ఒక లక్షా ఇరవై అయిదు వేల పిఎమ్ కిసాన్ సమృద్ధికేంద్రాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు
పిఎమ్-కిసాన్ లో భాగం గా సుమారు 17,000 కోట్ల రూపాయల విలువైన పధ్నాలుగో వాయిదా సొమ్ము నుఆయన విడుదల చేశారు
ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) తో 1600 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ ను జతపరచారు
గంధకం పూత పూసినటువంటి యూరియా - ‘యూరియా గోల్డ్’ ను ఆయన ప్రవేశపెట్టారు
అయిదు నూతన వైద్య కళాశాల లను ప్రారంభించడం తో పాటు ఏడు వైద్యకళాశాలల కు శంకుస్థాపన కూడా చేశారు
‘‘కేంద్రం లో ఉన్నప్రభుత్వం రైతుల బాధల ను మరియు అవసరాల ను అర్థం చేసుకొంటున్నది’’
‘‘యూరియా యొక్క ధరల తో రైతులు ఇబ్బందిపడేటట్టు ప్రభుత్వం చేయదు. ఒక రైతు యూరియా ను కొనుగోలు చేసేటందుకు వెళ్ళినప్పుడు, ఆయనకు మోదీ హామీ ఒకటి ఉంది అనే నమ్మకం కలుగుతుంది’’
‘‘పల్లె లువికసిస్తేనే భారతదేశం అభివృద్ధి చెందగలుగుతుంది’’
‘‘రాజస్థాన్ లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన మా ప్రాధాన్యం గా ఉంది’’
‘‘మనమందరం కలసి రాజస్థాన్ యొక్క అభిమానాని కి మరియు వారసత్వాని కి యావత్తుప్రపంచం లో ఒక క్రొత్త గుర్తింపు ను కట్టబెడదాం’’

రాజస్తాన్  గవర్నర్  శ్రీ కల్  రాజ్ మిశ్రాజీ, కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్  తోమర్  జీ, మంత్రులు, పార్లమెంటులో నా  సహచరులు, శాసన సభ్యులు, ఇతర ప్రముఖులు, ఈ కార్యక్రమంలో మాతో పాల్గొంటున్న దేశానికి చెందిన కోట్లాది మంది రైతులు అందరికీ నమస్కారం. రాజస్తాన్  భూభాగం నుంచి దేశానికి చెందిన కోట్లాది మంది రైతులకు అభివాదం చేస్తున్నాను. నేడు రాజస్తాన్  కు చెందిన నా సోదర సోదరీమణులందరూ ఈ కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చారు. 

ఖతు శ్యామ్ జీకు చెందిన ఈ భూమి దేశవ్యాప్తంగా భక్తులందరిలోనూ విశ్వాసం, ఆశ నింపుతుంది. పోరాటయోధుల భూమి అయిన షెఖావతి నుంచి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే భాగ్యం నాకు కలిగింది. పిఎం కిసాన్  సమ్మాన్  నిధి పథకం ద్వారా నేడు సుమారు రూ.18,000 కోట్ల సొమ్ము కోట్లాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఆ సొమ్మును నేరుగానే రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. 

నేడు దేశవ్యాప్తంగా 1.25 లక్షల పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ, బ్లాక్  స్థాయిలో ఏర్పాటైన ఈ కేంద్రాలు నేరుగా కోట్లాది మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలిగిస్తోంది. అలాగే 1500 పైగా వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్  పిఓ), మన రైతుల కోసం ‘‘ఓపెన్  నెట్  వర్క్  ఫర్  డిజిటల్ కామర్స్’’ (ఓఎన్ డిసి) ప్రారంభించడం జరిగింది. దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోని రైతు అయినా ఇంట్లోనే  కూచుని దేశంలోని ఏ ప్రాంతంలోని మార్కెట్  లో అయినా తేలిగ్గా తమ ఉత్పత్తిని విక్రయించవచ్చు. 

నేడు దేశంలో రైతుల కోసం ‘‘యూరియా గోల్డ్’’ విడుదల చేశారు. దీనికి తోడు రాజస్తాన్ లోని విభిన్న నగరాలు కొత్త వైద్య కళాశాలలు, ఏకలవ్య మోడల్  పాఠశాలలు బహుమతిగా అందుకుంటున్నాయి. దేశ ప్రజలు ప్రత్యేకించి రాజస్తాన్  ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

 

మిత్రులారా, 
రాజస్తాన్  లోని సికార్, షెఖావతి ప్రాంతాలు రైతులకు అత్యంత బలమైన ప్రదేశాలు. కష్టించి పని చేసే విషయంలో తమ బాటలో ఏ అవరోధం ఉండబోదని రైతులు ఎల్లప్పుడూ నిరూపిస్తున్నారు. నీటి కొరత ఉన్న సమయాల్లో కూడా రైతులు తమ భూముల్లో అద్భుతమైన దిగుబడులు రాబట్టగలుగుతున్నారు. రైతుల సామర్థ్యం, కష్టించి  పని చేసే  స్వభావం భూమి నుంచి బంగారం పండిస్తోంది. అందుకే మా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. 

మిత్రులారా,
దేశానికి  స్వాతంత్ర్యం సిద్ధించిన దశాబ్దాల తర్వాత ఇన్నాళ్లకి రైతుల కష్టాలు, బాధలు అర్ధం చేసుకునే ప్రభుత్వం మనకుంది. ఈ కారణంగానే కేంద్రప్రభుత్వం గత తొమ్మిది  సంవత్సరాలుగా రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటోంది. మేం రైతుల కోసం విత్తనం నుంచి మార్కెట్ల పేరిట ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు చేశాం. 2015 సంవత్సరంలో రాజస్తాన్  లోని సూరత్  ఘర్  నుంచి సాయిల్  హెల్త్  కార్డుల పథకం ప్రారంభించాం. ఈ పథకం కింద దేశంలోని రైతులందరికీ కోట్లాది సాయిల్  హెల్త్  కార్డులు అందచేశారు. ఈ కార్డుల సహాయంతోనే  నేడు రైతులు తమ భూమి స్వస్థతకు సంబంధించిన  సమాచారం తెలుసుకుని అందుకు తగినంత ఎరువులే వాడుతున్నారు. 
రాజస్తాన్  భూభాగం నుంచే రైతుల కోసం మరో ప్రధాన పథకం ప్రారంభిస్తున్నామని తెలియచేయడానికి నేను ఆనందిస్తున్నాను. దేశవ్యాప్తంగా నేడు 1.25 లక్షలకు పైగా ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. ఈ కేంద్రాలన్నీ రైతుల సుసంపన్నతకు మార్గం సుగమం చేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే అవి రైతులకు వన్ స్టాప్  సెంటర్లుగా వ్యవహరిస్తాయి. 

తమకు కావలసిన వ్యవసాయ ఉపకరణాల కొనుగోలు కోసం వ్యవసాయ రంగానికి చెందిన సోదర సోదరీమణులు విభిన్న ప్రాంతాలకు వెళ్లవలసివచ్చేది. ఇక మీకు ఆ కష్టాలు ఉండనే ఉండవు. ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాలే మీకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తాయి. దీనికి తోడు ఆ కేంద్రాలు మీకు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, యంత్రాలు కూడా అందచేస్తాయి. ప్రభుత్వ పథకాల గురించి సరైన సమాచారం లేని కారణంగా వ్యవసాయ సోదర సోదరీమణులు తీవ్రంగా నష్టపోతున్నట్టు నేను గుర్తించాను. నేడు ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాలు మీకు కావలసిన విలువైన సమాచారం అంతా సకాలంలో అందచేస్తాయి. 

మిత్రులారా, 
ఇది కేవలం ప్రారంభమే. మీకు వ్యవసాయ అవసరాల కోసం ఏదీ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకపోయినా మీ పట్టణంలోని ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాన్ని సందర్శించడం అలవాటుగా చేసుకోండి. అక్కడ ఏం జరుగుతోందో వీక్షించండి. మన తల్లులు, సోదరీమణులు కూరగాయల కోసం మార్కెట్  కు వెళ్లినప్పటికీ కొన్నా, కొనకపోయినా తరచు అక్కడ ఉన్న వస్ర్త దుకాణాన్ని సందర్శిస్తూ ఉండడం మీరు గమనించే ఉంటారు. అక్కడ కొత్తవి ఏవి వచ్చాయి, ఏ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి తెలుసుకునేందుకే వారు ఈ పని చేస్తారు. రైతు సోదరసోదరీమణులు కూడా ఇలాంటి  అలవాటు చేసుకోవాలి. పట్టణానికి వెళ్లినప్పుడల్లా ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాన్ని సందర్శించి అక్కడ కొత్తగా ఏవి అందుబాటులో ఉన్నాయి పరిశీలిస్తూ ఉండాలి. దీని ద్వారా మీరు పలు ప్రయోజనాలు అందుకోగలుగుతారు. మిత్రులారా, ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 1.75 లక్షల ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. 

 

మిత్రులారా, 
రైతుల సొమ్మును ఆదా చేయడానికి మా ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో తెలియచేసే మరో ఉదాహరణ యూరియా ధరలు. కరోనా మహమ్మారి, ఆ తర్వాత ఏర్పడిన రష్యా-ఉక్రెయిన్  యుద్ధం మార్కెట్లను అతలాకుతలం చేశాయి. అది ఎరువులు సహా అన్నింటిలోనూ తీవ్ర అవాంతరాలకు కారణమయింది. కాని ఆ ప్రభావం రైతులపై పడకుండా మా ప్రభుత్వం చూసింది. 

ఎరువుల ధరల గురించిన సమాచారం నా సోదర రైతులతో పంచుకోవాలని నేను బావిస్తున్నాను. నేడు మన దేశంలో యూరియా బస్తా కేవలం ర .266కే అందిస్తున్నాం. అదే మన పొరుగుదేశం పాకిస్తాన్  లో రూ.800 పలుకుతోంది. బంగ్లాదేశ్  లో రూ.720, చైనాలో రూ.2100కి సరఫరా చేస్తున్నారు. అమెరికాలో ఎంత ధర పలుకుతోందో మీరెవరైనా ఊహించగలరా...మనకి రూ.300 కన్నా తక్కువ ధరకు అందిస్తున్న బస్తా అక్కడ రూ.3000 పలుకుతోంది. రూ.300కి, రూ.3000కి మధ్యన తేడా ఎంత ఉందో పరిశీలించండి. 

యూరియా ధరల వల్ల భారతరైతాంగం ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నది మా లక్ష్యం. మన దేశానికి చెందిన రైతులు నిత్యం ఆ అనుభవం పొందుతున్నారు. వారు ఎప్పుడు యూరియా  కొనేందుకు వెళ్లినా ఈ మోదీ గ్యారంటీపై పూర్తి విశ్వాసం పొందుతున్నారు. మీకు భరోసా ఏమిటని ఏ రైతునైనా అడిగితే మీకు అదే తెలుస్తుంది.  

మిత్రులారా, 
రాజస్తాన్  లో మీరందరూ జొన్నల వంటి చిరుధాన్యాలు పండిస్తూ ఉంటారు. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల చిరుధాన్యాలు పండుతూ ఉంటాయి. ఇప్పుడు మా  ప్రభుత్వం చిరుధాన్యాలకు ‘‘శ్రీ అన్న’’ పేరిట ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. చిరుధాన్యాలన్నింటినీ ఇప్పుడు ‘‘శ్రీ అన్న’’గానే వ్యవహరిస్తున్నారు. మా ప్రభుత్వం ఈ చిరుధాన్యాలను ప్రపంచంలోని పెద్ద మార్కెట్లకు చేర్చుతోంది. ప్రభుత్వ ప్రయత్నాల వలెనే దేశంలో ‘‘శ్రీ అన్న’’ ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతి కూడా  పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్ష భవనం వైట్  హౌస్  సందర్శించే అవకాశం నాకు కలిగింది. అక్కడ అధ్యక్షుడు బైడెన్  ఏర్పాటు చేసిన విందులో చిరుధాన్యాల వంటకం కూడా ప్లేటులో ఉండడం నాకు ఆనందం కలిగించింది. 

 

మిత్రులారా, 
ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలన్నీ మన దేశానికి, చిరుధాన్యాలు - ‘‘శ్రీ అన్న’’  పంటలు పండించే రాజస్తాన్  రైతులకు అద్భుత ప్రయోజనాలు అందిస్తున్నాయి. అలాంటి పలు చొరవలు రైతుల జీవితాల్లో సానుకూల మార్పును తెస్తున్నాయి. 

రైతు సోదరులారా, 
గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అప్పుడే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అందుకే నేడు మా ప్రభుత్వం నగరాల్లో ఉన్న ప్రతీ ఒక్క సదుపాయం గ్రామాలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దేశ జనాభాలో అధిక శాతం ఆరోగ్య వసతుల నిరాకరణకు గురైన విషయం మీ అందరికీ తెలుసు. ఫలితంగా కోట్లాది మంది ప్రజలు విధిని నమ్ముకుని జీవించాల్సి వచ్చేది. ఢిల్లీ, జైపూర్  వంటి  పెద్ద నగరాలకే మంచి ఆస్పత్రులు పరిమితం అనే భావన కూడా ఉండేది. మేం ఆ పరిస్థితిని మారుస్తున్నాం. నేడు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కొత్త ఎయిమ్స్  (అఖిల భారత వైద్య శాస్ర్తాల సంస్థ), కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి.  

ఈ ప్రయత్నాల ఫలితంగా నేడు దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 700 దాటింది. 8-9 సంవత్సరాల క్రితం రాజస్తాన్  లో 10 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. నేడు వాటి సంఖ్య 35కి పెరిగింది. ఇవి మన చుట్టుపక్కల ప్రాంతాలకు వైద్య వసతులు అందుబాటులోకి తేవడమే కాకుండా పెద్ద  సంఖ్యలో వైద్యులను తయారుచేస్తున్నాయి. ఈ వైద్యులందరూ చిన్న పట్టణాలు, గ్రామాల్లో వైద్య సేవలకు పునాదిగా మారుతున్నారు.

ఉదాహరణకి ఈ కొత్త వైద్య  కళాశాలలు బరన్, బుండి, టాంక్, సవాయ్ మధోపూర్, కరౌలి, జున్ ఝును, జైసల్మీర్, ధోల్పూర్, చిత్తోర్  గఢ్, సిరోహి, సికార్  వంటి ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. వైద్య చికిత్సల కోసం ప్రజలిక ఏ మాత్రం జైపూర్ లేదా ఢిల్లీ వెళ్లాల్సిన పని లేదు. పేద కుటుంబాల్లోని మీ కుమారులు, కుమార్తెలు కూడా ఈ వైద్య కళాశాలల్లో చదివే అవకాశం పొందడం వల్ల మీ ఇళ్ల సమీపానికే మంచి ఆస్పత్రులు వస్తున్నాయి. అంతే కాదు, వైద్య విద్యను మాతృ భాషలోనే బోధించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇంగ్లీష్  రాని కారణంగా పేద కుటుంబాల్లోని ఏ కుమారుడు లేదా కుమార్తె విద్యకు అనర్హత పొందడానికి అవకాశం లేనే లేదు. ఇది కూడా మోదీ అందిస్తున్న హామీయే. 

సోదర  సోదరీమణులారా, 
దశాబ్దాలుగా మన గ్రామాలు, నిరాదరణకు గురవుతున్న వర్గాలకు మంచి  పాఠశాలలు లేవు. వెనుకబడిన తరగతులు, గిరిజన తెగలకు చెందిన బాలబాలికలకు పెద్ద కలలున్నప్పటికీ వాటిని సాకారం చేసుకునే మార్గం కొరవడింది. మేం విద్యారంగానికి చెందిన బడ్జెట్  ను పెంచి వనరులు మెరుగుపరచడంతో పాటు ఏకలవ్య మోడల్  గిరిజన పాఠశాలలు ప్రారంభించింది. ఇవి గిరిజన బాలబాలికలకు ఎన్నో ప్రయోజనాలు అందుబాటులోకి తెచ్చింది.

 

మిత్రులారా, 
మన కలలు ఆకాంక్షాపూరితంగా ఉన్నట్టయితే విజయం చేకూరుతుంది.  ఎన్నో శతాబ్దాలుగా ప్రపంచం అంతటినీ తన వైభవంతో ఆశ్చర్యపరిచిన రాష్ర్టం రాజస్తాన్. వారసత్వాన్ని కాపాడి రాజస్తాన్  ను అభివృద్ధిపథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిదీ. ఇటీవలే ఢిల్లీ-ముంబై ఎక్స్  ప్రెస్  వే, అమృతసర్-జామ్  నగర్  ఎక్స్  ప్రెస్ వేలపై రాజస్తాన్  లోని కీలకమైన  సెక్షన్లలో రెండు ఎక్స్  ప్రెస్ మార్గాలు ప్రారంభమయ్యాయి. ఇవి రెండూ రాజస్తాన్  అభివృద్ధిలో కొత్త శకం రచిస్తాయి. రాజస్తాన్  ప్రజలకు వందే భారత్  రైలు కూడా బహుమతిగా అందింది. 

నేడు కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి మౌలిక వసతులు, సదుపాయాలు నిర్మిస్తోంది. ఇది కూడా రాజస్తాన్  కు పలు ప్రయోజనాలు అందిస్తుంది. మీరు పర్యాటకులను ‘‘పధారో మహరే దేశ్’’ అని ఆహ్వనిస్తే ఎక్స్ ప్రెస్  వేలు, మంచి రైలు వసతులు వారికి ఆహ్వానం పలుకుతాయి. 

 

స్వదేశీ దర్శన్  యోజన కింద ఖతు శ్యామ్  జీ దేవాలయానికి కూడా సదుపాయాలను మా ప్రభుత్వం విస్తరించింది. శ్రీ ఖతు శ్యామ్  జీ ఆశీస్సులతో రాజస్తాన్  అభివృద్ధి వేగం అందుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను. మనందరం సంపూర్ణ మనస్సుతో రాజస్తాన్ ఆత్మగౌరవానికి, వారసత్వానికి కొత్త గుర్తింపు అందిద్దాం. 

మిత్రులారా, 
రాజస్తాన్  ముఖ్యమంత్రి శ్రీ అశోక్  గెహ్లాట్  జీ గత కొద్ది రోజులుగా కాలికి సంబంధించిన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కావలసి ఉన్నా ఆయన రాలేకపోయారు. ఆయనకు  సత్వరం స్వస్థత చేకూరాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ రాజస్తాన్  రైతులు, ప్రజలకు నేను అంకితం చేస్తున్నాను. మీ అందరికీ నా  హృద‌యపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. 

ధన్యవాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"