"విపత్తు పట్ల మన ప్రతిస్పందన ఒంటరిగా కాకుండా సమైక్యంగా కావాలి"
“మౌలిక సదుపాయాలు అంటే అవి కేవలం రాబడి గురించి మాత్రమే కాకుండా అందరికీ చేరుకోవడం, స్థితిస్థాపకత గురించి కూడా"
"మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలి"
"ఒక విపత్తు నుంచి మరొక విపత్తు మధ్య కాలంలో స్థితిస్థాపకత నిర్మించబడింది"
"స్థానిక అంతర్ దృష్టి తో కూడిన ఆధునిక సాంకేతిక స్థితిస్థాపకతకు మూలం"
"విపత్తు నిరోధక కార్యక్రమాల విజయానికి ఆర్థిక వనరుల నిబద్ధత కీలకం"

నమస్కారం

గౌరవ అతిథులు, ప్రభుత్వాధినేతలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విధానకర్తలు, ప్రపంచం మొత్తం నుండి వచ్చిన నా ప్రియ మిత్రులారా !

ప్రతి ఒక్కరికీ  అభివాదం. భారతదేశానికి స్వాగతం. తొలుత వైపరీత్యాలను తట్టుకోగల మౌలిక వసతుల కూటమికి అభినందనలు. ఇది తొలుత వైపరీత్యాలను తట్టుకోగల మౌలిక వసతుల కూటమి 5వ సమావేశం. ఐసిడిఆర్ఐ-2023 నిజంగా ప్రత్యేకమైనది.

మిత్రులారా,

ప్రపంచ దృక్కోణం నుంచి సిడిఆర్ఐ ఆవిర్భవించింది.  సన్నిహితంగా అనుసంధానమైన ఈ ప్రపంచంలో వైపరీత్యాల ప్రభావం స్థానికం కానే కాదు. ఒక ప్రాంతంలో ఏర్పడే వైపరీత్యం పూర్తిగా వేరుగా ఉన్న ప్రాంతంఫై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మన స్పందన కూడా ఏకాకిగా కాకుండా ఉమ్మడిగా ఉండాలి.  

మిత్రులారా, 

అతి తక్కువ కాలంలోనే 40 దేశాలు సిడిఆర్ఐలో భాగంగా చేరాయి.  ఈ సదస్సు అతి ప్రధానమైన వేదికగా మారుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు, వర్థమాన దేశాలు;  పెద్ద, చిన్న దేశాలు, ప్రపంచ ఉత్తరాది, దక్షిణాది దేశాలు ఈ వేదికపై ఒక్కటవుతున్నాయి.  ఇందులో భాగస్వామ్యం కేవలం  ప్రభుత్వాలకే పరిమితం కాకపోవడం ప్రోత్సాహకరం. ప్రపంచ స్థాయి సంస్థలు, ఈ రంగ నిపుణులు, ప్రైవేట్ రంగం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

మిత్రులారా, 

మనం మౌలిక వసతుల గురించి చర్చించినప్పుడు ప్రాధాన్యతలను గుర్తు పెట్టుకోవాలి.  వైపరీత్యాలను తట్టుకునే, సమ్మిళిత మౌలిక వసతులు అనేది ఈ ఏడాది సిడిఆర్ఐ ప్రధాన థీమ్. మౌలిక వసతులు కేవలం ఫలితాలకే పరిమితం కాదు... పరిధికి కూడా సంబంధించినవి. మౌలిక వసతులు ఏ ఒక్కరినీ వదిలివేయవు...సంక్షోభ సమయంలో ప్రజలకు సేవలు అందిస్తాయి.  మౌలిక వసతుల విషయంలో సంపూర్ణ దృక్పథం అవసరం. రవాణా మౌలిక వసతుల వలెనే సామజిక, డిజిటల్ మౌలిక వసతులు కూడా అవసరం. 

మిత్రులారా,

వైపరీత్యాల సమయంలో మన హృదయాలు బాధితుల గురించి బాధ పడడం  సహజం. సహాయ, పునరావాస చర్యలకు ప్రాధాన్యత ఉంటుంది. వైపరీత్యాలను తట్టుకోవడం అంటే ఎంత తొందరగా సాధారణ జన జీవనాన్ని పునరుద్ధరిస్తామనేదే. ఒక వైపరీత్యం నుండి మరో వైపరీత్యం మధ్యన నిర్మాణాత్మక చర్యలు చేపట్టడమే.  గతంలో ఏర్పడిన వైపరీత్యాల గురించి అధ్యయనం చేసి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇక్కడే సిడిఆర్ఐ, ఈ సదస్సు ప్రధాన పాత్ర పోషిస్తాయి.  

మిత్రులారా,

ప్రతీ ఒక్క దేశం, ప్రాంతం వేర్వేరు స్వభావం గల వైపరీత్యాలు ఎదుర్కొంటూ ఉంటుంది.  ఆయా ప్రాంతాల్లో వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతులేవి అనేది స్థానిక సమాజాలకు అవగాహన ఉంటుంది. ఆధునిక మౌలిక వసతులు నిర్మించే విషయంలో ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు. స్థానిక పరిజ్ఞానంతో మిళితమైన ఆధునిక టెక్నాలజీ ఇలాంటి మౌలిక వసతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాదు, ఈ స్థానిక టెక్నాలజీని గ్రంధస్థం చేసి ఉంటే అది ప్రపంచ స్థాయిలో అత్యుత్తమైన ప్రాక్టీస్ అవుతుంది.

మిత్రులారా,

సిడిఆర్ఐ తీసుకున్న కొన్ని చర్యలు సమ్మిళిత వైఖరిని చాటుతున్నాయి. ద్వీపకల్ప దేశాలు లేదా పలు ఇతర దేశాలకు మౌలిక వసతులు కీలకంగా ఉంటాయి. ఈ దేశాలు చిన్నవే కావచ్చు...కానీ అక్కడ నివసించే మనుషుల జీవితమే మనందరికీ ప్రధానం.  గత ఏడాది మౌలిక వసతుల ఆక్సిలేటర్ ఫండ్  ను ప్రకటించడం జరిగింది. ఈ 50 మిలియన్  డాలర్ ఫండ్  వర్తమాన దేశాల్లో అద్భుతమైన  ఆసక్తిని రేకెత్తించింది. ఇలాంటి కార్యక్రమాలకు ఆర్థిక వనరులు అత్యంత ప్రధానం.  

మిత్రులారా, 

ఇటీవల ఎదురైన వైపరీత్యాలు వాటి పరిధి ఎంత విస్తృతం అనేది మనకి తెలియజేశాయి.  కొన్ని ఉదాహరణలు చెబుతాను. భారత, యూరప్ దేశాల్లో వడగాలులు సహజం.  పలు ద్వీప దేశాలు భూకంపాలు, తుపానులు,  అగ్ని పర్వతాలు పేలడం వంటి వైపరీత్యాలు ఎదుర్కొంటూ ఉంటాయి.  తుర్కియే, సిరియాల్లో ఏర్పడిన భూకంపాలు ప్రజల జీవితాలు, ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించాయి.   ఇలాంటి సమయంలో మీ అందరి కృషి ఎంతో కీలకంగా నిలిచింది. ఇప్పుడు సిడిఆర్ఐఫై భారీ అంచనాలున్నాయి.  

మిత్రులారా,

ఈ ఏడాది భారతదేశం జి-20 అధ్యక్షత ద్వారా ప్రపంచం యావత్తునూ ఒక్కటి చేస్తోంది.  జి-20 అధ్యక్ష హోదాలో పలు కార్యాచరణ బృందాల్లో సిడిఆర్ఐని కూడా చేర్చడం జరిగింది. ఇక్కడ మీరు కనుగొనే పరిష్కారాలు ప్రపంచ దేశాల్లో అత్యున్నత స్థాయిలో విధానకర్తల దృష్టిని ఆకర్షిస్తాయి. వైపరీత్యాలను తట్టుకోగల మౌలిక వసతులు ప్రత్యేకించి వాతావరణ రిస్క్  లు, వైపరీత్యాలను తట్టుకోగలవి రూపొందించేందుకు సిడిఆర్ఐకి ఇది చక్కని అవకాశం. మరింత తట్టుకోగల మౌలిక వసతులు నిర్మించాలనే భాగస్వామ్య  దృక్పథానికి ఐసిడిఆర్ఐ-2023లో జరిగే చర్చలు చక్కని మార్గం చూపుతాయని నేను విశ్వసిస్తున్నాను.  

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi