“భారత్ మాతాకీ జై… భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై… భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
దయచేసి నాతో గళం కలపండి- జై జవాన్ ... జై కిసాన్! జై జవాన్ ... జై కిసాన్!
ఇప్పుడు మరో నినాదం ఇవ్వబోతున్నాను. నేను జై విజ్ఞాన్ (శాస్త్ర విజ్ఞానం) అంటాను.. మీరు జై అనుసంధాన్! (పరిశోధన) అనండి.
జై విజ్ఞాన్.. జై అనుసంధాన్!, జై విజ్ఞాన్.. జై అనుసంధాన్!, జై విజ్ఞాన్.. జై అనుసంధాన్!, జై జవాన్ ... జై కిసాన్!, జై జవాన్ ... జై కిసాన్!, జై జవాన్ ... జై కిసాన్! జై విజ్ఞాన్.. జై అనుసంధాన్!, జై విజ్ఞాన్.. జై అనుసంధాన్!, జై విజ్ఞాన్.. జై అనుసంధాన్!”
దేశ శాస్త్రవేత్తలు ఎంతో గొప్ప విజయం సాధించి, జాతికి అమూల్య కానుక ఇచ్చిన నేపథ్యంలో ఈ సుందర సూర్యోదయాన బెంగళూరులో ఇప్పుడు నా ముందు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇవాళ ఇక్కడ చూస్తున్న ఇదే దృశ్యం గ్రీస్ దేశంలోనూ నా కళ్లముందు కదలాడింది. అంతేకాదు… జోహన్నెస్‌బర్గ్ నగరంసహా ప్రపంచం నలుమూలలా ఇదే దృశ్యం. భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని నమ్మి, భవిష్యత్తును చూడగలిగే వారిలోనేగాక మానవాళి శ్రేయస్సుకు అంకితమైన ప్రతి ఒక్కరిలో అదే ఉత్సాహం.. ఉత్తేజం పెల్లుబుకుతున్నాయి. మీరంతా ఉదయాన్నే ఇక్కడికి రావడం చూసి, నాలోనూ అదే భావన కలుగుతోంది. మీరు విజయం సాధించిన వేళ నేను మాతృభూమికి దూరంగా మరో దేశంలో ఉన్నందున ఇక్కడికి రావాలన్న అభిలాష నన్నెంతో తొందరపెట్టింది. ఆ మేరకు శాస్త్రవేత్తలకు వందనం చేయడం కోసం తిరుగు ప్రయాణంలో బెంగళూరు నగరంలో దిగాలని నిర్ణయించుకున్నాను. ఎంతో దూరం నుంచి ప్రయాణం కాబట్టి నా రాక ఎంతోకొంత ఆలస్యం సహజం. కాబట్టే శాస్త్రవేత్తలకు వందనాలర్పించి వెంటనే ఢిల్లీ వెళ్లిపోతానని, ఈ కార్యక్రమం కోసం తెల్లవారుజామున హడావుడి పడవద్దని గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కోరాను. నేను అధికారికంగా వచ్చి ఉంటే, అధికార లాంఛనాలను అనుసరించవచ్చునని, ఇప్పుడు అవసరం లేదని అభ్యర్థించాను. నా మాట మన్నించి, సహకరించినందుకు వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను కలవడానికి నేను చాలా ఉత్సుకతతో ఉన్నాను. అందువల్ల ఇది నా ప్రసంగానికి తగిన సమయం కాదు. బెంగళూరు ప్రజలు ఇప్పటికీ ఆ మధుర క్షణాలను ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆస్వాదిస్తున్నారని నాకు అర్థమైంది. కాబట్టి, మీకందరికీ నా కృతజ్ఞతలు. ఈ ప్రభాతవేళ చిట్టిపొట్టి బాలలు కూడా ఇక్కడ కనిపిస్తుండటం నాలో ఉత్సాహం పెంచింది. ఈ భావిభారత పౌరులే రేపటి దేశ భవిష్యత్తుకు వెలుగు దివ్వెలు. చివరగా మరొక్కసారి నాతో గళం కలపండి.
భారత్ మాతా కీ… జై! భారత్ మాతా కీ… జై! భారత్ మాతా కీ… జై!, జై జవాన్-జై కిసాన్!, జై జవాన్-జై కిసాన్!, జై జవాన్-జై కిసాన్!
ఇప్పుడు… జై విజ్ఞాన్ - జై అనుసంధాన్!, జై విజ్ఞాన్ - జై అనుసంధాన్!, జై విజ్ఞాన్ - జై అనుసంధాన్!, జై విజ్ఞాన్ - జై అనుసంధాన్!, జై విజ్ఞాన్ - జై అనుసంధాన్!
మిత్రులారా, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.