మహాశయులారా,
నిపుణులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు,విధాన నిర్ణేతలు, ప్రపంచవ్యాప్తంగా గల మిత్రులారా,
నమస్కారం,
విపత్తులను తట్టుకునే మౌలికసదుపాయాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సు నాలుగవ ఎడిషన్‌లో మీతో కలిసి పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ఏ ఒక్కరినీ మరిచిపోకూడదన్నది . అందుకే నిరుపేదలు, అత్యంత దయనీయస్థితిలో ఉన్న వారి అవసరాలను తీర్చేందుకు మనం కట్టుబడి ఉన్నాం. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు అధునాతన మౌలికసదుపాయాలను నిర్మించడం ద్వారా దీనిని సాధించేందుకు కట్టుబడి ఉన్నాం. అలాగే మౌలిక సదుపాయాల కల్పన అంటే కేవలం మూలధన ఆస్తులను సమకూర్చడం ,దీర్ఘకాలిక పెట్టుబడి రాబడి సమకూర్చడం మాత్రమే కాదు. ఇది అంకెలకు సంబంధించినది కాదు. డబ్బు కు సంబంధించినది కాదు. ఇది ప్రజలకు సంబంధించినది. ఇది వారికి అత్యంత నాణ్యమైన , నమ్మకమైన, సుస్థిర సేవలను సమానత్వంతో అందించడానికి సంబంధించినది.మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రగతికథలో ప్రజలే గుండెకాయగా ఉండాలి., కచ్చితంగా ఇదే పనిని ఇండియాలో చేస్తున్నాం. మేం మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున విస్తరిస్తూ వస్తున్నాం. విద్య నుంచి ఆరోగ్యం వరకు, తాగునీటి నుంచి పారిశుధ్యం వరకు , విద్యుత్ సరఫరానుంచి రవాణా వరకు ఇలా ఎన్నో ఎన్నెన్నో.మేం వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాన్ని నేరుగా చేపట్టాం. అందువల్లే కాప్ -26 విషయంలో దానిని సాధించేందుకు కట్టుబడి ఉన్నాం.
అందువల్లే అభివృద్ధి కృషికి సమాంతరంగా కాప్ -26 ప్రకారం 2070 నాటికి నెట్ జీరో స్థాయికి చేరేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
మిత్రులారా,
మౌలికసదుపాయాల అభివృద్ధి, చెప్పుకోదగిన రీతిలో మానవ శక్తిసామర్ధ్యాలను గొప్పగా ఆవిష్కరించగలదు. అయితే మనం మన మౌలికసదుపాయాలను ఇష్టారీతిగా వాడకూడదు. ఈ వ్యవస్థలకు సంబంధించి వాతావరణ మార్పుతో సహా, మనకు తెలిసిన, తెలియని సవాళ్లు ఎన్నో ఉన్నాయి. మనం సిడిఆర్ ఐని 2019లో ప్రారంభించినపుడు అది, మన అవసరాలకు అనుగుణంగా , మన అనుభవానికి తగినట్టుగా ఉంది. వరదలలో ఒక బ్రిడ్జి కొట్టుకుపోయినపుడు, తుపాను పెనుగాలులకు విద్యుత్ లైన్లుతెగిపోయినపుడు, అటవీ మంటలకు కమ్యూనికేషన్ టవర్ ధ్వంసమైనపుడు ఇలాంటివి వేలాది మంది జీవితాలను, జీవనోపాధిని ప్రత్యక్షంగా దెబ్బతీస్తాయి. ఇలాంటి మౌలికసదుపాయాలు ధ్వంసం కావడం వల్ల వాటి పరిణామాలు చాలా ఏళ్ల వరకు ఉంటాయి. ఇవి లక్షలాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల మన ముందున్న సవాలు స్పష్టంగా ఉంది.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానం మనవద్ద ఉన్నప్పుడు , కల కాలం మన గలిగే విధంగా, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలను కల్పించలేమా? సఇడిఆర్ ఐ ఏర్పాటు ఈ సవాలును గుర్తించడం సిడిఆర్ ఐ ఏర్పాటుకు మూలం.ఈ కూటమిని విస్తరించడం , దానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు రావడాన్ని బట్టి మనందరి ఆందోళన కూడా ఇదేనని స్పష్టమవుతున్నది.
మిత్రులారా,
రెండున్నర సంవత్సరాల స్వల్ప వ్యవధిలో సిడిఆర్ ఐ పలు కీలక చర్యలు తీసుకుంది, ఈ దిశగా విలువైన పాత్ర పోషించింది. గత ఏడాది కాప్ -26 సందర్భంగా ద్వీప దేశాలకు విపత్తులనుంచి తట్టుకునే మౌలిక సదుపాయాలకు సంబంధించిన చర్యలను ప్రారంభించడాన్ని గమనిస్తే, చిన్న ద్వీప దేశాలకు అండగా మనం కృషి చేయడానికి కట్టుబడి ఉన్న విషయం స్పష్టంగా బోధపడుతుంది. విద్యుత్ వ్యవస్థలను విపత్తులకు తట్టుకునే విధంగా బలోపేతం చేయడంలో సిడిఆర్ఐ కృషి ఇప్పటికే భారతదేశంలోని కోస్తా ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చింది. దీనివల్ల తుపానుల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే పరిస్థితి చాలావరకు తగ్గిఇంది. ఈ కృషి తదుపరి దశకు ముందుకు సాగడంతో , ఇది 130 మిలియన్ల జనాభాకు, ప్రతి ఏటా తుపానులకు గురయ్యే ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుంది..
విపత్తులను ఎదుర్కొనేందుకు సిడిఆర్ ఐ చేపట్టిన కార్యక్రమం కింద ప్రపంచవ్యాప్తంగా 150 విమానాశ్రయాలను అధ్యయనం చేయడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా విపత్తులను తట్టుకునే రీతిలో అనుసంధానతకకు కృషిచేయగల శక్తి దీనికి ఉంది. సిడిఆర్ ఐ నేతృత్వంలో గ్లోబల్ అసెస్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్ రెసిలియన్స్ ఆఫ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్‌లు అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని అందించడమే కాక ఇది ఎంతో విలువైనదిగా ఉండనుంది. సిడిఆర్ ఐ కిసంబంధించిన నిపుణులు ఆయా సభ్యదేశాలలో పలు పరిష్కారాలను ఇప్పటికే అందిస్తున్నారు. దీనిని మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోవచ్చు.
వారు అంకిత భావంతో పనిచేసే ప్రొఫెషనల్స్ కు సంబంధించి గ్లోబల్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో విపత్తులను తట్టుకునే రీతిలో మౌలికసదుపాయాల క ల్పనకు ఉపకరించనుంది.
మిత్రులారా,
మన భవిష్యత్తు విపత్తులను తట్టుకునే విధంగా ఉండాలంటే, మనం విపత్తులను తట్టుకునే మౌలికసదుపాయాల పరివర్తన దిశగా ముందుకు సాగాలి. ఇది ఈ సదస్సు ప్రధానాంశం. మనం తీసుకునే చర్యలలో విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన కేంద్ర బిందువు కావాలి. మనం మన మౌలిక సదుపాయాలను విపత్తులను తట్టుకునే విధంగా రూపొందించినట్టయితే, మనం విపత్తులను అరికట్టడమే కాకుండా భవిష్యత్తులో ఎన్నో తరాలను వీటి బారిన పడకుండా చేయవచ్చు. ఇది మనందరి కల. మనందరి దార్శనికత. దీనిని మనం సాకారం చేయాలి. చేయగలం కూడా. నేను నా ప్రసంగాన్ని ముగించడానికి ముంద, సిడిఆర్ ఐని , ఈ సదస్సుకు సహ ఆతిథ్యం ఇస్తున్న యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.
ఈ సదస్సుకు రూపకల్పనచేయడంలో భాగస్వాములైన వారందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సదస్సు ఫలవంతమైన సంప్రదింపులు ,తగిన ఫలితాన్నిచ్చే చర్చలను చేయగలదని ఆకాంక్షిస్తున్నాను.
ధన్యవాదాలు,