కేంద్ర మంత్రివర్గం లో నా సహచరుడు, శ్రీ రాజ్ నాథ్ సింగ్ జీ, హిమాచల్ ప్రదేశ్ లోకప్రియ ముఖ్యమంత్రి, సోదరుడు జైరాం ఠాకూర్, కేంద్రంలో నా తోటి మంత్రి, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన అబ్బాయి, సోదరుడు అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు లాహాల్-స్పితి కి చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా .
చాలా కాలం తర్వాత ఈ రోజు మీ అందరి మధ్యకి రావడం నాకు చాలా సంతోషకరమైన అనుభవం. అటల్ టన్నెల్ ప్రారంభం సందర్భంగా మీ అందరికీ అభినందనలు మరియు శుభాకాంక్షలు.
మిత్రులారా,
కొన్ని సంవత్సరాల క్రితం, మీ మధ్యకి నేను ఒక కార్యకర్తగా ఇక్కడకు వచ్చినప్పుడు, సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాతనే నేను రోహతాంగ్ చేరుకునేవాడిని. శీతాకాలంలో రోహ్తాంగ్ పాస్ మూసివేయబడినప్పుడు, వైద్యం, విద్య, సంపాదన వంటి అన్ని మార్గాలు కూడా ఎలా మూసివేయబడ్డాయో నేను చూశాను. ఆ సమయంలో నా సహోద్యోగులలో చాలామంది ఇప్పటికీ చురుకుగా ఉన్నారు. కొంతమంది సహచరులు ఇప్పుడు మన మధ్య లేరు.
కిన్నౌర్ కు చెందిన మన ఠాకూర్ సేన్ నేగీ గారు, ఆయనతో మాట్లాడటానికి, తెలుసుకోవటానికి మరియు చాలా నేర్చుకునే అవకాశం నాకు లభించింది, నేగి గారు హిమాచల్కు ఒక అధికారిగా మరియు ప్రజా ప్రతినిధిగా చాలా సేవలందించారు.. బహుశా అతను 100 సంవత్సరాలు పూర్తి చేసి ఉండవచ్చు,ఏమైనా మిగిలాయా? కానీ జీవితంలో చివరి వరకు, వారు చాలా చురుకుగా ఉన్నారు. ఆయన వ్యక్తిత్వం చాలా శక్తివంతమైనది, ఆయన చాలా స్పూర్తినిచ్చేవాడు. నేను ఆయనను చాలా అడుగుతూనే ఉండేవాడిని , అతను నాకు చాలా చెప్పేవాడు, అతను సుదీర్ఘ చరిత్రకు సాక్షి. మరియు ఈ మొత్తం ప్రాంతం గురించి తెలుసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో వారు నాకు చాలా సహాయపడ్డారు.
మిత్రులారా,
అటల్ జీకి ఈ ప్రాంతంలోని అన్ని సమస్యల గురించి కూడా బాగా తెలుసు. ఈ పర్వతాలు అటల్ జీకి చాలా ప్రియమైనవి. 2000 సంవత్సరంలో, అటల్జీ కెలాంగ్కు వచ్చినప్పుడు మీ బాధలు తీర్చడానికి ఈ సొరంగమార్గాన్ని ప్రకటించారు. ఆ సమయంలో, ఈ ప్రాంతమంతా పండుగ వాతావరణంతో నిండి ఉండడం నాకు ఇప్పటికీ గుర్తుంది. దీనికి సాక్ష్యంగా, గొప్ప ప్రభుత్వ సేవకుడు తాషి దవా జీ, ఆయన సంకల్పం కూడా నేడు నెరవేరింది . ఆయన, ఇతర సహచరుల ఆశీస్సులతో ఇది సాధ్యమైంది.
మిత్రులారా,
అటల్ సొరంగమార్గం ఏర్పాటుతో లాహౌల్ ప్రజల జీవితాలలో నవోదయం వచ్చింది , పాంగి ప్రజల జీవితాలు కూడా మారబోతున్నాయి . 9 కిలోమీటర్ల ఈ సొరంగం నుండి నేరుగా 45-46 కిలోమీటర్ల దూరం తగ్గించబడింది. ఈ ప్రాంతంలోని అనేక మంది సహచరులు తమ జీవితకాలంలో ఈ అవకాశాన్ని కూడా పొందగలరనే విషయాన్ని ఎన్నడూ ఊహించలేదు. చలికాలం లో ఒక మార్గం కోసం వేచి చూసి, నొప్పి లో, ఆ బాధ అనుభవించిన వారు, ఎంతమంది రోగులనో చూసిన వారు ఈ ప్రజలు. నేడు, తమ పిల్లలు, కుమారులు మరియు కుమార్తెలు, ఇప్పుడు ఆ కష్టదినాలను చూడవలసిన అవసరం లేదని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మిత్రులారా,
అటల్ సొరంగమార్గం ఏర్పాటుతో లాహాల్-స్పితి, పాంగి రైతులు, ఉద్యానవనంతో సంబంధం ఉన్న వ్యక్తులు, పశువుల పెంపకందారులు, విద్యార్థులు, వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు, అందరూ లబ్ధి పొందబోతున్నారు. ఇప్పుడు లాహాల్ రైతుల క్యాబేజీ, బంగాళాదుంపలు మరియు బఠానీల పంటలు వృథా కాకుండా, వేగంగా మార్కెట్కు చేరుతాయి.
చంద్రముఖి ఆలూ లాహాల్ గుర్తింపుగా మారింది, నేను కూడా రుచి చూశాను. చంద్రముఖి బంగాళాదుంపకు కొత్త మార్కెట్లు కూడా లభిస్తాయి, కొత్త కొనుగోలుదారులు దొరుకుతారు, కొత్త మార్కెట్ దొరుకుతుంది. ఇప్పుడు, కొత్త కూరగాయలు మరియు కొత్త పంటల మాదిరిగా, ఈ ప్రాంతంలో ధోరణి వేగంగా పెరుగుతుంది.