గౌరవనీయులైన స్పీకర్ సర్,
ఈ రోజు న నేను, ఒక అతి ముఖ్యమైనటువంటి మరియు చరిత్రాత్మకమైనటువంటి విషయాని కి సంబంధించిన సమాచారాన్ని దేశాని కి వెల్లడించడం కోసం, మీ మధ్య కు ప్రత్యేకం గా విచ్చేశాను.
ఈ విషయం మన సాటి కోట్లాది సోదరీమణుల కు మరియు సోదరుల కు మల్లేనే నా యొక్క హృదయాని కి కూడాను ఎంతో సన్నిహితమైనటువంటి విషయం గా ఉంది. మరి దీని ని గురించి మాట్లాడటాన్ని నేను ఎంతో గౌరవప్రదం గా భావిస్తున్నాను.
ఈ విషయం శ్రీ రామ జన్మ భూమి తో ముడిపడి ఉంది. ఇది అయోధ్య లో భగవాన్ శ్రీ రాముని జన్మ స్థలం లో ఒక వైభవోపేతమైనటువంటి ఆలయ నిర్మాణాని కి సంబంధించింది.
గౌరవనీయులైన స్పీకర్ సర్,
2019వ సంవత్సరం నవంబర్ 9వ తేదీ నాడు గురు నానక్ దేవ్ జీ యొక్క 550వ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో కర్ తార్ పుర్ సాహిబ్ కారిడోర్ ను దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం కోసం నేను పంజాబ్ కు వెళ్ళాను. అటువంటి పవిత్రమైన వాతావరణం లో రామ జన్మ భూమి విషయం పై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన చరిత్రాత్మక నిర్ణయాన్ని గురించి నేను తెలుసుకోవడం జరిగింది.
వివాదం లో ఉన్నటువంటి రామ జన్మ భూమి కి సంబంధించిన అంతర మరియు బాహ్య ప్రాంగణాల పై భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్ మాన్ కు హక్కు ఉందని మాననీయ సర్వోన్నత న్యాయస్థానం ఆ నిర్ణయం లో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఒకదానితో మరొకటి సంప్రదింపులు జరుపుకొని, 5 ఎకరాల భూమి ని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కు కేటాయించాలని కూడా మాననీయ సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశం లో తెలిపింది.
గౌరవనీయులైన స్పీకర్ సర్,
ఈ రోజు న ఈ సమున్నత సభ దృష్టి కి మరియు యావత్తు దేశం దృష్టి కి నేను ఎంతో సంతోషం తో తెలియజేసేది ఏమిటంటే- కేంద్ర మంత్రివర్గం ఇవాళ ఉదయం సమావేశమై, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ను పరిగణన లోకి తీసుకొని ఈ అంశం లో ముఖ్యమైన నిర్ణయాల ను చేసింది- అనేదే.
సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన దానికి అనుగుణం గా నా ప్రభుత్వం భగవాన్ శ్రీ రాముని జన్మ స్థలం లో ఒక భవ్య మందిరాన్ని నిర్మించేందుకు మరియు సంబంధిత ఇతర అంశాల పై ఒక సమగ్ర పథకాన్ని రూపొందించింది.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు – ‘‘శ్రీ రామ్ జన్మ భూమి తీర్థ క్షేత్ర’’ – అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ట్రస్టు ను ప్రారంభించాలనే ఒక ప్రతిపాదన కు ఆమోదం తెలియజేయడమైంది.
అయోధ్య లో భగవాన్ శ్రీ రాముని జన్మ స్థలం లో ఒక చాలా గొప్పదైనటువంటి మరియు పవిత్రమైనటువంటి శ్రీ రామ దేవాలయాన్ని నిర్మించేందుకు మరియు దానితో సంబంధం ఉన్న అంశాల లో నిర్ణయాలు తీసుకొనేందుకు ఈ ట్రస్టు కు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది.
గౌరవనీయులైన స్పీకర్ సర్,
మాననీయ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల కు అనుగుణం గా, కూలంకష సంప్రదింపులు మరియు చర్చోపచర్చల జరిపిన అనంతరం, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కు 5 ఎకరాల భూమి ని కేటాయించవలసింది గా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించడమైంది. దీనికి, ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతి ని వ్యక్తం చేసింది.
గౌరవనీయులైన స్పీకర్ సర్,
భగవాన్ శ్రీ రాముని దివ్య ఘనత ను, అయోధ్య యొక్క చారిత్రక సందర్భాన్ని, అలాగే అయోధ్య ధామ్ యొక్క పవిత్రత ను గురించి మనకు అందరి కీ ఎంతో బాగా తెలుసు ను. ఇవన్నీ కూడా ను భారతదేశం యొక్క ఆత్మ కు, ఆదర్శాల కు మరియు నైతికత కు అభిన్నమైనటువంటివి గా ఉన్నాయి.
అయోధ్య లో భగవాన్ శ్రీ రాముని కి ఒక భారీ మందిర నిర్మాణం మరియు వర్తమానం కాలం లోను, భవిష్యత్తు కాలం లోను రామ్ లాలా యొక్క దర్శనం కోరి తరలివచ్చే తీర్థ యాత్రికుల సంఖ్య ను, అలాగే వారి యొక్క భావోద్వేగాల ను దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం మరొక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకొన్నది.
అయోధ్య చట్టం పరిధి లో సేకరించినటువంటి మొత్తం సుమారు గా 67,703 ఎకరాల భూమి (దీని లో లోపలి మరియు వెలుపలి ప్రాంగణాలు కూడా కలసివున్నాయి)ని నూతనం గా ఏర్పాటైన ‘‘శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర’’ ట్రస్టు కు ధారదత్తం చేయాలని నా ప్రభుత్వం నిర్ణయించింది.
గౌరవనీయులైన స్పీకర్ సర్,
2019వ సంవత్సరం నవంబర్ 9వ తేదీ నాడు రామ జన్మభూమి అంశం లో కోర్టు ఉత్తర్వు వెలువడిన అనంతరం భారతదేశ ప్రజలు మన ప్రజాస్వామిక వ్యవస్థ ల పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని కలిగివుంటూ, గొప్ప పరిణతి ని ప్రదర్శించారు.
మన సాటి పౌరుల పరిపక్వత కలిగిన నడవడిక కు ఈ రోజు న ఈ సభ లో నమస్కరిస్తున్నాను.
మన సంస్కృతి మరియు మన సంప్రదాయాలు మనకు ‘‘వసుధైవ కుటుంబకమ్’’ మరియు ‘‘సర్వే భవన్తు సుఖిన:’’ ల తాలూకు తత్వాన్ని ప్రసాదించాయి. మరి ఈ స్ఫూర్తి తో ముందుకు సాగడానికి మనకు ప్రేరణ ను అందించాయి.
భారతదేశం లో అన్ని విశ్వాసాల కు చెందిన ప్రజలు, వారు హిందువులు కావచ్చు, ముస్లిములు కావచ్చు, సిఖ్ఖులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, పారశీలు లేదా జైనులు కావచ్చు.. అందరూ ఒక పెద్ద పరివారం లో సభ్యులే.
ఈ కుటుంబం లోని ప్రతి ఒక్క సభ్యుడు/సభ్యురాలు అభివృద్ధి చెందుతూ, ఆరోగ్యం గాను, సంతోషం తోను ఉంటూ, సౌభాగ్యాన్ని పొందుతూ, మరి దేశం పురోగమించాలనే భావన తో నా ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్‌కా విశ్వాస్’ సూత్రం తో ముందుకు కదులుతున్నది.
ఈ ప్రాముఖ్యం గల ఘడియ లో అయోధ్య లో శ్రీ రామ్ ధామ్ యొక్క జీర్ణోద్ధరణ కై భారీ రామ మందిర నిర్మాణం కోసం ముక్తకంఠం తో మద్దతు ను ఇవ్వడం లో కలసి రావలసింది గా నేను ఈ సమున్నత సభాసదులందరి కి పిలుపునిస్తున్నాను.