The role of civil servants should be of minimum government and maximum governance: PM Modi
Take decisions in the national context, which strengthen the unity and integrity of the country: PM to civil servants
Maintain the spirit of the Constitution as you work as the steel frame of the country: PM to civil servants

కార్యనిర్వాహక వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తున్న మన యువతరం వినూత్నమైన, విభిన్నమైన ఆలోచనలకోసం సిద్ధంగా ఉంది. సరికొత్తగా ప్రయత్నించాలని అనుకుంటుంది. ఇది నాలో సరికొత్త ఆశలు కల్పిస్తోంది. అందుకే మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. గతేడాది సరిగ్గా ఇదేరోజు కేవడియాలో మీ ముందు బ్యాచ్ శిక్షణ అధికారులతో సవిస్తారంగా నా ఆలోచనలను పంచుకున్నాను. అప్పటినుంచి ప్రతి ఏడాది ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని సర్దార్ పటేల్ విగ్రహం వద్ద, నర్మదానది ఒడ్డున యువ అధికారులతో కలవాలని.. రోజంతా మీతోనే ఉండి మీ ఆలోచనలు తెలుసుకోవాలని.. ప్రారంభంలోనే మీ ఆలోచనలకు ఓ ప్రత్యేక రూపాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాం. అయితే ఈసారి కరోనా మహమ్మారి కారణంగా.. మీతో నేరుగా సమావేశమవడం కుదరలేదు. ఈసారి మీరంతా ముస్సోరీ నుంచి వర్చువల్ వేదిక ద్వారా అనుసంధానమై ఉన్నారు. ఇవాళ్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ.. నేను చెబుతున్న దొక్కటే.. కరోనా ప్రభావం కాస్త తగ్గిన తర్వాత మీరంతా కలిసి సర్దార్ పటేల్ భవ్యమైన ఈ విగ్రహం వద్ద ఓ క్యాంప్ ఏర్పాటుచేసుకోండి. కొంతసమయం ఇక్కడ గడపండి.. భారతదేశంలోని ఈ ప్రత్యేకమైన, ఓ చక్కటి పర్యాటక కేంద్రం ఎలా అభివృద్ధి చెందుతుందో మీరు కూడా తెలుసుకోండి.

మిత్రులారా, ఏడాదిక్రితం ఉన్న పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు చాలా తేడా ఉంది. సంకట సమయంలో దేశం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టింది? దేశ వ్యవస్థ ఏ విధమైన పనులు చేసింది? అనే విషయాలనుంచి చాలా నేర్చుకుంటారనే విశ్వాసం నాకుంది. మీరు కేవలం చూడటం మాత్రమే కాదు. అనుభవం ద్వారా నేర్చుకుని ఉంటారని భావిస్తున్నాను. కరోనాతో పోరాటం సందర్భంగా భారతదేశం చాలా అంశాల్లో ఇతరులపై ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. సంకల్పంతో ఏదైనా సిద్ధిస్తుంది అనడానికి ఇదోక మంచి ఉదాహరణ.

మిత్రులారా, భారతదేశం ప్రగతిపథంలో దూసుకుపోతున్న ఈ తరుణంలో.. మీరు అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇది చాలా ప్రత్యేకమైన సమయం. మీ బ్యాచ్ కార్యక్షేత్రంలోకి వెళ్లి పని ప్రారంభించే సమయంలో.. భారతదేశం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుంది. అధికారులుగా మీ బాధ్యతలు ప్రారంభించిన సమయం, 75వ స్వాతంత్ర్య వేడులకు జరుపుకునే సమయం ఒకేసారి వచ్చిన ఓ అద్భుతమైన సమయంలో.. నేను  చెప్పే ఓ మాటలను గుర్తుంచుకోండి. అవసరమైతే డైరీలో రాసిపెట్టుకోండి. మీరు దేశ సేవలో ఉన్నప్పుడు, మీ కెరీర్.. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 100వ స్వాతంత్ర్య వేడుకల మధ్య కొనసాగుతుంది. భారతదేశాభివృద్ధిలో అత్యంత కీలకమైన ఈ సమయంలో మీరు దేశ సేవలో ఉండటం నిజంగా మీ అదృష్టం. 25 ఏళ్లపాటు దేశ రక్షణ, పేదల సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం వంటి చాలా కీలకమైన పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మీపై ఉంది. మనలో చాలా మంది అప్పటివరకు మీతోనే ఉండకపోవచ్చు. కానీ మీ సంకల్పం, మీ సంకల్ప సిద్ధది మీతోనే ఉంటుంది. అందుకే ఈ పవిత్రమైన సందర్భంలో మీకు మీరే ఎన్నో ప్రమాణాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రమాణాలకు మీకు మీరే సాక్షులు. మీ ఆత్మే సాక్షి. మీకు ఓ విన్నపం. ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఓ అరగంట మీకోసం కేటాయించుకోండి. మీ ఆలోచనలను, మీ కర్తవ్యాలను, మీ బాధ్యతలతోపాటు మీ ప్రమాణం గురించి కూడా సమీక్షించుకోండి. దాన్ని రాసిపెట్టుకోండి.

మిత్రులారా, మీ సంకల్పాన్ని రాసిపెట్టుకుంటున్న కాగితానికి మీ కలల రూపాన్ని ఇవ్వండి. అది కాగితం ముక్కమాత్రమే కాదు. మీ హృదయస్పందన కావాలి. ఈ కాగితం ముక్కే జీవితాంతం.. మీ శరీరంలో హృదయ స్పందన ఎలాంటిదో.. అలాగే మీ సంకల్పానికి నిరంతరం బలాన్ని ఇచ్చేలా ఉండాలి. మీ ఆలోచనలకు గతిని ఇచ్చేలా, మార్గదర్శనం చేసేలా ఉండాలి. ప్రతి కలను సంకల్పంగా.. సంకల్పాన్ని సిద్ధించుకునేందుకు ఓ ప్రవాహాన్ని ఏర్పాటుచేసుకుని అందులో ముందుకు సాగుతూ ఉండాలి. అలాంటప్పుడు మీకు ఎలాంటి ప్రత్యేకమైన ప్రేరణ, పాఠాల అవసరమే ఉండదు. మీకు మీరే రాసుకున్న ఈ కాగితం.. మీ హృదయ భాషను వెల్లడిస్తుంది. ఇది నిరంతరం మీ సంకల్పాన్ని మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది.

మిత్రులారా, మన దేశంలో సివిల్ సర్వీసెస్ ప్రారంభానికి సర్దార్ పటేల్ ముఖ్య కారకులు. 1947, ఏప్రిల్ 21న అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారుల మొదటి బ్యాచ్ ను ఉద్దేశించి సర్దార్ పటేల్ ప్రసంగిస్తూ.. సివిల్ సర్వీసెస్ మన దేశానికి ఓ ఉక్కు కవచం వంటిదని అభివర్ణించారు. దేశ ప్రజల సేవే మీకు సర్వోన్నత బాధ్యత కావాలని సూచించారు. నేను కూడా ఇదే  సూచిస్తాను. సివిల్ సర్వెంట్లుగా మీరు తీసుకునే నిర్ణయాలు.. అవి దేశహితానికి సంబంధించినవి, దేశ సమగ్రతను బలపరిచేవి, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేలా ఉండాలి. మీ క్షేత్రం చిన్నదైనా సరే.. మీరు బాధ్యతలు చేపట్టే బాధ్యత చిన్నదయినా.. మీ నిర్ణయాన్నీ దేశ హితాన్ని కాంక్షించేవిధంగానే ఉండాలి. జాతీయవాదాన్ని ప్రతిబింబించాలి.

మిత్రులారా, ఉక్కు కవచం పని.. కేవలం ఆధారాన్ని ఇవ్వడమే. ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడమే. ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని మీరు ఓ బలమైన శక్తిగా మారి సంకట పరిస్థితులనుంచి బయటపడేయడమే. అనుసంధానకర్తగా మీ ఫలప్రదమైన మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలి. కార్యక్షేత్రంలోకి వెళ్లిన తర్వాత విభిన్నమైన వ్యక్తిత్వాల మధ్య కూడా మీ సంకల్పాన్ని ఎప్పుడూ మరువకూడదు. ఫ్రేమ్ ఏదైనా.. అది బండి చట్రమైనా, కళ్లద్దాల ఫ్రేమ్ అయినా.. ఏదైనా చిత్రపటం ఫ్రేమ్ అయినా.. అది బలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఉక్కు కవచంలో ఉన్న మీ బాధ్యతలుమరింత కీలకమైనవి. మీరంతా ఒక బృందంగా ఉన్నప్పుడే మీరు అనుకున్న లక్ష్యలను సాధించగలరు. మీరు వెళ్లగానే  జిల్లాల బాధ్యతలను చూసుకోవాలి. విభిన్న విభాగాల బాధ్యతలు చూసుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలు మొత్తం రాష్ట్రంపై ప్రభావం చూపేలా ఉండాలి. అలాంటప్పుడు మీ ఈ బృంద భావనే మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని.. మీ సంకల్పాలకు అనుగుణంగా పనిచేయండి. మీరు ఏ సర్వీసులో ఉన్నా.. ఓ బృందంలాగా అందరినీ కలుపుకుని ముందుకెళ్లండి. అలాంటప్పుడు మీరెప్పుడూ వెనుకడువేయడమో. విఫలమవడమో జరగదు. ఎప్పుడు విజయాలు సాధిస్తూనే ఉంటారని సంపూర్ణ వివ్వాసంతో చెబుతున్నాను.

మిత్రులారా, సర్దార్ పటేల్ ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ స్వప్నాన్ని చూశారు. నాటి వారి స్వప్నమే.. నేటి ‘ఆత్మనిర్భర్ భారత్’తో అనుసంధానమై ఉంది. కరోనా మహమ్మారి సమయంలోనూ మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం. అవన్నీ ఆత్మనిర్భరతను బలపరిచేవే. నేటు ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ భావన, ఆత్మనిర్భర భారత్ భావన, నవభారత నిర్మాణ భావనను నిజం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాం. కొత్తదనానికి ఎన్నో అర్థాలుంటాయి. నా దృష్టిలో కొత్తదనమంటే.. పాతదనాన్ని పక్కనపెట్టి కొత్తగా ముందుకెళ్లడం అని కాదు. పునర్ యవనాన్ని పొందడం, సృజనాత్మకతతో ఆలోచించడం, ఫ్రెష్ కావడం, సరికొత్త శక్తిని పొందడం అని అర్థం. పాతదానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తూ.. అనవసరమైన వాటిని పక్కనపెడుతూ ముందుకెళ్లాలి. కొన్నింటిని వదులుకునేందుకు కూడా ధైర్యం కావాలి. అందుకోసం ఈరోజు నవ, శ్రేష్ఠ, ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించేందుకు అవసరమైన వాటికోసం నిరంతరం సమీక్ష జరగాలి. మిత్రులారా, ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించేందుకు మనకు శాస్త్ర, సాంకేతికత అవసరం చాలా ఉంది.  దీంతోపాటుగా వనరులు, ఆర్థిక వనరుల అవసరం కూడా ఉంది. కానీ ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో సివిల్ సర్వెంట్లుగా మీ మహత్వపూర్ణ బాధ్యత ఏంటనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయడంలో మీ పని సామర్థ్యం, పనివేగంతో ముందుకెళ్లేందుకు 24 గంటలపాటు దృష్టిసారించాల్సి ఉంటుంది.

మిత్రులారా, దేశంలో మార్పు తీసుకువచ్చేందుకు, కొత్త లక్ష్యాలను  చేరుకునేందుకు కొత్త మార్గాలను, కొత్త పద్ధతులను నేర్చుకునేందుకు ‘శిక్షణ’ పాత్ర చాలా కీలకం. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధిపై దృష్టిపెట్టడం అవసరం. గతంలో దీనిపై పెద్దగా దృష్టిపెట్టేవారు కాదు. శిక్షణలో ఆధునీకరణను ఎలా జోడించాలనేదిపై పెద్దగా ఆలోచించలేదు. కానీ నేటి పరిస్థితుల్లో దేశంలోని మానవవనరులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడంపైనా మరింత శ్రద్ధ వహించాలి. గత మూడు-నాలుగేళ్లుగా సివిల్ సర్వెంట్ల శిక్షణలోనూ ఎలాంటి మార్పులు వచ్చాయో మీరు గమనించే ఉంటారు. ‘ఆరంభం’ కేవలం ఆరంభం మాత్రమే కాదు. ఇదో సరికొత్త పరంపరకు ప్రతీక. ఇందులో భాగంగానే ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానిపేరే ‘మిషన్  కర్మయోగి’. దేశంలో సామర్థ్య నిర్మాణం దిశగా చేపట్టిన ఓ ప్రయోగం ఇది. ఈ మిషన్ ద్వారా ప్రభుత్వాధికారులకు మరింత అధునాతనమైన శిక్షణను అందించడంతోపాటు వారి ఆలోచనలో, కార్యశైలిలో మార్పు తీసుకొచ్చేందుకు వారి స్కిల్-సెట్ ను మరింత పెంచేందుకు.. వారిని కర్మయోగులుగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోంది.

మిత్రులారా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘యజ్ఞ్ అర్థాత్ కర్మణ: అన్యత్ర లోక: అయమ్ కర్మ బంధన:’ అని చెబుతారు. అంటే.. యజ్ఞం లేదా సేవకు బదులుగా.. స్వార్థం కోసం చేసిన పనులు కర్తవ్యం గా కీర్తించబడవు. అవి మనల్ని బంధనంలో, ఉచ్చులో చిక్కుకునేలా చేస్తాయనేది దానర్థం. ఓ దీర్ఘదృష్టితో, ఓ పెద్ద లక్ష్యాని ముందుంచుకుని మనం చేసేదే కర్మ అనిపించుకుంటుంది. ఈ కర్మతో మనమంతా కర్మయోగిగా మారాల్సిన అవసరముంది. మిత్రులారా, మీరంతా ఏ సుదీర్ఘమైన ప్రయాణానికి బయలుదేరుతున్నారో.. అందులో నియమ నిబంధనల పాత్ర కీలకం. వీటితోపాటు మీ పాత్రను కూడా గుర్తెరిగి నడవాల్సి ఉంటుంది. నియమ నిబంధనలకు, మన పాత్రకు మధ్య చాలా సంఘర్షణ ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిబంధనలకు మహత్వమైవని.. మన పాత్ర మహత్వపూర్ణమైనది. ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఇది ఓ బిగుతుగా ఉన్న తాడుపై నడిచే ఆటలాంటిది. కొంతకాలంగా ప్రభుత్వం కూడా పాత్ర ఆధారిత విధానంపై ఎక్కువ దృష్టి పెట్టింది. దీని ఫలితం కూడా స్పష్టంగా కనబడుతోంది. ముందుగా సివిల్ సర్వీసెస్ లో సామర్థ్యం, యోగ్యత, సృజనాత్మకతకు అవసరమైన సరికొత్త ఆర్కిటెక్చర్ నిర్మితమైంది. రెండోది.. నేర్చుకునే విధానాలు ప్రజాస్వామ్య బద్ధమయ్యాయి. మూడోది.. ప్రతి అధికారికీ తన సామర్థ్యం, ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పోస్టింగ్ ఇవ్వాలనేది నిర్ణయమవుతోంది. మీకు ఇచ్చిన బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మీ సంపూర్ణ జీవితం సానుకూలంగా ముందుకెళ్తుందనేదే.. ఈ ఆలోచన వెనక ముఖ్యోద్దేశం. ఈ సానకూలతే.. విజయమార్గాన్ని చూపిస్తుంది. ఓ కర్మయోగిగా మీ సంతోషానికి బాటలు వేస్తుంది.   

మిత్రులారా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘యజ్ఞ్ అర్థాత్ కర్మణ: అన్యత్ర లోక: అయమ్ కర్మ బంధన:’ అని చెబుతారు. అంటే.. యజ్ఞం లేదా సేవకు బదులుగా.. స్వార్థం కోసం చేసిన పనులు కర్తవ్యం గా కీర్తించబడవు. అవి మనల్ని బంధనంలో, ఉచ్చులో చిక్కుకునేలా చేస్తాయనేది దానర్థం. ఓ దీర్ఘదృష్టితో, ఓ పెద్ద లక్ష్యాని ముందుంచుకుని మనం చేసేదే కర్మ అనిపించుకుంటుంది. ఈ కర్మతో మనమంతా కర్మయోగిగా మారాల్సిన అవసరముంది. మిత్రులారా, మీరంతా ఏ సుదీర్ఘమైన ప్రయాణానికి బయలుదేరుతున్నారో.. అందులో నియమ నిబంధనల పాత్ర కీలకం. వీటితోపాటు మీ పాత్రను కూడా గుర్తెరిగి నడవాల్సి ఉంటుంది. నియమ నిబంధనలకు, మన పాత్రకు మధ్య చాలా సంఘర్షణ ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిబంధనలకు మహత్వమైవని.. మన పాత్ర మహత్వపూర్ణమైనది. ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఇది ఓ బిగుతుగా ఉన్న తాడుపై నడిచే ఆటలాంటిది. కొంతకాలంగా ప్రభుత్వం కూడా పాత్ర ఆధారిత విధానంపై ఎక్కువ దృష్టి పెట్టింది. దీని ఫలితం కూడా స్పష్టంగా కనబడుతోంది. ముందుగా సివిల్ సర్వీసెస్ లో సామర్థ్యం, యోగ్యత, సృజనాత్మకతకు అవసరమైన సరికొత్త ఆర్కిటెక్చర్ నిర్మితమైంది. రెండోది.. నేర్చుకునే విధానాలు ప్రజాస్వామ్య బద్ధమయ్యాయి. మూడోది.. ప్రతి అధికారికీ తన సామర్థ్యం, ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పోస్టింగ్ ఇవ్వాలనేది నిర్ణయమవుతోంది. మీకు ఇచ్చిన బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మీ సంపూర్ణ జీవితం సానుకూలంగా ముందుకెళ్తుందనేదే.. ఈ ఆలోచన వెనక ముఖ్యోద్దేశం. ఈ సానకూలతే.. విజయమార్గాన్ని చూపిస్తుంది. ఓ కర్మయోగిగా మీ సంతోషానికి బాటలు వేస్తుంది.   

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi