నేను నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు, మీకందరికీ ఒక వినతి చేస్తున్నాను... మీరు ఎక్కడ ఉన్న సరే, మీరు కూర్చున్న చోటే.. లేచి నిలబడనక్కర లేదు... మనం కూర్చొని ఉండే, ఈ నెల 22న మనం కోల్పోయిన కుటుంబసభ్యులకు నివాళిని సమర్పిద్దాం... మీరు ఆసీనులై ఉన్న చోటు నుంచే, కొన్ని క్షణాల పాటు మౌనాన్ని పాటించండి... మనం మన ఆరాధ్య దైవాలను స్మరించుకొంటూ, మొన్నటి మృతులందరికీ శ్రద్ధాంజలిని సమర్పిద్దాం. ఇది అయ్యాక, నేను నా నేటి ప్రసంగాన్ని మొదలుపెడతాను.
ఓం శాంతి శాంతి శాంతి.
బీహార్ గవర్నరు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు, ఇక్కడి జనప్రియ ముఖ్యమంత్రి, నా స్నేహితుడు శ్రీ నీతీశ్ కుమార్ జీ, వేదిక మీద ఉన్న ఇతర సీనియర్ ప్రముఖులు, బీహార్‌కు చెందిన నా ప్రియమైన సోదర, సోదరీమణులారా..
ఈ రోజు, పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా, దేశమంతా మిథిలతో ఉందంటే... బీహార్‌తోనూ ఉన్నట్లే. ఇవాళ, దేశాభివృద్ధికీ, బీహార్ ప్రగతికీ సంబంధించిన వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు అయ్యాయి. విద్యుత్తు, రైలుమార్గాలు, మౌలిక సదుపాయాలకు చెందిన వివిధ పనులు బీహార్‌లో కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించనున్నాయి. ఈ రోజు జాతీయ కవి రాంధారీ సింగ్ దినకర్ జీ వర్ధంతి కూడా. ఆయనకు నేను నా వినమ్ర నివాళిని అర్పిస్తున్నాను.
మిత్రులారా,
పూజ్య బాపూ సత్యాగ్రహ మంత్రాన్ని వ్యాప్తిలోకి తీసుకువచ్చింది బీహార్ నుంచే. భారత్‌లో పల్లెలలు బలమైవిగా మారకపోతే, భారత్ శరవేగంగా పురోగమించలేదని పూజ్య బాపూ గట్టిగా నమ్మారు. దేశంలో పంచాయతీ రాజ్ భావన వెనుక ఉన్న స్ఫూర్తి ఇదే. వెనుకటి పదేళ్లలో, పంచాయతీలకు సాధికారతను కల్పించడానికి ఒకదాని తరువాత మరొకటిగా అనేక చర్యలు తీసుకున్నాం. టెక్నాలజీ ద్వారా కూడా పంచాయతీలను బలపరిచాం. గడచిన దశాబ్ద కాలంలో, ఇంటర్‌నెట్‌తో 2 లక్షలకు పైగా పంచాయతీల్ని కలిపాం.
పల్లెల్లో అయిదున్నర లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లను నిర్మించారు. పంచాయతీలు డిజిటలీకరణకు నోచుకొన్నందువల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. జీవన ప్రమాణ, మరణ ధ్రువపత్రాలు, భూ యాజమాన్య ధ్రువపత్రాలు, ఆ తరహా దస్తావేజులను మరెన్నింటినో పొందవచ్చును. స్వాతంత్ర్యం వచ్చిన అనేక దశాబ్దాలకు, దేశంలో 30 వేల కొత్త పంచాయతీ భవనాలను నిర్మించారు. పంచాయతీలకు సరిపడ నిధులు లభించేటట్టు చూడాలనేది సైతం ప్రభుత్వ ప్రాథమ్యంగా ఉండింది. పోయిన పది సంవత్సరాల్లో, 2 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ నిధులను పంచాయతీలు అందుకున్నాయి. ఈ డబ్బునంతా గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఖర్చుపెట్టారు.
మిత్రులారా,
గ్రామ పంచాయతీల్లో మరో ప్రధాన సమస్య భూమి వివాదాలకు సంబంధించింది. ఏది నివాస భూమి, ఏది సాగు భూమి, ఏది పంచాయతీ భూమి, ఏది ప్రభుత్వ భూమి అనే విషయాల్లో తరచుగా వివాదాలు తలెత్తుతూ వచ్చాయి. దీనిని పరిష్కరించడానికి, భూమిని డిజిటలీకరించాం. భూమి రికార్డుల డిజిటలీకరణ అనవసర తగాదాలను చక్కదిద్దడంలో సహాయపడింది.
మిత్రులారా,
పంచాయతీలు సామాజిక ప్రాతినిధ్యానికి ఎలా ఊతాన్నిచ్చాయో మనమంతా గమనించాం. పంచాయతులలో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించిన మొదటి రాష్ట్రం బీహారే. ఈ కారణంగా నేను నితీశ్ జీని అభినందిస్తున్నాను.
ప్రస్తుతం... పేద, దళిత, మహా దళిత, వెనుకబడిన సముదాయాలతో పాటు మరీ వెనుకబడిపోయిన వర్గాలకు చెందిన సోదరీమణులు, పుత్రికలు బీహార్‌లో ప్రజా ప్రతినిధులుగా సేవచేస్తున్నారు. ఇదే నిజమైన సామాజిక న్యాయం, సిసలైన సామాజిక ప్రాతినిధ్యం. ఎక్కువ మంది పాల్గొంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, బలపడుతుంది. మదిలో ఈ ఆలోచనతోనే, లోక్‌సభలోనూ, విధానసభలోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలన్న చట్టాన్ని కూడా తీసుకువచ్చాం. దీనివల్ల దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలోని మహిళలకు మేలు కలుగుతుంది... మన అక్కచెల్లెళ్లతో పాటు కుమార్తెలకు కూడా మరింత ప్రాతినిధ్యం లభిస్తుంది.
మిత్రులారా,
దేశంలో మహిళలకు ఆదాయాన్ని పెంచడానికీ, ఉద్యగావకాశాలతోపాటు స్వతంత్రోపాధి అవకాశాల్ని సృష్టించడానికీ ప్రభుత్వం ఉద్యమ తరహాలో పనిచేస్తోంది. బీహార్‌లో నడుపుతున్న జీవికా దీదీ కార్యక్రమం చాలా మంది సోదరీమణుల జీవనాన్ని ఉద్ధరించింది. ఈ ఒక్క రోజులోనే, సుమారు ఒక వేయి కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని బీహార్‌లో సోదరీమణుల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అందజేశాం. ఇది సోదరీమణుల ఆర్థిక సాధికారితను మరింత పెంచుతుంది. ఇది దేశంలో మూడు కోట్ల మంది సోదరీమణులను ‘లఖ్పతీ దీదీలు’గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సాధించడంలో మరింత తోడ్పాటును అందించనుంది.

గడచిన పదేళ్ల కాలంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇదివరకెరుగని వేగాన్నందుకుంది. పల్లెల్లో పేదల కోసం ఇళ్లను నిర్మించారు, రోడ్లు వేశారు, కాంక్రీటు దారులు పరిచారు. పల్లెల్లో గ్యాస్ కనెక్షన్లను, నీటి కనెక్షన్లను ఇచ్చారు, టాయిలెట్లను కట్టారు. ఇలాంటి ప్రతి పనినీ చేపట్టడం వల్ల లక్షల కోట్ల రూపాయలు పల్లెలకు అందాయి. కొత్త ఉద్యోగావకాశాలను సైతం కల్పించారు. శ్రామికుల మొదలు రైతుల వరకు, బండి నడిపే వారు మొదలు దుకాణదారుల వరకు.. ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదనకు కొత్త అవకాశాలంటూ లభించాయి. ఇది సమాజానికి ఎంతో లాభదాయకంగా ఉంది... ఈ మేలు కొన్ని తరాల తరబడి కలగనే లేదు. నేను మీకు ‘పీఎం ఆవాస్ యోజన’ను గురించిన ఉదాహరణను చెబుతాను. దేశంలో ఏ పేద కుటుంబమూ తలపై నీడ లేకుండా మిగిలిపో కూడదు. ప్రతి ఒక్కరికీ తల దాచుకోవడానికంటూ ఒక పక్కా వసతి లభించాలన్నదే ఈ పథకం ధ్యేయం. కాసేపటి కిందటే, నేను ఇక్కడున్న మాతృమూర్తులకు, సోదరీమణులకు వారి ఇళ్ల తాళంచెవుల్ని అందజేస్తున్నప్పుడు వారి ముఖాల్లో కనిపించిన సంతోషం... వారిలో ఉట్టిపడుతున్న సరికొత్తదైన ఆత్మవిశ్వాసం.. నిజంగా ఇవే, ఈ పేదల కోసం పని చేయాలన్న ప్రేరణకు కారణమయ్యాయి. మరి ఈ లక్ష్యాన్ని మనసులో పెట్టుకొనే, పోయిన పదేళ్లలో 4 కోట్లకు పైగా కాంక్రీటు ఇళ్లను నిర్మించాం. బీహార్‌లో సైతం, ఇంతవరకు 57 లక్షల పేద కుటుంబాలు పక్కా ఇళ్లను పొందాయి. ఈ గృహాలను పేదలకు, దళితులకు, వెనుకబడిన వర్గాలు, మరీ వెనుకబడిపోయిన వర్గాల వారికీ, పస్‌మాందా పరివారాలకూ, సమాజంలో వంచనకు గురైనటువంటి సమాజాల్లోని కుటుంబాలకూ ఇచ్చారు. రాబోయే సంవత్సరాల్లో, మరో 3 కోట్ల పక్కా ఇళ్లను పేదలకు ఇవ్వబోతున్నారు. ఇవాళ, సుమారు ఒకటిన్నర లక్షల బీహార్ కుటుంబాలు కొత్తగా నిర్మించిన పక్కా ఇళ్లలోకి అడుగుపెడుతున్నాయి. దేశం నలుమూలలా 15 లక్షల మంది పేదలకు నూతన గృహాలను నిర్మించాలంటూ మంజూరు లేఖలను అందజేశాం. ఈ కుటుంబాల్లో, మూడున్నర లక్షల మంది లబ్ధిదారులు ఒక్క బీహార్‌లోనే ఉన్నారు. ఈ ఒక్క రోజులోనే, ఇంచుమించు 10 లక్షల మంది పేద కుటుంబాలకు కాంక్రీటు ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించాం. ఈ కుటుంబాల్లో బీహార్ కు చెందిన 80 వేల కుటుంబాలతో పాటు పట్టణ ప్రాంతాలకు చెందిన ఒక లక్ష కుటుంబాలు కూడా ఉన్నాయి.