New National Education Policy focuses on learning instead of studying and goes ahead of the curriculum to focus on critical thinking: PM
National Education Policy stresses on passion, practicality and performance: PM Modi
Education policy and education system are important means of fulfilling the aspirations of the country: PM Modi

నమస్కార్, 
గౌరవ రాష్ట్రపతి, నా కేబినెట్ సహచరులు శ్రీ రమేశ్ నిశాంక్ జీ, సంజయ్ ధోత్రే జీ, గౌరవ గవర్నర్లు, లెఫ్టనెంట్ గవర్నర్లు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, జాతీయ విద్యావిధానానికి రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కస్తూరి రంగన్ జీ, ఆయన బృందం, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ చాన్సలర్లు, విద్యావేత్తలు, ఈ సమావేశంలో భాగం పంచుకుంటున్న సోదర సోదరీమణులారా

సర్,
దేశ ఆకాంక్షలను తీర్చడంలో విద్యావిధానం ఒక ప్రధాన మాధ్యమంగా ఉంటుంది. కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అందరి పైన విద్యావిధానం బాధ్యత ఉంటుంది. కాని విద్యావిధానంలో ప్రభుత్వ జోక్యం, ప్రభావం అత్యంత కనిష్ఠంగా ఉండాలన్నది మాత్రం వాస్తవం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంత అధికంగా భాగస్వాములైతే విద్యావిధానం ప్రాధాన్యం, ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. 

జాతీయ విద్యావిధానం రూపకల్పన కోసం కృషి నాలుగైదు సంవత్సరాల క్రితమే ప్రారంభమయింది. దేశ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల నుంచి అన్ని వర్గాల ప్రజలు, విద్యారంగంలో అనుభవజ్ఞులైన వారు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేశారు. విద్యావిధానం ముసాయిదాలోని భిన్న అంశాలపై కూడా రెండు లక్షల మంది వరకు సలహాలు అందించారు. అంటే తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యారంగం మేనేజర్లు, వృత్తినిపుణులు అందరూ తమ సూచనలు అందించారు. అంత విభిన్న వర్గాల ఆసక్తితో విస్తృత స్థాయిలో జరిగిన చర్చ నుంచి జరిగిన మథనంలో ఉద్భవించినది కావడం వల్ల జాతీయ విద్యావిధానానికి ప్రతీ చోటా ఆహ్వానిస్తున్నారు. 

గ్రామీణ స్థాయిలో ఉపాధ్యాయుడు కావచ్చు లేదా పేరు ప్రతిష్ఠలు గడించిన విద్యావేత్త కావచ్చు ప్రతీ ఒక్కరూ జాతీయ విద్యా విధానాన్ని తమ సొంద విద్యావిధానంగా భావిస్తున్నారు. గతంలోని విద్యావిధానంలో తాము చూడాలనుకున్న సంస్కరణలుగా వీటిని భావిస్తున్నారు. జాతీయ విద్యావిధానానికి సర్వత్రా ఆమోదం లభించడానికి ప్రధాన కారణం ఇదే.

విద్యావిధానం స్వభావాన్ని నిర్ణయించిన తర్వాత జాతి మరో అడుగు ముందుకేసింది. జాతీయ విద్యావిధానం, దాని అమలుపై దేశంలో విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. విద్యావిధానం అనేది కేవలం పాఠశాలల ధోరణులకు సంబంధించిన సంస్కరణ కాకపోవడం వల్ల దానిపై సమగ్ర చర్చ అవసరం. 21వ శతాబ్దిలో సామాజిక, ఆర్థికాంశాలకు కూడా ఈ విధానం ఒక కొత్త దిశ కల్పిస్తుంది. 

స్వయంసమృద్ధ భారత్ సంకల్పం, పోటీ సామర్థ్యాన్ని కూడా ఈ విధానం తీర్చి దిద్దుతుంది. ఆ అద్భుతమైన సంకల్పానికి దీటుగానే ప్రయత్నాలు, చైతన్యం అనుసంధానం కావాలి. మీలో చాలా మంది విద్యావిధానంలోని సూక్ష్మమైన అంశాలను అధ్యయనం చేసే ఉంటారు. ఇంత విస్తృతి గల సంస్కరణ ప్రయోజనం, లోతుపాతులపై నిరంతరాయంగా చర్చ జరగడం కూడా అవసరమే. అందరిలోనూ ఉన్న అనుమానాలు, ప్రశ్నలు నివృత్తి చేసిన అనంతరమే జాతీయ విద్యావిధానం విజయవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. 

సర్, 
ఈ రోజున ప్రపంచం యావత్తు ఉపాధి రంగంలో త్వరిత గతిన చోటు చేసుకుంటున్న స్వాభావికమైన మార్పుల గురించి విస్తృతంగా చర్చిస్తోంది. ఈ విధానం జ్ఞానం, నైపుణ్యాలు రెండూ పెంచి భవిష్యత్ అవసరాలకు దీటుగా యువతను సంసిద్ధులను చేస్తుంది.  ఈ విద్యావిధానం అభ్యాసం కన్నా అధ్యయనానికి పట్టం కడుతుంది. పాఠ్యాంశాలకు భిన్నమైన విమర్శనాత్మక ఆలోచన పెంచుతుంది. కేవల ప్రక్రియలే కాకుండా ఆసక్తి, ఆచరణీయత, సాధనకు అధిక ప్రాముఖ్యత కల్పిస్తుంది. మౌలిక బోధన, భాషలు;  అధ్యయన ఫలితాలు, ఉపాధ్యాయ శిక్షణ అన్నింటి పైన దృష్టి సారిస్తుంది. ఈ విధానంలో సౌలభ్యం, మదింపు కోణంలో కూడా విస్తృతమైన సంస్కరణలు జరిగాయి. ప్రతీ ఒక్క విద్యార్థిని సాధికారం కావడాన్ని ఈ విధానం నిరూపించి చూపిస్తుంది. 

ఒక రకంగా మన విద్యావిధానాన్ని అన్నింటికీ ఒకే మంత్రం అనే ధోరణి నుంచి ఈ విధానం బయటకు తెస్తుంది. ఇది ఒక సాధారణమైన ప్రయత్నం కాదు, అసాధారణ ప్రయత్నం అని మీ వంటి ప్రముఖులందరూ కూడా భావిస్తారు. దశాబ్దాల నుంచి అమలుజరుగుతున్న మన విద్యావిధానంలో లోటుపాట్లు, సమస్యలు తొలగించేందుకు కూడా ఈ విధానంలో సమగ్ర చర్చ జరిగింది. పిల్లలు స్కూల్ బ్యాగ్ ల భారంతో కుంగిపోతున్నారని, బోర్డు పరీక్షలు కుటుంబానికి, సమాజానికి కూడా ఒక భారంగా మారాయని చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. సమర్థవంతమైన మార్గంలో ఈ విధానం ఆ సమస్యకు పరిష్కారం అందిస్తుంది. మన సాంప్రదాయంలో సా విద్యా యా విముక్తో అనే నానుడి ఉంది, మన మనసును విముక్తం చేసేదే జ్ఞానం అని దాని అర్ధం. 
  
పిల్లలు తమ సంస్కృతి, భాష, సాంప్రదాయాలతో ప్రాథమిక స్థాయి నుంచి అనుసంధానం అయితే ఆ విద్య అత్యంత సమర్థవంతం, సరళం కావడమే కాకుండా పిల్లలకు దానితో అనుబంధం ఏర్పడుతుంది. జాతీయ విద్యా విధానంలో ఎలాంటి ఒత్తిడులు, విరామం, ప్రభావం లేకుండా ప్రజాస్వామిక విలువలతో కూడిన బోధనా విలువలను వాస్తవిక దృక్పథంతో జోడించే ప్రయత్నం జరిగింది. వివిధ అంశాల పట్ల విద్యార్థులపై ఉండే ఒత్తిడిని పూర్తిగా తొలగించడం జరిగింది. 
 
ఇప్పుడు మన యువత తమ ఆసక్తి, యోగ్యతకు అనుగుణంగా చదువుకునే వీలుంటుంది. గతంలో విద్యార్థులు ఒత్తిడికి లోనై తమ సామర్థ్యాలకు అతీతమైన విభాగాన్ని ఎంచుకోవలసి వచ్చేది. వారికి ఇది అర్ధం అయ్యే సమయానికి జాప్యం అయిపోయేది. దాని ఫలితంగా విద్యార్థి మధ్యలోనే దాన్ని వదులుకుని బయటకు వెళ్లడమో లేదా ఏదో ఒక రకంగా డిగ్రీ పూర్తి చేశాడనిపించుకోవడమో జరిగేది. అది నేను అర్ధం చేసుకోగలిగాను. నాకన్నా మీకు మన దేశంలో ఏర్పడిన సమస్యలపై మరింత అవగాహన ఉంది. జాతీయ విద్యా విధానంలో ఆ సమస్యకు పరిష్కారం ఉన్నందు వల్ల  విద్యార్థులకు అధిక ప్రయోజనం కలుగుతుంది.

సర్, 
భారతదేశం స్వయం సమృద్ధం కావాలంటే యువల నిపుణులైన మానవ వనరులు కావడం అత్యంత ప్రధానం. బాల్య దశ నుంచి వృత్తి విద్యతో అనుసంధానం కావడం వల్ల యువత భవిష్యత్ అవసరాలకు మెరుగ్గా సిద్ధం అవుతారు. ఆచరణీయ బోధన వల్ల మన యువ మిత్రుల ఉపాధి సామర్థ్యం పెరగమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో కూడా వారి భాగస్వామ్యం పెరుగుతుంది. ఆనే భద్రాః కృతవే యన్తు విశ్వతః అనే నానుడి ఒకటుంది. ఎవరి నుంచి వచ్చాయన్న అంశంతో సంబంధం లేకుండా కొత్త ఆలోచనలను ప్రతీ ఒక్కరూ అనుమతించాలన్నదే దాని అర్ధం. ప్రాచీన కాలం నుంచి ప్రపంచ స్థాయిలో జ్ఞానానికి కేంద్రంగా భారతదేశం భాసిల్లింది. 21వ శతాబ్దిలో భారత్ ను మేథో సంపత్తి కేంద్రంగా తీర్చి దిద్దేందుకు మేం శ్రమిస్తున్నాం. ఈ సంకల్పం దిశగా పెద్ద అడుగు వేయించేది కొత్త విద్యావిధానం.

సాధారణ కుటుంబాలకు చెందిన యువత కోసం అంతర్జాతీయ శ్రేణి విద్యా సంస్థల ఏర్పాటుకు, మేథావుల వలస నివారణకు ఈ విద్యావిధానం ద్వారాలు తెరిచింది. అంతర్జాతీయ శ్రేణి విద్యా సంస్థలు, క్యాంపస్ లు దేశంలో ఏర్పడినట్టయితే విద్యాభ్యాసం కోసం విదేశీలకు వెళ్లే ధోరణి తగ్గుతుంది. మన విశ్వవిద్యాలయాలు, కళాశాలల పోటీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఆన్ లైన్ విద్య మరో ప్రధానాంశం. స్థానికం, అంతర్జాతీయం వంటి అన్ని పరిమితులను అది చెరిపేస్తుంది.

సర్, 
ఏ వ్యవస్థలో అయినా విస్తృతమైన మార్పులకు శ్రీకారం చుట్టినా, ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు దిశగా అడుగేసినా అనుమానాలు, భయాలు కూడా ఏర్పడడం సహజం. వివిధ కోర్సులు పూర్తిగా రద్దయిపోతే విద్యార్ధులకు స్వేచ్ఛ ఉంటుందా, వారికి కళాశాలల్లో ప్రవేశం లభిస్తుందా, వారి కెరీర్ ఏమైపోతుందని తల్లిద్రండులు భయపడిపోతారు. కొత్త మార్పులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవడం ఎలా అని ప్రొఫెసర్లు, ఉపాధ్యాయుల మనసులో ప్రశ్న తలెత్తుతుంది. కొత్త పాఠ్యాంశాల నిర్వహణ ఎలా అని కూడా వారు చింతిస్తారు.

అలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి.  మీరు కూడా వాటిపై చర్చిస్తున్నారు. ప్రధానంగా పాఠ్యాంశాల డిజైనింగ్ ఎలా ఉంటుంది, సిలబస్, కంటెంట్ స్థానిక భాషల్లో ఎలా తయారుచేయాలి, దాని అమలు ఎలా నే ప్రశ్నలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే ఈ విధానంలో ప్రతిపాదించిన డిజిటల్, ఆన్ లైన్ కంటెంట్ ఎలా తయారుచేయాలనేది గ్రంథాలయాల్లో ఆందోళన. వనరులు తగినంతగా లేకపోతే మనం లక్ష్యాలు సాధించగలమా అనే భయాలు కూడా ఉన్నాయి. పాలనాంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలు కూడా మీ మనసుల్లో చెలరేగడం సహజమే. ఆ ప్రశ్నలు అత్యంత ప్రధానమైనవి అనడంలో సందేహం లేదు.

ఈ ప్రశ్నలన్నీ పరిష్కరించేందుకు మేమంతా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. విద్యా మంత్రిత్వ శాఖ స్థాయిలో నిరంతర చర్చ జరుగుతోంది. రాష్ర్టాల స్థాయిలో ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు, సూచనలు విశాల దృక్పథంతో వింటున్నారు. చివరికి మనం ఆ అనుమానాలు, భయాలు తొలగించగలగాలి. దృక్పథంలో ఎంత మృదుత్వం ప్రదర్శించామో అమలులో కూడా అంతే మృదుత్వాన్ని ప్రదర్శించాల్సి ఉంది. 

ఈ విద్యావిధానం ఏ మాత్రం ప్రభుత్వ విద్యావిధానమే కాదు. ఇది ఈ దేశ విద్యావిధానం. దేశ రక్షణ, విదేశాంగ విధానాలు ఏ ఒక్క ప్రభుత్వానికి చెందనవిగా ఉండవో విద్యావిధానం కూడా పాలనలో ఉన్న ప్రభుత్వం ఏది అన్న దానితో సంబంధం లేకుండా దేశానిది అవుతుంది. 30 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ విద్యావిధానం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదు, యావత్ దేశ ఆకాంక్షలకు ప్రాతినిథ్యం వహిస్తుంది.

సర్, 
త్వరిత గతిన మారుతున్న మార్పులకు దీటుగా జాతీయ విద్యావిధానంలో భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని సమగ్ర ప్రతిపాదనలు చేయడం జరిగింది. గ్రామాలకు, నిరుపేదలకు, నిరాకరణకు గురవుతున్న వారికి, వెనుకబడిన, గిరిజన తెగల వారికి సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్ది సమాచారం, జ్ఞానం పరిధి కూడా పెరుగుతోంది. 

ఈ రోజున మన యువ మిత్రబృందాలు తమ వీడియో బ్లాగ్ లలోని వీడియో స్ర్టీమింగ్ సైట్ల ద్వారా ప్రతీ ఒక్క సబ్జెక్ట్ లోను మెరుగైన కోచింగ్ ఇవ్వడం నేను గమనించాను. ఒక పేద బాలుడు లేదా బాలిక ఊహకైనా రాని అంశం ఇది. సాంకేతిక పరిజ్ఞానం చేరడంలో ప్రాంతీయ, సామాజిక అసమతుల్యతలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రతీ విశ్వవిద్యాలయం, కళాశాలలో గరిష్ఠ స్థాయిలో సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత.

సర్,
నిర్వహణా నమూనా ఎలా ఉందనే దాన్ని బట్టి ఏ వ్యవస్థ సమర్థత, సమ్మిళితత్వం ఆధారపడి ఉంటాయి. నిర్వహణాపరమైన అంశాల్లో కూడా అదే వైఖరిని ఈ పాలసీ అనుసరించింది. సాంకేతిక లేదా వృత్తి విద్యారంగం ఏదైనా కావచ్చు విద్యావిభాగం అంతటినీ ప్రత్యేకించి ఉన్నత విద్యలోని అన్ని విభాగాలను చుట్టూ కమ్ముకుని ఉన్న బంధాల నుంచి విముక్తం చేసే ప్రయత్నం జరిగింది. పాలనా విభాగంలో కూడా పలు  అంచెలను కనిష్ఠ స్థాయికి తగ్గించి మెరుగైన సమన్వయం సాధించేందుకు ఈ విధానం కృషి చేసింది. ఈ విధానం ద్వారా ఉన్నత విద్యలో నియంత్రణ తొలగించి సరళం చేసే ప్రయత్నం కూడా జరిగింది.  పనితీరు ఆధారంగా వాటిని ప్రోత్సహించడం లక్ష్యంగానే విద్యాసంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు అంచెలంచెలుగా స్వయంప్రతిపత్తి కల్పించే  ప్రతిపాదన వచ్చింది. జాతీయ విద్యావిధానంలోని (ఎన్ఇపి-2020) అంశాలన్నింటినీ తుచ తప్పకుండా అమలులోకి తేవడం మనందరి ఉమ్మడి బాధ్యత.

సెప్టెంబర్ 25 లోగా మీ రాష్ర్టాలు, కేంద్రపాలిత  ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాల్లో మరిన్ని వర్చువల్ సమావేశాలు నిర్వహించాలని నేను మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుకు పురోగమిస్తున్న కొద్ది కొత్త జాతీయ విద్యా విధానంపై మెరుగైన అవగాహన కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. మీ అందరూ సమయం తీసుకుని హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవ రాష్ట్రపతికి కూడా నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi