Quoteరూ. 5,500 కోట్లతో 176 కి. మీ. జాతీయ రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన
Quoteరూ. 500 కోట్ల రైల్వే తయారీ విభాగానికి కాజీపేటలో శంకుస్థాపన
Quoteభద్రకాళి ఆలయ సందర్శన, పూజలు
Quote“తెలుగు ప్రజల సామర్థ్యం దేశ సామర్థ్యాన్ని పెంచుతూనే ఉంది”
Quote“శక్తిమంతమైన నేటి యువ భారతం వెలిగిపోతోంది”
Quote“పాడుబడిన మౌలిక వసతులతో వేగవంతమైన అభివృద్ధి అసాధ్యం”
Quote“చుట్టుపక్కల ఉన్న ఆర్థిక కార్యక్రమ కేంద్రాలను అనుసంధానం చేస్తూ తెలంగాణ ఒక్క ఆర్థిక కార్యకలాపాల హబ్ గా మారుతోంది”
Quote“యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటంలో తయారీ రంగం అతి పెద్ద వనరు కాబోతోంది”

 తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు...

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర మంత్రి వర్గ నా సహచరులు నితిన్ గడ్కరీ గారు, జి కిషన్ రెడ్డి గారు, సోదరుడు సంజయ్ గారు, ఇతర ప్రముఖులు, తెలంగాణ సోదరసోదరీమణులారా.. ఇటీవలే తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం కొత్తదే కావచ్చు, కానీ భారతదేశ  చరిత్రలో తెలంగాణ పాత్ర, ఇక్కడి ప్రజల సహకారం ఎల్లప్పుడూ గొప్పది.  తెలుగువారి బలం భారతదేశ బలాన్ని ఎల్లప్పుడూ పెంచింది. అందుకే నేడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించినప్పుడు అందులో  తెలంగాణ ప్రజల పాత్ర కూడా ఎంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేడు ప్రపంచమంతా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న తరుణంలో అభివృద్ధి చెందిన భారత్ పై ఇంత ఉత్సాహం ఉంటే తెలంగాణకు మున్ముందు మరిన్ని  అవకాశాలు ఉన్నాయి. 

 

|

 మిత్రులారా,

 నేటి నవ భారతం యువ భారతదేశం, ఎంతో శక్తితో నిండిన భారతదేశం. 21వ శతాబ్దపు ఈ మూడవ దశాబ్దంలో ఈ స్వర్ణ యుగం మనకు వచ్చింది. ఈ స్వర్ణ యుగంలోని ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. శరవేగంగా అభివృద్ధి చెందే విషయంలో దేశంలోని ఏ మూల కూడా వెనుకబడి ఉండకూడదు.. గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి, కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తెలంగాణ కనెక్టివిటీ, తయారీకి సంబంధించి రూ.6 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టులన్నింటికీ తెలంగాణ ప్రజలను అభినందిస్తున్నాను.

 

మిత్రులారా,

మీకు కొత్త లక్ష్యాలు ఉంటే, మీరు కొత్త మార్గాలను సృష్టించాలి. పాత మౌలిక సదుపాయాల బలంతో భారతదేశ వేగవంతమైన అభివృద్ధి సాధ్యం కాదు. ప్రయాణాల్లో ఎక్కువ సమయం వృథా అయితే, లాజిస్టిక్స్ ఖరీదైనవి అయితే వ్యాపారం కూడా దెబ్బతింటుంది, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే మా ప్రభుత్వం మునుపెన్నడూ లేనంత వేగంగా పనిచేస్తోంది. మునుపటి కంటే అనేక రెట్లు వేగంగా నేడు అన్ని రకాల మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయి. నేడు దేశవ్యాప్తంగా హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలు, ఎకనామిక్ కారిడార్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు నెట్ వర్క్ చేస్తున్నాయి. రెండు లేన్ల రహదారులను నాలుగు లేన్లుగా, నాలుగు లేన్ల రహదారులను ఆరు లేన్లుగా మారుస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ జాతీయ రహదారి నెట్ వర్క్ 2500 కిలోమీటర్లు ఉంటే నేడు 5000 కిలోమీటర్లకు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. భారత్ మాల ప్రాజెక్టు కింద దేశంలో నిర్మిస్తున్న డజన్ల కొద్దీ కారిడార్లు తెలంగాణ గుండా వెళుతున్నాయి. హైదరాబాద్-ఇండోర్ ఎకనామిక్ కారిడార్, సూరత్-చెన్నై ఎకనామిక్ కారిడార్, హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్, హైదరాబాద్-విశాఖపట్నం ఇంటర్ కారిడార్ ఇలా ఎన్నో ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. ఒకరకంగా తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక కేంద్రాలను కలుపుతూ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది.

 

|

మిత్రులారా,

నేడు నాగ్ పూర్ -విజయవాడ కారిడార్ లోని మంచిర్యాల-వరంగల్ సెక్షన్ కు కూడా శంకుస్థాపన చేశారు. ఇది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లకు తెలంగాణకు ఆధునిక కనెక్టివిటీని అందిస్తుంది. దీనివల్ల మంచిర్యాల- వరంగల్ మధ్య దూరం బాగా తగ్గడంతో పాటు ట్రాఫిక్ జామ్ ల సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా అభివృద్ధి కొరవడిన ప్రాంతాల గుండా, గిరిజన సామాజిక వర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు అధిక సంఖ్యలో నివసిస్తున్న ప్రాంతాల గుండా వెళ్తుంది. ఈ కారిడార్ మల్టీమోడల్ కనెక్టివిటీ విజన్ను బలోపేతం చేస్తుంది. కరీంనగర్-వరంగల్ సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం వల్ల హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, వరంగల్ సెజ్ లకు కనెక్టివిటీ బలోపేతం అవుతుంది.

మిత్రులారా,

కేంద్ర ప్రభుత్వం నేడు తెలంగాణలో పెంచుతున్న కనెక్టివిటీ తెలంగాణ పరిశ్రమకు, ఇక్కడి పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూరుస్తోంది. తెలంగాణలోని అనేక వారసత్వ కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు ఇప్పుడు అక్కడ సందర్శనకు మరింత సౌకర్యవంతంగా మారుతున్నాయి. కరీంనగర్ లోని గ్రానైట్ పరిశ్రమ అయినా, వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలకు కూడా భారత ప్రభుత్వ ఈ ప్రయత్నాల ద్వారా చేయూత అందుతోంది. అంటే రైతులు, కార్మికులు, విద్యార్థులు, వృత్తి నిపుణులు ఇలా ప్రతి ఒక్కరూ దీని ద్వారా లబ్ది పొందుతున్నారు. దీంతో యువతకు ఇళ్ల దగ్గరే కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

మిత్రులారా,

దేశంలో యువతకు ఉపాధి కల్పించేందుకు తయారీ రంగం మరో పెద్ద మాధ్యమంగా మారుతోంది, దేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రచారం జరుగుతోంది. దేశంలో తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించాం. అంటే ఎక్కువగా ఉత్పత్తి చేసే వారికి భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక సహాయం అందుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో 50కి పైగా భారీ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. ఈ ఏడాది రక్షణ ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ల క్రితం భారత రక్షణ ఎగుమతులు రూ.1,000 కోట్ల లోపే ఉండేవి. నేడు అది రూ.16 వేల కోట్లు దాటింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ కూడా దీని ద్వారా లబ్ధి పొందుతోంది.

మిత్రులారా,

ఈ రోజు, భారతీయ రైల్వే కూడా తయారీ పరంగా కొత్త రికార్డులు, కొత్త మైలురాళ్లను నెలకొల్పుతోంది. ఈ రోజుల్లో మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ రైళ్ల గురించి చాలా చర్చ జరుగుతోంది. కొన్నేళ్లుగా భారతీయ రైల్వే వేలాది ఆధునిక కోచ్లు, లోకోమోటివ్లను రూపొందించింది. భారతీయ రైల్వేల ఈ పరివర్తనలో, ఇప్పుడు కాజీపేట కూడా మేకిన్ ఇండియా  కొత్త శక్తితో ముడిపడి ఉండబోతోంది. ఇప్పుడు ఇక్కడ ప్రతి నెలా డజన్ల కొద్దీ వ్యాగన్లు తయారవుతాయి. ఇది ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది, ఇక్కడ ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా ప్రయోజనం పొందుతుంది. ఇది అందరి మద్దతు, అందరి అభివృద్ధి. ఈ అభివృద్ధి మంత్రంతో తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలి. అనేక అభ్యుదయ కార్యక్రమాలకు, వ్యవస్థీకృతానికి, నూతన అభివృద్ధి స్రవంతికి మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అనేకానేక  అభినందనలు! ధన్యవాదాలు !

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Increase in lion population from 674 to 891 'very encouraging': PM Modi

Media Coverage

Increase in lion population from 674 to 891 'very encouraging': PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మే 2025
May 25, 2025

Courage, Culture, and Cleanliness: PM Modi’s Mann Ki Baat’s Blueprint for India’s Future

Citizens Appreciate PM Modi’s Achievements From Food Security to Global Power