అమృత కాలం లోని ఈ ఒకటో బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క విరాట సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఒక బలమైన పునాది ని నిర్మించ గలుగుతుంది. ఇది వంచితుల కు పెద్దపీట ను వేసినటువంటి బడ్జెటు. ఈ బడ్జెటు ఆకాంక్ష లు నిండినటువంటి నేటి కాలం సమాజం యొక్క- గ్రామాల, పేదల , రైతు ల మరియు మధ్య తరగతి జనత యొక్క- చెప్పాలంటే అందరి యొక్క కలల ను నెరవేర్చగలదు.
ఈ విధమైన చరిత్రాత్మక బడ్జెటు ను తీసుకు వచ్చినందుకు గాను ఆర్థిక మంత్రి నిర్మల గారి ని మరియు ఆమె జట్టు సభ్యుల ను నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
సాంప్రదాయకం గా చూసినప్పుడు, వారి హస్తాల తోనో, పనిముట్ల తోనో మరియు ఉపకరణాల తోనో కష్టపడి పని చేసి ఏదో ఒకటి తయారు చేసే యడం ద్వారా ఏవో కొన్ని వస్తువుల ను తయారు చేస్తూ ఉంటున్నటువంటి కోట్ల కొద్దీ ‘విశ్వకర్మలు’ ఈ దేశం నిర్మాతలు గా ఉన్నారు. మన దేశం లో కమ్మరులు, స్వర్ణకారులు, కుమ్మరులు, వడ్రంగి పనివారు, శిల్పులు, తాపీ మేస్త్రులు, చేతివృత్తి కళాకారులు.. ఇటువంటి వారు లెక్కపెట్టలేనంత మంది ఉన్నారు. ఈ విశ్వకర్మలు అందరి కఠోర శ్రమ కు మరియు వారి సృజనశీలత్వానికి సమర్థన ను ఇవ్వడం కోసమని ఈ బడ్జెటు లో తొలిసారి గా అనేక ప్రోత్సహక పథకాల ను తీసుకు రావడం జరిగింది. ఆ తరహా వ్యక్తుల కు శిక్షణ ను, సాంకేతిక విజ్ఞానాన్ని, రుణాల ను మరియు బజారు కు సంబంధించి మద్ధతు ను అందించే వ్యవస్థ ను సమకూర్చడమైంది. ‘పిఎమ్ విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’ అంటే అదే సంక్షిప్తం గా ‘పిఎమ్-వికాస్’.. కోట్ల కొద్దీ విశ్వకర్మ ల జీవనం లో ఒక చాల పెద్ద మార్పు ను తీసుకు వస్తుంది.
మిత్రులారా,
పట్టణ ప్రాంత మహిళలు మొదలుకొని పల్లె ప్రాంతాల లో నివసిస్తూ ఉన్న మహిళల వరకు, అలాగే వ్యాపారం లో తలమునకలు గా ఉన్న మహిళలు గాని లేదా కుటుంబ కార్యకలాపాల లో తీరిక లేకుండా ఉండే మహిళలు గాని .. వారి జీవనాన్ని సులభ తరం గా తీర్చిదిద్దడం కోసమని గడచిన సంవత్సరాల లో ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యల ను తీసుకొన్నది. అది జల్ జీవన్ మిశన్ కావచ్చు, లేదా ఉజ్జ్వల యోజన కావచ్చు, లేదా పిఎమ్- ఆవాస్ యోజన కావచ్చు.. ఇటువంటి అనేక కార్యక్రమాల ను బోలెడంత ఉత్సాహం తో ముందుకు తీసుకు పోవడం జరుగుతుంది. దీనికి తోడు, ‘మహిళా స్వయం సహాయక సమూహాలు’ ప్రస్తుతం భారతదేశం లో ఒక కీలక పాత్ర ను పోషిస్తున్న చాలా శక్తివంతం అయినటువంటి రంగం గా మారిందని చెప్పాలి. వారికి గనుక కొద్ది మాత్రం గా అండ దొరికిందా అంటే వారు అద్భుత కార్యాల ను చేయగల దక్షులే అవుతారు. మరి ఇందుకనే, ‘మహిళా స్వయం సమూహాల’ సర్వతోముఖ అభివృద్ధి కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని ఈ బడ్జెటు లో జత పరచడం జరిగింది. ఇది ఈ బడ్జెటు కు ఒక నూతనమైనటువంటి కోణాన్ని జోడిస్తుంది. మహిళ ల కోసమంటూ ఒక ప్రత్యేకమైన పొదుపు పథకాన్ని కూడా ప్రారంభించడం జరుగుతున్నది. మరి జన్ ధన్ ఖాతా కు తరువాయి గా ఈ విశేషమైన పొదుపు పథకం సామాన్య కుటుంబాల గృహిణుల కు, మాతృమూర్తుల కు మరియు సోదరీమణుల కు చాలా పెద్దదైన దన్ను ను ఇచ్చేది కానుంది.
ఈ బడ్జెటు, సహకార సంఘాల ను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కి ఒక ఇరుసు గా మార్చివేయనుంది. ప్రభుత్వం సహకార రంగం లో ప్రపంచం లో అతి పెద్దది అయినటువంటి అన్న నిలవ యోజన ను తీసుకు వచ్చింది. అదే స్టోరేజ్ కపాసిటీ. సరిక్రొత్త గా ప్రాథమిక సహకార సంఘాల ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం తో ఒక మహత్వాకాంక్షయుక్త ప్రణాళిక ను సైతం బడ్జెటు లో ప్రకటించడమైంది. దీనితో సాగు తో పాటే పాలు మరియు చేపల ఉత్పత్తి రంగం కార్యకలాపాలు విస్తరించగలవు. రైతుల కు, పశువుల పెంపకం దారుల కు మరియు మత్స్యకారుల కు వారి వారి ఉత్పత్తుల కు గాను మరింత మెరుగైన ధర లభించగలదు.
మిత్రులారా,
ఇక మనం డిజిటల్ పేమెంట్స్ తాలూకు సాఫల్యాన్ని వ్యవసాయ రంగం లో కూడాను ఆచరణ లోకి తీసుకు రావలసి ఉంది. అందుకనే ఈ బడ్జెటు లో మేం డిజిటల్ ఎగ్రీకల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక పెద్ద ప్రణాళిక ను తీసుకు వచ్చాం. ఇవాళ ప్రపంచం ప్రస్తుతం చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరాన్ని జరుపుకొంటోంది. భారతదేశం లో మిలిట్ ల లో అనేక విధాలైనటువంటి మిలిట్స్ ఉన్నాయి, వాటికి అనేకమైన పేరు లు ఉన్నాయి. ఎప్పుడైతే చిరుధాన్యాలు ఇంటింటికీ చేరుకొంటున్నాయో, ప్రపంచ వ్యాప్తం గా అవి ఆదరణ ను చూరగొంటున్నాయో, అప్పుడు దీని తాలూకు సర్వాధిక లాభం భారతదేశం లోని చిన్న రైతుల కు దక్కాల్సిందన్న మాటే. మరి ఈ కారణం గానే, వీటిని ఒక కొత్తదైనటువంటి దారి లో ముందుకు తీసుకు పోవలసిన అవసరం ఉంది. ఇది జరగాలంటే ఒక కొత్త గుర్తింపు, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అవసరం. అందువల్లే ఈ సూపర్ ఫూడ్ కు ‘శ్రీ అన్న’ అనేటటువంటి ఒక నూతనమైన గుర్తింపు ను ఇవ్వడం జరిగింది. దీనిని ప్రాచూర్యం లోకి తీసుకు రావడం కోసం అనేకమైన పథకాల ను రూపొందించడమైంది. ‘శ్రీ అన్నాని’ కి పెద్దపీట ను వేస్తున్నందువల్ల సాగు వ్యాపకం లో నిమగ్నం అయిన దేశ చిన్న రైతుల కు, మన ఆదివాసీ సోదరీమణులకు మరియు మన ఆదివాసీ సోదరులకు ఆర్థిక సమర్థన అందనుంది. అలాగే దేశవాసుల కు ఒక స్వస్థ స్వస్థ జీవనం కూడా లభించనుంది.
మిత్రులారా,
ఈ బడ్జెటు ఒక మన్నికైన భవిష్యత్తు కోసం, గ్రీన్ గ్రోథ్, గ్రీన్ ఇకానమి, గ్రీన్ ఎనర్జి, గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇంకా గ్రీన్ జాబ్స్ కు ఇదివరకు ఎన్నడూ లభించనంతటి విస్తారాన్ని అందించనుంది. బడ్జెటు లో మేం సాంకేతిక విజ్ఞానాని కి, న్యూ ఇకానమి కి ఎంతో ప్రాధాన్యాన్ని కట్టబెట్టాం. రహదారులు, రైలు మార్గాలు, మెట్రో, ఓడరేవులు, జలమార్గాల వంటి ప్రతి ఒక్క రంగం లో నేటి ఆకాంక్ష భరిత భారతదేశం ఆధునికమైనటువంటి మరియు తదుపరి తరాని కి చెందినటువంటి మౌలిక సదుపాయాలు కావాలి అని కోరుకొంటున్నది. 2014వ సంవత్సరం తో పోల్చి చూసినప్పుడు మౌలిక సదుపాయాల రంగం లో పెట్టుబడి 400 శాతం కంటే అధికం గా పెరిగింది. ఈసారి అపూర్వమైన రీతి లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ని మౌలిక సదుపాయాల రంగాని కి ప్రతిపాదించినందువల్ల భారతదేశం యొక్క అభివృద్ధి కి నవీన శక్తి, నూతన మైన జోరు అందగలదు. ఈ పెట్టుబడి యువత కు సరికొత్త ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తుంది. జనాభా లో ఒక పెద్ద భాగాని కి వినూత్న ఆదాయ అవకాశాల ను అందుబాటు లోకి తీసుకు రాగలదు. ఈ బడ్జెటు లో వ్యాపార నిర్వహణ సంబంధి సౌలభ్యం తో పాటే మన పరిశ్రమల కోసం పరపతి సమర్థన, ఇంకా సంస్కరణల ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడం జరిగింది. సూక్ష్మ, లఘు, మధ్యతరహా వ్యాపార సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) ల కోసం 2 లక్షల కోట్ల రూపాయల అదనపు రుణ పూచీకత్తు ను కల్పించే వ్యవస్థ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు సంభావ్య పన్ను తాలూకు పరిమితి పెరగడం తో ఎమ్ఎస్ఎమ్ఇల కు వృద్ధి చెందడం లో సాయం లభించగలదు. పెద్ద కంపెనీల నుండి ఎమ్ఎస్ఎమ్ఇ లకు సకాలం లో చెల్లింపుల ను జరపడానికి వీలు గా ఒక కొత్త వ్యవస్థ ను అభివృద్ధి పరచడమైంది.
మిత్రులారా,
శరవేగం గా పరివర్తన కు లోనవుతున్నటువంటి భారతదేశం లో జీవనం లోని ప్రతి ఒక్క రంగం లో, అది అభివృద్ధి కావచ్చు లేదా సిస్టమ్స్ కావచ్చు, ధైర్యసాహసాలు కావచ్చు, లేదా ఒక సంకల్పాన్ని తీసుకొనే సామర్థ్యం కావచ్చు మధ్య తరగతి ఒక ప్రధానమైన శక్తి గా మారింది. సమృద్ధియుక్తం అయినటువంటి మరియు అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క కలల ను పండించాలి అంటే మరి ఈ ప్రక్రియ లో మధ్య తరగతి ప్రజానీకం ఒక భారీ శక్తి గా ఉన్నది. భారతదేశం లో యువ శక్తి అనేది దేశాని కి ఏ విధం గా అయితే ఒక ప్రత్యేకమైనటువంటి బలం గా ఉందో, అదే మాదిరి గా భారతదేశం లో అంతకంతకు పెరుగుతూ ఉన్నటువంటి మధ్య తరగతి కూడాను దేశాని కి ఒక మహా బలం గా ఉన్నది. మధ్యతరగతి కి సాధికారిత ను కల్పించడం కోసం గడచిన కొన్నేళ్ళ లో అనేకమైన నిర్ణయాల ను మా ప్రభుత్వం తీసుకోవడంతో పాటు జీవించడం లో సౌలభ్యానికి పూచీ పడింది. మేం పన్నుల రేటు ను తగ్గించాం, దీనితో పాటు ప్రక్రియ ను సరళతరం గాను, పారదర్శకమైంది గాను, వేగవంతమైంది గాను తీర్చిదిద్దాం. ఎల్లవేళలా మధ్య తరగతి వెన్నంటి నిలచే మా ప్రభుత్వం మధ్య తరగతి ప్రజానీకానికి పన్నుల పరం గా పెద్ద ఊరట ను కలగజేసింది. ఒక చురుకైనటువంటి మరియు అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడం లో దోహద పడేటటువంటి మరియు అందరికీ ప్రయోజనాల ను అందించేటటువంటి బడ్జెటు ను రూపొందించినందుకు గాను నిర్మల గారి కి మరియు ఆమె ఆధ్వర్యం లోని యావత్తు జట్టు సభ్యుల కు నేను మరో సారి అభినందనల ను తెలియ జేస్తున్నాను. అభినందించడం అనే కాకుండా, నా తోటి దేశ ప్రజలందరికీ నేను పిలుపును ఇస్తున్నాను. ఆ పిలుపు ఏమని అంటే అది.. ఇక కొత్త బడ్జెటు మీ ముందుకు వచ్చింది. కొత్త సంకల్పాల తో ముందుకు సాగిపోదాం. 2047 వ సంవత్సరాని కల్లా మనం ఒక సమృద్ధియుక్తమైనటువంటి భారతదేశాన్ని, ఒక సమర్థమైనటువంటి భారతదేశాన్ని ప్రతి ఒక్క రంగం లో అభివృద్ధి ని సాధించినటువంటి భారతదేశాన్ని నిర్మించితీరుదాం. రండి, ఈ యాత్ర ను మనం ముందుకు తీసుకు పోదాం.. అనేదే.
అనేకానేక ధన్యవాదాలు.