Quoteనాగ్పూర్-విజయవాడ ఆర్థిక కారిడార్లోని కీలక రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన;
Quoteహైదరాబాద్-విశాఖపట్నం కారిడార్ పరిధిలో భారతమాల పథకం కింద నిర్మించిన రహదారి ప్రాజెక్టు జాతికి అంకితం;
Quoteకీలక చమురు-గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన;
Quoteహైదరాబాద్ (కాచిగూడ)-రాయచూర్ మధ్య కొత్త రైలుకు పచ్చజెండా;
Quoteతెలంగాణ పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన;
Quoteహన్మకొండ.. మహబూబాబాద్.. వరంగల్.. ఖమ్మం జిల్లాల యువతకు అనేక అవకాశాల సృష్టి దిశగా ఆర్థిక కారిడార్;
Quoteసమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.900 కోట్లు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు  జి.కిషన్ రెడ్డి గారు, పార్లమెంటులో నా సహచరులు శ్రీ సంజయ్ కుమార్ బండి గారు, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నమస్కారం!

 

దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. నారీ శక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. నేడు తెలంగాణలో పలు కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం ఇక్కడి పండుగ వాతావరణాన్ని మరింత పెంచింది. తెలంగాణ ప్రజల కోసం రూ.13,500 కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులు చేపట్టినందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను.

 

|

నా కుటుంబ సభ్యులారా,

ఇక్కడి ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువచ్చే ఇలాంటి అనేక రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులకు ఈ రోజు నేను శంకుస్థాపన చేసి అంకితం చేసినందుకు సంతోషంగా ఉంది. నాగ్పూర్-విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. దీని వల్ల ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఊపందుకోనున్నాయి. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలు గుర్తించబడ్డాయి. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉంటాయి. దీంతో హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల యువతకు అనేక ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల ఆయా జిల్లాల రైతుల పంటల్లో విలువ జోడింపు జరుగుతుంది.

 

|

నా కుటుంబ సభ్యులారా,

తెలంగాణ వంటి భూపరివేష్టిత రాష్ట్రానికి రోడ్డు, రైలు కనెక్టివిటీ అవసరం చాలా ఉంది, ఇక్కడ తయారైన వస్తువులను సముద్ర తీరానికి తరలించి వాటి ఎగుమతులను ప్రోత్సహించవచ్చు . తెలంగాణ ప్రజలు ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించుకోవాలి. ఈ కారణంగా దేశంలోని అనేక ప్రధాన ఆర్థిక కారిడార్లు తెలంగాణ గుండా వెళుతున్నాయి. ఇవి తూర్పు, పశ్చిమ తీరంతో అన్ని రాష్ట్రాలను కలిపే మాధ్యమంగా మారనున్నాయి. హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్ లోని సూర్యాపేట-ఖమ్మం సెక్షన్ కూడా ఇందుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇది తూర్పు తీరానికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అదే సమయంలో పరిశ్రమలు, వ్యాపారాల లాజిస్టిక్స్ ఖర్చులు బాగా తగ్గుతాయి. జక్లేరు- కృష్ణా సెక్షన్ మధ్య నిర్మిస్తున్న రైల్వే లైన్ కూడా ఇక్కడి ప్రజలకు ఎంతో కీలకం కానుంది.

 

|

నా కుటుంబ సభ్యులారా,

భారతదేశం పసుపు యొక్క ప్రధాన ఉత్పత్తిదారు, వినియోగదారు మరియు ఎగుమతిదారు. తెలంగాణలో కూడా ఇక్కడి రైతులు పసుపును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. కరోనా తర్వాత పసుపుపై అవగాహన కూడా పెరగడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాని డిమాండ్ కూడా పెరిగింది. నేడు, పసుపు ఉత్పత్తి నుండి ఎగుమతి మరియు పరిశోధన వరకు మొత్తం విలువ గొలుసులో మరింత వృత్తిపరమైన మార్గాలపై దృష్టి పెట్టడం అవసరం. దీనికి సంబంధించిన పెద్ద నిర్ణయాన్ని ఈ రోజు తెలంగాణ గడ్డపై నుంచి ప్రకటిస్తున్నాను. పసుపు రైతుల అవసరాలు, భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వారి ప్రయోజనాల కోసం 'జాతీయ పసుపు బోర్డు'ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 'జాతీయ పసుపు బోర్డు' సరఫరా గొలుసులో విలువ జోడింపు నుండి మౌలిక సదుపాయాల పనుల వరకు రైతులకు సహాయపడుతుంది. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు తెలంగాణ తో పాటు దేశంలోని పసుపు పండించే రైతులందరినీ నేను అభినందిస్తున్నాను.

 

|

నా కుటుంబ సభ్యులారా,

నేడు, ప్రపంచవ్యాప్తంగా ఇంధన మరియు ఇంధన భద్రతపై చాలా చర్చ జరుగుతోంది. భారతదేశం తన పరిశ్రమలకు మాత్రమే కాకుండా దేశీయ ప్రజలకు కూడా ఇందన శక్తిని అందించింది. దేశంలో 2014లో 14 కోట్లుగా ఉన్న ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 2023 నాటికి 32 కోట్లకు పెరిగింది. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. భారత ప్రభుత్వం, ఎల్పిజి యాక్సెస్ ను పెంచడంతో పాటు, ఇప్పుడు తన పంపిణీ నెట్వర్క్ ను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. హసన్-చర్లపల్లి ఎల్పీజీ పైప్లైన్ ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఇంధన భద్రతను అందించడంలో ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం-హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ కు కూడా ఇక్కడే శంకుస్థాపన చేయడం జరిగింది. దీని వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.

 

|

నా కుటుంబ సభ్యులారా,

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివిధ భవనాలను ఈ రోజు నేను ప్రారంభించాను. హైదరాబాద్ యూనివర్శిటీకి ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కల్పించి ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు, నేను మీ మధ్య మరొక పెద్ద ప్రకటన చేయబోతున్నాను. కేంద్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ గిరిజన దేవతలు సమ్మక్క-సారక్క పేరు పెట్టబడుతుంది. సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కోసం రూ.900 కోట్లు వెచ్చించనున్నారు.. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కోసం తెలంగాణ ప్రజలను అభినందిస్తున్నాను. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. . ప్రస్తుతం నేను ఈ ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నాను, అందుకే నేను దానికే పరిమితమయ్యాను. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఓపెన్ గ్రౌండ్‌కి వెళ్లి అక్కడ ఓపెన్‌గా మాట్లాడతాను, ఏం చెప్పినా తెలంగాణ మనసులో మాట చెబుతాను. ఇక్కడి ప్రజల మనసులో మాట గురించి మాట్లాడతాను.

 

చాలా ధన్యవాదాలు!

 
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Reinventing the Rupee: How India’s digital currency revolution is taking shape

Media Coverage

Reinventing the Rupee: How India’s digital currency revolution is taking shape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 జూలై 2025
July 28, 2025

Citizens Appreciate PM Modi’s Efforts in Ensuring India's Leap Forward Development, Culture, and Global Leadership