Quoteపెట్టుబడులు, వ్యాపార అవకాశాలకు కేంద్రంగా ఒడిశా రాష్ట్ర అపారమైన సామర్థ్యాన్ని ఈ సదస్సు ప్రదర్శిస్తుంది: ప్రధాన మంత్రి
Quoteదేశాభివృద్ధికి తూర్పు భారతదేశం చోదక శక్తి అయితే, ఇందులో ఒడిశా పాత్ర ఎంతో కీలకం: ప్రధాని
Quoteకోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేడు భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది: ప్రధాని
Quoteఒడిశా ముద్ర ప్రత్యేకం... నవ భారతదేశ ఆశావాదానికి, సహజత్వానికి ప్రతీక.... ఒడిశా అవకాశాలకు కేంద్రం
Quoteఎల్లప్పుడూ అత్యుత్తమతను కనబరచడం ఇక్కడి ప్రజల అభిరుచి: ప్రధానమంత్రి
Quoteహరిత భవిత, హరిత సాంకేతికతపై దృష్టి పెట్టిన భారత్: ప్రధానమంత్రి
Quote21వ శతాబ్దపు భారతదేశానికి ఇది అనుసంధానిత మౌలిక సదుపాయాలు, బహుళ విధ కనెక్టివిటీతో ముడిపడిన శకం: ప్రధాన మంత్రి
Quoteఒడిశాలో పర్యాటక రంగానికి అపార అవకాశాలున్నాయి: ప్రధాని

జై జగన్నాథ్‌!

ఒడిశా రాష్ట్ర గవర్నర్‌ శ్రీ హరిబాబు, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ మోహన్‌ చరణ్‌ మాఝీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, ఒడిశా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ పారిశ్రామిక-వాణిజ్యవేత్తలు, దేశవిదేశాల పెట్టుబడిదారులు, ఈ కార్యక్రమానికి హాజరైన ఒడిశా సోదరసోదరీమణులారా!

మిత్రులారా!

   ఈ జనవరిలో... అంటే-2025 ఆరంభంలో నేను ఒడిశా పర్యటనకు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు కొన్ని రోజుల కిందట ఇక్కడ ప్రవాసి భారతీయ దినోత్సవానికి హాజరయ్యాను. ఇవాళ ‘ఉత్కర్ష్‌ ఒడిశా’ సదస్సులో పాల్గొనేందుకు వచ్చాను. ఈ రాష్ట్రంలో నిర్వహించి అతిపెద్ద వాణిజ్య శిఖరాగ్ర సదస్సు ఇదేనని నాకు తెలిసింది. మునుపటితో పోలిస్తే ఇందులో పాల్గొనే  పెట్టుబడిదారుల సంఖ్య ఐదారు రెట్లు అధికం. ఈ అద్భుత కార్యక్రమానికి ఆతిథ్యమిస్తున్న రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలుపుతూ, మీకందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను.

మిత్రులారా!

   తూర్పు భారతాన్ని దేశాభివృద్ధికి సారథ్యం వహించేదిగా నేను పరిగణిస్తాను. ఇలాంటి కీలక పాత్ర పోషించే ఈ ప్రాంతంలోని రాష్ట్రాల్లో ఒడిశా ప్రధానమైనది. ప్రపంచ ప్రగతిలో భారత్‌ ప్రధాన భాగస్వామిగా ఉన్నపుడు అందులో తూర్పు భారతం గణనీయమని చరిత్ర సాక్ష్యమిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రాలు, ఓడరేవులు, వాణిజ్య కూడళ్లు చాలానే ఉన్నాయి. అలాగే వాటిలో రాష్ట్రానికి ప్రధాన వాటా కూడా ఉంది. ఆగ్నేయాసియా స్థాయిలో ఒకనాడు ఒడిశా కీలక వాణిజ్య కూడలిగా ఉండేది. ఇక్కడి ప్రాచీన ఓడరేవులు ఒక విధంగా  భారత ప్రవేశ ద్వారాలుగా ఉండేవి. ఒడిశాలో నేటికీ ప్రతి సంవత్సరం ‘బాలి జాత్ర’ (బాలి యాత్ర) పేరిట వేడుకలు నిర్వహించడం ఇందుకు తార్కాణం. ఇటీవల భారత్‌ సందర్శించిన ఇండోనేషియా అధ్యక్షుడు- ఒడిశా బహుశా తన రక్తంలో ఉందేమోనని వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం.

|

మిత్రులారా!

   ఆగ్నేయాసియాతో తన అనుసంధాన వారసత్వంపై ఒడిశా గర్విస్తోంది. ఈ మేరకు ప్రస్తుత 21వ శతాబ్దంలో సదరు అద్భుత వారసత్వ పునరుద్ధరణకు కృషి చేస్తోంది. ఇటీవల సింగపూర్‌

అధ్యక్షుడు ఒడిశాలో పర్యటించినపుడు ఈ రాష్ట్రంతో సంబంధాలపై ఆసక్తి చూపారు. అలాగే ఒడిశాతో వాణిజ్యం, సంప్రదాయక సంబంధాల బలోపేతం కోసం ఆసియాన్ దేశాలు కూడా ఎదురుచూస్తున్నాయి. భారత స్వాతంత్ర్యానంతరం ఎన్నడూలేని రీతిలో నేడు ఈ ప్రాంతంలో అనేక అవకాశాలకు బాటలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడీ కార్యక్రమానికి హాజరైన ప్రతి పెట్టుబడిదారునికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి చెప్పిన అంశాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నాను. అదేమిటంటే- మీకందరికీ ఇదే తగిన  సమయం... ఇంతకు మించిన తరుణం మళ్లీ రాదు. ఒడిశా పురోగమనంలో మీ పెట్టుబడులు మిమ్మల్ని కూడా సరికొత్త, సమున్నత విజయ శిఖరాలకు చేరుస్తాయి... ఇది మోదీ స్వయంగా ఇస్తున్న హామీ.

మిత్రులారా!

   భారత్‌ ఇవాళ కోట్లాది ప్రజల ఆకాంక్షల ఆధారంగా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఇది కృత్రిమ మేధ (ఎఐ) యుగం... దీనిపై విస్తృత చర్చ సాగుతోంది. అయితే, భారత్‌ విషయంలో ఇది కేవలం ‘ఎఐ’ కాదు- ఇదే మన ఆకాంక్ష... ఇదే మన బలం. ప్రజల అవసరాలు తీరుతున్నపుడు కొత్త ఆకాంక్షలు పుడుతుంటాయి. గత దశాబ్దంలో కోట్లాది ప్రజలకు సాధికారత కల్పించడం వల్ల కలుగుతున్న ప్రయోజనాలను దేశం నేడు ప్రత్యక్షంగా చూస్తోంది. కాబట్టి అలాంటి ఆకాంక్షలకు ఒడిశా కూడా అతీతమేమీ కాదు. ఒడిశా సామర్థ్యం అపారం.. ఈ రాష్ట్రం ఆశావాదానికి, నవ భారత్‌ వాస్తవికతకు ప్రతిబింబం. ఒడిశాలో అవకాశాలు అపారం... అలాగే వాటి సద్వినియోగంతో ప్రతిభను చాటుకోవాలనే యువత తాపత్రయానికీ కొదవ లేదు. ఒడిశా నుంచి గుజరాత్‌ వచ్చి పనిచేస్తున్న రాష్ట్రవాసుల నైపుణ్యం, కఠోర శ్రమ, నిజాయితీలకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒడిశాలో కొత్త అవకాశాల సృష్టితో రాష్ట్రం త్వరలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రగతి శిఖరాలు అధిరోహించగలదని నా ప్రగాఢ విశ్వాసం. తదనుగుణంగా రాష్ట్ర ప్రగతి రథాన్ని పరుగు పెట్టించడంలో ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ బృందం నిమగ్నం కావడం నాకెంతో సంతోషదాయకం. ఆహార తయారీ, పెట్రోరసాయనాలు, ఓడరేవుల చోదక అభివృద్ధి, మత్స్య, సమాచార సాంకేతిక, విద్యా-సాంకేతిక, జౌళి, పర్యాటకం, గనుల తవ్వకం, పరిశుభ్ర ఇంధనం తదితర పరిశ్రమలన్నిటా భారత్‌లోని ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటిగా ఒడిశా దూసుకెళ్తోంది.

   ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే దిశగా భారత్‌ ఇప్పుడు శరవేగంతో దూసుకెళ్తోంది. కాబట్టి, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనే కీలక మలుపు మరెంతో దూరం లేదు. గడచిన దశాబ్దంలో, తయారీ రంగంలో కూడా భారతదేశం బలం పుంజుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణకు రెండు ప్రధాన స్తంభాలున్నాయి. ఒకటి... మన వినూత్న సేవా రంగం, మరొకటి... నాణ్యమైన భారత ఉత్పత్తులు. దేశం వేగంగా పురోగమించడం అన్నది ఒక్క ముడి పదార్థాల ఎగుమతిపై ఆధారపడిన అంశం కాదు. అందుకే, సంబంధిత ఆవరణం మొత్తాన్నీ మేం సమూల రీతిలో మారుస్తూ సరికొత్త దృక్పథంతో కృషి చేస్తున్నాం. మన దేశం నుంచి ఖనిజాల వెలికితీత, ఏదో ఒక దేశానికి ఎగుమతి, అక్కడ విలువ జోడింపుతో కొత్త ఉత్పత్తి తయారీ, ఆపై భారత మార్కెట్‌లో దాని ప్రవేశం వంటి గానుగెద్దు ధోరణి మోదీకి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అందుకే భారత్‌ నేడు ఆ బాటను వీడి, నవ్యపథంలో ప్రవేశించింది. అదేవిధంగా ఇక్కడి సముద్ర సంపదను వెలికితీసి, ప్రపంచంలో ఎక్కడో మరో దేశంలో ప్రాసెస్ చేసి తిరిగి మన మార్కట్లో విక్రయించే విధానం ఇకపై భారత్‌కు ఆమోదయోగం కాదు. అందుకే ఒడిశాలోగల వనరుల  సంబంధిత పరిశ్రమలను ఇక్కడే ఏర్పాటు చేయడం లక్ష్యంగా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ స్వప్న సాకారం దిశగా ఇప్పుడు ‘ఉత్కర్ష్ ఒడిశా’ సదస్సు ఒక మాధ్యమం కానుంది.

మిత్రులారా!

   ప్రపంచం ఇప్పుడు సుస్థిర జీవనశైలి గురించి చర్చిస్తూ హరిత భవితవైపు అడుగులు వేస్తోంది. అందుకు తగిన ఉద్యోగావకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి. కాలానుగుణ అవసరాలు, డిమాండ్లకు తగినట్లు మనల్ని మనం మార్చుకోక తప్పదు. తదనుగుణంగా మనం మారాలి కాబట్టి- హరిత భవిష్యత్తు, సాంకేతికతలపై భారత్‌నిశితంగా దృష్టి సారిస్తోంది. ఆ మేరకు సౌర, పవన, జల, గ్రీన్ హైడ్రోజన్ వంటివి వికసిత భారత్‌ ఇంధన భద్రతను సాధికారం చేయగలవు. ఒడిశాలో ఇందుకు అనేక అవకాశాలున్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్, సౌర విద్యుత్ మిషన్‌ను మేం ప్రారంభించాం. ఒడిశాలోనూ పునరుత్పాదక ఇంధన సంబంధిత పరిశ్రమను ప్రోత్సహించడానికి పెద్ద విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు, హైడ్రోజన్ శక్తి ఉత్పత్తికి అనేక చర్యలు చేపడుతున్నారు.

|

మిత్రులారా!

   ఒడిశాలో గ్రీన్ ఎనర్జీతోపాటు పెట్రోకెమికల్ రంగాల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నారు. పారాదీప్, గోపాల్‌పూర్‌లలో ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, పెట్టుబడికి అనువైన ప్రదేశాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ రంగాల్లోనూ పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయి. ఒడిశాలోని వివిధ ప్రాంతాల సామర్థ్యం ప్రాతిపదికగా సత్వర నిర్ణయాలతో కొత్త వాతావరణాన్ని కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి నా అభినందనలు.

మిత్రులారా!

   ఈ 21వ శతాబ్దపు భారతదేశంలో ఇది అనుసంధాన మౌలిక సదుపాయాల కల్పన శకం. ముఖ్యంగా బహుళ-రవాణా సాధాన సంధానం. ఈ మేరకు ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన పరిమాణం, వేగం భారత్‌ను ప్రధాన పెట్టుబడుల గమ్యంగా మారుస్తున్నాయి. తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలు ప్రత్యేక సరకు రవాణా కారిడార్లతో సంధానం అవుతున్నాయి. అన్నివైపులా భూతలం కనిపించే దేశంలోని అనేక ప్రాంతాలూ ఇవాళ సముద్రంతో సంధానం కాగలుగుతున్నాయి. దేశంలో అనేకానేక పారిశ్రామిక నగరాలు పరిశ్రమల తక్షణ స్థాపనకు అనువుగా నిర్మితమవుతున్నాయి. అందులో భాగంగా ఒడిశాలోనూ ఇలాంటి అవకాశాలు మెరుగవుతున్నాయి. రైల్వేలు, జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ సంబంధిత రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్రంలోని పరిశ్రమలకు రవాణా వ్యయం తగ్గింపు దిశగా ప్రభుత్వం ఓడరేవులను పారిశ్రామిక సముదాయాలతో అనుసంధానిస్తోంది. పాత ఓడరేవుల విస్తరణ సహా కొత్తవి నిర్మితమవుతున్నాయి. తద్వారా నీలి ఆర్థిక వ్యవస్థ పరంగా ఒడిశా దేశంలోని అగ్ర రాష్ట్రాల జాబితాలోకి చేరనుంది.

|

మిత్రులారా!

   ప్రభుత్వం ఇన్నివిధాలుగా కృషి చేస్తున్న నేపథ్యంలో మీ పాత్ర పోషణపై కొన్ని అభ్యర్థనలను మీ ముందుంచుతున్నాను. వేగంగా మారుతున్న ప్రపంచంలో అంతర్జాతీయ సరఫరా శ్రేణికిగల సవాళ్లను మీరు గమనిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ చెల్లాచెదరుగాగల, దిగుమతి ఆధారిత సరఫరా శ్రేణులపై భారత్‌ అంతగా ఆధారపడదు. అంటే- అంతర్జాతీయ ఒడుదొడుకుల ప్రభావం పడని రీతిలో మనం దేశంలోనే బలమైన సరఫరా-విలువ శ్రేణులను సృష్టించాలి. ఇందులో ప్రభుత్వంతోపాటు పారిశ్రామిక రంగంపైనా పెద్ద బాధ్యత ఉంది. అందుకే మీరు ఏ పరిశ్రమను నడిపేవారైనా దానితో అనుబంధంగల ‘ఎంఎస్‌ఎంఇ’లకు మద్దతోపాటు చేయూతనివ్వండి. అలాగే వీలైనన్ని తరుణ అంకుర సంస్థలకూ మద్దతివ్వాల్సి ఉంటుంది.

మిత్రులారా!

   ఆధునిక సాంకేతి పరిజ్ఞానం తోడు లేకుండా పరిశ్రమలేవీ వృద్ధి చెందవు. కాబట్టి, పరిశోధన, ఆవిష్కరణలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. అందుకే దేశంలో అత్యంత శక్తిమంతమైన పరిశోధనావరణ వ్యవస్థను ప్రభుత్వం సృష్టిస్తోంది. దీనికోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ఇంటర్న్‌షిప్, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ అంశాల్లోనూ పారిశ్రామిక రంగం ముందడుగు వేయాలని, ప్రభుత్వంతో చేయి కలిపికృషి చేయాలని అందరూ ఆశిస్తున్నారు. భారత పరిశోధనావరణం, నిపుణ యువశక్తి, ఎంత భారీగా-బలంగా ఉంటే అంత అధికంగా పారిశ్రామిక రంగం వాటినుంచి ప్రత్యక్ష ప్రయోజనం పొందుతాయి. కాబట్టి రాష్ట్ర పారిశ్రామికవేత్తలు, ఒడిశా ప్రభుత్వ యంత్రాంగం కలసికట్టుగా ఒక ఆధునిక పర్యావరణ వ్యవస్థను సృష్టించాలని అభ్యర్థిస్తున్నాను. ఒడిశా ఆకాంక్షలపై ఏకాగ్రతగల వాతావరణం ఇక్కడి యువతకు కొత్త అవకాశాలను చేరువ చేస్తుంది. దీంతో ఒడిశా యువత ఇక్కడే మరిన్ని ఉద్యోగావశాలు పొందుతారు, ఒడిశా అభివృద్ధి చెందడంతోపాటు సాధికారత సాధించి, ప్రగతి పథంలో దూసుకుపోగలదు.

మిత్రులారా!

   మీరందరూ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ దేశదేశాల ప్రజలతో మమేకం అవుతుంటారు. ఆ క్రమంలో భారత్‌ గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి ఆయా దేశాల్లో వ్యక్తం కావడం మీరు గమనించే ఉంటారు. ఆ మేరకు మన దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఒడిశా ఎంతో అనువైన గమ్యం. వేల ఏళ్ల చరిత్ర, వారసత్వం, విశ్వాసం-ఆధ్యాత్మికత, దట్టమైన అడవులు, పర్వతాలు, సముద్రం ఒకటనేమిటి... అన్నీ ఒకేచోట సాక్షాత్కరిస్తాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి-వారసత్వానికి ఓ అద్భుత ఉదాహరణ. అందుకే, ఒడిశాలో జి-20 సాంస్కృతిక కార్యక్రమాలను మేము నిర్వహించాం. కోణార్క్ సూర్య దేవాలయం చక్రాన్ని జి-20 ప్రధాన కార్యక్రమంలో అంతర్భాగం చేశాం. ఇప్పుడు ‘ఉత్కర్ష్ ఒడిశా’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని కూడా మనం అంచనా వేయాలి. రాష్ట్రానికి 500 కిలోమీటర్లకుపైగా తీరప్రాంతం ఉంది. అంతేగాక 33 శాతానికిపైగా అటవీ విస్తీర్ణం, తదనుగుణ పర్యావరణ పర్యాటక అపార అవకాశాలు, సాహస పర్యాటకం కూడా మీ కోసం ఎదురుచూస్తున్నాయి. భారత్‌ను ‘వివాహ గమ్యం’గా ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఆరోగ్య పునఃప్రాప్తికి భారత్‌ ఓ తారకమంత్రం. ఈ దిశగా ఒడిశాలో ప్రకృతి, ప్రాదేశిక సహజ సౌందర్యం ఎంతగానో దోహదం చేస్తాయి.

|

మిత్రులారా!

   కాన్ఫరెన్స్ పర్యాటకం పరంగానూ భారత్‌ ఎంతో సామర్థం సంతరించుకుంది. ఢిల్లీలోని భారత్ మండపం, యశోభూమి వంటి వేదికలు ఇందుకు ప్రధాన ఆతిథ్య కూడళ్లుగా రూపొందాయి. అదేవిధంగా భువనేశ్వర్ కూడా అటువంటి అత్యుత్తమ వేదికగా రూపొంది, ప్రయోజనం పొందవచ్చు. దీనికి సంబంధించిన మరో కొత్త రంగం సంగీత విభావరి ఆర్థిక వ్యవస్థ. సంగీతం-నృత్యం, కథా శ్రవణం వంటి గొప్ప వారసత్వం మన దేశానికి సొంతం. ఇటువంటి మాధ్యమాలను నేడు యువత విరివిగా వినియోగిస్తున్న నేపథ్యంలో కచేరీ ఆర్థిక వ్యవస్థ వృద్ధికీ అనేక అవకాశాలున్నాయి. గత 10 సంవత్సరాలలో ప్రత్యక్ష సంగీత, నృత్య కార్యక్రమాల ధోరణి, డిమాండ్ రెండూ పెరిగాయన్నది మన కళ్లముందున్న వాస్తవం. కొన్ని రోజులుగా, ముంబై, అహ్మదాబాద్‌ నగరాల్లో ‘కోల్డ్‌ ప్లే కచేరీ’ సంబంధిత అద్భుత చిత్రాలను మీరు చూసే ఉంటారు. ప్రత్యక్ష సంగీత విభావరులకు ఈ దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయనడానికి ఇదొక ఉదాహరణ. ప్రపంచంలోని గొప్ప, ప్రసిద్ధ కళాకారులు కూడా భారత్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. కాబట్టి, అటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా పర్యాటకాన్ని పెంచుతుంది. అలాగే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల సృష్టికీ దోహదం చేస్తుంది. కచేరీ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని నేను రాష్ట్రాలకు, ప్రైవేట్ రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కార్యక్రమ నిర్వహణ అయినా, కళాకారుల సంరక్షణ అయినా, భద్రత తదితర ఏర్పాట్లైనా... అన్నింటా కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయి.

మిత్రులారా!

   వచ్చే నెలలో “వేవ్స్‌” పేరిట తొలి ప్రపంచ ఆడియో విజువల్ సమ్మిట్ను భారత్‌లో నిర్వహిస్తున్నారు. ఇదొక భారీ కార్యక్రమం కావడంతో భారత కళాకారుల, నిపుణుల సృజనాత్మక శక్తికి కొత్త గుర్తింపునిస్తుంది. రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా లభించే ఆదాయంతోపాటు ప్రజల్లో పెరిగే అవగాహన కూడా ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి తోడ్పడతాయి. ఇందుకు ఒడిశాలోనూ అనేక అవకాశాలున్నాయి.

మిత్రులారా!

   వికసిత భారత్‌ నిర్మాణంలో ఒడిశా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అందులో భాగంగా సుసంపన్న ఒడిశా నిర్మాణంపై ప్రజలు ప్రతినబూనారు. వారి సంకల్ప సాధనకు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా మద్దతిస్తోంది. ఒడిశాపై నాకెంతటి అభిమానమో మీకందరికీ బాగా తెలుసు. ప్రధానమంత్రి హోదాలో దాదాపు 30 సార్లు ఈ రాష్ట్రానికి వచ్చాను. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్నేలిన ప్రధాన మంత్రులు అందరికన్నా నేనే ఒడిశాను ఎక్కువ సార్లు సందర్శించాను. నా మీద మీరు చూపించే ప్రేమాభిమానాలే నన్ను పదేపదే ఇక్కడికి రప్పిస్తాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాలను ఇప్పటికే నేను సందర్శించాను, ఒడిశా సామర్థ్యంపై నాకు అపార నమ్మకం ఉంది. ఇక్కడి ప్రజలపై ఎనలేని విశ్వాసం ఉంది. ఇక మీ అందరి పెట్టుబడులతో మీ వాణిజ్య, వ్యాపారాలు ఘనంగా సాగి, ఒడిశా ప్రగతిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చగలవని విశ్వసిస్తున్నాను.

   నేటి అద్భుత కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించడంపై ఒడిశా ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నా అభినందనలు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఒడిశాలో అవకాశాలను అన్వేషించే గొప్ప వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా పూర్తిస్థాయిలో సహయ సహకారాలు అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. మరోసారి మీకందరికీ నా శుభాకాంక్షలు.

అనేకానేక ధన్యవాదాలు!

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
From Digital India to Digital Classrooms-How Bharat’s Internet Revolution is Reaching its Young Learners

Media Coverage

From Digital India to Digital Classrooms-How Bharat’s Internet Revolution is Reaching its Young Learners
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of Shri Sukhdev Singh Dhindsa Ji
May 28, 2025

Prime Minister, Shri Narendra Modi, has condoled passing of Shri Sukhdev Singh Dhindsa Ji, today. "He was a towering statesman with great wisdom and an unwavering commitment to public service. He always had a grassroots level connect with Punjab, its people and culture", Shri Modi stated.

The Prime Minister posted on X :

"The passing of Shri Sukhdev Singh Dhindsa Ji is a major loss to our nation. He was a towering statesman with great wisdom and an unwavering commitment to public service. He always had a grassroots level connect with Punjab, its people and culture. He championed issues like rural development, social justice and all-round growth. He always worked to make our social fabric even stronger. I had the privilege of knowing him for many years, interacting closely on various issues. My thoughts are with his family and supporters in this sad hour."