మొత్తం ప్రాజెక్ట్ వ్యయం సుమారు 76,000కోట్లు
రూ.1560 కోట్ల విలువైన మత్స్యపరిశ్రమ ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన
సుమారు రూ.360 కోట్ల విలువైన నౌకా సమాచార, సహాయ వ్యవస్థ జాతీయ ప్రాజెక్టు ప్రారంభం
మత్స్యకారులకు ట్రాన్స్ పాండర్ సెట్లు, కిసాన్ క్రెడిట్ కార్డులను అందించిన ప్రధాని
“మహారాష్ట్రలో అడుగుపెట్టగానే ఇటీవల సింధుదుర్గ్ ఘటన పట్ల ఛత్రపతి శివాజీ మహారాజ్ పాదాలకు నమస్కరించి నేను క్షమాపణలు చెప్పాను”
“ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో వికసిత్ మహారాష్ట్ర – వికసిత్ భారత్ సాధన దిశగా వేగంగా ముందుకుసాగుతున్నాం”
“వికసిత్ భారత్ తీర్మానంలో వికసిత్ మహారాష్ట్ర అత్యంత ముఖ్యమైన భాగం”
“అభివృద్ధికి అవసరమైన సామర్థ్యాలు, వనరులు రెండూ మహారాష్ట్రలో ఉన్నాయి”
“ప్రపంచమంతా నేడు వధావన్ పోర్ట్ వైపు చూస్తున్నది”
‘‘డిఘి పోర్ట్ మహారాష్ట్రకు గుర్తింపుగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ కలల చిహ్నంగా మారుతుంది’’
“ఇది నవభారతం, చరిత్ర నుండి నేర్చుకుంటుంది, తన సామర్ధ్యాన్నీ, తన గొప్పతనాన్నీ గుర్తించగలదు’’
"21వ శతాబ్దపు మహిళా శక్తి సమాజానికి కొత్త దిశానిర్దేశం చేసేందుకు సిద్ధంగా ఉందనడానికి మ

భారత్ మాతాకీ – జై!

భారత్ మాతాకీ – జై!

భారత్ మాతాకీ – జై!

మహారాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గారు, ప్రజాదరణ కలిగిన మన ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు, సర్బానంద సోనోవాల్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ దాదా పవార్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా ఇతర సహచరులు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదర సోదరీమణులారా!

నేడు సంత్ సేనాజీ మహరాజ్ వర్ధంతి. ఆయన ముందు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా ప్రియమైన సోదరీమణులు, సోదరులందరికీ నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

నేటి కార్యక్రమంలో మాట్లాడే ముందు నా మనసులోని భావాలను వ్యక్తపరచాలనుకుంటున్నాను. 2013లో భారతీయ జనతా పార్టీ నన్ను ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు, నేను చేసిన మొదటి పని ఏమిటంటే, నేను రాయగడ్ కోటను సందర్శించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి ముందు ప్రార్థించాను. ఒక భక్తుడు భక్తిశ్రద్ధలతో తన దేవుడిని ప్రార్థించినట్లుగానే, నేను ఆ భక్తితో ఆశీర్వాదం తీసుకొని దేశ సేవలో నా నూతన ప్రయాణాన్ని ప్రారంభించాను. తాజాగా సింధుదుర్గ్ లో ఏం జరిగిందంటే... నాకు, నా సహచరులకు ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు మాత్రమే కాదు. మాకు ఛత్రపతి శివాజీ మహరాజ్ కేవలం రాజు, చక్రవర్తి లేదా పాలకుడు మాత్రమే కాదు; ఆయన మన ఆరాధ్య దైవం. ఈ రోజు నా ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ పాదాల వద్ద శిరస్సు వంచి క్షమించమని ప్రార్థిస్తున్నాను. మన విలువలు వేరు. ఇదే గడ్డపై జన్మించిన మహానుభావుడైన వీర్ సావర్కర్ గారిని నిరంతరం అవమానిస్తూ, ఆయనపై అబద్ధాలు ప్రచారం చేసే రకం మనుషులు మనం కాదు. వారు నిరంతరం ఆయనను అగౌరవపరుస్తారు, దేశభక్తుల మనోభావాలను అణచివేస్తారు. వీర్ సావర్కర్ ను అవమానించిన తరువాత కూడా వారు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరు, కోర్టులలో న్యాయ పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతటి గొప్ప పుత్రుడిని అవమానించినందుకు పశ్చాత్తాపం చెందని వారి విలువలను మహారాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలి. ఈ రోజు ఈ గడ్డపైకి వచ్చాక నేను చేసిన మొదటి పని నా ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ పాదాల వద్ద శిరస్సు వంచి క్షమించమని అడగడం. అంతే కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ను తమ దైవంగా భావించి, వారి హృదయాలను తీవ్రంగా గాయపరిచిన వారందరినీ నేను శిరస్సు వంచి క్షమించమని కోరుతున్నాను. నా విలువలు వేరు. మనకు మన ఆరాధ్య దైవం కంటే గొప్పది ఏదీ లేదు.

 

మిత్రులారా,

మహారాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. 'వికసిత్ మహారాష్ట్ర' అనేది 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) దార్శనికతలో ఒక ముఖ్యమైన భాగం. అందుకే గత పదేళ్లలో గానీ, నా ప్రభుత్వం మూడోసారి నిరంతరం మహారాష్ట్ర కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. మహారాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బలం, వనరులను కలిగి ఉంది. సుదీర్ఘ తీరప్రాంతం, శతాబ్దాల నాటి అంతర్జాతీయ వాణిజ్య చరిత్ర. అంతేకాకుండా, ఇక్కడ భవిష్యత్తు కోసం అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను మహారాష్ట్ర, దేశం పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు వధావన్ పోర్టుకు నేడు శంకుస్థాపన జరిగింది. ఈ పోర్టు కోసం రూ.76,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. ఇది దేశంలోనే  అతిపెద్ద కంటైనర్ పోర్టు కానుంది. దేశంలోనే కాదు, లోతు పరంగా ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన  ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ రోజు, దేశంలోని అన్ని కంటైనర్ రేవుల గుండా వెళ్ళే మొత్తం కంటైనర్ల  సంఖ్య కేవలం వధావన్ రేవులో నిర్వహించే దానికంటే ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్రతో పాటు దేశంలో వాణిజ్య, పారిశ్రామిక పురోగతికి ఈ పోర్టు ఎంత పెద్ద కేంద్రంగా మారుతుందో ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రాంతం పురాతన కోటలకు ప్రసిద్ధి చెందింది, కానీ ఇప్పుడు ఇది ఆధునిక ఓడరేవుకు కూడా ప్రసిద్ది గాంచనుంది. పాల్ఘర్, మహారాష్ట్ర, యావత్ దేశానికి నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

రెండు, మూడు రోజుల క్రితమే మా ప్రభుత్వం డిఘీ పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధికి కూడా ఆమోదం తెలిపింది. ఇది మహారాష్ట్ర ప్రజలకు రెండు రెట్ల శుభవార్త.. ఈ పారిశ్రామిక ప్రాంతం ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజధాని అయిన రాయగఢ్ లో అభివృద్ధి చెందుతుంది. అందువల్ల, ఇది మహారాష్ట్ర గుర్తింపునకు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కలలకు ప్రతీకగా ఉంటుంది. డిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా పర్యాటక రంగాన్ని, పర్యావరణ రిసార్టులను ప్రోత్సహిస్తుంది.

మిత్రులారా,

నేడు మన మత్స్యకార సోదర సోదరీమణుల కోసం రూ.700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంభించాం. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూ.400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించా. ఈ ప్రాజెక్టుల కోసం నా మత్స్యకార సోదర సోదరీమణులకు, మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అది వధావన్ పోర్టు అయినా, డిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి అయినా, ఫిషరీస్ ప్రణాళికలు అయినా ఇలాంటి ముఖ్యమైన పనులు మాతా మహాలక్ష్మి దేవి, మాతా జీవదానీ, తుంగరేశ్వర్ ఆశీస్సులతోనే జరుగుతున్నాయి. మాతా మహాలక్ష్మి దేవికి, మాతా జీవదానీకి, తుంగరేశ్వరుడికి వందసార్లు తలవంచి నమస్కరిస్తున్నాను.

మిత్రులారా,

ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న, శక్తివంతమైన దేశాలలో ఒకటిగా ఉండేది. భారతదేశ శ్రేయస్సుకు ఒక ముఖ్యమైన పునాది దాని సముద్ర బలం. ఈ విషయం మహారాష్ట్ర కంటే ఎవరికి బాగా తెలుసు? ఛత్రపతి శివాజీ మహారాజ్ సముద్ర వాణిజ్యాన్ని, నౌకాదళ శక్తిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. దేశ ప్రగతి కోసం కొత్త విధానాలు రూపొందించి నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం ఈస్టిండియా కంపెనీ కూడా సీ కమాండర్ కన్హోజీ ఆంగ్రేకు ఏమాత్రం తట్టుకోలేని విధంగా మన బలం ఉండేది. కానీ, స్వాతంత్య్రానంతరం ఆ వారసత్వానికి దక్కాల్సిన శ్రద్ధ లభించలేదు. పారిశ్రామిక అభివృద్ధి నుండి వాణిజ్యం వరకు, భారతదేశం వెనుకబడిపోయింది.

 

కానీ మిత్రులారా,

ఇది ఇప్పుడు నవ భారతం. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొంటున్న నవ భారతం, తన బలాన్ని గుర్తిస్తోన్న  నవ భారత్ ఇది, తన గౌరవాన్ని గుర్తిస్తున్న నవ భారత్ ఇది, వలసవాదపు ప్రతి ఆనవాళ్లను వదిలి సముద్ర మౌలిక సదుపాయాలలో కొత్త మైలురాళ్లను నిర్మిస్తోంది నవ భారతం.

మిత్రులారా,

గత దశాబ్ద కాలంలో భారత్ తీర ప్రాంతాల్లో అభివృద్ధి అనూహ్యంగా ఊపందుకుంది. ఓడరేవులను ఆధునీకరించి జలమార్గాలను అభివృద్ధి చేశాం. భారత్ లో నౌకా నిర్మాణం జరగాలని, తద్వారా మన ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఉద్ఘాటించింది. ఈ దిశగా కోట్లాది రూపాయలు వెచ్చించి నేడు ఫలితాలను చూస్తున్నాం. మునుపటితో పోలిస్తే చాలా ఓడరేవుల సామర్థ్యం రెట్టింపు అయింది, ప్రైవేట్ పెట్టుబడులు పెరిగాయి, నౌకల రాక పోకల (టర్న్అరౌండ్) సమయం కూడా తగ్గింది. దీని వల్ల ప్రయోజనం ఎవరికి లభిస్తోంది? మన పరిశ్రమలకు, మన వ్యాపారులకు ఖర్చులు తగ్గాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మన యువతకు కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తోంది. మెరుగైన సౌకర్యాలను అనుభవిస్తున్న మన నావికులకు కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తోంది.

మిత్రులారా,

ఈ రోజు ప్రపంచం మొత్తం వధావన్ పోర్టును గమనిస్తోంది. 20 మీటర్ల లోతు ఉన్న వధావన్ రేవు లోతుకు సరితూగే ఓడరేవులు ప్రపంచంలో చాలా తక్కువ. వేలాది నౌకలు ఇక్కడ దిగుతాయి, కంటైనర్లను నిర్వహిస్తారు, ఇది మొత్తం ప్రాంతం ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తుంది. ప్రభుత్వం వధావన్ పోర్టును రైలు, హైవే కనెక్టివిటీతో అనుసంధానం చేయనుంది. ఈ పోర్టు కారణంగా ఇక్కడ అనేక కొత్త వ్యాపారాలు ప్రారంభమవుతాయి. గిడ్డంగి కార్యకలాపాలు వేగవంతం అవుతాయి. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్(పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్), ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే చాలా దగ్గరగా ఉండటంతో దాని స్థానం ఒక సువర్ణావకాశం. ఇక్కడి నుండి ఏడాది పొడవునా సరుకు రవాణా జరుగుతుంది. దీని నుండి గరిష్ట ప్రయోజనం మీకు, మహారాష్ట్ర ప్రజలకు, నా భవిష్యత్ తరాలకు లభిస్తుంది.

మిత్రులారా,

మహారాష్ట్ర అభివృద్ధే నా ప్రథమ ప్రాధాన్యం. నేడు మహారాష్ట్ర 'మేకిన్ ఇండియా' కార్యక్రమం ప్రయోజనాలను పొందుతోంది. నేడు ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) ప్రచారం ద్వారా మహారాష్ట్ర ప్రయోజనం పొందుతోంది. నేడు, భారతదేశ పురోగతిలో మహారాష్ట్ర గణనీయమైన పాత్ర పోషిస్తోంది, కానీ మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు ఎల్లప్పుడూ మీ అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకోవడానికి  ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఇందుకు సంబంధించిన మరో ఉదాహరణ ఇవాళ మీకు ఇస్తాను.

 

సోదర సోదరీమణులారా,

ప్రపంచ దేశాలతో వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి మన దేశానికి చాలా సంవత్సరాలుగా ఒక పెద్ద, ఆధునిక నౌకాశ్రయం అవసరం. దీనికి మహారాష్ట్రలోని పాల్ఘర్ అత్యంత అనువైన ప్రదేశం. ఈ పోర్టు అన్ని సీజన్లలో పనిచేయగలదు. అయితే ఈ ప్రాజెక్టు 60 ఏళ్లు ఆలస్యమైంది. మహారాష్ట్రకు, దేశానికి ఎంతో కీలకమైన ఈ పని ప్రారంభం కావడానికి కూడా కొందరు అనుమతించలేదు.. 2014లో మీరు మాకు ఢిల్లీలో సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు, 2016లో మా సహచరుడు దేవేంద్ర గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. పోర్టు నిర్మించాలని 2020లో నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత ప్రభుత్వం మారి రెండున్నరేళ్లుగా ఇక్కడ పనులు జరగలేదు. ఒక్క ఈ ప్రాజెక్టుతోనే కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 12 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. మహారాష్ట్ర ఈ అభివృద్ధితో ఎవరికి సమస్య ఉంది? మహారాష్ట్ర పురోగతిని అడ్డుకుంటున్న వ్యక్తులు ఎవరు? మహారాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు? గత ప్రభుత్వాలు ఈ పనులను ఎందుకు ముందుకు సాగనివ్వలేదు? ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు. నిజం ఏమిటంటే, కొంతమంది మహారాష్ట్ర  అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారు, అయితే మా ఎన్డీఏ  ప్రభుత్వం, ఇక్కడ మా మహాయుతి (మహా కూటమి) ప్రభుత్వం మహారాష్ట్రను దేశంలో అగ్రగామిగా చేయాలనుకుంటున్నాయి.

మిత్రులారా,

సముద్రానికి సంబంధించిన అవకాశాల విషయానికి వస్తే, మన మత్స్యకార సోదర సోదరీమణులు అత్యంత ముఖ్యమైన భాగస్వాములు. మత్స్యకార సోదరసోదరీమణులు! మన 526 మత్స్యకార గ్రామాలు, 15 లక్షల మంది మత్స్యకారుల జనాభాతో మహారాష్ట్ర మత్స్యరంగంలో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. ఇప్పుడే పీఎం మత్స్య సంపద పథకం లబ్ధిదారులతో మాట్లాడుతున్నాను. గత పదేళ్లలో ఈ రంగం చూసిన మార్పు వారి కృషి ద్వారా, ప్రభుత్వ పథకాలు కోట్లాది మంది మత్స్యకారుల జీవితాలను ఎలా మార్చాయో ఈ రోజు కనిపిస్తుంది. మీ కృషి ప్రభావాన్ని తెలుసుకోవడానికి మీరు కూడా సంతోషించాలి! నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారత్ అవతరించింది. 2014లో దేశంలో కేవలం 80 లక్షల టన్నుల చేపలు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. ప్రస్తుతం భారత్ 170 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తోంది. అంటే కేవలం పదేళ్లలో చేపల ఉత్పత్తి రెట్టింపు అయింది. నేడు భారత్ సీఫుడ్(సముద్రపు ఆహారం) ఎగుమతులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. పదేళ్ల క్రితం మన దేశం రూ.20,000 కోట్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేసింది. ప్రస్తుతం రూ.40 వేల కోట్లకు పైగా విలువైన రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. అంటే రొయ్యల ఎగుమతులు కూడా రెట్టింపు అయ్యాయి. మేం ప్రారంభించిన నీలి విప్లవం పథకం విజయం ప్రతిచోటా కనిపిస్తుంది. ఈ పథకం ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగావకాశాలు లభించాయి. మా ప్రభుత్వ నిరంతర కృషి వల్ల కోట్లాది మంది మత్స్యకారుల ఆదాయం పెరిగి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.

 

మిత్రులారా,

చేపల ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద వేలాది మంది మహిళలకు ఆసరాగా నిలిచారు. చేపల వేటకు వెళ్లే వారు తరచూ ప్రాణాంతక ప్రమాదాలను ఎదుర్కొంటారని మీకు తెలుసు. వారి కుటుంబాలు, ముఖ్యంగా ఇంట్లో మహిళలు నిత్యం ఆందోళనకు గురవుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాటిలైట్ సాయంతో ఈ ప్రమాదాలను తగ్గిస్తున్నాం. ఈ రోజు ప్రారంభించిన నౌక కమ్యూనికేషన్ వ్యవస్థ మన మత్స్యకార సోదర సోదరీమణులకు గొప్ప వరం. ఫిషింగ్ బోట్లలో లక్ష ట్రాన్స్ పాండర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దీనితో మన మత్స్యకారులు వారి కుటుంబాలు, పడవ యజమానులు, మత్స్య శాఖ, సముద్రంలో భద్రతకు భరోసా ఇచ్చే వారితో ఎల్లప్పుడూ అనుసంధానంగా ఉంటారు. తుపానులు, సముద్రంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మన మత్స్యకారులు ఉపగ్రహం ద్వారా తీరంలోని సంబంధిత ప్రజలకు సందేశాలు పంపగలరు. మీ ప్రాణాలను కాపాడుకోవడం, సంక్షోభ సమయంలో మొదట మిమ్మల్ని చేరుకోవడం ప్రభుత్వానికి ఉన్న మొదటి ప్రాధాన్యత.

 

మిత్రులారా,

మత్స్యకారుల బోట్లు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు 110కి పైగా ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నాం. కోల్డ్ చైన్, ప్రాసెసింగ్ సౌకర్యాలు, బోట్లకు రుణాలు, పీఎం మత్స్య సంపద యోజన ఇలా అన్ని పథకాలు మన మత్స్యకార సోదరసోదరీమణుల ప్రయోజనం కోసం రూపొందించినవే. తీరప్రాంత గ్రామాల అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తున్నాం. మత్స్యకారుల సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నాం.

మిత్రులారా,

వెనుకబడిన తరగతుల కోసం పని చేసినా, అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించినా బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాలు పూర్తి అంకితభావం, నిజాయితీతో పనిచేశాయి. మన దేశంలో దశాబ్దాలుగా మత్స్యకార సోదరసోదరీమణులు, గిరిజన సమాజాల పరిస్థితిని చూడండి. గత ప్రభుత్వాల విధానాలు ఈ వర్గాలను ఎప్పుడూ అంచుల్లోనే ఉంచాయి. దేశంలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉన్నప్పటికీ గిరిజన సంక్షేమానికి అంకితమైన మంత్రిత్వ శాఖ ఎప్పుడూ లేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. మత్స్యకారుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. ఎంతోకాలంగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాలు ఇప్పుడు పీఎం జన్మన్ పథకం ద్వారా లబ్ది పొందుతున్నాయి. మన గిరిజన సమాజాలు, మన మత్స్యకార సంఘాలు నేడు భారతదేశ పురోగతికి గణనీయమైన సహకారం అందిస్తున్నాయి.

 

 

మిత్రులారా,

ఈ రోజు, మహాయుతి (మహాకూటమి) ప్రభుత్వం మరో విజయాన్ని సాధించినందుకు నేను ప్రత్యేకంగా అభినందించాలనుకుంటున్నాను. మహిళల నేతృత్వంలో అభివృద్ధి, మహిళా సాధికారతలో మహారాష్ట్ర దేశంలోనే ముందంజలో ఉంది. నేడు మహారాష్ట్రలో చాలా మంది మహిళలు వివిధ ఉన్నత పదవుల్లో అద్భుతంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సుజాత సౌనిక్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర పరిపాలనకు దిశానిర్దేశం చేస్తున్నారు. రష్మీ శుక్లా తొలిసారి డీజీపీగా రాష్ట్ర పోలీసు శాఖకు నాయకత్వం వహిస్తున్నారు. తొలిసారిగా షోమితా బిశ్వాస్ రాష్ట్ర ఫారెస్ట్ ఫోర్స్ అధిపతి గా వ్యవహరిస్తున్నారు. శ్రీమతి సువర్ణ కేవలే గారు మొదటిసారిగా రాష్ట్ర న్యాయశాఖ అధిపతిగా ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా జయ భగత్ గారు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ గా కొనసాగుతున్నారు. ముంబైలో కస్టమ్స్ విభాగానికి ప్రాచీ స్వరూప్ నేతృత్వం వహిస్తున్నారు. ముంబైలోని విశాలమైన, సవాలుతో కూడుకున్న అండర్ గ్రౌండ్ మెట్రో-3కి ముంబై మెట్రో ఎండీగా అశ్విని భిడే నేతృత్వం వహిస్తున్నారు.. మహారాష్ట్రలో ఉన్నత విద్యారంగంలో కూడా మహిళలు ముందంజలో ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ మాధురీ కనిత్కర్ జీ మహారాష్ట్ర హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్. మహారాష్ట్ర స్కిల్స్ యూనివర్శిటీ తొలి వైస్ చాన్స్ లర్ గా డాక్టర్ అపూర్వ పాల్కర్ కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. మహారాష్ట్రలో మహిళలు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్న ఇలాంటి ముఖ్యమైన, అత్యంత బాధ్యతాయుతమైన పదవులు అనేకం ఉన్నాయి. 21వ శతాబ్దానికి చెందిన నారీ శక్తి (మహిళా శక్తి) సమాజాన్ని కొత్త దిశలో నడిపించడానికి సిద్ధంగా ఉందనడానికి వారి విజయమే నిదర్శనం. ఈ నారీ శక్తి 'వికసిత్ భారత్'కు ముఖ్యమైన పునాది.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.