Quote“పరిశ్రమ రూపురేఖలు మార్చే పురోగతిని సాధిస్తోన్న భారత సెమీకండక్టర్ రంగం భారీ మార్పుకు చేరువలో ఉంది”
Quote“నేటి భారతదేశం ప్రపంచానికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. ఇతర దేశాల్లో పరిస్థితులు బాలేనప్పుడు భారత్‌ను ఆశ్రయించొచ్చు”
Quote"భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రత్యేక డయోడ్లు ఉన్నాయి, ఇక్కడ శక్తి రెండు దిశలలో ప్రవహిస్తుంది"
Quote“ప్రస్తుత సంస్కరణవాద ప్రభుత్వం, దేశంలో పెరుగుతున్న ఉత్పాదక రంగం, సాంకేతిక ధోరణులపై అవగాహన ఉన్న బలమైన మార్కెట్ అనే త్రిముఖ శక్తులను భారత్ కలిగి ఉంది”
Quote"దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వారికి సేవలు అందేలా చూడటంలో ఈ చిన్న చిప్ పెద్ద పనులు చేస్తోంది"
Quote“ప్రపంచంలోని ప్రతి పరికరంలోనూ దేశంలో తయారైన చిప్ ఉండాలనేది మన కల”
Quote“ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమను ముందుకు నడిపించడంలో భారత్ ప్రధాన పాత్ర పోషించనుంది”
Quote“100 శాతం ఎలక్ట్రానిక్ తయారీ భారత్‌లోనే జరగాలన్నదే మా లక్ష్యం”
Quote"మొబైల్ తయారీ, ఎలక్ట్రానిక్స్ లేదా సెమీకండక్టర్లు ఏదైనా సరే, మా దృష్టి స్పష్టంగా ఉంది. సంక్షోభ సమయాల్లో ఆపకుండా, విరామం కలగకుండా ముందుకు సాగే ప్రపంచాన్ని నిర్మించా

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాద, ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమతో సంబంధం ఉన్న దిగ్గజాలు, విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకి చెందిన భాగస్వాములు, ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా ! అందరికీ నమస్కారం!

 

|

సెమీతో సంబంధం ఉన్న మిత్రులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమకు సంబంధించిన ఈ బృహత్తర కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన ఎనిమిదో దేశం భారత్. భారత్ లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇదే సరైన సమయం అని నేను చెప్పగలను. మీరు సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఉన్నారు. 21వ శతాబ్దపు భారత్ లో చిప్స్ తయారీ ఎన్నటికీ తగ్గవు! అంతే కాదు, నేటి భారత్ ప్రపంచానికి భరోసా ఇస్తుంది - చిప్స్ తగ్గినప్పుడల్లా మీరు భారతదేశంపై ఆధారపడవచ్చు!

 

|

మిత్రులారా,

సెమీకండక్టర్ ప్రపంచంతో సంబంధం ఉన్న మీకు తప్పనిసరిగా డయోడ్లతో అనుబంధం కలిగి ఉంటుంది. మీకు తెలిసినట్లుగా, ఒక డయోడ్ లో శక్తి ఒక దిశలో మాత్రమే ప్రవహిస్తుంది. కానీ భారత్ సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రత్యేక డయోడ్లను ఉపయోగిస్తారు. ఇక్కడ శక్తి రెండు దిశలలో ప్రవహిస్తుంది. ఎలా అని మీరు ఆశ్చర్యపోవచ్చు? మీరు పెట్టుబడి పెట్టి విలువను సృష్టించడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదే సమయంలో, ప్రభుత్వం మీకు స్థిరమైన విధానాలను, వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తుంది.. సెమీకండక్టర్ పరిశ్రమ 'ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్'తో ముడిపడి ఉంది. భారత్ మీకు 'ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్' (సమీకృత విస్తారిత వ్యవస్థ)ను కూడా అందిస్తుంది. ఈ దేశ డిజైనర్ల అపారమైన ప్రతిభ గురించి మీకు బాగా తెలుసు. డిజైనింగ్ ప్రపంచంలో 20 శాతం ప్రతిభను కలిగి ఉన్న భారత్ నిరంతరం విస్తరిస్తోంది. 85,000 మంది టెక్నీషియన్లు (సాంకేతిక నిపుణులు), ఇంజినీర్లు, ఆర్ అండ్ డీ నిపుణులతో సెమీకండక్టర్ వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేస్తున్నాం. సెమీకండక్టర్ పరిశ్రమకు విద్యార్థులను, నిపుణులను సిద్ధం చేయడంపై భారత్ దృష్టి సారించింది. నిన్ననే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ తొలి సమావేశం జరిగింది. ఈ ఫౌండేషన్ భారత్ పరిశోధన విస్తారిత వ్యవస్థ (రీసర్చ్ ఎకోసిస్టమ్) కు కొత్త దిశను, కొత్త శక్తిని అందిస్తుంది. అదనంగా, భారత్ ఒక ట్రిలియన్ రూపాయల ప్రత్యేక పరిశోధన నిధిని కూడా ఏర్పాటు చేసింది.

 

|

మిత్రులారా,

సెమీకండక్టర్, సైన్స్ రంగాల్లో ఆవిష్కరణల పరిధిని ఈ తరహా కార్యక్రమాలు ఎంతగానో విస్తరిస్తాయి. సెమీకండక్టర్ సంబంధిత మౌలిక సదుపాయాలపై కూడా ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం. అంతేకాక, మీకు త్రీ డైమెన్షనల్ (త్రిమితీయ) శక్తి ఉంది - మొదటిది, భారతదేశంలోని ప్రస్తుత సంస్కరణాత్మక ప్రభుత్వం, రెండవది, భారతదేశంలో పెరుగుతున్న తయారీ రంగం, మూడవది భారతదేశంలోని ఆకాంక్షాత్మక మార్కెట్. సాంకేతిక పరిజ్ఞాన అభిరుచిని అర్థం చేసుకునే మార్కెట్. మీ కోసం, త్రీ-డి శక్తి తో కూడిన సెమీకండక్టర్ పరిశ్రమ స్థావరం (బేస్) ఉంది. ఈ రకమైన ఏర్పాటును వేరే చోట కనుగొనడం కష్టం.

 

|

మిత్రులారా,

భారత దేశ ఆకాంక్షాత్మక, సాంకేతిక ఆధారిత సమాజం చాలా ప్రత్యేకమైనది. భారత్ కు చిప్ అనేది కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు. మాకు,లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చే సాధనం. ప్రస్తుతం భారత్ చిప్స్ ప్రధాన వినియోగదారుగా ఉంది. ఈ చిప్ తో ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించాం. ఈ చిన్న చిప్ భారత్ లో లాస్ట్ మైల్ డెలివరీని నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచంలోని బలమైన బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా కుదేలైనప్పుడు, భారతదేశంలో బ్యాంకులు నిరాటంకంగా పనిచేశాయి. భారత్ యూపీఐ అయినా, రూపే కార్డు అయినా, డిజి లాకర్ అయినా, డిజి యాత్ర అయినా వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్లు భారత ప్రజలకు  దైనందిన జీవితంలో భాగమయ్యాయి. నేడు భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రతి రంగంలోనూ తయారీని పెంచుతోంది. నేడు, భారతదేశం గణనీయమైన హరిత మార్పు(గ్రీన్ ట్రాన్సిషన్)కు లోనవుతోంది. భారత్ లో డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమను ముందుకు నడిపించడంలో భారత్ ప్రధాన పాత్ర పోషించబోతోంది.

 

|

మిత్రులారా,

ఒక పాత ప్రసిద్ధ సామెత ఉంది - 'చిప్స్ ఎక్కడ అయితే అక్కడ పడనివ్వండి'. అంటే జరుగుతున్నది యథాతథంగా సాగిపోవాలి. నేటి యువ, ఆకాంక్ష భారత్ ఈ వైఖరిని అనుసరించడం లేదు. 'భారత్ లో తయారయ్యే చిప్ ల సంఖ్యను పెంచడం' అనేది నేటి భారత్ మంత్రం. అందుకే సెమీకండక్టర్ తయారీని ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. భారత్ లో సెమీకండక్టర్ తయారీ సౌకర్యాల ఏర్పాటుకు భారత ప్రభుత్వం 50 శాతం సహకారం అందిస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనపు సహకారం అందిస్తున్నాయి. ఈ విధానాల కారణంగా ఈ రంగంలో భారత్ లో తక్కువ కాలంలోనే 1.5 ట్రిలియన్ రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. నేడు అనేక ప్రాజెక్టులు పైప్ లైన్ లో ఉన్నాయి. సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద ఫ్రంట్ ఎండ్ ఫ్యాబ్స్, డిస్ప్లే ఫ్యాబ్స్, సెమీకండక్టర్ ప్యాకేజింగ్, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెన్సర్లు, డిస్ప్లే తయారీకి ఆర్థిక సహకారం అందిస్తోంది. అంటే భారత్ లో 360 డిగ్రీల విధానంతో పనులు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం భారత్ లో మొత్తం సెమీకండక్టర్ సప్లై చైన్ ఎకోసిస్టమ్ ను ముందుకు తీసుకెళ్తోంది. ప్రపంచంలోని ప్రతి పరికరంలోనూ స్వదేశీ చిప్ ఉండాలనేది మా కల అని ఈ ఏడాది ఎర్రకోట నుంచి చెప్పాను. సెమీకండక్టర్ పవర్ హౌస్ గా మారడానికి అవసరమైన ప్రతిదాన్ని దేశం చేయబోతోంది.

 

|

మిత్రులారా,

కీలకమైన ఖనిజాల దేశీయ ఉత్పత్తి, విదేశీ సేకరణ కోసం ఇటీవల క్రిటికల్ మినరల్ మిషన్ ను ప్రకటించాం. కీలకమైన ఖనిజాలకు కస్టమ్స్ సుంకం మినహాయింపులు, మైనింగ్ బ్లాక్ వేలం తదితరాలపై కసరత్తు జరుగుతోంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ లో సెమీకండక్టర్ పరిశోధన కేంద్ర ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఐఐటీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాం, తద్వారా మా ఇంజనీర్లు ప్రస్తుత అవసరాలకు హైటెక్ చిప్ లను అభివృద్ధి చేయడమే కాకుండా తదుపరి తరం చిప్ లను కూడా పరిశోధించవచ్చు.అంతర్జాతీయ సహకారాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. చమురు దౌత్యం గురించి మీరు వినే ఉంటారు; నేటి యుగం సిలికాన్ దౌత్యం. ఈ ఏడాది ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ సప్లై చైన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా భారత్ ఎన్నికైంది. క్వాడ్ సెమీకండక్టర్ సప్లై చైన్ ఇనిషియేటివ్ లో మేము ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉన్నాం, ఇటీవల జపాన్, సింగపూర్ తో సహా అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఈ రంగంలో అమెరికాతో భారత్ తన సహకారాన్ని నిరంతరం పెంచుకుంటోంది.

 

|

మిత్రులారా,

భారత్ సెమీకండక్టర్ మిషన్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ రంగంపై భారత్ ఎందుకు దృష్టి సారిస్తోందని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.. అలాంటి వారు మన డిజిటల్ ఇండియా మిషన్ ను అధ్యయనం చేయాలి. దేశానికి పారదర్శకమైన, సమర్థవంతమైన, లీకేజీ రహిత పాలన అందించడమే డిజిటల్ ఇండియా మిషన్ లక్ష్యం. నేడు, మనం దాని గుణక ప్రభావాన్ని అనుభవిస్తున్నాం. డిజిటల్ ఇండియా విజయానికి చౌకైన మొబైల్ హ్యాండ్ సెట్లు, డేటా అవసరం. అందుకు అనుగుణంగా అవసరమైన సంస్కరణలు అమలు చేసి అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించాం. దశాబ్దం క్రితం మొబైల్ ఫోన్లను ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశాల్లో మనమూ ఉన్నాం. నేడు, మనం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా ఉన్నాం. 5జీ హ్యాండ్ సెట్లకు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ గా అవతరించిందని తాజా నివేదిక వెల్లడించింది. రెండేళ్ల క్రితమే 5జీ సేవలను ప్రారంభించాం. ఈ రోజు మనం ఎక్కడికి చేరుకున్నామో చూడండి. నేడు భారత్ ఎలక్ట్రానిక్స్ రంగం 150 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. మా లక్ష్యం ఇంకా పెద్దది. ఈ దశాబ్దం చివరి నాటికి మన ఎలక్ట్రానిక్స్ రంగాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలనుకుంటున్నాం. దీని వల్ల భారత యువతకు 60 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. దీని వల్ల భారత్ సెమీకండక్టర్ రంగం కూడా ఎంతో ప్రయోజనం పొందనుంది. ఎలక్ట్రానిక్ తయారీ 100 శాతం భారతదేశంలోనే జరగాలన్నదే మా లక్ష్యం. అంటే భారత్ సెమీకండక్టర్ చిప్స్ మాత్రమే కాకుండా వాటి ఫినిష్డ్ గూడ్స్(పూర్తిగా తయారైన వస్తువులు) ను కూడా తయారు చేస్తుంది.

 

|

మిత్రులారా,

భారత్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్(విస్తారిత వ్యవస్థ) దేశీయ సవాళ్లకే కాకుండా ప్రపంచ సవాళ్లకు కూడా పరిష్కారాలను అందిస్తుంది. డిజైనింగ్ కు సంబంధించిన ఒక రూపకాన్ని మీరు వినే ఉంటారు. ఈ రూపకం - 'సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్'. ఈ లోపాన్ని నివారించడానికి డిజైనింగ్ విద్యార్థులకు బోధిస్తారు. వ్యవస్థ కేవలం ఒక భాగంపై ఆధారపడకుండా చూడటమే లక్ష్యం. ఈ పాఠం కేవలం డిజైనింగ్ కే పరిమితం కాలేదు. ఇది మన జీవితాలకు సమానంగా వర్తిస్తుంది, ముఖ్యంగా సరఫరా గొలుసుల (సప్లై చైన్) సందర్భంలో. కోవిడ్ కావచ్చు, యుద్ధం కావచ్చు, గతంలో సరఫరా గొలుసు అంతరాయాల వల్ల నష్టపోని పరిశ్రమ లేదు. అందువల్ల, సరఫరా గొలుసులలో స్థితిస్థాపకత కీలకం. అందువల్ల, వివిధ రంగాలలో స్థితిస్థాపకతను సృష్టించే మిషన్ లో భారత్ ఒక ముఖ్యమైన భాగం కావడం పట్ల నేను సంతోషిస్తున్నాను. మనం మరో విషయం గుర్తుంచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజాస్వామిక విలువలు తోడైతే సాంకేతిక పరిజ్ఞాన సానుకూల శక్తి బలపడుతుంది. దీనికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య విలువలు సాంకేతిక పరిజ్ఞానం నుండి తొలగించబడినప్పుడు, హానికరంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. అందువల్ల మొబైల్ తయారీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీకండక్టర్లు ఇలా ఏవైనా సరే మా దృష్టి చాలా స్పష్టంగా ఉంది. విపత్కర సమయాల్లో కూడా ఆగిపోకుండా, నిరంతరం పనిచేసే ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాం. మీరు కూడా భారతదేశ ఈ ప్రయత్నాలను బలోపేతం చేస్తారనే నమ్మకంతో, మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు!

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
A chance for India’s creative ecosystem to make waves

Media Coverage

A chance for India’s creative ecosystem to make waves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The world will always remember Pope Francis's service to society: PM Modi
April 26, 2025

Prime Minister, Shri Narendra Modi, said that Rashtrapati Ji has paid homage to His Holiness, Pope Francis on behalf of the people of India. "The world will always remember Pope Francis's service to society" Shri Modi added.

The Prime Minister posted on X :

"Rashtrapati Ji pays homage to His Holiness, Pope Francis on behalf of the people of India. The world will always remember his service to society."