ముఖ్యమంత్రి శ్రీ పళని స్వామి గారు,
మంత్రి శ్రీ కె. పాండియరాజన్ గారు,
వనవిల్ సాంస్కృతిక కేంద్రం వ్యవస్థాపకుడు శ్రీ కె. రవి,
విశిష్ట ప్రముఖులారా !
మిత్రులారా !
వణక్కం !
నమస్కారం !
మహనీయుడు భారతీయార్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడం ద్వారా నేను నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. అటువంటి ప్రత్యేకమైన రోజున, అంతర్జాతీయ భారతి ఉత్సవంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. భారతి రచనలపై పరిశోధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప పండితుడు శ్రీ సీనీ విశ్వనాథన్ గారికి ఈ ఏడాది భారతి అవార్డును ప్రదానం చేయడం పట్ల కూడా నాకు సంతోషంగా ఉంది. 86 సంవత్సరాల వయస్సులో కూడా చురుకుగా పరిశోధన కొనసాగిస్తున్నందుకు, నేను ఆయన్ను అభినందిస్తున్నాను! సుబ్రమణ్య భారతిని ఎలా వర్ణించాలి, ఇది చాలా కష్టమైన ప్రశ్న. భారతీయార్‌ను ఏ ఒక్క వృత్తితోనో లేదా కోణంతోనో అనుసంధానించలేము. అతను ఒక కవి, రచయిత, సంపాదకుడు, జర్నలిస్ట్, సామాజిక సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు, మానవతావాది, ఇలా ఇంకా ఎన్నో ….
ఆయన రచనలు, కవితలు, తాత్వికత, జీవితం మనల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించడానికి నాకు గౌరవం కలుగజేసిన వారణాసితో, ఆయనకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆయన సేకరించిన రచనలు 16 సంపుటాలలో ప్రచురించబడిందని నేను ఇటీవల చూశాను. 39 సంవత్సరాల స్వల్ప జీవితంలో ఆయన అతను చాలా రాశారు, చాలా చేశారు, చాలా రాణించారు. ఆయన రచనలు అద్భుతమైన భవిష్యత్తు వైపు మనకు మార్గనిర్దేశం చేస్తాయి.
మిత్రులారా,
ఈ రోజు మన యువత సుబ్రమణ్య భారతి నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి. సుబ్రమణ్య భారతికి అసలు భయం అంటే ఏమిటోతెలియదు.
ఆయన ఈ విధంగా చెప్పారు :
அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே
இச்சகத்து ளோரெலாம் எதிர்த்து நின்ற போதினும்,
அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே
దీని అర్ధం ఏమిటంటే :
నాకు భయం లేదు, నాకు భయం లేదు, ప్రపంచమంతా నన్ను వ్యతిరేకించినా. ఈ రోజు నేను యువ భారతదేశంలో ఈ స్ఫూర్తిని చూస్తున్నాను. ఆవిష్కరణ మరియు శ్రేష్ఠతలో వారు ముందంజలో ఉన్నప్పుడు నేను వారి చైతన్యాన్ని చూస్తాను. భారతదేశం యొక్క అంకురసంస్థల ప్రదేశమంతా మానవాళికి క్రొత్తదనాన్ని అందిస్తున్న ధైర్యంతో కూడిన యువతతో నిండి ఉంది. అలాంటి 'చేయగలను' అనే శక్తి మన దేశానికి, మన భూమండలానికి అద్భుతాలను సృష్టిస్తుంది.
మిత్రులారా,
పురాతన మరియు ఆధునికతల మధ్య ఆరోగ్యకరమైన మిశ్రమాన్ని, భారతీయార్ విశ్వసించారు. మన మూలాలతో అనుసంధానమవడంతో పాటు, భవిష్యత్తు వైపు చూసే జ్ఞానాన్ని కూడా ఆయన ఆస్వాదించారు. ఆయన, తమిళ భాషనూ, మాతృభూమి భారతదేశాన్నీ, తన రెండు కళ్ళగా భావించారు. ప్రాచీన భారతదేశం యొక్క గొప్పతనం; వేదాలు, ఉపనిషత్తుల గొప్పతనం; మన సంస్కృతి, సంప్రదాయంతో పాటు మన అద్భుతమైన గత చరిత్ర గురించీ ఆయన పాటలు పాడారు. కానీ అదే సమయంలో, గత కీర్తితో జీవించడం మాత్రమే సరిపోదని ఆయన హెచ్చరించారు. మనం శాస్త్రీయ నిగ్రహాన్నీ, విచారణ స్ఫూర్తినీ పెంపొందించుకోవాలనీ, పురోగతి వైపు పయనించాలనీ ఆయన పేర్కొనేవారు.
మిత్రులారా,
మహాకవి భారతీయార్ యొక్క పురోగతి యొక్క నిర్వచనంలో మహిళలకు ప్రధాన పాత్రను కలిగి ఉంది. అతి ముఖ్యమైన దృష్టి స్వతంత్ర మరియు సాధికారిత మహిళల దృష్టి. స్త్రీలు కళ్ళు చూసేటప్పుడు తల ఎత్తి నడుచుకునేలా ఉండాలని, మహాకవి భారతీయార్, రాశారు. మనం ఈ దృష్టితో ప్రేరణ పొందాము మరియు మహిళల నాయకత్వ సాధికారత కోసం కృషి చేస్తున్నాము. మా ప్రభుత్వం పనిచేసే ప్రతి రంగంలోనూ, మహిళల గౌరవానికి ప్రాముఖ్యత ఇవ్వడం మీకు సంతోషాన్నిస్తుంది.
ఈ రోజు, ముద్ర యోజన వంటి పథకాల ద్వారా 15 కోట్లకు పైగా మహిళా పారిశ్రామికవేత్తలకు నిధులు సమకూరుతున్నాయి. వారు తల ఎత్తుకొని నడుస్తూ, మమ్మల్ని కంటికి చూస్తూ, వారు ఎలా స్వతంత్రంగా మారుతున్నారో మాకు చెబుతున్నారు.
ఈ రోజున, మహిళలు మన సాయుధ దళాలలో శాశ్వత ఉద్యోగాలలో భాగమవుతున్నారు. వారు తల ఎత్తుకొని నడుస్తూ మనల్ని చూస్తూ, దేశం సురక్షితమైన చేతుల్లో ఉందనే నమ్మకాన్ని నింపుతున్నారు. సురక్షితమైన పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న నిరుపేద మహిళలు, నేడు, 10 కోట్లకు పైగా సురక్షితమైన మరియు పరిశుభ్రమైన మరుగుదొడ్లు ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
వారు ఇకపై సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మహాకవి భారతీయార్ ఊహించినట్లు, మహిళలు తల ఎత్తుకొని నడుస్తూ అందరికీ కనపడతారు. ఇది న్యూ ఇండియా యొక్క నారీ శక్తి యుగం. వారు అడ్డంకులను అధిగమించి ప్రభావం చూపుతున్నారు. సుబ్రమణ్య భారతికి ఇది న్యూ ఇండియా నివాళి.
మిత్రులారా,
విభజించబడిన ఏ సమాజమైనా విజయం సాధించలేదని, మహాకవి భారతీయార్ అర్థం చేసుకున్నారు. అదే సమయంలో, సామాజిక అసమానతలను పరిష్కరించని మరియు సామాజిక దురలవాట్లను పరిష్కరించని రాజకీయ స్వేచ్ఛ యొక్క శూన్యత గురించి ఆయన రాశారు.
ఆయన ఈ విధంగా చెప్పారు :
இனியொரு விதி செய்வோம் – அதை
எந்த நாளும் காப்போம்
தனியொரு வனுக்குணவிலை யெனில்
ஜகத்தினை யழித்திடுவோம்
దీని అర్ధం ఏమిటంటే :
ఇప్పుడు మనం ఒక నియమాన్ని రూపొందించుకుందాం, దానిని ఎల్లప్పుడూ అమలు చేద్దాం. ఎప్పుడైనా ఒక మనిషి ఆకలిని ఎదుర్కొంటే, ప్రపంచం ఆ విధ్వంసం యొక్క బాధతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆయన బోధనలు ప్రతి వ్యక్తి యొక్క సాధికారతకు, ఐక్యంగా, కట్టుబడి ఉండటానికి, మనకు, ముఖ్యంగా పేదలు మరియు అట్టడుగు వర్గాల వారికి బలమైన రిమైండర్ గా పనిచేస్తాయి.
మిత్రులారా,
మన యువత భారతి నుండి నేర్చుకోవలసినది చాలా ఉంది. మన దేశంలో ప్రతి ఒక్కరూ ఆయన రచనలు చదివి వారి నుండి ప్రేరణ పొందాలని నేను కోరుకుంటున్నాను. భారతీయార్ సందేశాన్ని వ్యాప్తి చేయడంలో వనావిల్ సాంస్కృతిక కేంద్రం చేసిన అద్భుతమైన కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ ఉత్సవంలో ఉత్పాదక చర్చలు జరుగుతాయని నేను విశ్వసిస్తున్నాను, ఇది భారతదేశాన్ని కొత్త భవిష్యత్ లోకి నడిపించడంలో సహాయపడుతుంది.
కృతజ్ఞతలు,
మీకు అనేకానేక ధన్యవాదములు.