QuoteCongratulates BRO and Indian Engineers for achieving the marvel feat of building the tunnel in the most difficult terrain of Pir Panjal ranges in Himachal
QuoteTunnel would empower Himachal Pradesh, J&K Leh and Ladakh :PM
QuoteFarmers, Horticulturists, Youth, Tourists, Security Forces to benefit from the project: PM
QuotePolitical Will needed to develop border area connectivity and implement infrastructure projects: PM
QuoteSpeedier Economic Progress is directly dependent on fast track execution of various infrastructure works: PM

దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ గారు, కేంద్ర క్యాబినెట్‌లో నా సహచరుడు హిమాచల్ యువనాయకుడు ఠాకూర్, హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రజల ప్రతినిధులు, చీఫ్  ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు, రక్షణ మంత్రిత్వ శాఖ సరిహద్దు సంస్థతో సంబంధం ఉన్న సహచరులు, నా హిమాచల్‌‌ప్రదేశ్ సోదర సోదరీమణులారా .. అందరికీ నమస్కారం.

 

ఈ రోజు చాలా చారిత్రాత్మక దినం.. ఈ రోజు కేవలం అటల్‌‌జీ కల మాత్రమే నెరవేరడం కాదు, హిమాచల్ ప్రదేశ్‌‌‌లోని కోట్లాదిమంది ప్రజల అనేక ఏళ్ళ నిరీక్షణ ఈరోజు ముగిసింది.

 

ఈ రోజు అటల్ టన్నెల్‌‌‌‌ను ప్రారంభించే అవకాశం లభించడం నా అదృష్టం. రాజ్‌నాథ్ గారు చెప్పినట్లే నేను ఇక్కడ పార్టీ వ్యవహారాల పనిని చూసేవాడిని.ఇక్కడి పర్వతాల్లో, ఇక్కడి లోయల్లోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. అటల్‌‌జీ మనాలిలో నివసించేటప్పుడు, నాకు తరచూ వారి దగ్గర కూర్చోవడం, అనేక విషయాలపై చర్చించే అవకాశం లభించింది. ఒక రోజు నేను, ధుమాల్ ఇద్దరం టీ తాగుతూ అటల్‌‌జీ ముందు ఈ విషయాన్ని  ఉంచాం. అటల్జీ విశేష లక్షణం ఏంటంటే, తను మమ్మల్ని చూస్తూనే మేం చెప్పే విషయాన్ని వింటూనే తల ఊపుతూ  మా మనసుల్లో ఏం ఉందో పూర్తిగా చదివేశారు. అయితే చివరకు నేను, ధుమల్ జీ ఏ సూచన చేశామో, అది చివరకు అటల్ జీ కలగా, ఆలోచనగా మారింది. ఆ కల ఇప్పుడు సాకారం అయ్యింది. ఈ రోజు అది మన ముందు సాక్షాత్కారం అయ్యింది. జీవితం ఎంత సంతృప్తిని ఇస్తుందో మీరు ఊహించుకోవచ్చు.

|

ఇప్పుడు కొన్ని నిమిషాల క్రితం మనమందరం ఒక సినిమాను చూశాము. అక్కడ ఒక ఫోటో గ్యాలరీని కూడా చూశాను. అటల్ టన్నెల్ నిర్మాణం. సాధారణంగా ఇలాంటి హడావిడి సమయంలో ఎవరైతే రేయింబవళ్ళు కష్టపడ్డారో, ఎవరి కారణంగా అయితే ఇలాంటి అద్భుతాలు సాధ్యం అయ్యాయో వారు వెనుక ఉండిపోతారు. అభేద్యమైన పిర్ పంజాల్‌ శ్రేణిని తొలుచుకుంటూ, ఎంతో కష్ట సాధ్యమైన ఈ అద్భుతాన్ని కళ్ళముందు సాక్షాత్కారం అయ్యేలా చేశారు. ఈ మహాయజ్ఞంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడి పనిచేసిన ఎందరో ఇంజనీర్లు, శ్రామిక సోదర సోదరీమణులందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

 

ఇప్పుడు కొన్ని నిమిషాల క్రితం మనమందరం ఒక సినిమాను చూశాము. అక్కడ ఒక ఫోటో గ్యాలరీని కూడా చూశాను. అటల్ టన్నెల్ నిర్మాణం. సాధారణంగా ఇలాంటి హడావిడి సమయంలో ఎవరైతే రేయింబవళ్ళు కష్టపడ్డారో, ఎవరి కారణంగా అయితే ఇలాంటి అద్భుతాలు సాధ్యం అయ్యాయో వారు వెనుక ఉండిపోతారు. అభేద్యమైన పిర్ పంజాల్‌ శ్రేణిని తొలుచుకుంటూ, ఎంతో కష్ట సాధ్యమైన ఈ అద్భుతాన్ని కళ్ళముందు సాక్షాత్కారం అయ్యేలా చేశారు. ఈ మహాయజ్ఞంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడి పనిచేసిన ఎందరో ఇంజనీర్లు, శ్రామిక సోదర సోదరీమణులందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా, అటల్ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్‌‌లోని ఒక అతి పెద్ద భాగం, కొత్త కేంద్రపాలిత లేహ్-లడఖ్ జీవనాడిగా మారనుంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌‌లోని ఈ ప్రాంతం, లేహ్-లడఖ్ ఎల్లప్పుడూ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానమై, పురోగతి మార్గంలో  చాలా వేగంగా దూసుకెళ్ళనుంది.

|

ఈ సొరంగం మనాలి, కేలాంగ్ మధ్య దూరాన్ని 3-4 గంటలు తగ్గిస్తుంది. పర్వత సానువుల్లోని నా సోదర సోదరీమణులు, పర్వతాలపై 3-4 గంటల దూరాన్ని తగ్గించడం అంటే ఏమిటో చాలా స్పష్టంగా తెలుసు.

 

మిత్రులారా, లే-లడఖ్‌‌లో ఉన్న రైతులు, తోటమాలలు, యువతకు ఇప్పుడు దేశ రాజధాని ధిల్లీతో పాటు ఇతర మార్కెట్లకు చాలా సులభంగా చేరుకోవచ్చు. ఇన్నేళ్ళుగా వారు పడుతున్న కష్టాలు, ప్రమాదాలు కూడా చాలా తగ్గుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ సొరంగం దేవభూమి హిమాచల్, ఎంతో ప్రాచీనమైన బౌద్ధ సంప్రదాయం మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఇది భారతదేశంతో పాటు ప్రపంచానికి నూతన మార్గాన్ని, కొత్త కాంతిని చూపించనుంది. ఈ శుభసందర్భాన హిమాచల్, లే-లడఖ్ సహచరులందరికీ చాలా అభినందనలు.

|

మిత్రులారా, అటల్ టన్నెల్ భారతదేశ సరిహద్దు మౌలిక సదుపాయాలకు నూతనోత్తేజాన్ని ఇవ్వనుంది. ఇది ప్రపంచ స్థాయి సరిహద్దు కనెక్టివిటీకి సజీవ రుజువుగా మారనుంది. ఇది హిమాలయాల్లోని ఈ భూభాగం అయినా, పశ్చిమ భారతదేశంలో విస్తరించి ఉన్న ఎడారులు కానీ దక్షిణ, తూర్పు భారతదేశంలోని తీర ప్రాంతాలు అయినా, ఇవి దేశ భద్రత, శ్రేయస్సు కోసం భారీ వనరులుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల సమతుల్య, సంపూర్ణ అభివృద్ధి కారణంగా ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలనే డిమాండ్ ఎప్పుడూ ఉంది. అయితే చాలా కాలంగా, ఇక్కడి సరిహద్దుకు అనుసంధానించి ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రణాళిక దశ నుంచి బయటపడలేదు లేదా అవి ఫైళ్ళలోనే చిక్కుకుపోయాయి… దారితప్పాయి. అటల్ టన్నెల్‌‌ విషయంలోనూ  కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితే ఎదురై ఉంటుంది.

 

2002లో, అటల్ జీ ఈ సొరంగం కోసం అప్రోచ్ రోడ్‌కు శంఖుస్థాపన చేశారు. అటల్ జీ తర్వాత ప్రభుత్వం అలాంటి పనులను పూర్తిగా మరచిపోయారు. పరిస్థితి ఏమిటంటే 2013-14 వరకు, సొరంగం కోసం 1300 మీటర్లు అంటే ఒకటిన్నర కిలోమీటర్ల మేర పని మాత్రమే చేయగలిగింది.

 

ఆ సమయంలో అటల్ టన్నెల్  పని ఎంత వేగంతో జరిగిందో, అదే వేగంతో పని జరిగి ఉంటే ఈ సొరంగం 2040 నాటికి పూర్తయి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి… ఈ రోజు మీ వయస్సుకి మరో 20 సంవత్సరాలు జోడించి లెక్కేసుకోండి. అప్పుడు ప్రజల జీవితాల్లో ఈ రోజు వచ్చినప్పుడు, వారి కల నెరవేరేది.

 

అభివృద్ధి మార్గంలో వేగంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు, అభివృద్ధిపై  దేశ ప్రజల కోరిక బలీయంగా ఉన్నప్పుడు, ఏ కార్యక్రమంలోనైనా వేగం పెంచవలసి ఉంటుంది. అందుకే, అటల్ టన్నెల్ నిర్మాణ పని కూడా 2014 తరువాత వేగవంతమైంది. BRO ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి పరిష్కారమైంది.

 

దీని కారణంగా, ప్రతి యేడాది 300 మీటర్ల మేర నిర్మిస్తున్న సొరంగం  పనులు, దాని వేగం సంవత్సరానికి 1400 మీటర్లకు పెరిగింది.  అందుకే కేవలం 6 సంవత్సరాల్లో మేము 26 ఏళ్ళుగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న పనిని పూర్తిచేశాం.

 

 

మిత్రులారా, మౌలిక సదుపాయాల ఇంత ముఖ్యమైన, కీలక ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం దేశానికి ప్రతీ విధంగా నష్టం కలిగిస్తుంది. దీని కారణంగా, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఆలస్యం జరుగుతుంది. ఆర్థికంగానూ మొత్తం దేశం దీని భారాన్ని భరించాల్సి వచ్చింది.

 

 

ఈ టన్నెల్ నిర్మాణ అంచనా 2005 సంవత్సరంలో జరిగింది. ఈ సొరంగం సుమారు తొమ్మిదిన్నర కోట్ల రూపాయల్లో సిద్ధం కావాల్సి ఉంది. కానీ నిరంతర జాప్యం కారణంగా, ఈ రోజు ఇది మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అయి దీని భారం దేశవాసులపైనే పడింది. అంటే సుమారు 3,200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన తరువాత ఇది సాధ్యమైంది. అదే మరో 20 సంవత్సరాలు జాప్యం అయి ఉంటే దీని నిర్మాణ భారం ఆర్థికంగా ఎంతలా పెరిగేదో ఆలోచించుకోండి.

|

మిత్రులారా, కనెక్టివిటీ నేరుగా దేశ అభివృద్ధికి సంబంధించిన విషయం. ఎంత ఎక్కువగా కనెక్టివిటీ ఉంటే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో, కనెక్టివిటీ నేరుగా దేశ రక్షణ అవసరాలకు సంబంధించినది. కానీ ఇలాంటి సున్నితమైన ఈ అంశంపై చూపించాల్సిన గంభీరత, అవసరమైన రాజకీయ సంకల్పం దురదృష్టవశాత్తు ఏమాత్రం చూపించలేదు.

 

అటల్ టన్నెల్ మాదిరిగా, చాలా ముఖ్యమైన ప్రాజెక్టులన్నింటి విషయంలోనూ ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు. అన్నింటితోనూ ఇదే రకమైన నిర్లక్ష్యం కనిపించింది.  లద్ధాక్‌లోని దౌలత్ బేగ్ ఓల్డి ఎంతో వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ఎయిర్ స్ట్రిప్.. ఇది  40-50 సంవత్సరాలుగా మూసివేశారు. ఇందులో ఎలాంటి బలవంతం జరిగింది. ఒత్తిడి ఏంటి?  నేను ఈ విషయంలో మరింత విస్తారంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. దీని గురించి చాలా విషయాలు చెప్పారు. చాలా విషయాలు ప్రచురించారు. కానీ నిజం ఏంటంటే, దౌలత్ బేగ్ ఓల్డి ఎయిర్ స్ట్రిప్ వాయుసేన అవసరాల కోసం ప్రారంభమైంది. అందులో ఎలాంటి రాజకీయ సంకల్పం కనిపించలేదు.

 

మిత్రులారా ఇలాంటి వ్యూహాత్మక, దేశ ప్రయోజనాలకు ఎంతో మహత్వపూర్ణమైన అనేక ప్రాజెక్టులు ఈ విధంగా ఎన్నో ఏళ్ళుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి.

|

దాదాపు రెండేళ్ళ క్రితం అటల్‌‌ జీ  పుట్టినరోజు సందర్భంగా నేను అస్సాంలో ఉన్నాను. అక్కడ భారతదేశపు పొడవైన రైలు రోడ్డు వంతెన 'బాగీబీల్ వంతెన'ను దేశానికి అంకితం చేసే అవకాశం నాకు లభించింది. ఈరోజు ఈ వంతెన ఈశాన్య భారతానికి, అరుణాచల్ ప్రదేశ్‌‌లతో అనుసంధానానికి ప్రధాన మాధ్యమంగా మారింది. అటల్ జీ  ప్రభుత్వ కాలంలోనూ బాగీబీల్ వంతెన పనులు ప్రారంభమయ్యాయి. కాని అటల్‌ జీ  ప్రభుత్వం తరువాత, ఈ వంతెన పనులు మళ్లీ ఆగిపోయాయి. 2014 తరువాత కూడా ఈ పని ఊపందుకుంది. నాలుగేళ్లలో ఈ వంతెన పని పూర్తయింది.

 

అటల్ జీ పేరుతో కోసి మహాసేతు పేరుతో మరొక వంతెన జోడించి ఉంది. బీహార్‌లోని మిథిలాంచల్‌లోని రెండు భాగాలను కలిపే కోసి మహాసేతు శంఖుస్థాపనను అటల్ జీ చేశారు. అయితే దీని నిర్మాణ పని కూడా ఇరుక్కుపోయింది.

 

మేము ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత 2014 లో కోసి మహాసేతును కూడా పూర్తి చేసాము. కొద్ది రోజుల క్రితం కోసి మహాసేతు వంతెనను ప్రారంభించాము.

 

మిత్రులారా, దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో కనెక్టివిటీకి సంబంధించిన కీలక ప్రాజెక్టుల పరిస్థితి ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారుతోంది. ఇది చాలా వేగంగా మారుతోంది. గత 6ఏళ్ళలో అనేక కీలక ప్రాజెక్టుల కలను సాకారం చేసే దిశలో ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి.

 

హిమాలయ సానువుల్లోని  హిమాచల్, జమ్మూ కాశ్మీర్, కార్గిల్-లే-లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక కీలక ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇంకా అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. అది వంతెనను నిర్మించే పని అయినా, సొరంగం నిర్మించే పని అయినా, దేశంలో ఈ  పర్వతప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున కీలక పనులు ఎప్పుడూ జరగలేదు.

 

ఈ ప్రాజెక్టులతో సాధారణ ప్రజానీకంతో పాటు మన సైనిక సోదర సోదరీమణులు సైతం ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. శీతాకాలంలో, వారు నిత్యావసరాలతో పాటు, వారి రక్షణ సామగ్రిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్ళడంతో పాటు వారు సులభంగా పెట్రోలింగ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

 

మిత్రులారా, దేశ రక్షణ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవటం, దేశాన్ని రక్షించే వారి అవసరాలను, వారి ప్రయోజనాలను జాగ్రత్తగా చూసుకోవటం అనేది మన ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యతా అంశం.

 

హిమాచల్‌‌ప్రదేశ్‌‌లోని మన సోదర సోదరీమణుల విషయంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌‌ను  గత ప్రభుత్వాలు ఎలా చూసుకున్నాయో ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. నాలుగు దశాబ్దాలుగా, మా మాజీ సైనిక సోదరులకు కేవలం వాగ్దానం మాత్రమే  చేశారు. కాగితాల్లో 500 కోట్లు చూపిస్తూ, గత ప్రభుత్వాలు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ను అమలు చేస్తామని చెప్పేవారు. కాని ఏమాత్రం అమలు చేయలేదు. నేడు, దేశంలోని లక్షలాది మంది మాజీ సైనికులు వన్ ర్యాంక్-వన్ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతున్నారు. మాజీ సైనికులకు కేవలం 11,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బకాయిలుగా చెల్లించింది.

 

హిమాచల్‌‌ప్రదేశ్‌లో దాదాపు లక్షమంది మిలటరీ సోదరులు ప్రయోజనాన్ని పొందుతున్నారు. మేము తీసుకున్న నిర్ణయాలను మేము అమలు చేస్తున్నామని, మన ప్రభుత్వ నిర్ణయాలు సాక్ష్యమిస్తున్నాయి. దేశ ప్రయోజనాల కంటే, దేశాన్ని రక్షించడం కంటే మా ముందు వేరే ప్రాధాన్యతా అంశం ఏదీ లేదు. కానీ దేశ రక్షణ ప్రయోజనాలకు రాజీ పడిన కాలానికి దేశం సాక్ష్యంగా నిలిచింది. ఒక ఆధునిక యుద్ధ విమానం కోసం దేశ వైమానిక దళం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూనే ఉంది. వారు ఒక ఫైలుపై, మరొక ఫైలు… ఒక ఫఐలుపై మరొక ఫై… కొన్నిసార్లు ఫైలు తెరిచేవారు… కొన్నిసార్లు ఫైలుతో ఆటలాడుకొనేవారు.

 

అది మందుగుండు సామగ్రి అయినా, ఆధునిక రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కఠినమైన శీతాకాలపు పరికరాలు, ఇతర వస్తువులు అయినా ప్రతీ విషయాన్ని పక్కన పెట్టేశారు. మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల బలం మేధావులకు ఆనవాలంగానే ఉండేవి. కాని దేశంలోని ఆర్డినెన్స్  ఫ్యాక్టరీలను గాలికొదిలేశారు.

దేశంలోని స్వదేశీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల కోసం హెచ్‌ఏఎల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థను సృష్టించారు. కానీ దీనిని కూడా బలోపేతం చేయడంపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. సంవత్సరాలుగా అధికారంలో ఉన్నవారు ,తమ రాజకీయ స్వార్థం కోసం మన సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయకుండా, పూర్తిగా దెబ్బతీసేశాయి.

 

ఈ రోజు దేశం గర్విస్తున్న తేజస్ యుద్ధ విమానాలను సైతం ఈ మేధావులు పక్కనపెట్టేందుకు సైతం వెనుకాడలేదు. ఇది వీరి నిజ స్వరూపం..

 

మిత్రులారా, ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి మారుతోంది. ఆధునిక ఆయుధాల తయారీ కోసం దేశంలో ఆధునిక సంస్కరణలు జరిగాయి, మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు దేశవాసుల ఆయుధంగా మారింది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యవస్థ ఇప్పుడు మన వ్యవస్థలో భాగంగా మారిపోయింది.

 

ఇది దేశ త్రివిధ దళాల అవసరాలకు అనుగుణంగా సేకరణ, ఉత్పత్తి రెండింటిలోనూ మంచి సమన్వయానికి దారితీసింది.ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించిన అనేక వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులను ఇప్పుడు భారతదేశ పరిశ్రమల నుంచి మాత్రమే కొనుగోలు చేయవలసి ఉంది.

 

మిత్రులారా, భారతదేశంలో రక్షణ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు,  విదేశీ సాంకేతిక పరిజ్ఞానం రావడానికి వీలుగా భారతీయ సంస్థలకు ఇప్పుడు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నందున, మన మౌలిక సదుపాయాలను ఆర్థిక, వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంచడానికి అదే వేగంతో ముందుకు తీసుకెళ్ళే పని జరుగుతోంది.

 

ఆత్మనిర్భర భారతదేశ ఆత్మ విశ్వాసం ఈరోజు ప్రజల ఆలోచనల్లో ఒక భాగంగా మారిపోయింది. అటల్ టన్నెల్ ఈ విశ్వాసానికి ప్రతీక.

 

మరోసారి, హిమాచల్‌‌ప్రదేశ్, లక్షలాది మంది లేహ్-లడఖ్ ప్రజలను  మీ అందరినీ అభినందిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు.

 

హిమాచల్‌పై నాకు ఎంత అధికారం ఉందో నేను చెప్పలేను. కానీ హిమాచల్‌కు నాపై చాలా అధికారం ఉంది. నేటి కార్యక్రమంలో సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, మన హిమాచల్ ప్రదేశ్ ప్రేమ నాపై చాలా ఒత్తిడి తెచ్చింది. అందుకే ఈరోజు మూడు కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. దీని తరువాత చాలా తక్కువ సమయంలో నేను మరో రెండు కార్యక్రమాల్లో మాట్లాడాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ విషయాలు మాట్లాడకుండా, వివరంగా మరిన్ని విషయాలు మరో రెండు కార్యక్రమాల్లో మాట్లాడనున్నాను.

 

కానీ నేను ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. నా సూచనలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు, BROకు చేస్తున్నాను. ఇంజనీరింగ్ పరంగా సంస్కృతి పరంగా ఒక సొరంగం పని ప్రత్యేకంగా ఉంటుంది. గత చాలా సంవత్సరాలలో దాని రూపకల్పన పని ప్రారంభమైనప్పటి నుంచి, కాగితంపై రాయడం ప్రారంభమైంది; అప్పటి నుంచి ఇప్పటి వరకు 1000-1500 స్థలాలను క్రమబద్ధీకరించగలిగితే… అందులో మీరు ఒక కూలీ కావచ్చు… ఒక కీలక పదవిలో ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. మీ భాషలో మీరు చేసిన పని గురించి మీ స్వంత అనుభవాన్ని రాయండి. 1500 మంది ప్రజలు మొత్తం మీ ప్రయత్నాన్ని .. అసలు ఏం జరిగింది.. ఎలా జరిగింది… అనే విషయంపై డాక్యుమెంటేషన్ చేయండి… అందులో మానవీయత చూపించండి. అక్కడ పని జరుగుతున్న సమయంలో అసలు ఏం అనుకున్నాడు.. వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏం అనుకున్నాడు. మంచి డాక్యుమెంటేషన్ చేయండి. నేను అకడెమిక్ డాక్యుమెంటేషన్  గురించి చెప్పట్లేదు. ఇది మానవీయత ఉన్న డాక్యుమెంటేషన్‌‌గా ఉండాలి. ఇందులో పనిచేసిన కార్మికుడు ఉండాలి. కొన్ని రోజులు ఆహారం అందకపోయి ఉండొచ్చు…  అలాంటి సమయంలో అతను ఎలా పని చేసి ఉండాలి, ఆ విషయానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొన్నిసార్లు కొంత సామాను అక్కడికి  చేరాల్సి ఉన్నప్పుడు, మంచు కారణంగా రవాణా  జరగని పరిస్థితుల్లో ఎలా పనిచేశారన్నది తెలియాలి.

 

ఎవరైనా ఇంజనీర్‌‌కు సవాలు ఎలా వచ్చింది? అలాంటి అప్పుడు ఎలా పనిచేశారు. ఇందులో కనీసం 1500 మంది తమ అనుభవాలను రాయాలని కోరుకుంటున్నాను. ప్రతి స్థాయిలోకనీసం 5 పేజీలు, 6 పేజీలు, 10 పేజీలు వారి అనుభవాన్ని రాయండి. ఏదైనా ఒక వ్యక్తికి బాధ్యత ఇవ్వండి. ఆ పై దాన్ని కొంచెం మెరుగ్గా చేసి, భాషను చక్కగా డాక్యుమెంట్ చేయండి. ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు దానిని డిజిటల్ చేసినా అది దేశవాసులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది.

 

రెండవది, మన దేశంలోని అన్ని సాంకేతిక, ఇంజనీరింగ్ సంబంధిత విశ్వవిద్యాలయాలకు ఆ విశ్వవిద్యాలయాల పిల్లలకు కేస్ స్టడీస్ ఇవ్వాలని నేను విద్యా మంత్రిత్వ శాఖను కోరుతున్నాను. ప్రతి సంవత్సరం, ప్రతి విశ్వవిద్యాలయం నుంచి ఎనిమిది నుంచి పది మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి కేస్ స్టడీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. ఈ కీలక ప్రాజెక్టు ఎలా ఉద్భవించింది… ఎలా తయారు అయ్యింది. సవాళ్లు ఎలా వచ్చాయి. ఎలా బయటపడాలి… ప్రపంచంలోనే ఎత్తైన, పొడవైన ప్రదేశం పేరులో సొరంగానికి సంబంధించిన  ఇంజనీరింగ్ పరిజ్ఞానం మన దేశ విద్యార్థులకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి.

 

అంతే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులను ఇక్కడ కేస్ స్టడీకోసం ఆహ్వానించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతున్నాను. కేస్ స్టడీ కోసం అక్కడి విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఇక్కడికి వస్తారు. ప్రాజెక్ట్ అధ్యయనం చేస్తారు. మన బలాన్ని ప్రపంచం గుర్తించాలి. మన బలం ప్రపంచానికి తెలియాలి. పరిమిత వనరులు ఉన్నప్పటికీ… ప్రస్తుత తరం, మన యువత ఎంత అద్భుతమైన పనులు చేయగలదో ప్రపంచం తెలుసుకోవాలి.

 

అందుకే నేను రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, BRO, అందరూ కలిసి ఈ సొరంగం పని విషయంలో నిరంతరంగా విద్యలో భాగం కావాలని కోరుకుంటున్నాను. మనలో సరికొత్త తరం ఈ విషయంలో సిద్ధమైతే,అప్పుడు టన్నెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరగడం మాత్రమే కాకుండా, మేధోసంపత్తి నిర్మాణం జరుగుతుంది. ఈ సొరంగం మనదేశంలో ఉత్తమ ఇంజనీర్లను తయారు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం కూడా ఆ దిశలో పనిచేయాలి. .

 

మీ అందరినీ మరోసారి అభినందిస్తున్నాను. అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ పనిని ఎంతో సమర్థవంతంగా పూర్తి చేసిన, దేశాన్ని పురోగతిలో నడిపించడంతో పాటు దేశ ప్రతిష్టను ద్విగుణీకృతం చేసిన యువకులను నేను మనస్ఫూర్థిగా అభినందిస్తున్నాను.

 

అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

  • Jitendra Kumar March 30, 2025

    🙏🇮🇳
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • Reena chaurasia September 04, 2024

    बीजेपी
  • Sonu Choubey February 02, 2024

    नमो नमो
  • Sonu Choubey February 02, 2024

    नमो नमो
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
When Narendra Modi woke up at 5 am to make tea for everyone: A heartwarming Trinidad tale of 25 years ago

Media Coverage

When Narendra Modi woke up at 5 am to make tea for everyone: A heartwarming Trinidad tale of 25 years ago
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings to His Holiness the Dalai Lama on his 90th birthday
July 06, 2025

The Prime Minister, Shri Narendra Modi extended warm greetings to His Holiness the Dalai Lama on the occasion of his 90th birthday. Shri Modi said that His Holiness the Dalai Lama has been an enduring symbol of love, compassion, patience and moral discipline. His message has inspired respect and admiration across all faiths, Shri Modi further added.

In a message on X, the Prime Minister said;

"I join 1.4 billion Indians in extending our warmest wishes to His Holiness the Dalai Lama on his 90th birthday. He has been an enduring symbol of love, compassion, patience and moral discipline. His message has inspired respect and admiration across all faiths. We pray for his continued good health and long life.

@DalaiLama"