చేపల పెంపకం‌లో నిమగ్నమైన ప్రజలు ఎక్కువగా ప్రధాన మంత్రి మత్స్య సంపాద యోజన నుండి ప్రయోజనం పొందుతారు: ప్రధాని
రాబోయే 3-4 సంవత్సరాల్లో మేము మా ఉత్పత్తిని రెట్టింపు చేసి, మత్స్య రంగానికి ఊపునివ్వడం మా లక్ష్యం: ప్రధాని మోదీ
పిఎంఎంఎస్‌వై పునరుద్ధరించిన శ్వేత విప్లవం (పాడి రంగం), స్వీట్ విప్లవం (ఎపికల్చర్ రంగం) కు మార్గం సుగమం చేస్తుందని ప్రధాని

అందరికీ నమస్కారములు,

దేశం కోసం, బిహార్  కోసం, గ్రామీణ జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు, వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మత్స్య సంపద, పాడి, పశుపోషణతోపాటు వ్యవసాయ రంగంలో విస్తృత అధ్యయనం, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకాన్ని ప్రారంభించడం, జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా బిహార్ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

బిహార్ గవర్నర్ శ్రీ ఫగూ చౌహాన్ గారు, ముఖ్యమంత్రి శ్రీమాన్ నితీశ్ కుమార్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గిరిరాజ్ సింగ్ గారు, శ్రీ కైలాశ్ చౌధరీ గారు, శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి గారు, శ్రీ సంజీవ్ బాలియాన్ గారు, బిహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ సుశీల్ మోదీ గారు, బిహార్ శాసనసభ అధ్యక్షుడు శ్రీ విజయ్ చౌధరీ గారు, రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియ మిత్రులారా..

మిత్రులారా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న ప్రతి పథకం వెనక ఉన్న ఏకైక లక్ష్యం.. 21వ శతాబ్దపు భారతదేశంలో మన గ్రామాలు స్వావలంబన సాధించి బలమైన శక్తిగా మారాడమే. ఈ శతాబ్దంలో నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ), శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ), తీపి విప్లవం – స్వీట్ రివల్యూషన్ (తెనె ఉత్పాదన)తో మన గ్రామాల అనుసంధానమై స్వయం సమృద్ధిని సాధించాలి. ఇదే లక్ష్యంతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను రూపొందించడం జరిగింది. ఇవాళ 21 రాష్ట్రాల్లో ఈ పథకం ప్రారంభించబడింది. వచ్చే 4-5 ఏళ్లలో దీనికోసం 20వేల కోట్లకు పైగా ఇందుకోసం వెచ్చించడం జరుగుతుంది. ఇవాళ 17వందల కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పథకంలో భాగంగా బిహార్‌లోని పాట్నా, పూర్ణియా, మాధేపురా, కిషన్ గంజ్, సమస్తి పూర్‌ ప్రాంతాల్లో వివిధ పథాలు ప్రారంభమయ్యాయి. దీనితో మత్స్యకారులకు నూతన మౌలిక సదుపాయాలు, ఆధునిక పరికరాలతోపాటు వారి ఉత్పత్తులను అమ్ముకునేందుకు కొత్త మార్కెట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇది వ్యవసాయంతో పాటు ఇతర మార్గాల ద్వారా ఆర్థిక పరిపుష్టికోసం అవకాశాలను పెంచుతుంది.

మిత్రులారా, దేశంలోని ప్రతి ప్రాంతంలో, ముఖ్యంగా సముద్ర మరియు నదీ తీర ప్రాంతాల్లో చేపల వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశంలో మొదటిసారి ఇటువంటి సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఈ రంగంలో పెట్టిన పెట్టుబడులకు ఎన్నోరెట్లు ఎక్కువ పెట్టుబడిని, ప్రోత్సాహాన్ని ఈ ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా అందిస్తున్నాము. ఇంతకుముందు శ్రీ గిరిరాజ్ గారు చెప్పినట్లు.. ఈ గణాంకాలను విన్నతర్వాత.. ఇలా కూడా చేయవచ్చా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ మీకు వాస్తవాలు తెలిసినపుడు.. ఈ ప్రభుత్వం ఏయే క్షేత్రాల్లో, ఎంతమంది శ్రేయస్సు కోసం ఎంతటి దీర్ఘకాల ప్రణాళికలతో ముందుకు వెళ్తుందో మీకు అర్థమవుతుంది.

దేశంలో మత్స్య సంబంధిత వాణిజ్యానికి సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాము. దీని ద్వారా మా మత్స్యకారుల మిత్రులు, చేపల పెంపకం మరియు వాణిజ్యానికి సంబంధించిన వారికి మరిన్ని సౌలభ్యాలను కల్పించిన నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోంది. రాబోయే 3-4 ఏళ్లలో చేపల ఎగుమతిని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. దీని ద్వారా కేవలం మత్స్యరంగంలోనే లక్షల కొద్ది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించబడతాయి. నేను ఇంతకుముందు చెప్పిన మిత్రులతో మాట్లాడిన తర్వాత అనుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో నా విశ్వాసం మరింత పెరిగింది. నేను రాష్ట్రాలకున్న నమ్మకాన్ని చూసినప్పుడు, సోదరుడు బ్రజేష్ గారితో, సోదరుడు జ్యోతి మండలంతోపాటు మోనికాతో మాట్లాడాను. వారిలో విశ్వాసం తొణికిసలాడుతోంది.

మిత్రులారా, చాలామటుకు మత్స్య సంపద స్వచ్ఛమైన నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా గంగానదిని స్వచ్ఛతతోపాటు నిర్మలంగా మార్చేందుకు ఉద్దేశించిన మిషన్ నుంచి కూడా సత్ఫలితాలు అందుతున్నాయి. గంగానది చుట్టుపక్కన ప్రాంతాల్లో నదీ రవాణాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దీని వల్ల మత్స్యరంగానికి లబ్ది చేకూరడం ఖాయం. ఈ ఆగస్టు 15 న ప్రకటించిన ‘మిషన్ డాల్ఫిన్’ ప్రభావం కూడా మత్స్యరంగంపై ప్రభావం చూపిస్తుంది. బయో-ప్రొడక్ట్ మద్దతు అదరను లాభం కానుంది. మా నితీశ్ బాబు గారు ఈ మిషన్‌పై చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. గంగానదిలో డాల్ఫిన్ల సంఖ్య ఎప్పుడు పెరుగుతుందో, గంగానది తీరప్రాంత ప్రజలు దీనిద్వారా చాలా ప్రయోజనాలను లభిస్తాయి. ప్రతి ఒక్కరికీ ఈ లబ్దిలో భాగం ఉంటుంది.

మిత్రులారా, నితీశ్ గారి నేతృత్వంలో.. ప్రతి గ్రామానికి నీటిని అందించేందుకు చాలా ప్రశంసనీయమైన పని జరుగుతోంది. 4-5 ఏళ్ల క్రితం క్రితం బిహార్‌లో 2 శాతం కుటుంబాలు మాత్రమే స్వచ్ఛమైన తాగునీటి సరఫరా జరిగేది. కానీ నేడు ఈ సంఖ్య 70 శాతానికి పైగా పెరిగింది. ఈ కాలంలో సుమారు 1.5 కోట్ల ఇళ్ళు నీటి సరఫరాతో అనుసంధానించబడ్డాయి.

నితీశ్ గారి ఈ పథకం వల్ల జలజీవన్ మిషన్‌కు సరికొత్త శక్తి వచ్చింది. కరోనా సమయంలోనూ.. బిహార్లోని దాదాపు 60 లక్షల ఇళ్ళు కుళాయి నీరు అందేలా చర్యలు తీసుకున్నట్లు నాకు చెప్పారు. ఇది వాస్తవంగా పెద్ద విజయం. కరోనాతో దేశమంతా దాదాపుగా స్తంభించిపోయినా.. మన గ్రామాల్లో మాత్రం ఆత్మవిశ్వాసంతో పనులు జరుగుతూనే ఉన్నాయనడానికి ఇదో ఉదాహరణ. కరోనా ఉన్నప్పటికీ, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు వంటి నిత్యావసరవస్తువులు.. మార్కెట్లకు, పాలకేంద్రాలకు ఎలాంటి కొరతలేకుండా సరఫరా చేయడమే మన గ్రామాల శక్తికి నిదర్శనం.

మిత్రులారా, ఈసారి ధాన్యం, పండ్లతోపాటు పాల ఉత్పత్తి అద్భుతంగా ఉంది. ఇది మాత్రమే కాదు, ఇంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ ప్రభుత్వాలు, పాడిపరిశ్రమ రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశాయి. ప్రధాని కిసాన్ సమ్మన్ నిధి నుంచి నేరుగా దేశంలోని 10 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేశాం. మన బిహార్‌లో సుమారు 75 లక్షల మంది ఈ పథకం లబ్ధిదారులున్నారు.  మిత్రులారా, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 6 వేల కోట్ల రూపాయలు బిహార్ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలాంటి అనేక ప్రయత్నాల వల్ల.. కరోనా మహమ్మారి ప్రభావం గ్రామాలపై పెద్దగా పడకుండా చేయగలిగాము. కరోనాతో పాటు వరదలను కూడా బిహార్ ఎదుర్కుంటున్న తీరు ప్రశంసనీయం.

మిత్రులారా, భారీ వర్షాలు మరియు వరదలు కారణంగా కరోనాతో పాటు బిహార్ తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పరిస్థిగి గురించి మనకు తెలుసు. సహాయక చర్యలను వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషిచేస్తున్నాయి. బిహార్‌లోని ప్రతి పేదవాడికి, లబ్దిదారుడికి, బయటినుంచి తమ తమ గ్రామాలకు చేరుకుంటున్న శ్రామిక కుటుంబాలకు.. ఉచిత రేషన్ పథకం, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ ప్రయోజనాలు అందించేందుకు కృషి జరుగుతోంద. ఈ పరిస్థితుల కారణంగానే ఉచిత రేషన్ పథకాన్ని జూన్ నుంచి దీపావళి, ఛత్ పూజ పొడగించాము.

మిత్రులారా, కరోనా సంక్షోభం కారణంగా నగరాల నుండి తిరిగి వచ్చిన చాలా మంది కార్మికులు పశుపోషణ దిశగా ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు బిహార్ ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా ఇలాంటివారికి ప్రోత్సాహం లభిస్తోంది. ఈ రోజు మీరు కంటున్న కలలు, వాటిని సాకారం చేసుకునేందుకు తీసుకుంటున్న చర్యల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను. ఇది రాసిపెట్టుకోండి. దేశ పాడిపరిశ్రమను విస్తరించడానికి ప్రభుత్వం నిరంతర కృషిచేస్తోంది. రైతు, పశువుల పెంపకందారులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా కొత్త ఉత్పత్తులు, సరి కొత్త ఆవిష్కరణలు సృష్టించేలా ప్రోత్సహిస్తోంది. దీనితో పాటు, దేశంలో ఉత్తమమైన జంతుజాతులను సృష్టించడం, వారి ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతోపాటు.. వాటి ఉత్పత్తులు శుభ్రంగా, పౌష్టికంగా కూడా ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాము.

ఈ లక్ష్యంతో, ఈ రోజు దేశంలోని 50 కోట్లకు పైగా పశువులను.. వివిధ వ్యాధులనుంచి కాపాడుకునేందుకు ఉచిత టీకాల కార్యక్రమం జరుగుతోంది. పశువులకు మంచి పశుగ్రాసం అందిచేందుకు కూడా వివిధ పథకాల కింద కూడా సదుపాయాలు కల్పిస్తున్నాము. మెరుగైన దేశీయ పశుజాతులను అభివృద్ధి చేయడానికి ‘మిషన్ గోకుల్’ జరుగుతోంది. ఏడాది క్రితం దేశవ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ప్రారంభించబడింది, దీంట్లో ఒక దశ ఈ రోజే పూర్తయింది.

మిత్రులారా, నాణ్యమైన దేశీయ పశుజాతుల అభివృద్ధికి బిహార్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారుతోంది. నేడు ‘జాతీయ గోకుల్ మిషన్’ ఆధ్వర్యంలో పూర్నియా, పాట్నా మరియు బరౌనిలలో నిర్మించిన ఆధునిక సౌకర్యాల కారణంగా పాడి రంగంలో బీహార్ మరింత పటిష్టమైన వ్యవస్థను ఏర్పర్చుకోనుంది. పూర్ణియాలో నిర్మించిన కేంద్రం భారతదేశంలోని అతిపెద్ద కేంద్రాలలో ఒకటి. ఇది బిహార్‌తోపాటు తూర్పు భారతదేశంలోని ప్రధాన భాగానికి లబ్ది చేకూరుస్తుంది. ఈ కేంద్రం బిహార్ దేశీయ జాతులైన ‘బచౌర్’, 'రెడ్ పూర్నియా' వంటి జాతుల అభివృద్ధి మరియు పరిరక్షణను ప్రోత్సహిస్తుంది.

మిత్రులారా,

ఒక ఆవు సాధారణంగా సంవత్సరంలో ఒక దూడను కంటుంది. కానీ ఐవీఎఫ్ టెక్నాలజీతో ఒక ఆవు సాయంతో ఒక ఏడాదిలో ఎక్కువ దూడలను సృష్టించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి గ్రామానికి చేరుకోవడమే మా లక్ష్యం.

మిత్రులారా,

ఉత్తమ పశువుల జాతులను సృష్టించడంతోపాటు, వాటి సంరక్షణ గురించి సరైన శాస్త్రీయ సమాచారం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం కొన్నేళ్లుగా సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఇందులో భాగంగా 'ఈ-గోపాల్' యాప్ ఈ రోజు ప్రారంభించబడింది. ఆన్‌లైన్ డిజిటల్ మాధ్యమం అయిన ‘ఈ-గోపాల్’ యాప్ ద్వారా పశువుల యజమానులకు ఆధునిక పశువులను ఎంచుకోవడం సులభమవుతుంది. దళారీ వ్యవస్థనుంచి వారికి విముక్తి లభిస్తుంది. ఈ యాప్ పశువులకు సంబంధించిన ఉత్పాదకత నుండి దాని ఆరోగ్యం, ఆహారం వరకు మొత్తం సమాచారాన్ని ఉచితంగా అందిస్తుంది. దీని ద్వారా రైతుకు తన వద్దనున్న పశువుకు ఎప్పుడెప్పుడు ఏమేం ఇవ్వాలో తెలుస్తుంది. ఒకవేళ పశువుకు అనారోగ్యం కలిగితే.. ఎక్కడ తక్కువ ధరకు చికిత్స లభిస్తుందో కూడా తెలిసిపోతుంది. దీంతోపాటుగా ఈ యాప్ ప్రతి పశువుతో అనుసంధానించబడుతుంది. తద్వారా జంతువులకు ఆధార్ ఇచ్చేందుకు వీలవుతుంది. ఒకసారి ఈ ఆధార్‌లో పశువుకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తే.. అది వాటిని కొనుగోలుచేసే వారి శ్రమను తగ్గిస్తుంది.

మిత్రులారా,

వ్యవసాయమైనా, పశుసంవర్ధకమైనా, మత్స్యశాఖ అయినా.. శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ఇందుకోసం గ్రామాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం అత్యంత అవసరం. వ్యవసాయ అధ్యయనాలు మరియు పరిశోధనలకు బిహార్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. Delhi లో మేము పూసా-పూసా అని వింటుంటాం. నిజమైన పూసా ఢిల్లీలో కాదు, బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. ఒకరకంగా చెప్పాలంటే ఢిల్లీలో ఉన్నది బిహార్ పూసాకు కవలసోదరుడు.

మిత్రులారా, స్వాతంత్ర్యానికి పూర్వమే సమస్తిపూర్ లోని పూసాలో ఉన్న జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రారంభించబడింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జననాయక్ కర్పూరి ఠాకూర్ వంటి దీర్ఘదృష్టి గల నేతలు స్వాతంత్య్రానంతరం ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ ప్రయత్నాలనుంచి ప్రేరణ పొంది 2016లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్ర విశ్వవిద్యాలయంగా గుర్తింపు కల్పించాం. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయంలో, అనుబంధ కళాశాలల్లో కూడా కోర్సులు, వివిధ సౌకర్యాలు విస్తరించాయి. మోతీహరిలోని కొత్త వ్యవసాయ, అటవీ కళాశాలైనా, పూసాలోని స్కూల్ ఆఫ్ అగ్రిబిజినెస్ అండ్ రూరల్ మేనేజ్‌మెంట్ అయినా.. బిహార్లో వ్యవసాయ, వ్యవసాయ నిర్వహణ విద్యను అందించేందుకు ఇలాంటి విద్యావ్యవస్థలు బలోపేతం అవుతున్నాయి. ఈ మహత్కార్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ‘స్కూల్ ఆఫ్ అగ్రిబిజినెస్ మరియు రూరల్ మేనేజ్‌మెంట్’ నూతన భవనం ప్రారంభించబడింది. దీంతోపాటు కొత్త హాస్టళ్లు, స్టేడియంలు, అతిథి గృహాలకు కూడా శంకుస్థాపన జరిగింది.

మిత్రులారా,

వ్యవసాయ రంగంలోని ఆధునిక అవసరాలకు అనుగుణంగా గత 5-6 ఏళ్లుగా దేశంలో ఒక పెద్ద ఉద్యమం జరుగుతోంది. 6 ఏళ్ల క్రితం దేశంలో ఒకే ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండేది, నేడు దేశంలో మూడు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం బిహార్లో వచ్చే వరదల నుంచి వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలకోసం మహాత్మాగాంధీ పరిశోధనా కేంద్రం సృష్టించబడింది. అదేవిధంగా, మోతీపూర్‌లోని చేపల కోసం ప్రాంతీయ పరిశోధన, శిక్షణా కేంద్రం, మోతిహారిలోని పశుసంవర్ధక విభాగంతో పాల అభివృద్ధి కేంద్రం అనుసంధానమైంది. ఇలా అనేక సంస్థలను వ్యవసాయ విజ్ఞానం, సాంకేతికతతో జోడించేందుకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage