రాష్ట్ర ప్రజల ఐకమత్యాన్ని, సమష్టి ప్రయాసల ను ఆయన ప్రశంసించారు
‘‘జోడు ఇంజన్ ల ప్రభుత్వం అలుపెరుగని కృషి ద్వారా త్రిపుర అవకాశాల గడ్డ గా మారుతున్నది’’
‘‘సంధానం సంబంధి మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారారాష్ట్రం శరవేగం గా ట్రేడ్ కారిడార్ కు హబ్ గా రూపుందుతున్నది’’


నమస్కారం!

ఖులుమఖా!

రాష్ట్రం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రిపుర ప్రజలందరికీ శుభాకాంక్షలు! త్రిపుర నిర్మాణానికి, అభివృద్ధికి సహకరించిన గొప్ప వ్యక్తులందరిని నేను గౌరవపూర్వకంగా అభినందిస్తున్నాను; వారి కృషికి వందనం!

త్రిపుర చరిత్ర ఎప్పుడూ మహిమాన్వితమైనదే. మాణిక్య వంశ చక్రవర్తుల ఘనత నుండి నేటి వరకు, త్రిపుర ఒక రాష్ట్రంగా తన పాత్రను బలోపేతం చేసుకుంది. అది గిరిజన సమాజమైనా లేదా ఇతర సంఘాలైనా, త్రిపుర అభివృద్ధికి అందరూ ఐక్యంగా కృషి చేశారు. త్రిపుర సుందరి మాత ఆశీస్సులతో, త్రిపుర ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంది.

 

త్రిపుర నూతన అభివృద్ధి శిఖరాలకు పయనిస్తున్న దశలో త్రిపుర ప్రజల జ్ఞానం చాలా దోహదపడింది. మూడేళ్ల అర్థవంతమైన మార్పు ఈ విజ్ఞతకు నిదర్శనం. త్రిపుర ఈ రోజు అవకాశాలకు వేదికగా నిలిచింది. ఈ రోజు, త్రిపురలోని సామాన్య ప్రజల చిన్న చిన్న అవసరాలు సైతం తీర్చడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఫలితంగా, త్రిపుర, ఈరోజు, అనేక అభివృద్ధి రంగాలలో మంచి పనితీరును కనబరుస్తోంది. రాష్ట్రం ఈ రోజు, భారీ అనుసంధానత కలిగిన మౌలిక సదుపాయాల ద్వారా వాణిజ్య కారిడార్లకు కేంద్రంగా మారుతోంది. చాలా దశాబ్దాలుగా, త్రిపుర నుండి భారతదేశంలో మిగిలిన ప్రాంతాలకు వెళ్ళడానికి రోడ్డు మార్గం మాత్రమే అందుబాటులో ఉండేది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో, రహదారులు మూసుకుపోవడం వల్ల, త్రిపుర తో సహా మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో నిత్యావసర వస్తువుల కొరత ఉండేది. ఈ రోజు, త్రిపుర రహదారులతో పాటు, రైలు, విమాన, అంతర్గత జల మార్గాలను కూడా కలిగి ఉంది. బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ పోర్ట్‌ ను ఏర్పాటు చేసిన తర్వాత, దానిని వినియోగించుకోడానికి అవకాశం కల్పించాలని త్రిపుర చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోంది. 2020 లో బంగ్లాదేశ్ నుంచి మొదటి ట్రాన్సిట్ కార్గో అఖౌరా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ కు వచ్చినప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఈ డిమాండ్‌ను తీర్చింది. రైలు మార్గాల అనుసంధానత లో త్రిపుర కూడా దేశంలోని అగ్రగామి రాష్ట్రాల సరసన చేరుతోంది. కొద్ది రోజుల క్రితం మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయాన్ని కూడా విస్తరించడం జరిగింది.

 

మిత్రులారా!

త్రిపుర, ఈ రోజు, ఒకవైపు, పేదలకు పక్కా గృహాలను అందించడంలో ప్రశంసనీయమైన కృషి చేస్తూనే, మరోవైపు, నూతన సాంకేతికతను కూడా వేగంగా స్వీకరిస్తోంది. గృహ నిర్మాణంలో నూతన సాంకేతికతను వినియోగిస్తున్న దేశంలోని ఆరు రాష్ట్రాల్లో త్రిపుర కూడా ఒకటి. ఈ మూడేళ్లలో జరిగింది, కేవలం ప్రారంభం మాత్రమే. త్రిపుర యొక్క వాస్తవ సామర్థ్యం ఇంకా తెరపైకి రావలసి ఉంది.

పరిపాలన లో పారదర్శకత నుండి ఆధునిక మౌలిక సదుపాయాల వరకు, నేడు నిర్మించబడుతున్న త్రిపుర రాబోయే దశాబ్దాలకు రాష్ట్రాన్ని సిద్ధం చేస్తోంది. శ్రీ బిప్లబ్ దేబ్ జీ మరియు అతని బృందం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతి గ్రామానికి వంద శాతం సౌకర్యాలు చేరుకునేలా, ఇటీవల, త్రిపుర ప్రభుత్వం, ప్రచారాన్ని ప్రారంభించింది. త్రిపుర ప్రజల జీవితాలను సులభతరం చేయడంలో, ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నం చాలా దోహదపడుతుంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ, త్రిపుర రాష్ట్రంగా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కొత్త తీర్మానాలు, అవకాశాలకు ఇది చాలా మంచి సమయం. మన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగాలి. మనమందరం కలిసి అభివృద్ధి పథంలో ముందుకు సాగుదాం. ఈ విశ్వాసంతో, నేను, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను !

ధన్యవాదములు!

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 డిసెంబర్ 2024
December 27, 2024

Citizens appreciate PM Modi's Vision: Crafting a Global Powerhouse Through Strategic Governance