజాతీర్పు తరువాత, ఈ పార్లమెంటు తాలూకు క్రొత్త దేవాలయం లో సమావేశమవుతున్నాం.

 

పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించినప్పుడు కొద్ది కాలం పాటే సమావేశాలు సాగాయి, అయితే ఆ సమావేశాలు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం రూపుదాల్చింది. ఏమైనా ఈ సారి దీర్ఘకాలం పాటు ఈ భవనం లో పని చేసేందుకు ఒక అవకాశం దక్కుతుంది. ఇది ఒక నూతనమైన భవనం, ఈ కారణం గా ఏర్పాటుల లో కొన్ని లోటుపాటు లు ఉంటే ఉండవచ్చును. ఏమైనా, ఇది సాధారణం గా పని చేయడం ప్రారంభించినప్పుడు పార్లమెంటు సభ్యులు, సందర్శకులు మరియు ప్రసార మాధ్యాల సిబ్బంది ఈ లోటుపాటుల ను కూడా గమనించి, మరి వాటి విషయం లో తగిన జాగ్రతల ను తీసుకొనేందుకు వీలు ఉంది. గౌరవనీయులైన ఉప రాష్ట్రపతి మరియు మాన్య స్పీకర్ లు ఈ అంశాల విషయం లో పూర్తి గా జాగరూకులై ఉంటారన్న నమ్మకం నాలో ఉంది. మీ దృష్టి కి వచ్చిన చిన్న చిన్న అంశాలు ఏవైనా ఉంటే వాటి ని ప్రస్తావించండి అని నేను కూడా మీకు సూచిస్తున్నాను. ఈ అంశాల ను (కొత్త పార్లమెంట్ భవనం) పట్టి చూపించడం జరిగినప్పుడు అవసరాల కు అనుగుణం గా మార్పుల ను చేసుకోవలసి ఉంటుంది కూడాను.

దేశం వ్యతిరేక ఆలోచనల ను త్రోసిపుచ్చింది. సమావేశాలు ఆరంభం అయ్యే ప్రతి సారి ప్రతిపక్షాలకు చెందిన సహచరుల తో మా చర్చలు నిరంతరాయం గా సాగిస్తూ ఉంటాం. మా ప్రధాన జట్టు వారితో చర్చించి మరి ప్రతి ఒక్కరి సహకారం కోసం విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది. ఈ సారి కూడా ఈ రకమైన అన్ని ప్రక్రియల ను అనుసరించడం జరిగింది. మీ ద్వారా, మన పార్లమెంటు సభ్యులు అందరికి కూడాను నేను బాహాటంగా విన్నవించడం ఏమిటి అంటే అది ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చేటటువంటి ఒక ‘వికసిత్ భారత్’ యొక్క పునాది ని బలపరచడాని కి ఒక ముఖ్య వేదిక ఈ ప్రజాస్వామ్య దేవాలయం అనేదే.

 

పూర్తి స్థాయి లో సన్నద్ధం అవ్వాలి, సభ లో సమర్పించే ఎటువంటి బిల్లుల పైన అయినా క్షుణ్ణం గా చర్చించాలి, మరి ఉత్తమమైనటువంటి సూచల ను అందించాలి అని . గౌరవనీయ ఎంపీలు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా ఎందుకంటే, పార్లమెంటు సభ్యులు ఏదైనా సలహా ను ఇచ్చారంటే అందులో ఆచరణీయమైన అనుభవం తాలూకు మూలాలు ఉండి ఉంటాయి అన్న మాటే. అయితే, ఎటువంటి చర్చా జరగకపోతే దేశం ఆయా అంశాల తాలూకు లోటు ను ఎదుర్కొంటుంది, మరి ఈ కారణం గా నేను మరొక్క సారి (గంభీరమైనటువంటి చర్చల కు గాను సభ్యులు అందరికి) విన్నపాన్ని చేస్తున్నాను.

తాజా ఎన్నికల ఫలితాల ఆధారం గా, నేను ప్రతిపక్ష సహచరుల కు వారి ముందు ఒక సువర్ణావకాశం ఉంది అని చెప్పదలచుకొన్నాను. (అసెంబ్లీ ఎన్నికల లో) ఓటమి ని గురించిన నిరుత్సాహాన్ని ఈ సమావేశాల లో వెలిగక్కేందుకు ప్రణాళికల ను రచించుకోవడాని కి బదులుగా వారు ఈ ఓటమి నుండి పాఠాన్ని నేర్చుకొనే వ్యతిరేకత తాలూకు ఆలోచన ను విడచిపెట్టి ముందుకు సాగాలి అన్నదే. అదే జరిగితే వారి విషయం లో దేశ ప్రజల దృష్టి కోణం లో మార్పు చోటు చేసుకొంటుంది. వారి కి ఒక క్రొత్త తలుపు తెరుచుకొనేందుకు అవకాశం ఉంటుంది... మరి ప్రతిపక్షం లో ఉన్న వారు అయినప్పటికీ కూడా సానుకూలమైన ఆలోచనల తో ముందుకు రావలసింది గా వారికి ఒక మంచి సలహాల ను నేను ఇస్తున్నాను. రండి, మేం పది అడుగులు వేస్తే అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకొనేటప్పుడు పన్నెండు అడుగులు ముందుకు వేయండి.

ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉజ్వలం గా ఉంది; నిరాశ చెందవలసిన అగత్యం లేదు, కానీ దయచేసి ఓటమి తాలూకు ఆశాభావాన్ని సభ లో బయట పెట్టకండి. నైరాశ్యం ఉంటే ఉండవచ్చును, మీ యొక్క సహచరులు వారి బలాన్ని చాటడాని కి ఏదైనా చేయవలసి రావచ్చును. అయితే, కనీసం లో మటుకు ఈ ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిష్ఫలత కు వేదిక గా మార్చడం తగదు. నేను నా యొక్క సుదీర్ఘ అనుభవం ఆధారం గా ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను; మీ వైఖరి ని ఒకింత మార్చుకోండి; సంఘర్షణ తో కూడిన ధోరణి ని వదలిపెట్టండి; మరి దేశం యొక్క మేలుకై సకారాత్మకం గా తోడ్పాటు ను అందించండి. లోపాల ను గురించి చర్చించండి, కొన్ని అంశాల పట్ల ప్రస్తుతం దేశం లో పెరుగుతూ వస్తున్న పగ, ద్వేషం అనేవి అటువంటి కార్యాల రూపేణా ప్రేమ గా మారిపోయేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి, ఇక్కడ ఒక అవకాశం ఉంది, దీనిని చేజారిపోనివ్వకండి.

 

సభ లో మీ యొక్క సహకారం కోసం నేను విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాను. రాజకీయ పరమైనటువంటి ఒక దృష్టి కోణం నుండి చూస్తే, సానుకూలత తాలూకు సందేశాన్ని దేశాని కి అందించడం మీకు కూడాను మేలు చేస్తుంది అనే నేను చెప్పదలచుకొన్నాను. మీ యొక్క ప్రతిష్ఠ ద్వేషం తోను మరియు నకారాత్మకత తోను ముడిపడిందా అంటే గనక అది ప్రజాస్వామ్యాని కి మంచిది ఏమీ కాజాలదు. ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యం లో కీలకమైనటువంటిదిగా, విలువైనటువంటిది గా మరియు శక్తియుక్తమైనటువంటిది గా ఉంటుంది; మరి అది అంతే దక్షత తో సైతం కూడుకొని ఉండాలి. ప్రజాస్వామ్యం యొక్క శ్రేయం కోసం నేను మళ్ళీ మళ్ళీ ఈ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను.

ప్రస్తుతం దేశం అభివృద్ధి లక్ష్య సాధనకై ఎంతో కాలం పాటు వేచి ఉండాలి అని అనుకోవడం లేదు. సమాజం లో ప్రతి ఒక్క వర్గం లో మనం ముందంజ వేయవలసిన అవసరం ఉంది అనేటటువంటి భావోద్వేగమే నెలకొంది. ఈ భావోద్వేగాన్ని గౌరవిస్తూ, సభ ను ముందుకు నడిపించవలసింది గా మాననీయులైన ఎంపీలు అందరిని నేను కోరుతున్నాను. వారికి ఇది నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మీకు అందరికి మంచి జరగాలి అని ఆకాంక్షిస్తున్నాను.

మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"